
విప్లవ కవి జ్వాలాముఖికి జోహార్లు
తన జీవితం చివరిక్షణం వరకు పాలకవర్గాలపై, నేటి దోపిడీ వ్యవస్థపై నిప్పులు కురిపిస్తూ తన ప్రతిభా పాటవాలను, శక్తి సామర్థ్యాలను ప్రజల కోసం ధారపోసిన విప్లవ కవులలో జ్వాలాముఖి ప్రముఖుడు. ఆయన 14.12.2008న మరణించారు. నేడు ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయనకు విప్లవ జోహార్లు. జ్వాలాముఖి 12.4.1938లో హైద రాబా ద్‌లోని సీతారాంబాగ్ దేవాలయంలో జన్మించారు. చిన్నతనంలోనే తాను నివాసముండే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల ఇండ్ల స్థలాల సమస్యపై పోరాటం చేసి పేద ప్రజల ప్రేమకు పాత్రుడయ్యారు.
ఎన్నో రుగ్మతలకు ఆలవాలమైన వ్యవ స్థపై ‘దిగంబర కవి’గా తిరుగుబాటు బావు టాను ఎగురవేసిన ఆయన క్రమంగా తన నిరంతర అధ్యయనం, పరిశీలన ద్వారా నేటి సమాజంలోని ప్రజల కడగండ్లకు దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థే మూలకారణమని, ఈ దోపి డీల నిర్మూలనకు మార్క్సిజం- లెనినిజం- మావో ఆలోచనా విధానమే శరణ్యమని గ్రహించారు. అంతేగాక భారత విప్లవోద్యమ నాయకులు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వరరావుల సాంగత్యం తోను, వారి బోధనలు, రచనల తోను ప్రభావితులై భారతదేశంలో అనుసరించవలసిన విప్లవ మార్గం పట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి తన జీవితాంతం తాను నమ్మిన ఆశయాల కోసం అంకితమై కృషి చేశారు.
ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ ఏర్పడిన నా టి నుంచి (1971-72) జ్వాలాముఖితో దాని అనుబంధం ప్రగాఢమైనది. సంస్థ మౌలిక లక్ష్యాలపట్ల, వాటిని సాధించే విప్లవ ప్రజాతం త్ర పద్ధతుల పట్ల ఏకీభావంతో ఏర్పడిన ఈ సంబంధ బాంధవ్యాలు ఆయన జీవితం చివ రివరకు కొనసాగాయి. నాలుగు దశాబ్దాల డీఎస్‌ఓ చరిత్రలో ఆయన అనేక సభల్లో, సమావేశాల్లో తన కంచుకంఠంతో విద్యార్థి లోకాన్ని, యువతను ఉర్రూతలూగించి వారి లో విప్లవోత్తేజం కలిగించి చెరగని ముద్రవే శారు. అంతేగాక అనేక సమస్యలపై డిఎస్‌ఓ చేపట్టిన మౌలిక అవగాహనతో ఏకీభవిస్తూ ఆ అవగాహనకు అనుగుణంగా తన వాగ్ధాటి ద్వారా, తనదైన శైలిలో వారిని నిరంతరం చైతన్యవంతులను చేశా రు.
రిజర్వేషన్ సమస్య, భాషా సమ స్య, ప్రత్యేక తెలంగాణ సమస్య -ఇలాంటి క్లిష్ట సమస్యలపై సాధా రణ విద్యార్థులకు, ప్రజలకు అర్థ మయ్యే రీతిలో అనేక ఉపమానా లతో, కథలతో జోడించి చెప్పేవారు. ఉదాహ రణకు రిజర్వేషన్ వ్యతిరేక, అనుకూల ఉద్య మాలు చెలరేగిన సందర్భంలో ఆయన పాల కుల రిజర్వేషన్ల విధానం విఫలమైందని దాని బూటకత్వాన్ని వివరిస్తూ ‘కౌరవులు పాండవు లకిచ్చిన లక్క ఇల్లు లాంటిదే పాలకులు ప్రజ లకిచ్చిన రిజర్వేషన్లు’ అని వ్యాఖ్యానిస్తూ చీలిక ఉద్యమాల్లోకి పోకుండా విద్యార్థులను చైతన్య వంతులను చేశారు.
ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా, విజ్ఞానదాయకంగా ఉండటమేకాక విద్యార్థుల ను కర్తవ్యోన్ముఖులను చేసేవి. విద్యార్థులను, యువతీ యువకులను, భావి భారతదేశ ఆశా కిరణాలుగా జ్వాలాముఖి అభివర్ణించేవారు. నేటి అరాచక, అశ్లీల సంస్కృతి ప్రభావంలో పడకుండా విద్యార్థులు నిరంతరం అప్రమ త్తంగా ఉండాలని, చైతన్యశీలురు కావాలని నిత్యం ప్రబోధించేవారు.
పురాణాలలోని, ఇతి హాస కథలలోని, స్వాతంత్య్ర పోరాటంలోని వీరుల త్యాగాలను తరచుగా ఉటంకిస్తూ ఆయన అటువంటి వీరుల నుండి నేటి విద్యార్థులు, యువకులు ప్రేరణ పొంది దేశంలో మౌలిక మార్పుల కోసం, మంచి సమాజ స్థాపన కోసం కృషిచేయాలని ప్రబోధించేవారు. పేదరి కం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మొద లగు సమస్యలు చుట్టుముట్టినా లెక్క చేయ కుండా జ్వాలాముఖి విప్లవ ఆశయాల కోసం జీవితం అంతా పోరాడారు. త్యాగనిరతి, అంకి తభావం, విప్లవ లక్ష్యంపట్ల చిత్తశుద్ధి, ఉన్నత మైన విలువలు మొదలగు లక్షణాలతో మూర్తీ భవించిన జ్వాలాముఖి విప్లవకర జీవితం నుండి స్ఫూర్తిని, ప్రేరణను పొంది ఆయన ఆశించిన నూతన సమాజస్థాపన కోసం కృషి చేయటమే నేటి విద్యార్థుల, యువజనుల కర్తవ్యం. ఆ విప్లవ తపస్వికి మనమందించే ఉత్తమమైన నివాళులు ఇవే.
(నేడు జ్వాలాముఖి ఆరవ వర్ధంతి)
జె.ఉపేందర్ ప్రధాన కార్యదర్శి, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డీఎస్‌ఓ)