మన సైన్యం–మన ప్రజలు | Sekhar Guptha write column on our Army | Sakshi
Sakshi News home page

మన సైన్యం–మన ప్రజలు

Published Sat, Jun 10 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

మన సైన్యం–మన ప్రజలు

మన సైన్యం–మన ప్రజలు

మన సైన్యం గుంపులపైన లేదా సాయుధ పోరాటకారులు కానివారిపైన కాల్పులు జరిపిన లేదా మారణకాండ సాగించిన ఘటనను గుర్తుచేసుకుని చెప్పగలరా? ఎంత ఆగ్రహంతో ఉన్న గుంపులైనా సైన్యాన్ని చూసిన వెంటనే మాయమౌతాయి. అది కఠినంగా, నిష్పాక్షి కంగా ఉంటుందని వారికి తెలుసు. సైన్యం ఫ్లాగ్‌ మార్చ్‌ జరిపాక కూడా కొనసాగిన మత ఘర్షణ ఒక్కటీ కనబడదు. మన సైన్యం డయ్యర్‌లా వందల మంది పౌరులను కాల్చి చంపేది కాదు. డయ్యర్‌–రావత్‌ పోలిక వాస్తవాన్ని తృణీకరించేది, వక్రీకరించేది.

బ్రిగేడియర్‌ జనరల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌ బ్రిటిష్‌వాడే అయినా భారత సైన్యా నికి చెందిన అధికారి. నేనైతే భారత సైన్యం అనడానికి బదులు సైన్యమని ప్రస్తావించడాన్నే ఇష్టపడతాను. భారత వైమానిక, నావికా దళాలకు భిన్నంగా నాటి భారత సైన్యానికి ‘‘రాయల్‌’’ అనే ముందు చేర్పు మాట ఉండేది కాదు. అమృత్‌సర్‌లో బైశాఖీ రోజున పూర్తి శాంతియుతంగా, నిరపాయకరంగా జరుగుతున్న సమావేశంపై కాల్పులను జరిపి 396 మందిని హతమార్చి, వెయ్యికంటే ఎక్కువ మందిని గాయపరచిన సైనికులంతా ఆ సైన్యానికి చెంది నవారే. 25 ఏళ్లు తిరిగే సరికి, అదే సైన్యం చిన్న, ఏకపక్షమైన చారిత్రాత్మక యుద్ధంలో అటూ ఇటూ నిలిచి పోరాటం సాగిస్తూ ఉంది.

సుభాష్‌ చంద్ర బోస్‌ నేతృత్వంలోని భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) అక్ష కూటమి దేశా లకు సైనిక బందీలుగా చిక్కిన భారత యుద్ధ ఖైదీలతో రూపొందినది. ఆ ఐఎన్‌ఏ సైనికులు బ్రిటిష్‌ నాయకత్వంలోని తమ సహోదరులతోనే పోరాటా నికి తలపడ్డారు. ఇరు పక్షాల సైన్యమూ అత్యంత విధేయంగా, తమ సేనా నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి పోరాడింది. మూడేళ్లు గడిచే సరికి, 1947–48లో బాధాకరమైన భ్రాతృ హత్యా మారణకాండలో యుద్ధం సాగించినది సైతం అదే సైన్యం. ఈసారి అది తన సొంత దేశ భూభాగం కశ్మీర్‌ను కాపాడుకోవడం కోసం పోరాడింది.

మన ప్రజాస్వామ్యానికి సైన్యం దన్ను
నేటి మన సైన్యం వలస పాలనా కాలపు భారత సైన్యం గుణశీలాలు, శిక్షణ , నాయకత్వ నిర్మాణ క్రమం, ‘‘సైనిక జాతుల’’ రెజిమెంట్ల పొందిక సహా తొలుత రెండుగా చీలింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ ఏర్పాటుతో మూడుగా చీలింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అదే సైన్యం ఒకటి కంటే ఎక్కువసార్లే అ«ధికారాన్ని నెరపింది, ప్రజలు ఎన్నుకున్న తమ నేతలను హతమార్చింది. దశాబ్దాల కాల క్రమంలో పాక్‌ సైన్యం, వచ్చిపోయే ఎన్నికైన ప్రభుత్వాలను శాసించేంతగా వ్యవస్థీకృతమైంది.

బంగ్లాదేశీ సైన్యం, ఎర్షాద్‌–జియాల రెండు దశాబ్దాల దుస్సాహసాల తర్వాతి కాలంలో మరింత వృత్తిశీలమైనదిగా, ఆధునికమైనదిగా, చాలా వరకు రాజకీయాలకు అతీతమైన బలగంగా పరిణతి చెందినట్టు అనిపి స్తుంది. భారత్‌లో సైన్యం మరింతగా రాజకీయాలకు అతీతమైనదిగా మారింది. అంతేకాదు, ఎక్కువ వృత్తిశీలమైనదిగా, వ్యవహరశైలి కలిగినదిగా, మరీ ముఖ్యంగా జాతిపరంగా, సామాజికంగా, మతపరంగా వైవిధ్యభరితమై నదిగా మారింది. సైనిక జాతులు వంటి పలు వలసవాద తలబరువులను వదిలించుకుని భారత సైన్యం నిజంగానే రాజకీయాలకు అతీతమైన, లౌకిక, ఉదారవాద బలగంగా మారింది. రాజకీయ అధికారాన్ని ఇష్టపూర్వకంగా గౌర వించడం  మరింతగా పెరిగింది కూడా. కొందరైతే అది రాజకీయాధికారాన్ని అతి సులువుగా అంగీకరించేస్తుందని వాదిస్తుంటారు.

రెండవ ప్రపంచ యుద్ధం నుంచి వలస పాలనానంతర ప్రపంచంలో వివిధ సైన్యాలు ఎలా పరివర్తన చెందాయో పరిశీలించి చూడండి. రాజ కీయాలకు దూరంగా ఉండి, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాల ఆదేశా లను పాటించే చెప్పుకోదగినంత పెద్ద సైన్యం ఏదీ కనబడదు. దిన దిన గండంగా బతికిన చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్‌ ప్రభుత్వాల హయాంలో సైతం భారత సైన్యం దేశాన్ని విజయవంతంగా రక్షించడమే కాదు, మరో దేశం ఏర్పడటానికి సహకరించింది కూడా. వలస పాలనానంతర కాలంలోని సైన్యం పరిణామంపై మన దేశంలో విస్తృతంగానే అధ్యయనం జరిగింది.

సైనిక చరిత్రకారులు, ఇతర మేధావులకే అది పరిమితమైంది. సామాజిక శాస్త్రాలలో సుప్రసిద్ధులైన రజనీ కొఠారీ, అశిష్‌ నంది వంటి వారి వారసులు దాన్ని సాధారణంగా విస్మరించారు. 1962 యుద్ధ పరాజయ చరిత్ర అత్యు త్తమంగా లిఖితమై ఉంది. సైన్యం అప్పటికింకా భారతీయీకరణ చెందు తోంది కాబట్టి ఆ చరిత్ర చాలా కీలకమైనది కూడా. బ్రిటిష్‌ వారి నుంచి సైనిక చరిత్ర రచనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాటి సైనికాధికారులు చాలా మందే మన సైనిక చరిత్రపై, పరిణామంపై పలు మంచి రచనలు చేశారు. ఆ వారసత్వం క్రమంగా క్షీణించినా చెప్పుకోదగిన పుస్తకాలు ఎప్పటికప్పుడు వెలువడుతూనే ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం మాజీ సైనికాధికారులు  రచించినవే.

క్షంతవ్యం కాని డయ్యర్‌ పోలిక
అయితే, పెంపొందుతున్న భారత ప్రజాస్వామ్యం శక్తికి కీలకమైన సామా జిక–సైనిక సంస్థగా సైన్యంపై ఒక వృత్తి సామాజిక శాస్తవేత్త చేసిన చెప్పు కోదగిన అధ్యయనం ఏదీ నాకు కనిపించలేదు. సైన్యం పౌర జీవితానికి దూరంగా ఉండాలని మనం అనుకున్నట్టుగానే సామాజిక శాస్త్రాల పండి తులు కూడా సైన్యాన్ని ఏకాకిగా వదిలేసినట్టుంది. భారత సమాజాన్ని, రాజకీ యాలను అధ్యయనం చేసే పండితుల మస్తిష్కాలు పూర్తిగా నిస్సైనికీకరణం చెందాయి. సైన్యాన్ని కంటోన్మెంట్లలో ఉండి దాని పని అది చేసుకోనివ్వనీ అన్నట్టుంది ఇది. భారత ప్రజాస్వామ్యానికి దూరంగా ఉండటం ద్వారా సైన్యం.... మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలవత్తరం కావడంలో, సమాఖ్యగా పెంపొందడంలో, ఉదారవాద స్వభావంగలిగినదిగా మారడంలో పోషించిన చారిత్రక పాత్రను ఎవరూ పట్టించుకున్నదీ లేదు. సైన్యం నుంచి ఇలా మేధో పరంగా విడివడి పోవడమే క్షమార్హం కాని రావత్‌–డయ్యర్‌ పోలికను తేవా లనే తప్పుడు నిర్ణయానికి దారితీసింది.
భారత్‌ తన సైన్యాన్ని అ«ధికారానికి, రాజకీయాలకు దూరంగా ఉంచ డంలో ఎలా సఫలమైందో, చాలా వలసానంతర దేశాలు ఎలా విఫలమ య్యాయో తెలుసుకోడానికి స్టీవెన్‌ విల్కిన్సన్‌ రాసిన ‘ఆర్మీ అండ్‌ నేషన్‌’ చదవడం తప్పనిసరి. కరియప్ప నుంచి మానెక్‌షా వరకు, ఆ తర్వాతా సైన్యం ఆలోచనా విధానం ఎలా మారుతూ వచ్చిందో ఆయన వివరించారు. అంతే కాదు,  సైన్యం సామాజిక, జాతికపరమైన పొందికను మార్చి దాన్ని వైవిధ్య భరితమైనదిగా చేయడానికి దశాబ్దాలుగా అగ్ర సైనిక నాయకత్వం, రాజకీయ వేత్తలు కలసి చేసిన కృషిని సైతం ఆ పుస్తకం చెబుతుంది. తద్వారా సైన్యంలో ఒక్క జాతి, పంజాబీ అధిపత్యం తగ్గడమే కాదు, సైనిక జాతులు అనే వలస వాద వారసత్వాన్ని అది వదుల్చుకోగలిగింది. చివరకు రాష్ట్రాలవారీగా జనా భాను బట్టి సైనిక నియామకాల కోటాలను కేటాయించడం సైతం జరిగింది. సైన్యం/పౌర ప్రభుత్వాల మధ్య చైనా గోడ అనే భావనను వ్యవస్థీకరించ డానికి ఎంతో రాజకీయ చింతన, సామాజిక నిర్మాణ కౌశలమూ అవసరమ య్యాయి.

సైన్యం సహాయాన్ని కోరేది పౌర ప్రభుత్వాలే
అయితే, పౌరజీవితానికి దూరంగా ఉండేలా సైన్యాన్ని ఒప్పించగలిగినా, పౌర ప్రభుత్వాలు అదే పనిగా సహాయం కోసం దానిపై ఆధాపడుతూ వచ్చాయి. మెజిస్ట్రేట్‌ ఆదేశానుసారం పనిచేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ‘‘పౌర అధికా రానికి సహాయంగా’’ అని అభివర్ణించడం పరిపాటి. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఇచ్చే అధికారాలతో సైన్యం కొన్ని సార్లు స్వయంప్రతిపత్తితో తిరుగుబాట్లతో పోరాడాల్సి వస్తుంది. ఈ రెండిం టిలో ఏది ప్రస్తావనకు వచ్చినా దురదృష్టవశాత్తూ అది డయ్యర్‌ను మన జీవితాల్లోకి తిరిగి తీసుకొస్తుంది.

జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ తదుపరి బ్రిటిష్‌ ప్రభుత్వం సంస్కర ణలను చేపట్టింది. నాటి భారత సైన్యం పౌర నియంత్రణలో పాటించాల్సిన పద్ధతులు వ్యవస్థీకృతమయ్యాయి. గుంపులపై కాల్పులు జరపాలంటే మెజి స్ట్రేట్‌ అక్కడ ఉండటమూ, లిఖిత ఆదేశాలు ఇవ్వడమూ అవసరం చే శారు. పౌర అధికారానికి సహాయంగా పనిచేసేటప్పడు ఈ పద్ధతులు నేటికీ సైన్యా నికి వర్తిస్తాయి. ఆ తర్వాత, క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటిష్‌ ప్రభు త్వానికి సైన్యం మరింత క్రియాశీల పాత్రను నిర్వహించడం అవసరమై సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల ఆర్డినెన్స్‌ను తెచ్చింది. మరింత విస్తృ తాధికారాలను ఇచ్చే ఏటీఏఫ్‌ఎస్‌పీకి అదే తల్లి.  

ఇప్పుడిక ఆలోచించండి. సైన్యం గుంపులపైన లేదా సాయుధ పోరా టకారులు కానివారిపైన కాల్పులు జరపడాన్ని, మారణకాండ సాగించడాన్ని గుర్తుచేసుకుని చెప్పగలరా? ఆపరేషన్‌ బ్లూస్టార్‌ గురించి చెప్పకండి. అది తుపాకులతో జరిగిన పోరు, అందులో 149 మంది సైనికులు కూడా మర ణించారు. కశ్మీర్‌లో జరిగిన 1990 నాటి గవాకదాల్‌ గురించి కూడా చెప్ప కండి. అది పారామిలిటరీ దళాలు చేసినది. 1990ల మ«ధ్య వరకు కొంత మెతక వైఖరితో వ్యవహరించిన పలు మానవ హక్కుల ఉల్లంఘనలను, బూటకపు ఎదురుకాల్పులను, కొన్ని అత్యాచారాలను కూడా చెప్పకండి. ఆ తర్వాతి నుంచి అలాంటి వాటికి శిక్షలు విధిస్తున్నారు. ఇవి కూడా సాయుధ పోరాటకారుల తిరుగుబాటు వ్యతిరేక చర్యలలో జరిగిన ఉల్లంఘనలు. మూకలను, ఆగ్రహంతో ఉన్న గుంపుల గురించి ఆలోచించండి. సైన్యం వారిలో ఒక్కరినైనా కాల్చాల్సి రాలేదు. దుండగులు, ఎంత ఆగ్రహంగా ఉన్నా లేదా ఎంతటి కరడుగట్టిన వారైనా సైన్యాన్ని చూసిన వెంటనే పారిపోతారు. సైన్యం కఠినంగా, నిష్పాక్షికంగా ఉంటుందని వారికి తెలుసు. సైన్యం ఫ్లాగ్‌ మార్చ్‌ జరిపాక కూడా కొనసాగిన మత ఘర్షణ ఒక్కటీ కనబడదు. కశ్మీర్‌ లోనూ అదే పరిస్థితి.

గుంపులు సైన్యాన్ని సవాలు చేసినదిగానీ, పోరాడినది గానీ లేదు. సైన్యం ఉగ్రవాదులతో పోరాడినప్పుడల్లా పౌరులు అడ్డు తొల గారు. సైన్యం ముట్టడిలోని ఉగ్రవాదులకు రాళ్లు రువ్వే గుంపులు మానన కవచాలు అవుతుండటంతో ఈ సమీకరణం ఇటీవల మారింది. మును పెన్నడూ ఎరుగని ఈ సవాలుతో వ్యవహరించే సిద్ధాంతాన్ని సైన్యం కను గొనాల్సి ఉంది. కంటికి కన్ను పంటికి పన్నుSమానన కవచాలకు పరిష్కారం కాదు. అయితే సైన్యం తనను అడ్డగించే గుంపులపై కాల్పులు జరపవచ్చా? అలా అయితే, ఎప్పుడు, ఎంత మేరకు, ఎలాంటి ప్రభావం కోసం? తేల్చాల్సి ఉంది. సైనిక బలగాల అధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ బహిరంగంగా మాట్లా డేటప్పుడు మాటలను ఆచితూచి ప్రయోగించాల్సింది. ఈ సరికొత్త సవా లును ఎదుర్కోవడానికి ఒక కొత్త సిద్ధాంతం అవసరం. అది రూపొందు తుందనడంలో సందేహం లేదు. సైనిక శ్రేణులకు ముందు ఎక్కువ మంది కశ్మీరీలను మనం ఇక చూడం. అంతేకాదు మన సైన్యం డయ్యర్‌ శైలిలో వందల మందిని మారణహోమం చేయదు. అందువల్లనే డయ్యర్‌–రావత్‌ పోలిక వాస్తవాన్ని తృణీకరించేది, వక్రీకరించేది.

 

  - శేఖర్‌ గుప్తా
    twitter@shekargupta




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement