దేశంలో పవిత్రమైనవిగా భావిస్తూ వచ్చిన నదులు, వాటి ఉపనదులన్నీ ఇప్పుడు కలుషితమైపోయాయి. గంగానది నీటిలో ఆక్సిజన్ నిల్వ లుండేవని, ఆ నీరు తాగినా, స్నానమాడినా కొన్ని రోగాలను నియం త్రిస్తున్నవని, పరిశోధకులు చెప్పిన మాట ప్రస్తుతం అభాసగా మారిం ది. గంగనీళ్లు తాగినా, వాటితో స్నానం చేసినా అనేక చర్మవ్యాధులు స్వయానా ఆహ్వానించుకుంటున్న వారవుతున్నారని, సంబంధిత శాస్త్రజ్ఞులు చెప్పేమాట. ఇటీవల సుప్రీంకోర్టు, కేంద్రప్ర భుత్వాన్ని హెచ్చరించినప్పటికీ గంగ ప్రక్షాళన ముందడు గు వేయటంలేదు.
చితాభస్మం, ఆస్తికలు, పవిత్ర నదుల్లో కలపటం అనాది నుంచి హిందువులు పాటించే ఆచారం. గంగానదిలో పడి చనిపోతే ఆత్మ సరాసరి స్వర్గానికి పోతుందని నమ్మకం. దేశంలోని నదులన్నీ కలుషితమయ్యాయి. జల కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు పర్చాలి. నదీ పరివాహ ప్రాంతాల్లో చితాభస్మం, ఆస్తికలు లాంటి వ్యర్థాలు కలి పితే శిక్షార్హులని ప్రకటించాలి. 21వ శతాబ్దిలో నీరు మరో పెట్రోలియం గా మారుతుందని అభిజ్ఞుల హెచ్చరిక. 2019 నాటికే భారత ప్రజలు మంచినీరు లేక లక్షలాదిగా మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి.
ఏవై శెట్టి సీనియర్ పౌరులు, పత్తిపాడు, గుంటూరు
నదుల ప్రక్షాళన తప్పదు
Published Sat, Jan 24 2015 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM
Advertisement