
గుడ్డి సర్కారు ‘న్యాయం’
1984 అల్లర్లలో వేలాదిమంది సిక్కులు మరణించారు. ఆ దాడులను ఆపలేక పోవడం వల్ల, నిస్సహాయులకు ప్రాణ రక్షణను కల్పించలేక పోయినందువల్ల బాధితులకు పరిహారం చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుంది.
విశ్లేషణ
1984 అల్లర్లలో వేలాదిమంది సిక్కులు మరణించారు. ఆ దాడులను ఆపలేక పోవడం వల్ల, నిస్సహాయులకు ప్రాణ రక్షణను కల్పించలేక పోయినందువల్ల బాధితులకు పరిహారం చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుంది.
ఇందిరా గాంధీని ఆమె సొంత భద్రతా సిబ్బందిలోని ఇద్దరు సిక్కు జవాన్లు దారుణంగా హత్య చేసిన తరువాత ఢిల్లీ, తదితర ప్రాంతాలలో సిక్కుల ఊచకోత సాగింది. ఘోర నేరాలు చేసిన దుర్మార్గ కార్యకర్తలకు, వారిని నడిపించిన నాటి అధికార పార్టీ నాయకులకు శిక్ష పడుతుందేమోనని జనం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆనాటి అల్లర్ల బాధితులైన వేలాది మంది సిక్కులకు నష్ట పరిహారం ఇచ్చే పథ కాలూ, ప్రయత్నాలూ ఆ తరువాత మొదలైనాయి. కేంద్ర, రాçష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహార పథకాలు ప్రకటించాయి. అయితే కొన్ని సందర్భాలలో ఆ అల్లర్లలో నష్టపోని కొందరు అవినీతిపరులు కూడా దొంగ పత్రాలను సృష్టించి, అక్రమంగా పరిహారాన్నిSపొందే దుర్మార్గానికి పాల్పడ్డారు. అదలా ఉంటే, ప్రభుత్వ కార్యాలయాల నిష్క్రియాపరత్వం వల్ల పరిహారం అంద కుండా పోయిన కుటుంబాలు వందలు, వేలు ఉన్నాయి. నిధులు, పథకాలు, అనుమతులు అన్నీ ఉన్నా పరి హారం ఇవ్వలేకపోవడం పరిపాలనాపరమైన విషయం. అధికార యంత్రాంగం సమర్థత, అసమర్థతలపైన ఆధా రపడి పరిహార వితరణ ఉంటుంది. వేలాదిమంది సిక్కులు నాటి దాడులలో మరణించారు. ఆ దాడులను ఆపలేకపోవడం వల్ల, ఆ మరణాలను నిరోధించలేక పోవడం వల్ల, పోలీసు యంత్రాంగం నిస్సహాయుల ప్రాణరక్షణ విధులను నెరవేర్చలేకపోవడం వల్ల బాధితు లకు పరిహారం చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన∙ఉంటుంది.
1984 నాటి దారుణ దాడులలో పరంజిత్ సింగ్ ఒక బాధితుడు. 2015 డిసెంబర్‌లో ఆయన ఒక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తనకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తా రని అడిగారు. విచిత్రమేమంటే, సిక్కులకు పరిహారం ఇచ్చే పథకాలేవీ లేవని, అన్నీ ముగిసిపోయాయని పీఐఓ జవాబిచ్చారు. మొదటి అప్పీలు దాఖలు చేస్తే మీరు అడిగిన సమాచారం ఆ అధికారి ఇచ్చారు కాబట్టి వెళ్లండి అని సాగనంపారు. విధిలేక పరంజిత్ సింగ్ రెండో అప్పీలు చేసుకున్నారు. ఆయనది అత్యంత హృదయవిదారక గాథ. దుండగులు ఆయన కళ్ల మీద దాడిచేయడంతో రెండూ కళ్లూ కనబడకుండా పోయాయి. అతను ఇప్పుడు ఏదీ చూడలేడు. మిగిలిన జీవితం ఏవిధంగా గడపాలో తెలియదు. పరంజిత్ సింగ్ నూరు శాతం దృష్టిని కోల్పోయాడని ఏఐఐ ఎంఎస్ ధ్రువీకరించింది. అయినా కార్యాలయాలు కద లలేదు. డబ్బు ఇవ్వలేదు. అతనికి లెక్క ప్రకారం, ప్రభుత్వం ఆమోదించిన పథకాల ప్రకారం 1,25,000 రూపాయల పరిహారం ఇవ్వాలి. కాని ఇవ్వలేదు. పరి హారం లేక, ఏ పనీ చేయలేక అతను బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. అతను ఇప్పుడొక గుడ్డి బిచ్చగాడు. కమిషన్ ముందు రెండో అప్పీలు విచారణకు అతను హాజరు కాలేకపోయాడు. కారణం చూపు లేకపోవడమే. ఎవరి సాయమూ లేకుండా అతను రాలేడు. కానీ గుడ్డి అధికార యంత్రాంగమూ రాలేదు. అది సీఐసీ నోటీసు లను లెక్క చేయలేదు, జవాబు కూడా పంపలేదు.
2006లో నానావతి కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా యూపీఏ ప్రభుత్వం రూ.717 కోట్ల పునరా వాస, పరిహార పథకాలను ప్రవేశపెట్టింది. వాటి ప్రకారం మరణించిన వారి కుటుంబాలకు రూ. 3.5 లక్షలు చెల్లించాలి. గాయపడిన వారికి, వికలాంగులైన వారికి కూడా పరిహారాలను నిర్ణయించారు. 717 కోట్ల రూపాయలలో రూ. 517 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. ఆ పథకాల అమలును సమీక్షించిన తరువాత పరిహారం చాలదంటూ రూ. 5 లక్షలకు పెంచారు. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు తీర్పును అనుసరించి మృతుల కుటుంబాలకు రూ. 3.5 లక్షల పరిహారం నిర్ణయిం చారు. మృతుల బంధువులు డిప్యూటీ కమిషనర్‌కు దర ఖాçస్తు పెట్టుకోవలసి ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ పరి శీలన తరువాత అర్హతను నిర్ణయిస్తారు. అందుకోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్ సిబ్బంది వారి అధికారిక అంతర్జాల వేదిక (వెబ్‌సైట్) లో పరంజిత్ పరిస్థితి తెలుసుకుందామని వెతకడం మొదలుపెడితే, ఏ ఒక్క దస్తావేజు లింకు కూడా తెరుచు కోలేదు. ఆ తెరుచుకోని వెబ్ లింకుల వివరాలను కమి షన్ ఇచ్చింది.
సిక్కుల పరిహారానికి జస్టిస్ టీపీ గార్గ్ కమిషన్ కూడా సిఫార్సులు ఇచ్చింది. నిరంజన్ సింగ్ అనే 74 ఏళ్ల బాధితుడికి రూ. 25 లక్షలు ఇవ్వాలని çసూచించింది. అతన్ని మంటల్లోకి తోసివేస్తే 80 శాతం కాలిన గాయా లతో బతికాడు. 32 ఏళ్లు చెక్కు వస్తుందేమోనని ఎదురు చూస్తూ నిరంజన్ సింగ్ జూలై 1, 2016న మరణిం చాడు. కాని ప్రభుత్వం చెక్కు పంపలేదు. గార్గ్ కమిషన్ గుర్గావ్, పటౌడీ ప్రాంతాల్లో కుటుంబసభ్యులను, ఆస్తు లను కోల్పోయిన వారికి రూ. 12.07 కోట్ల రూపాయల పరి హారం చెల్లించాలని లెక్క గట్టింది.
పంజాబ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీ నవ్ జ్యోత్ కౌర్ సిద్ధూ (ఎమ్ ఎల్‌ఏ) పరిహారం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 440 కోట్లకు సంబంధించి పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. జస్టిస్ జీపీ మా«థుర్ కమిటీ సూచనల మేరకు 2014 డిసెంబర్‌లో పంజాబ్‌లో ఉన్న 1,020 మంది బాధితులకు ఆరు నెలల వ్యవధిలో పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఢిల్లీ ప్రభుత్వం రూ. 130 కోట్లతో 2,600 కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి ఒక పథకాన్ని రూపొందించింది. ఇన్ని పథకాలు, కమి టీలు సిఫార్సులు ఉండగా అన్ని పథకాలు మూసేశారని పీఐఓ చెప్పడం అన్యాయం. తప్పుడు సమాచారం ఇచ్చి నందుకు జరిమానా ఎందుకు విధించకూడదో, అతనికి పరిహారం ఎందుకు చెల్లించరో కారణం చెప్పాలని సీఐసీ హెచ్చరిక చేసింది. పరంజిత్‌కు ఎప్పుడు పరి హారం ఇస్తారో చెప్పాలని ఆదేశించింది. (పరంజిత్ సింగ్ వర్సెస్ ఎస్‌డీఎం (ప్రీత్ విహార్) ఇఐఇ/Sఅ/అ/2016/001256 కేసులో 20 జూలై 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ )
ఈమెయిల్: professorsridhar@gmail.com