లండన్‌కు చెందిన ఓవర్‌సీస్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు, వినియోగంలో వస్తున్న మార్పులను, ప్యూచర్ డైట్స్‌తో ఒక నివేదిక వెలువరించింది. 1980తో పోలిస్తే 2008 నాటికి ఊబకాయుల సంఖ్య 23 శాతం అధికమైంది. వర్ధమాన దేశాల్లో గత రెండు మూడు దశాబ్దాల్లో ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వారి ఆహారం తీరు తెన్నుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఆదాయం పెరిగిన కొద్దీ జనం మాంసం, కొవ్వు పదార్థాలు, స్వీట్లు వంటి వాటి వైపు ఎక్కువగా మళ్లుతున్నారు. కానీ విధానపరంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలి. ఆర్థి కాభివృద్ధి, ఆదాయాల పెరుగుదల, పట్టణీకరణ వీటన్నింటి ప్రభా వంతో ప్రజలు సంప్రదాయంగా తాము తినే ధాన్యాలు, కూరగాయల నుంచి జంతు పదార్థాలు (మాంసం, పాల ఉత్పత్తులు) కొవ్వు, చక్కె రల వైపు ఎక్కువగా మళ్లుతున్నారు. మన దేశంలో కూడా గణనీయమైన పెరుగుదల ఉంది కానీ, శాకాహారుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటం వల్ల విదేశాలతో పోలిస్తే తలసరి మాంసం వినియోగం తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారం వైవిధ్యం క్రమేపి తగ్గుతూ కొవ్వు, ఉప్పులు, నూనెల వినియోగం, చక్కెర వినియోగం పెరుగుతుంది. ఇది సరికాదని గుర్తిద్దాం.
బోడ నాగేశ్వరరావు మల్టీపర్పస్ అవేర్‌నెస్ సొసైటీ, హైదరాబాద్
మందు, మాంసాన్ని తగ్గిద్దాం
Published Sat, Feb 7 2015 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement