ఏదీ భిన్నత్వంలో ఏకత్వం?
ఇప్పుడు ఈశాన్య భారతవాసుల సమస్య కూడా అదే. మిగిలిన భారతదేశం వారి పట్ల వివక్ష చూపుతున్నదన్న ఆరోపణ వాస్తవికమైనదే. చాలా దేశాల చరిత్ర మలుపు తిరగడానికి కారణమైన వర్ణ వివక్ష జాడే ఇందులోనూ ఉందని కొన్ని ఉదాహరణలతో చెప్పవచ్చు.
పదేళ్ల క్రితం నలభై మంది ప్రౌఢ స్త్రీలు మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో ఉన్న అసోం రైఫి ల్స్ ప్రధాన కార్యాలయం ముందు నగ్నంగా నిలబడ్డారు. ‘భారతీయ సైనికులారా! మా మీద అత్యాచారాలు చేయం’డంటూ నినాదాలు చేశారు. దేశం మొత్తాన్ని కదిపి కుదిపే ఒక అమానవీయ ఘటన, దురంతం జరిగి తేనే ఈశాన్య భారతం మీద దేశం దృష్టి పడుతుంది. ఈ పరిణామమే చాలా ప్రశ్నలను సంధిస్తుంది. వాటిలో ఈశాన్య భారతవాసుల పట్ల, మిగిలిన భారతావని వివక్ష చూపుతున్నదా? అన్న ప్రశ్న పదునెక్కుతోంది.
నిడో టానిమమ్ అనే అరుణాచల్‌ప్రదేశ్ విద్యార్థిని ఈ జనవరి 29న ఢిల్లీలోని లజపతినగర్ ప్రాంతంలో(నిజానికి జలంధర్‌లో చదువుకుంటున్నాడు) కొందరు హేళన చేయడంతో గొడవ మొదలై, ఆ కుర్రాడి హత్యకు దారి తీసింది. నిడో అరుణాచల్ ప్రదేశ్ కాం గ్రెస్ ఎంఎల్‌ఏ నిడో పవిత్ర కుమారుడు. 2012లో జరిగిన ఇంకో రెండు ఇలాంటి సం ఘటనలను కూడా గుర్తుకొస్తాయి. చండీఘడ్‌లో ఎంబీఏ చదువుతూ దానా సిల్వా సంగ్మా (మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూతురు) ఆత్మహత్య చేసుకుంది. పరీక్షా కేం ద్రంలో సెల్‌ఫోన్‌తో పట్టుబడిన తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ ఏడాదే బెంగళూరులో చదువుతున్న రిచర్డ్ లాయిటామ్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో హత్యకు గురయ్యా డు. ఈ దుర్ఘటన తరువా త బెంగళూరు పరిసరాల లో నివశిస్తున్న ఈశాన్య భారతీయులు స్వస్థలాల కు వెళ్లడానికి ప్రత్యేక రైళ్లనే నడపవలసి వచ్చింది. ఎస్‌ఎంఎస్‌లతో ఆ ప్రాం తం వారిని బీభత్సానికి గురిచేశారు. ఇవన్నీ వెలు గు చూసిన సంఘటనలు.
ఈశాన్య భారతవాసులకీ, మిగిలిన భారతదేశ వాసులకీ మధ్య భౌతికరూపంలో తేడా నిజమే. అయినా వారంతా శతాబ్దాలుగా భారతీయులే. కానీ రూపం కారణంగా వారు మిగిలిన భారతదేశంలో హేళనలకు గురి కావలసి రావడం విషాదమే. అమెరికాలో నల్లజాతీయులని ఈ కారణంగానే ద్వేషించడం ఎక్కువ. నిజానికి రంగు కారణంగానే వివక్ష పరిఢవిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ఈశాన్య భారతవాసుల సమస్య కూడా అదే. మిగిలిన భారతదేశం వారి పట్ల వివక్ష చూపుతున్నదన్న ఆరోపణ వాస్తవికమైనదే. చాలా దేశాల చరిత్ర మలు పు తిరగడానికి కారణమై న వర్ణ వివక్ష జాడే ఇందులోనూ ఉందని కొన్ని ఉదాహరణలతో చెప్పవచ్చు. ఈశాన్యవాసుల రూపం తో పాటు భాష, సం స్కృతి కూడా భిన్నమే. మనదేశంలో చాలాచోట్ల ఈశాన్య వాసులను చిం కీలు అని హేళనగా పిలు స్తూ ఉంటారు. కొన్ని శతాబ్దాలుగా వర్ణ వివక్షకు గురవుతున్న ఆఫ్రికా నల్లవారు ఆంగ్లేయుల కంటె భారతీయులకే వర్ణ వివక్ష ఉందని ఎందుకు భావిస్తున్నారో దీనినిబట్టి సుల భంగానే గ్రహించగలం. ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయుల పట్ల ఇలాంటి వివక్షే చూపుతూ ఉంటారన్న విమర్శ కూడా వాస్తవదూరమైనది కాదు.
దేశంలో అక్షరాస్యత గణనీయంగా ఉన్న ఈశాన్య ప్రాంత వాసులు ఇలాంటి పరిస్థితికి లోను కావడం ఒక వైచిత్రి. 2001 ప్రకారం ఏడు ఈశాన్య రాష్ట్రాలలో అక్షరాస్యత శాతం 64.3 శాతం (అసోం) నుంచి 88.5 శాతం (మిజోరం) ఉంది. ఇంత అక్షరాస్యత ఉన్నా, దశాబ్దాలుగా నివశిస్తున్న సొంత దేశ ంలోనే వివక్షకు గురికావడం విషాదమే. ఇదే భారత సాంస్కృతిక భిన్నత్వం మీద ప్రశ్నలు కురిపిస్తున్నది. ఈశాన్య భారత వాసుల మీద మొద టి దశలో మాటల దాడులు జరిగేవి. ఈ మాటలన్నీ మిగిలిన భారతీయుల కంటె భిన్నంగా ఉండే వారి రూపు రేఖల మీద వ్యం గ్యాస్త్రాలే. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు మరో అంశం. భాష సమస్యను అలుసుగా తీసుకుని చాలాచోట్ల టాక్సీ డ్రైవర్లు, ఇతర రవాణా వ్యవస్థలు దోపిడీ చేయడం, ఇళ్లు అద్దెకు దొరకకపోవడం వంటి సమస్యలూ వారు ఎదుర్కొంటున్నారు.
ఇవన్నీ చూస్తే మనం ఘనంగా చెప్పుకునే సాంస్కృతిక ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం మీద ప్రశ్నలు రేకెత్తక తప్పదు. దేశ సమగ్రతకు సంబంధించిన ఈ విషయంలో అయి నా, రాజ్యాంగం నిర్ద్వంద్వంగా ఉద్ఘాటించిన ఈ ఏకత్వం గురించి అయినా ఢిల్లీ నిబద్ధత చూపేటట్టు చేయడంలో అన్ని రాజకీయ పార్టీ లు విఫలమైనాయి.
భారతదేశంలో ఎక్కడైనా నివశించగలగడం గురించి చెప్పే హక్కు హుళక్కి అని ఈ పరిణామమే చాటి చెబుతోంది. అక్కడ జరిగే విషాదాలతోనే వారిని గురించి స్మరించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. టాగూర్ కథలలో ఒకపాత్ర తాను బతికున్న సంగతి లోకానికి ఎరుకపరచడానికి ఆత్మహత్యను ఆశ్రయిస్తుం ది. ఈశాన్య భారత జనజీవనం పరిస్థితి ఇలాగే ఉంది.
డాక్టర్ గోపరాజు నారాయణరావు