Jwalamukhi
-
Jwalamukhi: సమసమాజ విప్లవ తపస్వి
చరిత్రలో రెండురకాల కవులు, కళాకారులు మనకు గోచరిస్తారు. ప్రభు వర్గాలను, పాలకవర్గాలను కీర్తిస్తూ వారి దోపిడీ, పీడనలను సమర్థిస్తూ వారి అడుగులకు మడుగులొత్తే కవులు, కళాకారులు ఒక కోవకు చెందినవారు. కాగా దానికి భిన్నంగా పాలకవర్గాలను, వారి దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజల, పీడితుల పక్షం వహించి తమ గళాన్ని, కలాన్ని ప్రజల ప్రయోజనాలకోసం సంధించే కవులు, కళాకారులు రెండోకోవకు చెందుతారు. తన జీవితం చివరిక్షణం వరకు పాలకవర్గాలపై, దోపిడీవ్యవస్థపై నిప్పులు కురిపిస్తూ తన ప్రతిభాపాటవాలను, శక్తిసామర్థ్యాలను ప్రజలకోసం ధారపోసిన జ్వాలాముఖి రెండోకోవకు చెందిన కవులలో ప్రముఖుడు. జ్వాలాముఖి 1938 ఏప్రిల్ 12న హైదరాబాదులోని సీతారాంబాగ్ దేవాలయంలో జన్మించారు. చిన్నతనంలోనే తాను నివాసముండే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల ఇండ్లస్థలాల సమస్యపై పోరాటం చేసి పేద ప్రజల ప్రేమకు పాత్రుడయ్యారు. ఎన్నో రుగ్మతలకు ఆలవాలమైన నేటి దోపిడీ వ్యవస్థపై ‘దిగంబరకవి’గా తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. క్రమంగా తన నిరంతర అధ్యయనం, పరిశీలన ద్వారా నేటి సమాజంలోని ప్రజల కడగండ్లకు దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థే మూలకారణమని గ్రహించుకున్నారు. భారత విప్లవోద్యమ నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల సాంగత్యంతోను; వారి బోధనలు, రచనలతోను ప్రభావితులయ్యారు. భారతదేశంలో అనుసరించవలసిన విప్లవమార్గం పట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు. అప్పటినుంచి తాను నమ్మిన విప్లవ ఆశయాలకోసం జీవితాంతం అంకితమై కృషిచేశారు. (చదవండి: జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు) ఒక మానవుడు మరో మానవున్ని దోచుకోవటానికి వీలులేని వ్యవస్థకు బాటలువేసే సోషలిస్టు సమాజంకోసం జ్వాలాముఖి పరితపించారు. ‘బాల్యానికి శిక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వృద్ధాప్యానికి రక్షణలేని దేశం ఒక దేశమేనా?’ అని ప్రశ్నిస్తూ వచ్చారు. ప్రజలందరికీ ఇటువంటి మౌలిక సౌకర్యాలు సోషలిస్టు సమాజంలోనే సాధ్యపడతాయని, అటువంటి సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని నొక్కి చెప్పేవారు. (చదవండి: మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన) జ్వాలాముఖి చక్కటి వక్త. తన కంచుకంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించి వారిలో విప్లవోత్తేజం కల్గించి చెరగని ముద్రవేసేవారు. తన వాగ్ధాటిద్వారా, తనదైన శైలిలో పాలకవర్గాలపై నిప్పులు కురిపిస్తూ ప్రజలను, విద్యార్థులను, యువకులను నిరంతరం చైతన్యవంతులను చేసేవారు. క్లిష్టసమస్యలపై సరైన అవగాహనను సాధారణ ప్రజలకు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అనేక ఉపమానాలతో, కథలతో జోడించి చెప్పేవారు. ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా, విజ్ఞానదాయకంగా ఉండటమేగాక ప్రజలను విప్లవకర్తవ్యోన్ముఖులను చేసేవిగా వుండేవి. అన్నిరంగాల ప్రజల హృదయాలలో విప్లవభావాలను గుదిగుచ్చటంలో ఆయనమేటి. విద్యార్థులను, యువకులను భావి భారతదేశపు ఆశాకిరణాలుగా జ్వాలాముఖి అభివర్ణించేవారు. నేటి భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థ వెదజల్లే అరాచక, అశ్లీల సంస్కృతి ప్రభావంలో పడకుండా విద్యార్థులు, యువకులు నిరంతరం అప్రమత్తంగా వుండాలని, చైతన్యశీలురు కావాలని ఆయన నిత్యం ప్రబోధించేవారు. పురాణాలలోని, ఇతిహాస కథలలోని, స్వాతంత్య్ర పోరాటంలోని వీరుల త్యాగాలను తరచుగా ఉటంకిస్తూ ఆయన నేటి విద్యార్థులు, యువకులు అటువంటి వీరులనుండి ప్రేరణ, స్ఫూర్తిని పొంది దేశంలో మౌలికమార్పుల కోసం, మంచి సమాజ స్థాపనకోసం కృషిచేయాలని ప్రబోధించేవారు. భారత సమాజంలోని సమస్యలన్నింటికీ మౌలిక పరిష్కారమార్గాన్ని చూపిన దేవులపల్లి, టియన్‌ల విప్లవకర జీవితాలనుండి స్ఫూర్తిని పొందాలని చెప్పేవారు. ‘డివి, టియన్‌లు భారత విప్లవోద్యమంలో కృష్ణార్జునులవంటివారు’ అని ఆయన అభివర్ణించేవారు. (చదవండి: Mannu Bhandari: రాలిన రజనీగంధ) పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మొదలగు అనేక సమస్యలు చుట్టుముట్టినా లెక్కచేయకుండా జ్వాలాముఖి విప్లవ ఆశయాల కోసం జీవితాంతం పోరాడారు. ఆయన విప్లవకర జీవితం నుండి స్ఫూర్తిని, ప్రేరణనుపొంది తాను ఆశించిన నూతన సమాజస్థాపన కోసం కృషిచేయటమే నేటి ప్రజల ముఖ్యంగా విద్యార్థుల, యువజనుల కర్తవ్యం. ఆ విప్లవ తపస్వికి మనమందించే ఉత్తమమైన నివాళులు ఇవే. 2008 డిసెంబరు 14వ తేదీన కన్నుమూసిన జ్వాలాముఖికి అరుణారుణ జోహార్లు. – సి. భాస్కర్, యుసిసిఆర్‌ఐ (యంయల్) నేడు (డిసెంబరు 14) ప్రముఖ విప్లవకవి జ్వాలాముఖి వర్ధంతి -
శ్రుతి బయోపిక్ జ్వాలాముఖి
మీ బయోపిక్‌కి ఏం టైటిల్ పెడతారు? అని అడిగితే, ‘జ్వాలాముఖి’ అన్నారు శ్రుతీహాసన్. అంటే... భవిష్యత్తులో శ్రుతి జీవితాన్ని వెండితెరపై చూసే అవకాశం ఉందని ఊహించవచ్చు. వారాంతంలో అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్ చాట్ చేశారు శ్రుతీహాసన్. అప్పుడు ఓ ఫ్యాన్ ‘మీ బయోపిక్ టైటిల్ ఏంటి’ అంటే, ‘జ్వాలాముఖి’ అన్నారామె. ఇంతకీ ఈ బ్యూటీ జీవితంలో ఓ బయోపిక్‌కి కావాల్సినంత మసాలా ఉందా? అంటే.. విలక్షణ నటుడు కమల్‌హాసన్, నటి సారికల కూతురిగా శ్రుతీది గోల్డెన్ స్పూన్ అయినప్పటికీ, తల్లిదండ్రులకు ఉన్న పేరు వల్ల చిన్నప్పుడు స్వేచ్ఛ కోల్పోయారు. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో కమల్‌లా మంచి యాక్టరేనా? అనే కామెంట్లు ఒకటి. సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి శ్రుతి ప్రతి పాత్రనూ సవాల్‌గా తీసుకుని చేసి, అనుకున్నది సాధించారు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ‘ఐరన్ లెగ్’ అన్నారు కొందరు. అలానే లవ్, బ్రేకప్ వంటివి కూడా ఉన్నాయి. నటిగా, గాయనిగా, సంగీతదర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. భవిష్యత్తులో శ్రుతి బయోపిక్ తీస్తే అప్పటి విశేషాలు, ఇప్పటివరకూ జరిగినవి కలిపితే ఓ మంచి సినిమా తయారవుతుందని ఊహించవచ్చు. -
ఆన్లైన్ చదువు కోసం ఆవు అమ్మకం
పాలంపూర్: తమ ఇద్దరు పిల్లల ఆన్లైన్ పాఠాల కోసం, కుటుంబానికున్న ఏకైక జీవనాధారమైన ఆవుని రూ.6,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జ్వాలాముఖిలోని గుమ్మర్ గ్రామానికి చెందిన కుల్దీప్ కుమార్‌కు. కుల్దీప్ పిల్లలు అన్నూ నాల్గవ తరగతి, డిప్పు రెండవ తరగతి చదువుతున్నారు. మార్చి నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో పాఠశాలలు మూత పడ్డాయి. ఆన్లైన్ తరగతులు ప్రారంభం అయ్యాయి. చదువు కొనసాగించాలంటే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల్సిందేనని కుల్దీప్పై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. ఎవ్వరూ రుణం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో విసిగిపోయిన కుల్దీప్ తన బిడ్డల చదువుకోసం తన ఏకైక జీవనాధారమైన ఆవుని ఆరువేల రూపాయలకు అమ్ముకొని, పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిపెట్టారు. విషయం తెల్సి జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ దావ్లా విస్మయం వ్యక్తంచేశారు. తక్షణమే కుల్దీప్కి ఆర్థిక సాయం చేయాల్ సిందిగా స్థానిక బీడీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. -
జ్వలించే అగ్నిశిఖ జ్వాలాముఖి
నిత్య చైతన్యం, నిప్పులు చిమ్మే ఉపన్యాసం, సంకుచితత్వానికి అతీతమైన సహజ గంభీరం, జీవితమంతా ఉద్వేగంతో మాట లకు మంటలు నేర్పిన వ్యక్తి జ్వాలాముఖి. ఆయన ప్రసంగిస్తుంటే ఊపిరి బిగబట్టాల్సిందే! ఆ మాటల జలపాతంలో దూకేయాల్సిందే! దిగంబర కవిగా, విప్లవ కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధుడైన ఆ అక్షరయోధుడు దశాబ్దం క్రితం శాశ్వత నిద్రలోకి జారేముందు ప్రజలకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో! మనుషులపైన అచంచల ప్రేమతో జీవించిన జ్వాలాముఖి ఈ లోకం నుంచి నిష్క్రమించి నేటికి దశాబ్ద కాలం పూర్తికావస్తోంది. సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబం 18 ఏప్రిల్ 1938లో జన్మించిన వీరవెల్లి రాఘవాచారి సాహిత్య జీవితం ‘మనిషి’ కావ్యం 1958తో ప్రారంభమైంది. స్వీయాత్మక సంస్కరణ వాదంతో గీసిన ఆ భావచిత్రంతో అనుభూతుల అంచులను తాకారు. దిగంబర కవిత్వంతో విశ్వమానవతావాద పతాకను ఎగురవేయడానికి జ్వాలాముఖిగా అవతరించి ‘సూర్యస్నానం’ చేశారు. ఆ ‘సూర్యస్నానం’లోనే ‘కిందపడ్డ నగ్నకళేబరాన్ని ఐరాసకు ‘ఎంబ్లమ్’గా చేయాలనుంద’న్నారు. సమాజంలోని కుళ్లును చూసి, మర్యాదలన్నిటినీ పటాపంచలు చేసి, ఆవేశంతో విరుచుకు పడ్డారు. ఆయనలోని వైరుధ్యాలు, సామాజిక వైరుధ్యాలతో ఢీకొన్నాయి. ‘ఓటమీ తిరుగుబాటు’ ద్వారా నక్సల్బరీని సాక్షాత్కరింపజేశారు. విప్లవకవిగా మారి, విరసం ఆవిర్భావ చోదకశక్తిగా పనిచేశారు. అధ్యాపకుడిగా పాఠాలు చెప్పినా, జీవిత పాఠాలు చెప్పడమే ప్రవృత్తిగా స్వీకరించారు. ఉపన్యాసం జ్వాలాముఖికి జీవలక్షణం. ఆయన పేరులోనే కాదు, ప్రసంగంలోనూ బద్దలవుతున్న అగ్నిపర్వతం కనిపిస్తుంది. ఆ సుదీర్ఘ ధిక్కారస్వరం ఆయన కవిత్వం లోనూ ప్రతిబింబిస్తుంది. సమూహంలో ఉపన్యసించినా, వ్యక్తులతో మాట్లాడినా ఆ వాక్ప్రవాహం తగ్గేదికాదు. కర్ఫ్యూ ఉన్నా ప్రజల్లోకి చొచ్చుకుపోయేవారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఘర్షణ జరిగినా అక్కడ వాలేవారు. శాంతియాత్రలు చేశారు. శ్రీశ్రీతో కలిసి పౌరహక్కుల కోసం రాష్ట్రమంతా తిరిగినప్పుడు ‘సెడిషన్ చార్జ్’ పెట్టి జైలులో నిర్బంధించారు. విరసంతో విభేదించి, మిత్రులతో జనసాహితి స్థాపించినా, అందులోనూ చీలికలే. జ్వాలాముఖి ఒక వ్యక్తిగా కాకుండా ఎప్పుడూ తన వాగ్ధాటితో ఒక శక్తిగానే కనిపించేవారు. తన భావజాలంతో విభేదించేవారితో కూడా ఆత్మీయంగా వ్యవహరించేవారు. మనుషులపట్ల ఎల్లప్పుడూ ప్రేమ, ఆత్మీయత ఆయనలో కనిపించేవి. మనుషులతో ఎంతో హుందాగా ప్రవర్తించే ఆయన సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేశారు. జ్వాలాముఖి రాసిన ‘వేలాడిన మందారం’ ఉరిశిక్షపై వచ్చిన తొలి నవల. అదొక దిగులు దొంతర. శరత్‌చంద్రుడి జీవిత చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ‘దేశదిమ్మరి ప్రవక్త’ పేరుతో అనువదించారు. ‘రాంఘేయ రాఘవ’ జీవిత చరిత్రను కూడా అనువదించారు. ‘హత్యలు, ఆత్మహత్యలు వర్గసమాజం దినచర్యలు’ అంటూ నిరసించారు. వర్గాలు లేని మానవ స్వర్గాలను స్వప్నించారు. ‘కోటి స్వరాలు పోరాడందే ఉన్నత సమాజం ఆవిష్కరించదు. లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రభవించద’ని స్పష్టం చేశారు. రెండు సార్లు చైనాలో పర్యటించారు. భారత్, చైనా మిత్రమండలి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉభయ దేశాల మైత్రికి ఎంతో శ్రమించారు. జ్వాలాముఖి రచనలలో ‘భస్మ సింహాసనం’ అత్యుత్తమ కావ్యం. గోద్రా అనంతర అల్లర్ల సందర్భంగా గుజరాత్లో రెండుసార్లు పర్యటించి, అక్కడి బాధితులను ఓదార్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. అక్కడి దారుణ సంఘటనలను స్వయంగా విని, కొన్ని దృశ్యాలను కళ్ళారా చూసి చలించిపోయి, ఈ సుదీర్ఘ కవితను ఎంతో ఉద్వేగంగా(2002) రాశారు. ‘నమస్తే సదా హత్యలే మాతృభూమి నిస్సిగ్గు దగ్ధభూమి’/‘తెగిపడిన ఆర్తనాదాలు దయలేని వందేమాతరాలు’ అంటూ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోద్రా అల్లర్లపై ఎవరూ ఇంత నిక్కచ్చిగా, ఉద్వేగంగా రాయలేదు. ‘పీడిత జన సుఖాయ ప్రజాస్వామ్యం శరణం గచ్ఛామి/ తాడిత జన హితాయ లౌకిక రాజ్యం శరణం గచ్ఛామి/ శోషిత జన శుభాయ సామ్యవాద శరణం గచ్ఛామి/బాధిత జన మోక్షాయ విప్లవ శరణం గచ్ఛామి’ అంటూ ప్రవచించిన విప్లవ స్వాప్నికుడు జ్వాలాముఖి. వ్యాసకర్త : ఆలూరు రాఘవశర్మ, సీనియర్ పాత్రికేయులు ఈ- మెయిల్: alururaghavasarma@gmail.com -
అర్ధరాత్రి అదృశ్య శక్తి ప్రదక్షణలు!
నెల్లూరు, ఆత్మకూరు: పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో శరన్నవ రాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. 10వ రోజు విజయదశమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా పట్టణంలోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో తాళాలు వేసిన తలుపులు వేసినట్లుగానే ఉండగా, అర్ధరాత్రి వేళ ఓ మహిళ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తుందని, గజ్జెల శబ్ధం వినిపిస్తోందని పుకార్లు షికార్లు చేశాయి. దుర్గాష్టమి రోజు రాత్రి నుంచి ఇలా జరుగుతుందని పలువురు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఆలయ పూజారి కృష్ణప్రసాద్ సైతం తనకు ఇలా శబ్ధాలు వినిపించాయని చెప్పడంతో కొందరు యువకులు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. పసుపురంగు వస్త్రాలు ధరించిన ఓ మహిళ ముఖం కనిపించకుండా ఆలయ ప్రాంగణంలో అర్ధరాత్రి ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం పలు టీవీ జర్నలిస్టులు ఆలయానికి చేరుకుని భక్తుల అభిప్రాయాలను చిత్రీకరిస్తుండడంతో అక్కడ సందడి నెలకొంది. మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారన్న వాదనలు ఓ వైపు వినిపిస్తున్న భక్తి మార్గంలో ఉండే పలువురు అమ్మవారి శక్తిగా దీనిని అభివర్ణిస్తున్నారు. -
విప్లవ కవి జ్వాలాముఖికి జోహార్లు
తన జీవితం చివరిక్షణం వరకు పాలకవర్గాలపై, నేటి దోపిడీ వ్యవస్థపై నిప్పులు కురిపిస్తూ తన ప్రతిభా పాటవాలను, శక్తి సామర్థ్యాలను ప్రజల కోసం ధారపోసిన విప్లవ కవులలో జ్వాలాముఖి ప్రముఖుడు. ఆయన 14.12.2008న మరణించారు. నేడు ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయనకు విప్లవ జోహార్లు. జ్వాలాముఖి 12.4.1938లో హైద రాబా ద్‌లోని సీతారాంబాగ్ దేవాలయంలో జన్మించారు. చిన్నతనంలోనే తాను నివాసముండే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల ఇండ్ల స్థలాల సమస్యపై పోరాటం చేసి పేద ప్రజల ప్రేమకు పాత్రుడయ్యారు. ఎన్నో రుగ్మతలకు ఆలవాలమైన వ్యవ స్థపై ‘దిగంబర కవి’గా తిరుగుబాటు బావు టాను ఎగురవేసిన ఆయన క్రమంగా తన నిరంతర అధ్యయనం, పరిశీలన ద్వారా నేటి సమాజంలోని ప్రజల కడగండ్లకు దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థే మూలకారణమని, ఈ దోపి డీల నిర్మూలనకు మార్క్సిజం- లెనినిజం- మావో ఆలోచనా విధానమే శరణ్యమని గ్రహించారు. అంతేగాక భారత విప్లవోద్యమ నాయకులు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వరరావుల సాంగత్యం తోను, వారి బోధనలు, రచనల తోను ప్రభావితులై భారతదేశంలో అనుసరించవలసిన విప్లవ మార్గం పట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి తన జీవితాంతం తాను నమ్మిన ఆశయాల కోసం అంకితమై కృషి చేశారు. ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ ఏర్పడిన నా టి నుంచి (1971-72) జ్వాలాముఖితో దాని అనుబంధం ప్రగాఢమైనది. సంస్థ మౌలిక లక్ష్యాలపట్ల, వాటిని సాధించే విప్లవ ప్రజాతం త్ర పద్ధతుల పట్ల ఏకీభావంతో ఏర్పడిన ఈ సంబంధ బాంధవ్యాలు ఆయన జీవితం చివ రివరకు కొనసాగాయి. నాలుగు దశాబ్దాల డీఎస్ఓ చరిత్రలో ఆయన అనేక సభల్లో, సమావేశాల్లో తన కంచుకంఠంతో విద్యార్థి లోకాన్ని, యువతను ఉర్రూతలూగించి వారి లో విప్లవోత్తేజం కలిగించి చెరగని ముద్రవే శారు. అంతేగాక అనేక సమస్యలపై డిఎస్ఓ చేపట్టిన మౌలిక అవగాహనతో ఏకీభవిస్తూ ఆ అవగాహనకు అనుగుణంగా తన వాగ్ధాటి ద్వారా, తనదైన శైలిలో వారిని నిరంతరం చైతన్యవంతులను చేశా రు. రిజర్వేషన్ సమస్య, భాషా సమ స్య, ప్రత్యేక తెలంగాణ సమస్య -ఇలాంటి క్లిష్ట సమస్యలపై సాధా రణ విద్యార్థులకు, ప్రజలకు అర్థ మయ్యే రీతిలో అనేక ఉపమానా లతో, కథలతో జోడించి చెప్పేవారు. ఉదాహ రణకు రిజర్వేషన్ వ్యతిరేక, అనుకూల ఉద్య మాలు చెలరేగిన సందర్భంలో ఆయన పాల కుల రిజర్వేషన్ల విధానం విఫలమైందని దాని బూటకత్వాన్ని వివరిస్తూ ‘కౌరవులు పాండవు లకిచ్చిన లక్క ఇల్లు లాంటిదే పాలకులు ప్రజ లకిచ్చిన రిజర్వేషన్లు’ అని వ్యాఖ్యానిస్తూ చీలిక ఉద్యమాల్లోకి పోకుండా విద్యార్థులను చైతన్య వంతులను చేశారు. ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా, విజ్ఞానదాయకంగా ఉండటమేకాక విద్యార్థుల ను కర్తవ్యోన్ముఖులను చేసేవి. విద్యార్థులను, యువతీ యువకులను, భావి భారతదేశ ఆశా కిరణాలుగా జ్వాలాముఖి అభివర్ణించేవారు. నేటి అరాచక, అశ్లీల సంస్కృతి ప్రభావంలో పడకుండా విద్యార్థులు నిరంతరం అప్రమ త్తంగా ఉండాలని, చైతన్యశీలురు కావాలని నిత్యం ప్రబోధించేవారు. పురాణాలలోని, ఇతి హాస కథలలోని, స్వాతంత్య్ర పోరాటంలోని వీరుల త్యాగాలను తరచుగా ఉటంకిస్తూ ఆయన అటువంటి వీరుల నుండి నేటి విద్యార్థులు, యువకులు ప్రేరణ పొంది దేశంలో మౌలిక మార్పుల కోసం, మంచి సమాజ స్థాపన కోసం కృషిచేయాలని ప్రబోధించేవారు. పేదరి కం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మొద లగు సమస్యలు చుట్టుముట్టినా లెక్క చేయ కుండా జ్వాలాముఖి విప్లవ ఆశయాల కోసం జీవితం అంతా పోరాడారు. త్యాగనిరతి, అంకి తభావం, విప్లవ లక్ష్యంపట్ల చిత్తశుద్ధి, ఉన్నత మైన విలువలు మొదలగు లక్షణాలతో మూర్తీ భవించిన జ్వాలాముఖి విప్లవకర జీవితం నుండి స్ఫూర్తిని, ప్రేరణను పొంది ఆయన ఆశించిన నూతన సమాజస్థాపన కోసం కృషి చేయటమే నేటి విద్యార్థుల, యువజనుల కర్తవ్యం. ఆ విప్లవ తపస్వికి మనమందించే ఉత్తమమైన నివాళులు ఇవే. (నేడు జ్వాలాముఖి ఆరవ వర్ధంతి) జె.ఉపేందర్ ప్రధాన కార్యదర్శి, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డీఎస్ఓ)