Sekhar Guptha
-
నైతిక పతనం దిశగా ఐపీఎస్
ఈ వారం చర్చనీ యాంశం.. భారత్ పోలీసు రాజ్యంగా ఉంటోందా? ఈ ప్రశ్నకు మూడు సత్వర స్పందనలు ఇలా ఉండవచ్చు: ‘కాకపోవచ్చు’, ‘అవును’ లేదా ‘ఇంకా కాదు’. దీనికి మీరు మరికొన్ని ప్రశ్నలను కూడా సంధించవచ్చు. ‘ఎందుకు’, ‘ఎలా’, ‘ఎప్పుడు’. ఈ స్పందనలను దాటి చూస్తే ఇండియన్ పోలీసు సర్వీస్.. ఇండియన్ పొలిటికల్ సర్వీసుగా రూపాంతరం చెందిందనేదే వాస్తవం. మన దేశంలో పోలీసు–రాజకీయనేతల మధ్య సంబంధం కొత్తదేమీ కాదు. కానీ ఇది నాటకీయంగా మరింత హీనస్థితికి చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎస్ ఇప్పుడు తన నైతిక, వృత్తిగతమైన ధృతిని కోల్పోయింది. పోలీసు రాజ్యం (పోలీస్ స్టేట్)కి ఆక్స్ఫర్డ్ నిఘంటువులో మరింత కఠినమైన అర్థం ఉంది. రాజకీయ, పోలీసు బలగాలచే తన పౌరుల కార్యకలాపాలపై రహస్యంగా నిఘా పెట్టి, పర్యవేక్షించే నిరంకుశ రాజ్యం అని దీనర్థం. మనమయితే ఇంకా ఆ దశకు చేరలేదు. భారత్ ఒక పోలీసు రాజ్యంగా ఇంకా మారి ఉండకపోవచ్చు కానీ పోలీసులు చట్టంగా ఉంటున్న దేశంగా మారుతోంది. ప్రస్తుతం పోలీసులు– రాజకీయనేతల మధ్య బంధం ఐఏఎస్‌లు, న్యాయవ్యవస్థను కూడా తోసిరాజంటోంది. దీనికి కొన్ని ఉదాహరణలను చూపించవచ్చు.1. తబ్రెజ్ అన్సారీ కేసు. జార్ఖండ్ వాసి అయిన 24 ఏళ్ల తబ్రెజ్ను సైకిల్ దొంగతనం చేశాడనే అనుమానంతో మూక చచ్చేంతవరకు చావబాదింది. కానీ ఆ రాష్ట్ర పోలీసులు మాత్రం మూక హింస వల్ల కాకుండా, గుండెపోటు వల్ల అతడు చనిపోయినట్లుగా కేసు తీవ్రతను తగ్గించి చూపారు. కానీ చైతన్యవంతులైన వైద్యుల బృందం దీన్ని తప్పుడు కేసుగా ఆరోపించింది.2. రాజస్తాన్‌లో పెహ్లూ ఖాన్ కేసు. గోమాంసాన్ని ఇంట్లో ఉంచుకున్నాడనే ఆరోపణతో మూక తనను చావబాది చంపినట్లు కెమెరా సాక్ష్యం ఉన్నప్పటికీ దాన్ని పోలీసులు సాక్ష్యంగా సమర్పించలేదు. దీంతో కోర్టు ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిం చింది. 3. ఉన్నావో అత్యాచార ఘటన. యూపీలోని ఉన్నావో నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని దళిత యువతి ఆరోపిస్తే ఆమెకు న్యాయం చేయడానికి బదులుగా పోలీసులు ఆమె తండ్రిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టగా ఆయన కస్టడీలోనే చనిపోయాడు. పైగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడంటూ తనపైనే పోలీసులు కేసుపెట్టారు. తర్వాత బాధితురాలిపై, ఆమె లాయర్‌పై జరిగిన హత్యాప్రయత్నం ప్రజాగ్రహానికి దారి తీయడంతో సీబీఐ ఈ కేసులో ముగ్గురు పోలీసులపైనా నేరారోపణ చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఢిల్లీ పోలీసులు కశ్మీర్ పౌర హక్కుల కార్యకర్త, రాజకీయనేత అయిన షెహ్లా రషీద్‌పై తాజాగా రాజద్రోహం కేసు పెట్టారు. ఒక వ్యక్తి చేసిన ఆరోపణ దీనికి మూలం. ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఆరోపణలు ఆధారంగా దేశద్రోహ కేసులను నమోదు చేయడం కన్నా మించిన న్యాయ పరిహాసం మరొకటి ఉండదు. దీంతో సంబంధిత పౌరులను తీవ్రంగా వేధించవచ్చు, విచారణ పేరుతో ఆర్థికంగా కుంగదీయవచ్చు. పైగా కన్హయ కుమార్ ఉదంతంలోవలే విచారణ లేకుండానే నెలల తరబడి జైలులో గడపవలసి రావచ్చు. ప్రభుత్వంపై, ఉన్నతాధికారులపై, సాయుధ బలగాలపై విమర్శ చేసినంత మాత్రాన దేశద్రోహం కిందికిరాదంటూ ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ గుప్తా స్పష్టం చేసిన వారంలోనే షెహ్లా రషీద్‌పై దేశద్రోహ కేసు పెట్టడం గమనార్హం. దశాబ్దాలుగా మన రాజ కీయ వర్గం పార్టీ భేదాలు లేకుండా పోలీసులను యూనిఫాంలోని మాఫియాలాగా వాడుకుంటూ, వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వస్తోంది. అయితే దీనికి రాజకీయనేతలను మాత్రమే తప్పు పట్టాలా లేక పోలీసు శాఖను నియంత్రిస్తున్న ఐపీఎస్‌కు దీంట్లో భాగం లేదా? నిజాయితీని అంటిపెట్టుకుని ఉన్న ఏ సీనియర్ పోలీసు అధికారి అయినా కాస్త బుర్రను ఉపయోగించినట్లయితే, పైన పేర్కొన్న కేసులు ఇంత దరిద్రమైన ముగింపునకు చేరుకోవన్నది వాస్తవం. న్యాయాన్ని ప్రసాదించాల్సింది కోర్టులు మాత్రమే అని నటించడం కంటే నేరచర్య మరొకటి ఉండదు. న్యాయప్రక్రియ తనంతటతాను శిక్షగా మారిపోతున్నందున దేశంలో ఏ పౌరుడైనా, తగిన వనరులున్న వారైనా సరే సంవత్సరాల తరబడి కేసుల్లో భాగంగా బాధపడాల్సి వస్తోంది. అవినీతి కేసులనుంచి మూక హింస ఘటనల దాకా రాజకీయనాయకులు ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్రంగా పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించగలిగిన పక్షంలో న్యాయస్థానాలు అసంఖ్యాకమైన కేసుల విచారణ భారంతో నలిగిపోయే పరిస్థితే ఉండేది కాదు. అధికారంలో ఉన్న నేతల అభీష్టం మేరకు అమాయకులపై కేసులు మోపటం, వారు మద్దతిస్తున్న పార్టీలను వీడి అధికార పార్టీలోకి చేరేంతవరకు వారిని వేధిం చడం వంటి చర్యలు తప్పు అనీ, అలాంటి చర్యలకు నాయకత్వం పాల్పడవద్దని చెప్పగల దమ్ము ప్రస్తుతం ఐపీఎస్‌లో పూర్తిగా కొరవడినట్లే కనిపిస్తోంది. దీనికి భిన్నంగా గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎస్ దేశంలోని రాజకీయ యజమానుల సేవకే నిబద్ధత చూపుతున్న సర్వీసుగా మారిపోయింది. నేతల ఒత్తిళ్ల ఫలితంగా పోలీసులు ఇప్పుడు దేన్నయినా తమ్మిని బమ్మిని చేసే స్థితికి పతనమయ్యారు. అవినీతి కేసులను తారుమారు చేయగలరు. మూకహత్యలో చనిపోయిన వ్యక్తిది గుండెపోటు మరణంగా మార్చేయగలరు. అత్యాచార బాధితురాలి నిరుపేద తండ్రిని కరడుగట్టిన నేరస్థుడిగా ముద్రవేసి భూమ్మీదే లేకుండా చేయగలరు. ప్రైవేట్ కంప్లయింటును కూడా రాజద్రోహ కేసుగా తారుమారు చేసేయగలరు. పీవీ నరసింహారావు తన ప్రత్యర్థుల పనిపట్టడానికి ప్రయోగించిన జైన్ హవాలా కేసుల నుంచి సీబీఐ తదితర నిఘా సంస్థల వృత్తిపర క్షీణత తొలి సంకేతాలు మొదలయ్యాయి. ప్రముఖ రాజకీయనేతలు, ఉన్నతాధికారులు, అమాయకుల వ్యక్తిత్వ హననం ఆనాటినుంచే మొదలై ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. అనేకమంది యువ ఐపీఎస్ అధికారులు ఆదర్శవాదాన్ని రంగరించుకుని సర్వీసులోకి చేరుతుంటారు కానీ కాలక్రమంలో వారు ఆ లక్షణాన్ని పోగొట్టుకుని రాజీపడిపోవడం సహజమైపోతోంది. దీంతో సింహంలా ఉండాలనుకునేవాళ్లు చివరికి క్యారికేచర్లుగా మారిపోతున్నారు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
కన్నడ కురువృద్ధుడి మాట నెగ్గేనా?
పరిమాణం రీత్యా దేశంలోని మధ్య స్థాయి రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక ఇంతవరకు తిరుగులేని అధికారం చలాయిస్తున్న అమిత్ షా, నరేంద్రమోదీలకు తొలి సవాలు విసిరింది. బీజేపీ చరిత్రలో ఏ ఒక్కరికీ సాధ్యపడని రీతిలో ఆ పార్టీ అధిష్టానాన్నే రాజీపడేలా చేశారు యడియూరప్ప. ముఖ్యంగా బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారు ఏ ముఖ్యపదవులూ చేపట్టరాదనే వయోపరిమితి నిబంధనను యడియూరప్ప ధిక్కరించారు. అవినీతి విషయంలో ఎవరినీ మినహాయించేది లేదంటూ బీజేపీ నిర్దేశించుకున్న మరో ముఖ్య సూత్రాన్ని కూడా వదులుకునేలా చేశారు. అవినీతి ఆరోపణలతో గతంలో సీఎం పదవికి రాజీనామా చేసి పోటీ పార్టీ పెట్టిన తాను మినహా పార్టీకి మరో దిక్కులేదని ఆయన నిరూపించుకున్నారు. ఇది మిగతా రాష్ట్రాల్లోని బీజేపీ సీనియర్ నేతలకు కూడా ప్రేరణ నిస్తుందా అనేది ప్రశ్న. కర్ణాటక రాజకీయపరంగా చూస్తే భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రాష్ట్రమయితే కాదు. లోక్‌సభకు అది అందిస్తున్న ఎంపీల సంఖ్య ప్రాతిపదికన చూస్తే కేరళ (2), మధ్యప్రదేశ్ (29)కి మధ్య స్థాయిలో ఉండే రాష్ట్రమది. కానీ గత కొన్ని నెలలుగా పతాక శీర్షికల్లో లభించే ప్రాధాన్యతను బట్టి చూస్తే కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలను చాలాసార్లు అధిగమించినట్లే చెప్పాలి. ఇప్పుడు బీజేపీ కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరుణంలో రాష్ట్రం ప్రశాంతంగా విజయ సంబరాలను గడుపుకుంటుదని మనం ఊహించవచ్చు కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే చాలా కలవరం, వ్యాకులత కలుగుతోంది. మరింత వివరంగా చెప్పాలంటే.. పరిమాణం రీత్యా దేశంలోని మధ్య స్థాయి రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక ఇంతవరకు తిరుగులేని అధికారం చలాయిస్తున్న అమిత్ షా, నరేంద్రమోదీలకు తొలి సవాలు విసిరింది. మనం మరింత స్పష్టత కోసం చూద్దాం. ఈ ఘనతకు కారణం ఆ రాష్ట్రం కాదు.. తన సొంత పార్టీలో ఊహించలేనంత అధికార కుట్రను ముందుకు తీసుకువచ్చిన బీఎస్ యడియూరప్పకే మొత్తం ఘనత దక్కుతుంది. బీజేపీ చరిత్రలో ఏ ఒక్కరికీ సాధ్యపడని రీతిలో ఈ వ్యక్తిమాత్రుడు ఆ పార్టీ అధిష్టానాన్నే రాజీపడేలా చేశాడు. వయోపరిమితి నిబంధనకు చెక్ బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారు ఏ ముఖ్యపదవులూ చేపట్టరాదనే వయోపరిమితి నిబంధనను యడియూరప్ప ధిక్కరించారు. ఇప్పుడాయనకు 76 ఏళ్లు. ఆ వయసులో ఉన్న పార్టీ నేతలు ఎవరైనా సరే గవర్నరుగా రాజ్భవన్కో లేక పార్టీ మార్గదర్శక మండలికో వెళ్లాల్సి ఉంటుందని మోదీ, షాల నేతృత్వంలోని పార్టీ తేల్చి చెప్పింది. 2014 నుంచి బీజేపీ మొత్తం నాయకత్వ శ్రేణిని గమనించినట్లయితే, బహుశా ఇద్దరు మాత్రమే 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా కేబినెట్ ర్యాంకును నిలుపుకోగలిగారు. అది కూడా చాలా కొద్ది కాలం మాత్రమే వారు మనగలిగారు. వారిలో తొలివ్యక్తి నజ్మా హెప్తుల్లా. ఈమె ఇంఫాల్ రాజభవన్‌కు చెక్కేశారు. ఇక రెండవవ్యక్తి కల్రాజ్ మిశ్రా. మంత్రివర్గం నుంచి ఉద్వాసన పిలుపు వచ్చేవరకు ఈయన నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తడంలోనే మునిగిపోయారు. అయినప్పటికీ ఈయన కూడా సిమ్లాలోని రాజ్‌భవన్‌కు బయలుదేరక తప్పింది కాదు. మోదీ, షాల నాయకత్వం విధించిన ఈ వయోపరిమితి నిబంధనను బీజేపీలో ఎవ్వరు కూడా తోసిపుచ్చిన ఘటన జరగలేదు. మోదీని శాశ్వత ప్రధానిగా ఉండాలని డిమాండు చేస్తున్న బీజేపీ నేతలు కూడా మోదీకి 75 ఏళ్లు నిండాక ఎన్డీఏ మూడవ దఫా పాలనలో ప్రధాని ఎవరు కాగలరు అనే అంశంపై అంచనాలు వేసుకోవడం ఉత్తమమన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఇక్కడే యడియూరప్ప ప్రత్యేక ప్రాభవం, అధికారం స్పష్టమవుతుంది. 75 ఏళ్లనాటికి మోదీ పదవీవిరమణ చేస్తారు అనే అభిప్రాయం కూడా ఇప్పుడు చెల్లని కాసులా మారవచ్చేమో మరి. ఒక చిన్న స్థాయి రాష్ట్రానికి ఈ విషయంలో మినహాయింపు నిచ్చినప్పుడు అతిశక్తిమంతుడైన మోదీ విషయంలో అది ఎందుకు సాధ్యపడదు? ఎన్నిరకాలుగా చూసినా, యడియూరప్ప.. మోదీ, షాల ముఖ్యమంత్రుల జాబితాలో ఆదర్శప్రాయ స్థానంలోనే ఉన్నారు. 2014 నుంచి మోదీ, షాలు ముఖ్యమైన రాష్ట్రాల్లో నియమించిన ముఖ్యమంత్రుల జాబితాను చూడండి. వీరిలో ఏ ఒక్కరూ తమ తమ రాష్ట్రాల్లోని అధిపత్య కులానికి చెందినవారు కారు. జాట్లు రాజ్యమేలుతున్న హరియాణాలో మనోహర్ లాల్ ఖట్టర్ సాంప్రదాయ విరుద్ధమైన పంజాబీగా మిగిలిపోయారు. ఇక జార్కండ్లో ఆదివాసీలకు అధికారాన్ని తోసిపుచ్చారు. మహారాష్ట్రలో సీఎం పదవిని చేపట్టిన యువ బ్రాహ్మణుడు దేవేంద్ర పఢ్నవిస్ అక్కడి మరాఠాల దృష్టిలో అంగుష్టమాత్రుడు మాత్రమే. అస్సోంలో సైతం అతి శక్తిమంతుడైన హిమంత బిస్వా శర్మ తనకంటే తక్కువ పలుకుబడి కలిగిన శరబానంద సోనోవాల్ నేతృత్వంలో పనిచేయాల్సి వస్తోంది. స్వయంసిద్ధంగా ఎదిగిన ప్రాంతీయ నేత బీజేపీ అధికారిక నమూనా ప్రకారం ఆ పార్టీకి ఇద్దరు అగ్రనేతలు మాత్రమే అవసరం. వారు కూడా ఢిల్లీలోనే నివసిస్తుంటారు. మిగిలినవారు ఆ ఇద్దరి ఆమోదంతో విశ్వాసంగా సేవ చేస్తుంటారు. కానీ యడియూరప్ప ఆ నిబంధననే తోసిపుచ్చేశారు. స్వయంసిద్ధంగా ఎదిగిన లీడర్‌గా ఆయన ప్రకటించుకున్నారు. యడియూరప్ప ఆధిపత్య కులానికి చెందిన నేత మాత్రమే కాదు. పదే పదే అధిష్టానాన్ని ధిక్కరించే అసమ్మతివాదిగా ఉంటూ వస్తున్నారు. పార్టీ తనను అధికారం నుంచి తొలగించినప్పుడు తన అనుయాయి అయిన సదానంద గౌడను తన స్థానంలో పార్టీ నియమించేలా ఒత్తిడి తీసుకొచ్చారు. అతడిని సైతం అస్థిరత్వానికి గురి చేసినప్పుడు యడియూరప్ప వేరే మార్గం లేక తిరుగుబాటు చేసి తనదైన రాజకీయ పార్టీని ఏర్పర్చి 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 6 ఎంపీ స్థానాలు మాత్రమే గెల్చుకున్నారు కానీ, లింగాయతుల ఓట్లను తాను కైవసం చేసుకోవడం ద్వారా 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 40 సీట్లకు దించివేశారు. కన్నడ రాజకీయాల్లో అపర చాణక్యుడు అవినీతి విషయంలో ఎవరినీ లెక్కచేసేది లేదంటూ బీజేపీ నిర్దేశించుకున్న మరొక ముఖ్య సూత్రాన్ని కూడా అది వదులుకునేలా చేశారు యడియూరప్ప. తన తొలి హయాంలో ఆయన లోకాయుక్త తీవ్ర విమర్శ కారణంగా అధికారం కోల్పోయారు, కొంత కాలం జైల్లో గడిపారు. తర్వాత ఆ కేసునుంచి బయటపడ్డారు. కానీ ఆయను అధికారం నుంచి తప్పించిన కారణంగా, ఎవరికీ ప్రశాంతత దక్కలేదు. దీంతో బీజేపీకి ఒకే అసెంబ్లీలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చాల్సి వచ్చింది. దీని పర్యవసానం ఎంతవరకు వెళ్లిందంటే 2013లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో యడియూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకురావడమే కాదు.. తిరుగులేని ప్రాంతీయ నేతగా ఆయనకు పూర్వ స్థానం కూడా బీజేపీ కట్టబెట్టాల్సి వచ్చింది. ఇది మోదీ–షాల బీజేపీకి శాపంలాంటిది. పోల్చి చూడాలంటే గుజరాత్లో శంకర్ సింగ్ వాఘేలా ఉదంతాన్ని చూద్దాం. అత్యంత సమర్థుడు, కరుడు గట్టిన ఆరెస్సెస్ భావజాలం కలిగిన వాఘేలా బీజేపీనుంచి ఫిరాయించి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అయ్యారు. కానీ బీజేపీ ఆయనకు మళ్లీ ఎన్నడైనా గుజరాత్‌ని అప్పగించిందా? వయస్సు, కులం, అవినీతి, విశ్వసనీయతా పరీక్ష వంటి అన్నింటినీ తోసిపుచ్చుతూ, యడియూరప్ప తన పార్టీనే ఒత్తిడికి గురిచేసి కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చి, ఆ మరుక్షణమే తమ ప్రభుత్వాన్ని ఏర్పర్చడంలో ఘనవిజయం సాధించారు. దీనికి భిన్నంగా మోదీ షా ద్వయం ముందుగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించి కొంతకాలం తర్వాత తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పర్చే పంధాకే ప్రాధాన్యం ఇచ్చి ఉంటారు. తద్భిన్నంగా అసాధారణంగా, ప్రయోజన రహితంగా యడియూరప్పకు అధికారం కట్టబెట్టక తప్పని పరిస్థితికి వారిద్దరూ లోనయ్యారు. ముగియని రాజకీయ క్రీడ అయితే కర్ణాటకలో రాజకీయ తమాషా ఇంకా ముగియలేదు. స్పీకర్ ఒక తార్కిక ముగింపు పలుకుతూ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగిసేంతవరకు వారిని పోటీచేయకుండా నిషేధించి కోర్టులు ఈ సమస్యను పరిష్కరించేంతవరకు ప్రస్తుత సంక్షోభాన్ని పొడిగించవచ్చు. రాజకీయ క్రీడ ఇంకా ముగియలేదు. కనీసం బీజేపీ కోరుకుంటున్న తరహాలో అయితే ఇది ముగింపుకు చేరలేదు. బీజేపీ నేటి ప్రమాణాల బట్టి చూస్తే ఈ కన్నడ కురువృద్ధుడి పలుకుబడి తిరుగులేని విధంగా ఈ సంక్షోభ సమయంలో వెల్లడయింది. యడియూరప్ప విజయం బీజేపీకి, దాని అధిష్టానానికి పంపే సందేశం ఏమిటంటే కర్ణాటకలో యువ నాయకత్వాన్ని నిర్మించుకోవడంలో అది విఫలమైందనే. రాష్ట్రంలో తన ప్రత్యర్థి అనంత్ కుమార్ ఆకస్మిక మరణం యడియూరప్పకు ఎంతగానో కలిసొచ్చింది. అంతకంటే ముఖ్యంగా నరేంద్రమోదీ పలుకుబడిపై ఆధారపడి కర్ణాటక అసెంబ్లీని గెలుచుకోలేమని బీజేపీ గుర్తించింది. తన హిందూ ఓటు బ్యాంకు లోపలే ఎదిగివచ్చిన తన సొంత నాయకుడి కుల ఓటు బ్యాంకు విసిరే సవాలును ఎదుర్కోవడం బీజేపీకి ఇదే తొలిసారి. మోదీ–షాలకు తొలి సవాల్ ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు కూడా ఈ పరిణామాన్ని గమనించవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రాంతీయ నాయకులు యడియూరప్ప తరహాలో విజయం సాధించిన స్థితిలో లేరు. రాజస్థాన్‌లో వసుంధరా రాజే ప్రస్తుతం అధిష్టానం తన అనుయాయులను తొక్కివేస్తూ తన ప్రత్యర్థులను అందలమెక్కిస్తున్న తీరును చూస్తూ ఊరకుంటున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ను గద్దె దింపడానికి తగినంత బలాన్ని, వనరులను శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బీజేపీ అగ్రనాయకత్వం కల్పించడం లేదు. కానీ కర్ణాటక మినహాయింపు నుంచి స్ఫూర్తి పొందగల బీజేపీ నాయకులు మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఉన్నారు. చివరకు యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కోవలోకే రావచ్చు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
పరాజయ సంకేతాలు ఎవరివి?
తెలంగాణలో కేసీఆర్ రాజకీయ ప్రచారాన్ని, సంక్షేమాన్ని పునర్నిర్వచించారు. తన ఆర్థికశాస్త్రంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందుతూ ఉంటుంది. గొర్రెల పెంపకం దార్లకు తలొక 21 గొర్రెలు అందించారు. రజకులకు వాషింగ్ మెషిన్లు అందించారు. మత్స్యకారులకు చేపపిల్లలను సరఫరా చేశారు. రైతుబంధు పథకం గురించి చెప్పాల్సిన పనిలేదు. కొందరు మేధావులు చెబుతున్నట్లుగా ఇవి పూర్తిగా ఓట్ల కొనుగోలు పథకాలే. దేశంలో పలు ఎన్నికల అనుభవాలను గమనిస్తే ఉచిత వస్తువుల పంపకం పక్కాగా ఓట్లను సాధించిపెడుతుందనేది నేటికీ రుజువుకాని సత్యమే. అందుకే ఈ దఫా ఎన్నికల్లో రాయితీలు మాత్రమే కేసీఆర్‌కి గెలుపు తీసుకురాకపోవచ్చు. తెలంగాణలో, దాని రాజధాని హైదరాబాద్‌లో (భారత్‌లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో దానిసొంతం) గోడలపై రాతలను మీరు చదివినట్లయితే వాటిపై ఉన్న రంగును మీరు చూడండి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆయన పార్టీ టీఆర్ఎస్ రాష్ట్రాన్ని గులాబీమయం చేసిపడేశారు. దీన్ని చూస్తే ఈ ఎన్నికల్లో ఒక పార్టీ మాత్రమే పోరాడుతున్నట్లుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నికలను నేను పరిశీలిస్తున్నాను. ఒక రాజకీయ పార్టీ తన కనుచూపు మేరలో ఇంత ఆధిపత్యం చలాయించడాన్ని నేను ఎన్నడూ చూడలేదు. గుజరాత్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవకాశాలు 20:1గా ఉండగా, తెలంగాణలో కేసీఆర్‌కి 90:1 అవకాశం ఉంటోంది. అయినా మనం ఇప్పటికీ ద్వైదీభావంతోనే ఉంటున్నాం. నా విండో నుంచి కిందికి చూస్తుంటే ఏడు భారీ హోర్డింగులు కనిపిస్తున్నాయి. అవన్నీ కేసీఆర్, టీఆర్ఎస్కి సంబంధించినవే. అన్నీ గులాబీ రంగులో అంటే ఆయన పార్టీ రంగులో ఉన్నాయి. ఇలాంటి హోర్డింగులు రాష్ట్ర రాజధానిలో 698 ఉన్నాయని నా నమ్మకం. ఆయన ప్రత్యర్థులవి కూడా ఉండవచ్చు కానీ వాటిని నేను ఇంకా చూడలేదు. ప్రభుత్వం పట్ల అనుకూలత కారణంగా ఆయన తన ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి లేక బీజేపీపై తీవ్ర విమర్శలు చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఇది ఎంత అరుదైన ఎన్నికల ప్రచారం అంటే, కేసీఆర్ గత పనితీరుపైనే పోరాటం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ఇప్పుడు కొత్త వాగ్దానాలు ఏవీ చేయడం లేదు. కానీ గోడలపై, హోర్డింగులపై పింక్ రంగుతో తన గురించి చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఉచితాలు, ప్రజాసంక్షేమ చర్యలపై తాను చేసిన పనుల గురించి తెలిపే వివరాలు వీటిలో కనిపిస్తూ రాత్రిపూట చాలా చక్కగా వెలుగుతుంటాయి. ఆయన ప్రత్యర్థులకు ఇవన్నీ పంపే సందేశం ఏమిటి? ‘మీకు సాధ్యమైతే నాతో పోటీ పడండి’. కేసీఆర్ ఆత్మవిశ్వాసం వివియన్ రిచర్డ్స్ మైదానంలో భీకరంగా విరుచుకుపడే శైలిని తలపిస్తుంది. ఆయన స్కీములన్నీ అనుకూలమేనా? తన లోటు బడ్జెట్ ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుందా? ‘బక్వాస్, సబ్ బక్వాస్’ (చెత్త, అంతా చెత్తే) అనేది కేసీఆర్ లఘు సమాధానం. లోటేమిటి? అని ప్రశ్నించారు. ‘ప్రపంచంలోనే అత్యధిక లోటు ఉన్న దేశం ఏది? అమెరికాయేనా? తర్వాత జపాన్. మరి చైనా విషయమేంటి? ప్రజలు ఏమీ తెలీకున్నా వాగుతుంటారు..’ ప్రొఫెసర్ కేసీఆర్ చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. ‘ఉచిత’ రాజకీయాలకు తమిళనాడులో ప్రత్యేకించి జయలలిత సుప్రసిద్ధం. కేసీఆర్ దాన్ని మరొక స్థాయికి తీసుకుపోయారు. ఇది పనిచేస్తుందా అనేది ఈ ఎన్నికలు తేల్చిపడేస్తాయి. అయితే ఇలా ఉచితాల అప్పగింతలపై నా అనుమానాలు నా పాఠకులకు సుబోధకమే. బార్మర్‌లోని కెయిర్న్ చమురుక్షేత్రం నుంచి వచ్చిన రాయల్టీల కారణంగా వచ్చిన భారీ మొత్తాన్ని కైవసం చేసుకున్న రాజ స్థాన్ ప్రభుత్వం 2008–13 సంవత్సరాల్లో ఇలాంటి ఉచిత వస్తువుల సరఫరా విషయంలో దేశానికే ప్రయోగశాలగా మారింది. కానీ ఆ రాష్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై ప్రజల తీవ్ర వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ 163–21 తేడాతో శాసససభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైంది. జయలలిత రెండో దఫా కూడా ముఖ్యమంత్రి కాగానే (తమిళనాడులో ఇది అరుదైన ఘటన) నిరుపేదలు పండుగ చేసుకున్నారు. దాంతో ఆమె పరపతి అమాంతం పెరిగిపోయింది. ఆమె ప్రజలకు ఉచిత మిక్సర్ గ్రైండర్స్ వంటి వాటిని అందించారు. నిజానికి రెండో దఫా ఎన్నికల్లో ఆమెపై ప్రజా విశ్వాసం 13 శాతం మేరకు పడిపోయింది. ప్రతిపక్షాలు చీలకుండా కలిసి పోటీ చేసి ఉంటే ఆ ఎన్నికల్లో ఆమెకు పరాజయం తప్పేది కాదు. అందుకే ఉచిత వస్తువుల పంపకం పక్కాగా ఓట్లను సాధించిపెడుతుందనేది నేటికీ రుజువుకాని సత్యమే. కానీ కేసీఆర్ విషయంలో అలా చెప్పలేం. రెండు అంశాల్లో తనను చూసి గర్వించాలి. పంపకంలో అతడి రికార్డు, ఊహాశక్తి. ఆయన రాష్ట్రంలో మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన వాదనా పటిమను మీరు చూస్తారు. షాదీ ముబారక్ పేరిట మహిళలకు వివాహ సందర్భంగా లక్ష రూపాయల బహుమతిని అందించారు. ఇతరులకు కల్యాణ లక్ష్మినీ ప్రసాదించారు. ఇక ఆయన ప్రకటించిన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ పథకం సంచలనాత్మకమైంది. తన తొలి దఫా పాలనలో ఆయన 5 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రచారంలో ఇది అత్యంత ముఖ్యమైనది. హైదరాబాద్ సమీపంలోని కొల్లూరులో నిర్మించనున్న 11 అంతస్తుల టవర్ ఆయన ఘనకార్యాల్లో ఒకటి కాగా, రెండోది తన నియోజకవర్గమైన గజ్వేల్‌లో హైవే రూపకల్పన చేయడం. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయం ఏమిటని అడిగాను. అది చెత్త పథకం అంటూ కొట్టిపడేశారు. సింగిల్ రూమ్‌లో అయినా సరే మహిళలు బట్టలు మార్చుకునే అవకాశం మోదీ ఇచ్చారా అంటూ నిలదీశారు. అయితే రూ. 7.5 లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూం పథకాన్ని కేసీఆర్ అమలు చేయగలరా? అయితే కేసీఆర్ చేపట్టిన కొన్ని సృజనాత్మక ఆవిష్కరణలను పరిగణిద్దాం. ప్రభుత్వ భూములను పంచారు, సిమెం టుపై పన్నును రద్దుచేశారు. ఉచిత ఇసుకను అందించారు, థెర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుండి సబ్సిడీతో కూడిన ఫ్లై యాష్‌తో ఇటుకలు ఉపయోగించడం అభివృద్ధి చేశారు. గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించే రూ. 1.5 లక్షలను రాబట్టి 7.5 లక్షల వ్యయానికి పెంచారు. ఒక్కసారి ఆలోచిద్దాం. ముంబైలోని మురికివాడల స్థానంలో నిర్మించిన పునరావాస కాలనీల కంటే ఈ డబుల్ బెడ్ రూమ్ పథకం ఎంతో మెరుగ్గా ఉంటోంది. ఇంకా ప్రభుత్వ ఉచిత ఆసుపత్రులు కట్టించారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే ప్రతి తల్లికీ, ఆమె బిడ్డతో పాటు బట్టలు, టాయెలెట్ సంబంధిత ఉత్పత్తులను గత మూడు నెలలుగా కేసీఆర్ కిట్ రూపంలో అందిస్తున్నారు. కరీంనగర్ ఆసుపత్రిలో తల్లులు, వారి కుటుంబాలతో మాట్లాడుతూ మే ఇదంతా చూశాం. నిజంగానే వారు కేసీఆర్‌కి కృతజ్ఞత చూపుతున్నారు. ఇక రైతు బంధు పథకాన్ని ఎవరైనా చాలా నిశితంగా, దురుద్దేశాలకు అతీతంగా పరిశీలించాల్సి ఉంది. వ్యవసాయ రంగ దుస్థితి జాతీయ వైపరీత్యం. పైగా కనీస మద్దతు ధరలకోసం ఆయా ప్రభుత్వాలు ప్రకటిస్తూ వస్తున్న పలు ఇన్పుట్ సబ్సిడీలు విఫలమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రెండు దఫాలుగా ఒక ఎకరాకు రూ.8 వేలను నేరుగా రైతుకు అదజేస్తోంది. గత సంవత్సరం ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.12,000 కోట్లను వెచ్చించింది. అయితే భూమి సైజుతో పనిలేకుండా ఈ విధానం అమలు చేయడం వల్ల వందఎకరాల భూమి ఉండి వ్యవసాయం చేయని ఆబ్సెంటీ భూస్వాములకు కూడా ఈ పథకం కింద డబ్బులివ్వడం విమర్శలకు దారితీసింది. కానీ ఈ విషయంలో వస్తున్న డేటా మరో కథను చెబుతోంది. 58.3 లక్షలమంది లబ్దిదారులు ఉండగా 14,900 మంది మాత్రమే 50 ఎకరాలు లేక అంతకుమించి కలిగివున్నట్లు తెలుస్తోంది. నిజానికి కేవలం 1.15 లక్షల మంది అంటే మొత్త లబ్ధిదారుల్లో 2 శాతం మంది మాత్రమే 10 ఎకరాలకు మించి భూమిని కలిగి ఉన్నారు. అంటే ఈ పథకంలో ఎక్కువ మందికి మేలు జరుగుతున్నట్లే కదా. ఇలా అంటున్నందుకు కేసీఆర్ ముద్దుగా తిట్టే ‘బక్వాస్’ నన్ను క్షమించాలి. కేసీఆర్ ఆర్థికశాస్త్రంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందుతూ ఉంటుంది. గొర్రెల పెంపకం దార్లకు 21 గొర్రెలు అందించారు. చాకలివారికి వాషింగ్ మెషిన్లు అందించారు. మత్స్య కారులకు చేపపిల్లలను సరఫరా చేశారు. అయితే కంచ ఐలయ్య వంటి మేధావులు చెబుతున్నట్లుగా ఇవి పూర్తిగా ఓట్ల కొనుగోలు పథకాలే. కానీ ప్రతి ఒక్కరూ ఉచిత పస్తువును ప్రేమిస్తున్నారు. మరి వీటికోసం మాత్రమే వారు ఓటేస్తారా అన్నదే ప్రశ్న. దీనికి రుజువు మిశ్రమ స్వభావంతో ఉంది. కానీ ప్రధానంగా ఇలాంటివి వ్యతిరేక స్వభావంతో ఉంటాయి. ఉదాహరణకు ప్రజలకు తాయిలాలను భారీగా అందించిన రాజ స్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2013 ఎన్నికల్లో కుప్పగూలిపోయింది. ఇక రాయితీ రాజకీయాలకు మారుపేరైన తమిళనాడులో రెండో దఫా అదే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం అరుదైన ఘటన. పంజాబ్‌లో ఉచిత విద్యుత్‌తోపాటు గోధుమ పిండి, తృణధాన్యాలను ఉచి తంగా అందించినప్పటికీ అక్కడి అకాలీ–బీజేపీ మిశ్రమ ప్రభుత్వం ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. అదే సమయంలో ముఖ్యమంత్రులను రెండోదఫా ఎన్నుకున్న గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి ప్రభుత్వాలు ఇలా ఉచితాలు, రాయితీల విషయంలో ఛాంపియన్లు కావు. జయలలిత లాగా సబ్సిడీలకు తెరతీసినప్పటికీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీని పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయారు. ఒకటి మాత్రం నిజం. ఓటర్లు తెలివైనవారు. ఉచితంగా తమకు ఒకసారి ఏదైనా అందిస్తే వాటిని ఎన్నటికీ వెనక్కు తీసుకోలేరని వారికి తెలుసు. 2014 ఎన్నికల ప్రచారంలో ఉపాధి హామీ పథకంపై మొరటు వ్యాఖ్యానాలు చేసిన మోదీ తాను గెలిచాక ఆ పథకంలోకి మరిన్ని నిధులను గుమ్మరించిన విషయం మర్చిపోరాదు. పైగా బీజేపీ ఇప్పుడు ఉచి తంగా ఆవులను ఇచ్చే పని పెట్టుకుంది. ప్రజలకు రాయతీలు కల్పించ డంకంటే ప్రజల అస్తిత్వం, రాష్ట్రాలమధ్య వైరుధ్యాలు, మతం, జాతీ యత, ఉపజాతీయతావాదం వంటి సమస్యల పరిష్కారం ఇపుడు చాలా అవసరం. అందుకే ఈ దఫా ఎన్నికల్లో రాయితీలు మాత్రమే కేసీఆర్‌కి గెలుపు తీసుకురాకపోవచ్చు. తెలంగాణ ఆత్మగౌరవం అనే భావనను కూడా ఈ ఎన్నికల్లో ఆయన పదే పదే వాడుతుండటం గమనార్హం. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
దిగుబడి మాటున దాగిన వేదన
గత పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక స్థాయి వ్యవసాయరంగ అభివృద్ధిని మధ్యప్రదేశ్ నమోదు చేసింది. ఇది ఓటర్లలో గొప్ప సంతృప్తిని తీసుకురావాలి. కానీ ఆ రాష్ట్ర సీఎం చౌహాన్ తన జీవితంలోనే అత్యంత కఠినతరమైన ఎన్నికలను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పక్కకు వెళ్లి అశాంతి ఇంత తీవ్రంగా ఈ ఎన్నికల్లో ఎందుకు వ్యక్తమవుతోంది? మధ్యప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రంగా ఎలా రికార్డుకెక్కింది? ఉత్పత్తి పెరిగినా రైతుకు గిట్టుబాటుధర లభించకపోతే హరిత విప్లవ కేంద్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు తప్పవు. అధిక దిగుబడి నేపథ్యంలో రైతుల జీవితాల్లో దయనీయమైన వేదనకు ఇదే మూల కారణం. గోడలపై రాతలు అనేది ప్రత్యేకించి ఎన్నికల ప్రచార సమయంలో భారతదేశ వ్యాప్తంగా విస్తృతంగా ఉనికిలోకి వచ్చే పదబంధం. మన నగరాలకేసి లేక వేగంగా పట్టణీకరణకు గురవుతున్న గ్రామీణప్రాంతం కేసి చూస్తే మీ కళ్లూ చెవులూ ఒక్కసారిగా విచ్చుకుంటాయి. ప్రతిచోటా గోడలపై రాసి ఉన్న విషయం లేదా దాని ప్రతిధ్వనులు దేశంలో మారుతున్నదేమిటి, మారనిదేమిటి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాయి. ఇక్కడ గోడలు అంటే పరిమిత స్థలం అని వాచ్యార్థం కాదు. గుజరాత్ హైవేల పొడవునా కనిపించే ఫ్యాక్టరీల వరుసను కూడా ఈ అర్థంలోనే చూడాల్సి ఉంటుంది. లేక కాంచీపురంలోని పాత పెరియార్ విగ్రహం మీద రాసిన అక్షరాలు కూడా కావచ్చు. లేదా, ప్రస్తుతం ఎన్నికల వాతావరణంలోని మధ్యప్రదేశ్‌లో ఆహారధాన్యాలు, సోయాబీన్ రాశులను, కళకళలాడుతున్న మండీలను మనం గమనించవచ్చు. పంజాబ్‌లో పంటకోతల కాలంలో మీరు చూసే లెక్కలేనన్ని ట్రాక్టర్ల ట్రాలీలను కూడా గమనించవచ్చు. ఇప్పుడు వ్యవసాయ గిడ్డంగుల గోడలు హైవేల పొడవునా కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ నిజంగానే హరిత విప్లవం సాధించిన రాష్ట్రం. గత పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక స్థాయి వ్యవసాయరంగ అభివృద్ధిని ఈ రాష్ట్రం నమోదు చేసింది. ప్రత్యేకించి గత అయిదేళ్లలో మధ్యప్రదేశ్ అసాధారణ స్థాయిలో 18 శాతం వ్యవసాయరంగ అభివృద్ధిని నమోదు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేష్ రజోరా తెలిపారు. ఇక టీఎన్ నినాన్ తన ‘వీకెండ్ రుమినేషన్స్’ (వారాంతపు చింతన) కాలమ్‌లో రాసినట్లుగా, 2010 నుంచి 2015 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ వ్యవసాయ దిగుబడిలో 92 శాతం వృద్ధి నమోదైంది. చాలావరకు వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా ఉంటూ 77 శాతం గ్రామీణప్రాంతాలను కలిగి ఉన్న మధ్యప్రదేశ్ జనాభాలో ప్రతి పదిమందికీ ఏడుగురు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఇది ఓటర్ల సంఖ్య పరంగా గొప్ప సంతృప్తిని తీసుకురావాలి. గత 15 ఏళ్లుగా ఇంత అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగో దఫా పాలనను ఆశిస్తూ ఎంతో స్థిమితంగా కూర్చోవాలి. కానీ కాస్త వేచి ఉండండి. 2018లో మధ్యప్రదేశ్ గోడలపై రాసి ఉన్న చిత్రణ ఇది కాదు. తన జీవితంలోనే అత్యంత కఠినతరమైన ఎన్నికలను చౌహాన్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీపై 9 శాతం ఆధిక్యతతో గెలుపు సాధించారన్నది పట్టించుకోవద్దు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా మేం పర్యటిస్తున్నప్పుడు మేం సమాధానం కోసం ప్రయత్నించిన ప్రశ్నలు ఇవే. వ్యవసాయరంగంలో సాధించిన అభివృద్ధి పక్కకు వెళ్లి వ్యవసాయ రంగ అశాంతి ఇంత తీవ్రంగా ఈ ఎన్నికల్లో ఎందుకు వ్యక్తమవుతోంది? ప్రస్తుతం మధ్యప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రంగా ఎలా రికార్డుకెక్కింది? మీరు కలుసుకుంటున్న అక్కడి రైతులు ఎందుకింత ఆగ్రహంతో ఉంటున్నారు? ఒక దశాబ్ది కాలం వ్యవసాయ రంగ వికాసం ఇప్పుడు పెద్ద శిక్షలాగా ఎందుకు మారిపోయింది? కళ్లూ, చెవులూ, మనసు పెట్టుకుని ఈ వ్యవసాయ ప్రధాన రాష్ట్రానికి వచ్చి చూడండి. భారతీయ వ్యవసాయంలో ఎక్కడ తప్పు జరుగుతోందో అది మీకు తెలియజేస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం సెహోర్‌కు వెళ్లండి. రాష్ట్ర రాజధాని భోపాల్‌కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం రాష్ట్రంలోనే అతిపెద్ద మండీలకు నెలవుగా ఉంటోంది. అయితే మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు.. రైతునా, వ్యాపారినా, మధ్యదళారినా లేక ప్రభుత్వాధికారినా అనే దానిమీదే సమాధానాలు ఆధారపడి ఉంటాయి. తన ట్రాక్టర్ ట్రాలీపై కూర్చొని ఉన్న రామేశ్వర్ చంద్రవంశీతో మేం మాట్లాడాం. సూర్యుడి ఎండలో ఈ రైతు ముఖం మాడిపోయినట్లు కనిపిస్తోంది. ‘గోధుమలకు గిట్టుబాటుధరలు తప్ప మాకేమీ అవసరం లేదు. వంద కేజీల గోధుమలకు రూ.3,000లు సోయాబీన్కి రూ. 4,000లు వచ్చేలా చేస్తే చాలు’ అని చెప్పాడా రైతు. ప్రస్తుతం మార్కెట్ ధరలకు ఇది 30 శాతం కంటే ఎక్కువే. పంటమీద వచ్చే నష్టాన్ని తానెందుకు భరించాలి? ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించనీయండి, లేదా ఎగుమతి చేయనివ్వండి అని తేల్చేశాడు. ‘అంతకంటే మేమిక ఏదీ కోరుకోం. ఫిర్యాదులూ చేయం’ అని చెబుతూ తాను 15 ఎకరాలున్న సంపన్న రైతునే కానీ దారిద్య్రానికి దిగువన ఉంటున్న బీపీఎల్ రైతును కాదు అని రెట్టించి మరీ గుర్తు చేశాడాయన. చౌహాన్ ప్రభుత్వం దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నించింది. గోధుమ, వరి పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీలు)ను పెంచారు. దీనికి అదనంగా బోనస్ కూడా ప్రకటించారు. సోయాబీన్ వంటి కనీస మద్దతు ధర పరిధిలో లేని పంటలకు క్వింటాలుకు రూ.500లు రైతు ఖాతాలోకి బోనస్‌గా వెళ్లింది. తర్వాత తృణధాన్యాల వంతు. ప్రత్యేకించి పెసరపప్పు, ఉద్దిపప్పు. వీటి కనీస మద్దతు ధర వ్యాపారి చెల్లిస్తున్న ధర కంటే 60 నుంచి 90 శాతం ఎక్కువగా ఉంది. తృణధాన్యాల ధరలు పడిపోవడం వినియోగదారుడికి వరంగా మారితే రైతుకు పెను ముప్పుగా తయారవుతుంది. ఈ అంశంపై వ్యవసాయ ఆర్థికవేత్త, ఐసీఆర్ఆఇఆర్ సంస్కర్త అశోక్ గులాటిను ఈ విషయమై ప్రశ్నించండి చాలు. మార్కెట్ ధరకంటే కనీస మద్దతు ధర దాదాపు రెట్టింపు ధరను ప్రతిపాదిస్తున్నప్పటికీ రైతు ఖర్చులను అది చెల్లించలేకపోతోందని మీరు తెలుసుకుంటారు. కాబట్టి, రైతు ఎక్కువగా పండించే కొద్దీ ప్రభుత్వం ఎక్కువగా చెల్లిస్తుంటుంది. కానీ ఇద్దరూ కలిసి ఎక్కవ డబ్బును నష్టపోతుంటారు. మనం మూర్ఖంగా నష్టపోవడానికే చాలా కష్టపడి పని చేస్తున్నామా? గులాటి ఆయిన తోటి స్కాలర్లు రూపొందించిన ఐసీఆర్‌ఐఇఆర్ వర్కింగ్ పేపర్ 339 పేజీని చదవండి. మార్కెట్లతో సమన్వయం లేకపోయినట్లయితే, ఉత్పత్తిని మాత్రమే పెంచడం అనేది ప్రతీఘాతకంగా మారిపోతుందని ఈ నివేదిక మనకు తెలుపుతుంది. దీనికి మంచి ఉదాహరణ కాయధాన్యాలు. సంవత్సరాల తరబడి భారతీయ మొత్తం కాయధాన్యాల ఉత్పత్తి కనీసం 3–4 మిలియన్ టన్నుల కొరతను నమోదు చేస్తింది. ప్రపంచం తగినన్ని కాయధాన్యాలను పెంచడానికి సతమతమవుతోంది కానీ ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. రిటైల్ ధరలు వంద రూపాయలకు చేరుకోగానే మీడియాలో జనాగ్రహం కొట్టొచ్చినట్లు కనబడుతుంటుంది. అప్పుడు ప్రభుత్వం నిద్రమేలుకుని కనీస మద్దతు ధరను పెంచుతుంది. కాయధాన్యల ఉత్పత్తికి సాంకేతిక మిషన్‌ను నిర్మిస్తుంది, ఉత్పత్తిని పెంచుతుంది. దేశీయంగా కాయధాన్యాల డిమాండును 20 లక్షల టన్నుల మేరకు అధిగమించినట్లు ఐసీఆర్‌ఐఇఆర్ డేటా మనకు తెలుపుతుంది. కానీ పాత ఒడంబడికల వల్ల కాయధాన్యాల దిగుమతులు కొనసాగుతూనే ఉంటాయి. దీనిఫలితంగా భారత్‌కు ఏటా 22 లేక 23 మిలి యన్ టన్నుల కాయధాన్యాల ఉత్పత్తి సరిపోతుండగా, దేశంలో 30 మిలియన్ టన్నుల పంట చేరుతుంటుంది. అన్ని దిగుమతులూ జీరో పన్నుతో వస్తున్నందున వీటి ధరలు మన కనీస మద్దతు ధరలో సగమే ఉంటాయి. అంటే రైతు వ్యవసాయ ఖర్చులకు కూడా సమానం కావన్నమాట. కాయధాన్యాల వ్యవహారం మన కళ్లను తెరిపించకపోతే, మధ్యప్రదేశ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి విషయంలో ఏం జరుగుతోందో పరి శీలించండి. గత సంవత్సరం మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంత జిల్లా మాండసూర్లో రైతుల ఆగ్రహం జాతీయ పతాక శీర్షికల్లో చోటు చేసుకుంది. ఆగ్రహావేశాలతో మండుతున్న రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు చనిపోయారు. ఉల్లిపాయల ఉత్పత్తి కేంద్రంగా ఉంటున్న మాండసూర్లో వాటి ధర కిలోకు రూపాయికంటే తక్కువకు పడిపోయింది. రైతుల ఆత్మహత్యలకు జడిసిన చౌహాన్ ప్రభుత్వం నిల్వ ఉన్న ఉల్లిపాయలన్నింటినీ కిలోకు 8 రూపాయల లెక్కన కొంటానని ప్రకటించింది. ఈ వార్త ప్రచారం కాగానే మాండసార్లో పది కిలోమీటర్ల పొడవునా ట్రాక్టర్ ట్రాలీలు ఉల్లిపంటతో బారులు తీరాయి. సుదూరంగా ఉన్న మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కూడా రైతులు తమ ఉల్లిపాయల పంటను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ధర వద్ద కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి దానితో ఏంచేయాలో తోచలేదు. ప్రభుత్వానికి నిల్వ సౌకర్యాలు లేవు. వర్షాలు కుమ్మరించాయి. దీంతో భారీ నిల్వను వదిలించుకోవడానికి కిలో 2 రూపాయలకు అమ్ముతానని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఉన్మాదం కారణంగా మధ్యప్రదేశ్‌లో పన్ను చెల్లింపుదారులు రూ.785 కోట్లు నష్టపోయారు. ఇలా నష్టపోయే జాబితాలో ఈ ఏడు వంతు వెల్లుల్లికి దక్కింది. కిలో వెల్లుల్లి ఉత్పత్తికి రైతుకు రూ. 15–20లు ఖర్చు అవుతుండగా ధరలు మాత్రం కిలో రూ‘‘ 7కి పడిపోయాయి. మనది ఎంత విచిత్రమైన దేశం అంటే, మన రైతులు పండించిన వెల్లుల్లి ధరలు కుప్పగూలిపోతాయి. అదే సమయంలో చైనానుంచి భారీగా దిగుమతులు వస్తుం టాయి. ఎందుకంటే మన ప్రభుత్వ మెదడులో సగం వ్యవసాయం వైపు చూస్తుంటుంది. మిగతా సగం వినియోగదారు ధరలకేసి చూస్తుం టుంది. కానీ వీరు ఇద్దరూ ఎన్నడూ పరస్పరం చర్చించుకోరు. ఎన్నికల్లో మునిగితేలుతున్న మధ్యప్రదేశ్ నుంచి నేర్పవలసిన పాఠం ఏమిటి? రైతులు తమ ఉత్పత్తిని పెంచేలా ఏర్పాట్లు చేసినందుకు మన రాజకీయ నేతలకు అప్పనంగా ఓట్లు పడవు. కాస్త మంచిగా ఆలోచింది వ్యవసాయాన్ని మార్కెట్లతో అనుసంధానించకపోతే, దశాబ్ది కాలపు అమోఘమైన వ్యవసాయాభివృద్ధి సాధించినప్పటికీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలుపు సాధిస్తుందని చెప్పలేం. డబ్బు వెదజల్లడం పరిష్కారం కాదు. కనీస మధ్దతు ధర పెంపు అధిక ధరలకు గ్యారంటీ ఇవ్వదు. పైగా ఆహారధరలు పెరగాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. ఎందుకంటే అక్కడ వినియోగదారుడు ఉన్నాడు. పప్పు, ఉల్లిపాయ, టమేటో, బంగాళదుంపల ధరలు కాస్త పెరిగితే చాలు విమర్శలతో విరుచుకుపడే మీడియా ఉండనే ఉంది. అందుకే ఈ రోజు నిజమైన, చురుకైన రాజకీయనేత వ్యవసాయాన్ని మార్కెట్లతో అనుసంధానించడంపైనే దృష్టిపెడతాడు. దీనిపైనే వనరులను వెచ్చిస్తాడు. అవేమిటంటే ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ చైన్లు, ప్రైవేట్ రంగం ద్వారా స్టోరేజ్, ప్యూచర్ మార్కెట్లను తెరవడం. ప్రభుత్వ వ్యతిరేకత లేక భావజాలం కంటే మధ్యప్రదేశ్ గోడలపై ఇవ్వాళ స్పష్టంగా వ్యక్తమవుతున్న సందేశం ఇదే మరి. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
సైనిక చరిత్రతో నేతల సరాగాలు
సైనికాధికారులు ఎప్పుడూ మంచే చేస్తారు, రాజకీయనాయకులే వారికి అడ్డం వస్తారు అన్న తీరులో జాతీయ భావాలతో కూడిన చరిత్ర ఇన్ని దశాబ్దాలుగా నిర్మితమైంది. దీనిని ఆరెస్సెస్ మరింత అలంకరించి చెబుతుంది. మోదీ కూడా అందులోని వారే కదా! భారత సైనిక చరిత్ర గురించి ప్రధానమంత్రి సృష్టించిన గందరగోళం ఆయనకూ, ఆయన అనుచరులకూ సంబంధించినదే. వారు కనీసం వికీపీడియాలోకి వెళ్లి చూసినా భారత సైనిక దళాల ప్రధాన అధికారి పదవిని (అప్పుడు) కేఎం కరియప్ప (తిమ్మయ్య కాదు) జనవరి 15, 1949న చేపట్టారని తెలిసేది. అందుకే ఆ రోజును సైనిక దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ పదవిని చేపట్టేనాటికి కరియప్ప వయసు యాభయ్ ఏళ్లు (1899లో పుట్టారు). అప్పుడు త్వరితంగా జరిగిన పరిణామాల కారణంగా, ఒక ఘటన మరొక ఘటన మిళితమైపోయి కనిపించడం వల్ల ఆనాటి చరిత్ర కొంచెం తికమక పెడుతుంది. మరింత స్పష్టత కోసం– 1947–48 ఇండోపాక్ యుద్ధ సమయంలో కూడా రెండు దేశాల సైనిక దళాలు బ్రిటిష్ కమాం డర్ల నాయకత్వంలోనే పనిచేశాయి. తరువాత రెండు దేశాల సైనిక నాయకత్వాలను స్థానిక సైనిక అధికారులకు అప్పగించి, రాజకీయ నాయకులతో నేరుగా సంప్రతించే పద్ధతి తెచ్చారు. కశ్మీర్లో జరుగుతున్న పోరు కోసం భారత్ కరియప్పను ఎంచుకుంది. లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్న కరియప్పకు ఢిల్లీ, పంజాబ్ కమాండ్ నాయకత్వం అప్పగించారు. ఆ కమాండ్‌కే ఆయన వెస్ట్రన్ కమాండ్ అని పేరు మార్చారు. కరియప్ప, ఆయనే ఎంపిక చేసిన మేజర్ జనరల్ కేఎస్ తిమ్మయ్య ఇద్దరూ కూర్గ్ ప్రాంతం వారే. పైగా ఇద్దరి ఇంటి పేర్లు కే అనే అక్షరంతోనే మొదలవుతాయి. కే అంటే కోదండేరా. ఇద్దరూ అదే వర్గానికి చెందినవారు. తిమ్మయ్యను కశ్మీర్ (తరువాత 19) డివిజన్‌కు కరియప్ప పంపిం చారు. కూర్గీలు లేదా కొడవాలది ఒక చిన్న సామాజిక వర్గం. విజయవంతమైన వర్గం కూడా. అయితే 1950 నాటికి ఈ రెండు పేర్లు దేశానికి కొత్త. ఒకేలా ధ్వనిస్తాయి. ఆ ఇద్దరు కలసి పనిచేశారు. కశ్మీర్ పోరాటంలో వీరోచిత పాత్ర నిర్వహించి ప్రముఖలయ్యారు. తరువాత సైనిక దళాల ప్రధాన అధికారులు అయ్యారు కూడా. కరియప్ప వలె కాకుండా (ఈయన రక్షణమంత్రి సర్దార్ బల్దేవ్సింగ్ కలివిడిగా ఉంటూ, హాస్యోక్తులకు ప్రసిద్ధిగాంచినవారు) తిమ్మయ్య తన కాలపు రక్షణమంత్రి వీకే మేనన్‌తో విభేదిస్తూ ఉండేవారు. మేనన్ ఎరుపు మరీ ఎక్కువగా ఉన్న కమ్యూనిస్టు. అయితే ఆంగ్ల విధానంలో సైనిక శిక్షణ తీసుకున్న అధికారులకు కమ్యూనిస్టులంటే అసహ్యం. రక్షణమంత్రి నిరంతరం జోక్యం చేసుకోవడం పట్ల తిమ్మయ్య అసహనంగా ఉండేవారు. ఆ కాలం విశేషాలను అద్భుతంగా చిత్రించిన ఇందర్ మల్హోత్రా ఇచ్చిన ఉదంతం ఒకటి ఉంది. రక్షణమంత్రితో మరోసారి గొడవపడే సందర్భాన్ని తప్పించుకునేందుకు తిమ్మయ్య ఎత్తుగడ అది. రక్షణమంత్రితో సమావేశం తప్పించుకోవడానికి ఆయనకు ఏ కారణం చెప్పమంటారు అని తిమ్మయ్య సహాయకుడు అడిగాడట. దీనికి తిమ్మయ్య, ‘మేనన్జైటిస్ వ్యాధి సోకింద’ని చెప్పమన్నారట. చివరికి 1959లోనే తిమ్మయ్య పదవికి రాజీనామా చేశారు. నెహ్రూ నచ్చ చెప్పడంతో రాజీనామాను ఉపసంహరించుకుని, పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగి 1961లో వైదొలిగారు. ఇదంతా, మరీ ముఖ్యంగా ఈ కూర్గ్ చమత్కారం సామాన్య ప్రజలను నిజంగానే తికమకపెడుతుంది. కానీ ప్రధానమంత్రి, ఆయన కార్యాలయం కూడా ఇలాంటి గందరగోళంలో ఎలా పడిపోయారు? దీనికి ఆమోదయోగ్యమైన ఒక వాదనను ప్రతిపాదించవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, పాతికేళ్లు అన్నీ యుద్ధాలే. అందులో పాకిస్తాన్ (1947–48, 1965,1971), చైనా (1962) యుద్ధాలు పెద్దవి. హైదరాబాద్ (1947), గోవా (1960), చైనాతో మరోసారి 1967 నాథులా దగ్గర జరిగినవి చిన్నవి. 1971 నాటి యుద్ధం మినహా, మిగిలిన వాటిలో భారత్‌కు స్పష్టమైన విజయం దక్కలేదు. 1962లో మనది స్పష్టమైన ఓటమి. 1965 నాటి యుద్ధం ప్రతిష్టంభనతో ముగిసింది. 1947–48 నాటి యుద్ధం అసంపూర్ణం. ఆనాటి రాజకీయ నాయకత్వం సైన్యాన్ని నిరుత్సాహపరచకుండా ఉంటే వారు మరింత బాగా పోరాడి ఉండేవారని చెప్పడం రివాజుగా మారింది. ఇవన్నీ వలసపాలనానంతర దశాబ్దాలు. ప్రజాస్వామిక వ్యవస్థలు ఆకృతి దాలుస్తున్నాయి. తరువాత స్థానంలో మాత్రమే సైన్యం ఉంది. పౌర, రాజకీయ ఆధిక్యానికి ఒక సవాలుగా ఉండేది. ఒక చిన్న వాస్తవం: 1958లో పాకిస్తాన్ ఆధిపత్యం స్వీకరించిన జనరల్ (తరువాత ఫీల్డ్‌మార్షల్) ఆయుబ్ ఖాన్ సరిహద్దులలో కరియప్ప దగ్గరే కల్నల్‌గా పనిచేశారు. ఈ కారణాలతోనే ఈ మొత్తం కాలంలో రాజకీయ, సైనిక వ్యవస్థలకు సంబంధించి వ్యూహాత్మక సిద్ధాంతంతో కూడిన కథనం రూపుదిద్దుకుంది. అదే– సాయుధ దళాలు, వారి కమాండర్లు ఎలాంటి తప్పిదాలు చేయలేదు, అపజయాలకీ, ఎదురుదెబ్బలకీ రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి. 1971లో ఇందిరాగాంధీ సాధించినట్టు, విజయం వస్తే అందులో అంతా భాగస్వాములే. అప్పటి నుంచి అదే ధోరణి. కార్గిల్, 1999 వైఫల్యం ప్రధానంగా సైనిక నాయకత్వానిదే గానీ, వాజ పేయి ప్రభుత్వానిది కాదు. అంత పెద్ద సరిహద్దు ప్రాంతంలో పాకిస్తానీలు అంత లోపలికి, ఎవరూ గుర్తించకుండా ఎలా చొచ్చుకు రాగలిగారు? మరోసారి చాలా అనుకూలమైన పురాణం పుట్టింది. ఈసారి ఆ లోపం పౌర నిఘా సంస్థల మీదకు పోయింది. కొద్దిమంది సైనికాధికారుల మీదకు మాత్రం కొంత బాధ్యతను మోపారు. మనమంతా ఆ యుద్ధంలో జరిగిన వీరకృత్యాలను మననం చేసుకున్నాం. అపజయాల విమర్శల నుంచి సైనికులను కాపాడాలనుకోవడమే ఇందుకు కారణం. సైనికాధికారులు ఎప్పుడూ మంచే చేస్తారు, రాజకీయనాయకులే వారికి అడ్డం వస్తారు అన్న తీరులో జాతీయ భావాలతో కూడిన చరిత్ర ఇన్ని దశాబ్దాలుగా నిర్మితమైంది. ఆ కథలు ఎలా ఉంటాయంటే– కరి యప్ప, తిమ్మప్ప, చౌధరి, మానెక్షాలకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఆక్రమిత కశ్మీర్ ఉండేది కాదు, చైనా గుణపాఠం నేర్చుకునేది, టిబెట్ విముక్తమయ్యేది, 1971లో పాక్ భూతం చచ్చేది, మరో రెండువారాల యుద్ధం తరువాత పశ్చిమ పాకిస్తాన్‌ను మన సైన్యం ఆక్రమించేది– ఇలా. ఇందుకు సరైన ఆధారాలేమీ ఉండవు. కానీ అధికార వ్యవస్థకు సైన్యాన్ని దూరంగా ఉంచడానికి ప్రజాస్వామ్యంలో మా ఆర్మీ బలోపేతమైనదన్న సెంటిమెంట్ అవసరమవుతుంది. దీనిని ఆరెస్సెస్ మరింత అలంకరించి చెబుతుంది. ఆనాడు కరియప్ప, తిమ్మయ్య, చౌధరి మరింత సమయం ఇవ్వాలని నాటి ప్రధానిని కోరారని, కానీ గాంధీ–నెహ్రూ వంశీకులు అంగీకరించలేదని ఆరెస్సెస్ నేతలు చెబుతూ ఉంటారు. ఆరెస్సెస్‌కు చెందిన ఎవరిని అడిగినా ఇదే వాదం వినిపిస్తారు. మోదీ కూడా అందులోని వారే కదా! శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
వాత పెట్టాక కీలు వెతకాలా?
జాతిహితం సైనిక చర్యకు సంబంధించి రెండు అంశాలున్నాయి. అవి ఎత్తుగడల పరమైనవి, వ్యూహా త్మకమైనవి. ఎత్తుగడల పరంగా మెరుపుదాడులు విజయవంతమయ్యాయి. అవతలి పక్షం నుంచి గాయాలు, నష్టాలకు సంబంధించి నిర్దిష్ట ప్రకటన రాకున్నప్పటికీ, అధీన రేఖ పొడవునా అత్యంత వృత్తి నిపుణతతో కూడిన ప్రమాదకరమైన సైనిక దాడులు ఆ ఘటన తర్వాత నుంచి వెల్లువెత్తిన విషయం మనం గుర్తించాలి. అదే సమయంలో మెరుపుదాడులకు సంబంధించిన విస్తృత, వ్యూహాత్మక లక్ష్యం ఏమిటన్నది ఎవరూ ప్రకటించలేదు. పాకిస్తాన్ భూభాగంలో భారత్ మెరుపు దాడులు జరిపి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంలో కూడా, ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లు అవి నిజం గానే జరిగాయా లేదా, ఆ దాడులు సాధించినదేమిటి అని మనం ఇప్పటికీ వాదులాడుతున్నట్లయితే, అది మన వ్యూహాత్మక భావాల కుంగుబాటునే చూపిస్తుంది. గత సంవత్సరం జరిగిన మెరుపు దాడులనుంచి భారత్‌కు కలి గిన లాభదాయక ఫలితాన్ని మనం లెక్కిస్తున్నందున, దానికి సంబంధించి రెండు సాక్ష్యాధారాలు మనముందున్నాయి. మొదటిది రాజకీయ నాయకత్వం ఆదేశం మేరకు సైనిక యంత్రాంగం సమర్పించిన సాక్ష్యాధారం. ఇది తెరపై లేజర్ పెన్‌తో చిత్రాలను లేక క్షేమంగా వెనక్కు వచ్చిన వారిని సాక్ష్యంగా చూపింది తప్పితే మొత్తం సైనిక చర్యను వర్ణరంజితంగా మీడియా సమావేశంలో వివరించే సాంప్రదాయిక రీతిలో దీన్ని చూపించలేదు. సంప్రదాయక వార్తా మాధ్యమం ద్వారా చూపించారు. భారత్ జరిపిన సర్జికల్ దాడుల ప్రథమ వార్షికం సందర్భంగా రెండు ముఖ్యమైన పుస్తకాలు విడుదల అయ్యాయి. వీటిని సైనిక–రాజకీయ సమ్మేళనంతో బాగా పరిచయమున్న రక్షణరంగ పాత్రికేయులు రచించారు. వీరిద్దరూ సైనిక వ్యవహారాలను నివేదించడంలో మంచి శిక్షణ పొందారు. కాబట్టి మీరు ఈ రెండు పుస్తకాలను విలువైనవిగా పరిశీలించవచ్చు. మెరుపుదాడులు కల్పితం కాదు.. నిజమే..! ఈ రెండు పుస్తకాలూ భారత్ మెరుపు దాడులు చేసిందని నొక్కిచెబుతున్నాయి. తమ పేరు ప్రకటించడానికి ఇష్టపడని ప్రత్యేక బలగాలకు చెందిన కొందరు యువ అధికారులతో నేరుగా జరిపిన ఇంటర్వ్యూలనే ఇవి ప్రాథమిక సాక్ష్యంగా చూపించాయి. అందుకే వీటిని మనం నిజమైన విలువైన రచనలుగా తీసుకోవచ్చు. పైగా అగ్రశ్రేణి సైనికాధికారులు, రాజకీయ నాయకత్వం నుంచి తీసుకున్న ఉల్లేఖనలను కూడా ఈ పుస్తకాల్లో పొందుపర్చారు. సర్జికల్ దాడుల వెనుక అంతర్గత రాజకీయ ఉద్దేశానికి సంబంధించిన విస్తృత దృక్పథాన్ని మనం వీటిలో చూడవచ్చు. నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి.. ఇది ప్రజాస్వామ్యపు కచ్చితమైన, చట్టబద్ధమైన లక్ష్యం. మెరుపుదాడులకు సంబంధించిన మరొక సాక్ష్యం కమాండో కామిక్ చానల్స్ అంటూ మనం తరచుగా పిలుచుకునే టీవీ చానల్స్‌లో నిరంతరాయ వార్తల కవరేజ్. అది మనను పెద్దగా ఒప్పించలేకపోవచ్చు, బాల్య చేష్టగా కూడా కనిపించవచ్చు. ఈ చానళ్లలో పూర్తి సైనిక చిహ్నాలతో కనిపిస్తూ ముసుగు ధరించిన పారా–కమాండో అధికారుల ఇంటర్వ్యూలను చూడవచ్చు. ఉడి దాడులపై తామెంత ఆగ్రహంతో ఊగిపోయామో, మెరుపుదాడులకు తామెలా సన్నద్ధమయ్యామో, దాడులను నిర్వహించి ఎలా క్షేమంగా వచ్చామో ఆ ఇంటర్వ్యూలలో వీరు ఉత్సాహంగా చెప్పడాన్ని మనం చూస్తాం. సైనికాధికారులు వివరిస్తూండగా సైనిక చర్య గురించిన అస్పష్టంగా కనిపించే నైట్ విజన్ చిత్రాలు టీవీలోని సగం తెరలో మనకు కనిపిస్తుం టాయి. సన్నీడియోల్ సినిమాల్లోలాగా మంచి కమాండో కాల్పులు జరపడం, దుర్మార్గుడు బుల్లెట్ దాడులకు గురై చక్కగా నేలకూలిపోవడాన్ని కూడా స్పష్టంగా కెమెరా చిత్రీకరించడం మనం చూడవచ్చు. అయితే చిన్న పిల్లలు ఇష్టంగా చూసే కమాండో వీడియోల నుంచే ఈ చిత్రాలను తీసుకుని ఉన్నప్పటికీ, మూడు వాస్తవాలు మాత్రం మారవు. ఒకటి, మెరుపు దాడులని చెబుతున్నవి నిజంగా జరిగాయనేందుకు తగినంత ఆధారం ఉంది. రెండు, తీవ్ర నష్టాలు జరగకుండానే భారత ప్రత్యేక దళాలు సురక్షితంగా తిరిగొచ్చాయి. సైనికుల గాయాలను దాచిపెట్టడం అసాధ్యం. పైగా భారత్ అలా చేయదు కూడా. మూడోది, రాత్రివేళ జరిగిన ఈ ప్రతీకార దాడి ఇచ్చిన సంతృప్తిని పక్కనబెడితే ఈ దాడులు ఏం సాధించాయన్నది ఎవరూ చెప్పడం లేదు. సైనిక చర్యకు సంబంధించి రెండు అంశాలున్నాయి. అవి ఎత్తుగడల పరమైనవి, వ్యూహాత్మకమైనవి. ఎత్తుగడల పరంగా మెరుపుదాడులు విజయవంతమయ్యాయి. అవతలి పక్షం నుంచి గాయాలు, నష్టాలకు సంబంధించి నిర్దిష్ట ప్రకటన రాకున్నప్పటికీ, అధీన రేఖ పొడవునా అత్యంత వృత్తినిపుణతతో కూడిన ప్రమాదకరమైన సైనిక చర్యలు ఆ ఘటన తర్వాతనుంచి వెల్లువెత్తిన విషయం మనం గుర్తించాలి. మన కమాండోలు అత్యంత గోప్యతను పాటించడంతోపాటు అత్యంత నిర్దిష్టంగా మెరుపుదాడులను నిర్వహించి, తిరిగొచ్చారు. కశ్మీర్ వంటి కల్లోలభరిత రంగంలో మెరుపుదాడులను నిర్వహించడం చాలా కష్టం. అందుకే దీన్ని మనం విజయంగానే ప్రకటించవచ్చు. ఫలితాన్ని స్పష్టపరచని సాహస చర్య అదే సమయంలో మెరుపుదాడులకు సంబంధించిన విస్తృత, వ్యూహాత్మక లక్ష్యం ఏమిటన్నది ఎవరూ ప్రకటించలేదు. ఉడి వంటి ఘాతుక చర్యలకు ఎప్పుడు పాల్పడినా దానికి ప్రతీకార దాడి తప్పదని పాకిస్తానీయులను హెచ్చరించడమా? లేక భవిష్యత్తులో అలాంటి దాడులను తలపెట్టకుండా ద్వేషపూరితమైన ఉగ్ర చర్యల నుంచి పాక్‌ను అడ్డుకోవడమా? గత సంవత్సర కాలంగా ఈ రెండింటిలో ఏదీ చోటు చేసుకోలేదని స్పష్టమైన ఆధారం ఉంది. ప్రత్యేకించి రెండో అంశం అసలు చోటుచేసుకోలేదు. మన దేశంలో రక్షణరంగంపై రాసే అత్యంత గొప్ప రిపోర్టర్, నా సహచరుడు మను పబ్బీ.. పార్లమెంటులో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలతోపాటు అధికారిక రికార్డులను పరిశోధించి చెప్పిన విషయం ఏమిటంటే, పాక్ బుద్ధిగా మసులుకోవడానికి బదులుగా, అధీన రేఖ పొడవునా పాక్ బలగాల దుశ్చ ర్యలు ఈ సంవత్సరం బాగా పెరిగాయనే. ఈ ఏడాది జూలై 11 నాటికి పాక్ జరిపిన కాల్పుల విరమణ ఉల్లంఘన చర్యల సంఖ్య 228కి చేరుకుంది. 2016 మొత్తంమీద జరిగిన కాల్పుల విరమణ ఉల్లంఘన చర్యల సంఖ్యకు ఇది సమానం. అయితే చొరబాటుదారులను కాల్చి చంపడంలో భారత సైన్యం మరిన్ని విజయాలు సాధించింది. 2016లో 37 మంది చొరబాటుదారులను హతమార్చగా, 2017 జూలై నాటికే 36 మందిని భారత్ బలగాలు హతమార్చాయి. అధీన రేఖ నిర్వహణలో మన విజయాన్ని, మెరుగుదలను ఇది సూచిస్తోంది. అయితే మొత్తం గణాంకాలను చూస్తే ఈ సాహసిక దాడుల లక్ష్యం పాక్‌ను నిరోధించడమే అయితే, ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరనట్లే. వ్యూహాత్మక శాస్త్రాలు, సైనిక వృత్తికి సంబంధించిన స్వభావం ఏదంటే, కొత్త సాఫ్ట్వేర్ లేదా యాప్ లాగా కాకుండా, ప్రతి రెండు రోజులకు ఒకసారి మౌలికమైన కొత్త భావాలు ఇక్కడ ఆవిష్కృతం కావు. బ్రిటిష్ జనరల్ రూపర్ట్ స్మిత్ రాసిన ‘ది యుటిలిటీ ఆఫ్ ఫోర్స్’ పుస్తకం ప్రచురణతో 2005లో యుద్ధతంత్రానికి సంబంధించి కొత్త విప్లవం చోటుచేసుకుంది. ఈ పుస్తకం ప్రపంచ ప్రఖ్యాత సైనిక జనరల్ కార్ల్ వాన్ క్లాస్విట్జ్ ప్రామాణిక రచనలతో సరిసమానమైనదిగా కొందరు ప్రశంసించారు. ఈ పుస్తకంపై ప్రపంచ స్థాయిలో పేరొందిన 10 గొప్ప సమీక్షల్లో 6 సమీక్షలు ఆ పుస్తకంలోని ‘యుద్ధం ఇక ఉనికిలో ఉండదు’ అనే ఉత్తేజకరమైన 4 పదాల వాక్యంతో మొదలయ్యాయి. పాత తరహా యుద్ధాలకు కాలం చెల్లినట్లేనా? ఈ వాక్యం అంతగా మింగుడుపడనిది. స్పష్టమైన ఫలితాన్ని ఆశిస్తూ.. మనుషులు, యంత్రాలు వంటి భారీ స్థాయి విభాగాలతో చేసే సాంప్రదాయకమైన ‘పారిశ్రామిక స్థాయి’ యుద్ధాలకు ఇప్పుడు కాలం చెల్లిందని రూపర్ట్ స్మిత్ ఆ పుస్తకంలో పేర్కొన్నాడు. కొత్తయుద్ధాలు ప్రజలమధ్యే జరుగుతాయని అతడన్నాడు. అంటే ఈ తరహా యుద్ధాలు స్వల్పస్థాయితో, చెల్లాచెదురుగా ఉండే భూభాగాల్లో, వివిధ కాలక్రమాల్లో జరుగుతాయి. అతి పెద్ద, భారీ స్థాయి సైన్యాలతో ఈ తరహా యుద్ధాలను ముగించడం కష్టమనీ, ఇలాంటి భారీ స్థాయి సైన్యంకోసం ఖర్చుపెడుతూ దేశాలు తమ చర్యను సమర్థించుకునేటంత ప్రయోజనం దీనిలో ఉండదని తెలిపింది. తమ పొరుగునే ఉన్న రాజ్యరహితమైన పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ గ్రహించినట్లుగా, ఇప్పుడు ఆప్ఘానిస్తాన్‌లో అమెరికా గ్రహిస్తున్నట్లుగా ఈ కొత్త తరహా యుద్ధాలు ఎన్నటికీ ముగిసిపోవనీ తెలిపింది. యుద్ధం చేస్తున్న ప్రజల వ్యవహారంలో దేశాలు జోక్యం చేసుకున్నప్పుడు పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుందని చెప్పింది. లేదా, అధీన రేఖకు ఇరువైపుల ఉన్న ప్రజలతో పాక్ జోక్యం చేసుకుంటున్న సందర్భంలో భారత్, పాక్‌లకు ఇది మరింతగా వర్తిస్తుందని వివరించింది. మెరుపుదాడుల వ్యూహాత్మక విజయం ఎత్తుగడల పరంగా మన కమాం డోలు సాధించిన అత్యద్భుతమైన ఫలితంతో ఎందుకు సరిపోవడం లేదని అర్థం చేసుకోవడంలో ఇది మనకు తోడ్పడుతుంది. ఉగ్రవాదులు అపరిమిత వనరుగా విస్తృతస్థాయిలో లభిస్తున్నారు కాబట్టి ఉగ్రవాదుల ప్రాణాలు కోల్పోవడాన్ని పాకిస్తాన్ లెక్క చేయదు. ఈ సంప్రదాయేతర యుద్ధంలో వారిని సైనికంగా అడ్డుకోవడానికి, అలాంటి మెరుపుదాడుల్ని తరచుగా ఏకపక్షంగానే నిర్వహించాల్సిన అవసరముంది. సైనికపరంగా పాకిస్తాన్‌పై ఇలాంటి సానుకూల సౌష్టవం భారత్‌కు ఉందా? మన దేశంలో రెండు ఉదాహరణలు చాలా ప్రజాదరణ పొందాయి. అవి.. పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు, చాలా కాలంగా అఫ్గానిస్తాన్–పాక్‌లపై, ఇప్పుడు ఐసిస్‌కు బలమున్న ప్రాంతాలపై అమెరికా చేస్తున్న డ్రోన్ దాడులు. సైనికంగా పూర్తి పాటవంతో, గగనతల ఆధిక్యతతో ఉన్న వాతావరణంలో ఇవి పనిచేస్తాయి. అయితే అత్యంత ప్రమాదకరమైన, ఖర్చుతో కూడిన డ్రోన్లకు తమవైన పరిమితులున్నాయి. పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలో డ్రోన్లు పనిచేయవు. మన సైనిక రక్షణ పాటవం మరింతగా పెరగాలన్న ఆకాంక్ష సరైందే కాని, రక్షణ రంగంపై పెడుతున్న ఖర్చును గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నానా అని భారత్ తన్ను తాను ప్రశ్నించుకోవాలి. జీడీపీలో ఇప్పుడు రక్షణరంగంపై పెడుతున్న 2 శాతంకంటే తక్కువ వ్యయాన్ని అది రెట్టింపు చేయాల్సి ఉంటుంది. రాజీవ్ గాంధీ 1987–88లో మన రక్షణ రంగ బడ్జెట్‌ను 3.38 శాతం వరకు తీసుకుపోయారు. అయితే 1990–91లో ఆయన మనకు ఆర్థిక సంక్షోభాన్ని కూడా కానుకగా ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇదే మార్గమైతే, భారత్ గట్టిగా ఊపిరి పీల్చుకుని కృతనిశ్చయంతో ముందుకు సాగాలి. దీనికంటే తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలున్నాయా? మెరుపుదాడుల వార్షికోత్సవ తంతును శాస్త్రోక్తంగా జరుపుకోవడం కాకుండా భారత వ్యూహాత్మక నిపుణుల బృందం చర్చించాల్సిన అంశం ఇదే మరి. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఫిరాయింపు కాదు ఆశ్రయం
జాతిహితం అది మంచైనా, చెడైనా నితీశ్‌ను ఫిరాయింపుదారు అనడం సరికాదు. పలాయనం చిత్త గించి బీజేపీని రాజకీయ ఆశ్రయం కోరడం అనాలి. తుది కంటా పోరుకు దిగితే అది ఏకపక్షంగానే ముగిసిపోతుందని గుర్తించగల వాస్తవిక దృష్టి ఆయనకుంది. కాబట్టి వలస పాలన కాలపు రాజాలా మారి, సొంత ప్రజలపై ఆధికారం నెరపడానికి బదులుగా సార్వభౌత్వాన్ని వదులుకోవడమే మెరుగు. ప్రతిపక్ష నేతలలో చాలా మంది ఆయనలాగే పలాయనమా, రాజకీయంగా కడతేరిపోవడమా? అనే సందిగ్ధాన్ని ఎదుర్కొంటారు. నితీశ్ కుమార్, ఆయన పార్టీ మూకుమ్మడిగా ఒక రాజకీయ కూటమి నుంచి, భావజాలపరంగా దానికి పూర్తి విరుద్ధమైన మరో రాజకీయ కూటమికి ఫిరాయించడం తెలిసిందే. నరేంద్ర మోదీ, అమిత్‌షాలు 2019 ఎన్నికల విజ యాన్ని ఇప్పుడే ఖరారు చేసేసుకున్నారనే దీని అర్థమని విస్తృత జనాభిప్రాయం. మన బహిరంగ చర్చలోని స్వల్పకాలీనతకు ఇంతకంటే మెరుగైన ఉదాహరణ మరొకటి లేదు. దీనికి విరుద్ధంగా వాదించాలంటే మీకు నిర్లక్ష్యపూరితమైన దుస్సాహసమైనా ఉండాలి లేదా మీరు బిహార్‌లో అమ్మే దొంగ సారా తాగైనా ఉండాలి. ఈ మార్పు అంతరార్థాలు 2019 తర్వాత కూడా మిగులుతాయి. భారత రాజకీయాల్లో, సమాజంలో, క్లుప్తంగా చెప్పాలంటే ప్రజాభిప్రాయంలోని మార్పునకు సంకేతం ఇలాగే ప్రస్ఫుటమౌతుంది. ఇందిరా గాంధీకంటే మరింత శక్తివంతమైన, విజయవంతమైన గొప్ప రాజకీయ నేత ఆవిర్భవించడమని కూడా దీని అర్థం. ఇందిర మరిన్ని ఎక్కువ రాష్ట్రాలను పాలిం చారు, మూడు సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గారు అంటూ అసమ్మతి తెలపడానికి దిగకండి. అప్పటికే అధికారంలో స్థిరపడి ఉన్న పార్టీ ఆమెకు వారసత్వంగా లభించింది. పైగా అప్పట్లో చెప్పుకోదగ్గ ప్రతిపక్షమూ లేదు. మోదీ ముఠాలుగా చీలి ఉన్న తన పార్టీలోని వ్యతిరేకులతోనేగాక, పెద్ద ఓటు బ్యాంకులున్న పలువురు భావజాల ప్రత్యర్థులతో కూడా పోరాడి గెలిచారు. ఇప్పుడు ఆయన, ఆయన పార్టీ అధ్యక్షుడు కలసి ఇందిర కంటే ఎక్కువ బలంగా పార్టీని తమ నియంత్రణలో ఉంచుకున్నారు. మీడియాలో చాలా భాగం నేడు సంతోషంగానే మోదీ పట్ల విధేయతను ప్రదర్శిస్తూ, ప్రశంసలు కురిపిస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేసి తొమ్మిది నెలలు గడిచినా రద్దయిన కరెన్సీ ఎంతో ఆర్బీఐ ఎందుకు లెక్కకట్టలేకపోయిందనైనా కనీసం అడగలేని స్థితిలో అది ఉంది. మన రాజకీయాల్లో కొత్త మలుపు భారత క్రికెట్‌ను నడిపించడం కాక న్యాయవ్యవస్థ చేస్తున్నదేమైనా ఉందంటే అది.. యమునా నది ఒడ్డున మల విసర్జన చేసినందుకు రూ. 5,000 జరి మానా విధించడం, దేశభక్తి కొరవడిన మనలాంటి మూఢులకు జాతీయగీతం పట్ల గౌరవం చూపాలని బోధించడమే. క్రమశిక్షణ లోపించిన విశ్వవిద్యాలయం క్యాంపస్‌ను దారికి తేవడానికి తమకు ఒక యుద్ధ ట్యాంకును జ్ఞాపికగా ఇవ్వమని ఒక వైస్–ఛాన్స్లర్ కోరడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. మనం అదృష్టవంతులం, ఆయన మందుగుండు నింపిన నిజమైన యుద్ధ ట్యాంకునో లేదా పోలీసు సాయుధ శకటాన్నో అడిగారు కాదు. చర్చిల్ ఆలోచనా ధోరణితో రాజకీయాల్లో చాలా సుదీర్ఘకాలం చివర్లో మనం చూస్తున్న వాస్తవాలను ఏకరువు పెట్టడమే ఇదంతా. రచయిత, ఓటు వేయడంలోని తన ఇష్టాయిష్టాలకు అతీతంగా రాజకీయ విశ్లేషణ సాగించాలి. అప్పుడే మనం ఈ మలుపును మంచిది లేదా చెడ్డది అని అభివర్ణించకుండా నిగ్రహం చూపుతాం. అయితే ఈ మలుపు, మన రాజకీయాలలో ప్రస్తుతం ఉన్న ప్రమేయాలు, సమీకరణాలన్నింటిని తీసి చెత్తబుట్టలో వేసేస్తోంది. కాబట్టి, మోదీ–షాల రాజకీయ కార్యక్రమం మూడేళ్లుగా అమలయ్యాక... నితీశ్ అనంతర కాలపు మన రాజకీయాలను చిత్రీకరిద్దాం. మన దేశంలో ఇప్పుడు ఒక కొత్త రకం రాజకీయ సన్నివేశమూ, దానికి తగ్గ మానసిక స్థితి ఉన్నాయి. మన విలువలు, భావాలలో చాలా వరకు... ఏమంత మంచివి కానివి లేదా కాలంచెల్లినవి, వివేకం, నైతికత అనే భావనలు, అన్నిట్లోకీ ముఖ్యంగా భావజాలం.. నేడు మరణించాయి, దహన సంస్కా రాలూ జరిగిపోయాయి. మన ఓటర్లలో అత్యధికులు 21వ శతాబ్దపు తరంవారు. లౌకికవాద భావనకు ప్రామాణిక పరిరక్షకులుగా గుర్తింపుపొందిన వారిలో ప్రతి ఒక్కరూ అవినీతిగ్రస్తులు, వివాదాస్పదమైన వంశపారంపర్యవాదులు అయినప్పుడు, లౌకికవాదం సుగుణాల గురించి ఒప్పించడం కష్టం. లేక వామపక్షాలు చెప్పే మతమేలేని కపటపు లౌకికవాదాన్ని చూద్దామంటే, ప్రపంచవ్యాప్తంగా వారి ఆర్థిక సిద్ధాంతాలు విఫలమయ్యాయి. విపత్కరమైన 26/11 ముంబై ఉగ్రదాడి గురించి మీ నేతలు ప్రశ్నలను లేవనెత్తుతున్నప్పుడు, ఉగ్రవాదులకు విధించిన మరణశిక్షలను సుప్రీం కోర్టు ధృవపరచినా గానీ, వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పడు, లేదా మీ సొంత ప్రభుత్వం కళ్ల ముందే జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో దేశంలోని అత్యున్నత సాహస పురస్కారాన్ని అందుకున్న పోలీసు ఇన్స్పెక్టర్ మరణించినా దాన్ని బూటకపు ఎన్కౌంటర్ అంటున్నప్పుడు..సరళమైన జాతీయవాదాన్ని చెల్లుబాటయ్యేలా ప్రాచుర్యంలోకి తేవడం అసాధ్యం. మీకు భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉంది అని మీరు అనవచ్చు. అలా అయితే దాన్ని మీ పార్టీ నేత గురించి నిజం మాట్లాడటానికి కూడా ఉపయోగించండి. రాజకీయ విజ్ఞతకు పునర్నిర్వచనం జేఎన్యూకు వెళ్లే రహదారికి ఇప్పుడు సావర్కర్ లేదా గోల్వాల్కర్ పేరు పెడితే దానికి తెలిపే నిరసన ఎంత నమ్మించగలిగేదిగా ఉంటుంది? జామియా మిలియాలోని ఒక ఆడిటోరియంకు ఎడ్వర్డ్ సెడ్ పేరును, దానికి చేరే రహదారికి సెరా ఏ అర్జున్‌సింగ్ అని మీరు పేర్లు పెట్టారని గుర్తు తెచ్చుకోండి. లేదా మధ్యలోనే కాజేయగా మిగిలినవే ప్రజలకు చేరే, జనాకర్షకమైన, ఓట్లు రాబట్టే యోజనలలో చాలా వాటికి మీ పూర్వీకుల పేర్లు పెట్టి పేదలకు అనుకూలమైన పాలన అంటూ మీరు ప్రచారం చేసిన భావననే తీసుకోండి. మహాఘట్బంధన్ అనే ప్రహసనంగా జమకూడిన పార్టీలన్నీ చేసిన గొప్ప వాగ్దానమైన సామాజిక సమానత్వాన్నే తీసుకుని చూడండి. తమ సొంత చిన్న చిన్న వంశాలకు నాయకత్వం వహిస్తున్నవారిని మినహాయిస్తే. ఒక్క ముస్లిం, దళిత లేదా ఆదివాసీ నేతను కూడా ఎదగడాన్ని అవి అనుమతించలేదు. ఉదారవాదానికి కట్టుబడి ఉండే విషయానికి వస్తే... మీ సొంత భావనే అయిన ఆధార్పట్ల హాస్యాస్పదమైన వ్యతిరేకతగా అది కుదించుకుపోయింది. భారత మానసిక స్థితిలో వచ్చిన మౌలిక మార్పునకు అంతరార్థం రాజ కీయ విజ్ఞతను, ఒకటి కాదు రెండు తరాల ఓటర్లు పునర్నిర్విచించారు. గతం, స్వాతంత్య్రోద్యమ రాజకీయాల్లో వేళ్లూనుకున్నది. అందువలన స్వీయనిరాకరణ, త్యాగం, అంతరాత్మ పిలుపునకు విధేయమై ఉండటం, అతిగా రాజకీయంగా సరైన వైఖరిని కలిగి ఉండటం వంటి వాటికన్నిటికీ నేడు కాలం చెల్లిపోయింది. నేడు చెల్లుబాటయ్యేది అధికారమూ, తప్పు అనే ఒప్పుకోలే లేకుండా ఆ అధికారాన్ని చెలాయించడమే. మోదీ రాజకీయ అర్హతల పత్రాన్ని చూస్తే, నేడున్న మరే రాజకీయ పోటీదారు కంటే ఆయనే ఆ పరీక్షలో నెగ్గారని చెబుతుంది. 2002 అల్లర్ల తర్వాత అటల్ బిహారీ వాజపేయి నుంచి ఒత్తిడి వచ్చినా ఆయన రాజీనామా చేయలేదు, మరెవరినీ రాజీనామా చేయమని కోరలేదు. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణాలను ఉదాసీనంగా విస్మరిం చారు. స్మృతి ఇరానీని తక్కువ ముఖ్యమైన శాఖకు పంపి ఉండొచ్చుగానీ, ఆమెకు పునరావాసం కల్పించే పని జరుగుతోంది. ఆయన వైఖరి గురించి మరిన్ని ఆధారాలు కావాలా? ఆయన తన ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిన దాదాపు డజను మందిలో ఎవరినీ పదవి నుంచి తొలగించలేదు. అందరి కంటే ఎక్కువ అప్రతిష్ట తెచ్చిన సీబీఎఫ్సీ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీని సైతం పదవిలో కొనసాగించారు. నితీశ్ బాటన సాగాల్సిందేనా? 2014 ఎన్నికలపై నేను మొదట చేసిన వ్యాఖ్యలో నూతన భారత ఓటరు నేడు భావజాలానంతర, నేను నీకేమీ రుణపడి లేను అనే మనస్తత్వంతో ఉన్నాడని అన్నాను. బీజేపీ విజయపరంపర కొనసాగుతున్నదీ అంటే భారత లౌకికవాదం, ఉదారవాదం అంతరించిపోయాయని కాదు. కాకపోతే బీజేపీ విజ యాలు మనం ఇంతకు ముందు ఆ భావనలలో మనకు ఉన్నదనుకున్న విశ్వాసం ఎంత లోతైనదనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అతి ఎంతో లోతేనది కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల ఓటర్లలోని పెద్ద మెజారిటీ తాము ఎప్పుడూ విశ్వసిస్తూనే ఉన్న వాటి గురించి, పాత తరానికి చెందిన నైతికత, రాజీయంగా సరైన వైఖరి లేదా కపటత్వాల కారణంగా బయటకు మాట్లాడలేకపోయారు. వారిప్పుడు తాము విశ్వసిస్తున్నదానికి సమంజసత్వాన్ని చూస్తున్నారు. నూతన భారతం మోస్తున్న ఆ పాత తల బరువును మోదీ–షాల బీజేపీ వదిలించేసింది. భారతీయులు దాన్ని మెచ్చుతున్నారు. ఇప్పటికైతే, ఏ ప్రతిపక్ష నేతా లేదా కూటమి దీన్ని ఎదిరించలేదు. కాంగ్రెస్ లెక్కలోకి రానిదిగా కుదించుకుపోయింది. కర్ణాటకలో అధికారం కోల్పోతే అది దాదాపుగా చనిపోయినట్టే అవుతుంది. పంజాబ్‌లోని అమరిందర్ సింగ్ అప్పుడిక నితీశ్‌లా సందిగ్ధంలో పడతారు. లేదంటే కేంద్రం ఆయనను ఆకట్టుకుంటుంది లేదా ఒత్తిడి చేస్తుంది. మరోవంక కాంగ్రెస్ అధిష్టానం జోక్యం, అనుమానాలతో ఆయన వ్యవహరించాల్సి వస్తుంది. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు కొంత కాలం పాటు గట్టిగా నిలవగలుగుతారే తప్ప, బలీయమైన బీజేపీని దూరంగా ఉండేలా నిలవరించ లేరు. కేరళకు ఇంకా కొంత సమయం పడుతుంది గానీ, కాంగ్రెస్ అక్కడ బీజేపీకి తన స్థానాన్ని కొంతవరకు వదులుకోవాల్సి వస్తుంది. అది మంచైనా లేదా చెడైనాగానీ, నితీశ్‌ను ఫిరాయింపుదారు అనడం సరికాదు. దాన్ని బీజేపీ చెంతకు పలాయనం చిత్తగించడం అనాలి. తట్టాబుట్టా సర్దుకుని విమానంలో తప్పించుకు పారిపోయి బీజేపీని ఆశ్రయం కోరడంగా అభివర్ణించాలి. తుదికంటా పోరుకు దిగితే అది ఏకపక్షంగానే ముగిసిపోగలదని, అది నిరర్థకమని గుర్తించేపాటి వాస్తవికవాద దృష్టి ఆయనకుంది. తన ముందున్నది, ‘నేనే మొదట, నేనూ, నా సెల్ఫీ’ అనే వ్యామోహంతో ఉన్న మారిన ఓటర్ అని గుర్తించడానికి తగినంత కాలం నితీశ్ రాజకీయాల్లో మనగలిగారు. ఆయన ఇంతవరకు ఉపయోగించిన నినాదాలు, ప్రత్యేకించి సామ్యవాదం, లౌకికవాదాలకు జనసమ్మోహక శక్తి లేదు. ఆయన వద్ద సరి కొత్త భావాలూ లేవు. అందువల్ల వలసకాలపు భారత రాజాలాగా మారి, తన సొంత ప్రజలపై ఆధికారం నెరపడానికి బదులుగా సార్వభౌమత్వాన్ని వదులుకోవడమే మెరుగు. ఎంతోకాలం కాక ముందే, మిగతా ప్రతిపక్ష నేతలలో చాలా మంది... పార్టీ వీడటమా లేక అంతరించిపోవడమా అనే సందిగ్ధాన్ని ఎదుర్కొంటారు. లేదంటే మీకు గనుక ఊహాత్మకత ఉంటే చలామణీ చేయగలగిన ప్రభావశీలమైన కొత్త నినాదాన్ని కనిపెట్టాలి. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
మన సైన్యం–మన ప్రజలు
మన సైన్యం గుంపులపైన లేదా సాయుధ పోరాటకారులు కానివారిపైన కాల్పులు జరిపిన లేదా మారణకాండ సాగించిన ఘటనను గుర్తుచేసుకుని చెప్పగలరా? ఎంత ఆగ్రహంతో ఉన్న గుంపులైనా సైన్యాన్ని చూసిన వెంటనే మాయమౌతాయి. అది కఠినంగా, నిష్పాక్షి కంగా ఉంటుందని వారికి తెలుసు. సైన్యం ఫ్లాగ్ మార్చ్ జరిపాక కూడా కొనసాగిన మత ఘర్షణ ఒక్కటీ కనబడదు. మన సైన్యం డయ్యర్‌లా వందల మంది పౌరులను కాల్చి చంపేది కాదు. డయ్యర్–రావత్ పోలిక వాస్తవాన్ని తృణీకరించేది, వక్రీకరించేది. బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ బ్రిటిష్‌వాడే అయినా భారత సైన్యా నికి చెందిన అధికారి. నేనైతే భారత సైన్యం అనడానికి బదులు సైన్యమని ప్రస్తావించడాన్నే ఇష్టపడతాను. భారత వైమానిక, నావికా దళాలకు భిన్నంగా నాటి భారత సైన్యానికి ‘‘రాయల్’’ అనే ముందు చేర్పు మాట ఉండేది కాదు. అమృత్‌సర్‌లో బైశాఖీ రోజున పూర్తి శాంతియుతంగా, నిరపాయకరంగా జరుగుతున్న సమావేశంపై కాల్పులను జరిపి 396 మందిని హతమార్చి, వెయ్యికంటే ఎక్కువ మందిని గాయపరచిన సైనికులంతా ఆ సైన్యానికి చెంది నవారే. 25 ఏళ్లు తిరిగే సరికి, అదే సైన్యం చిన్న, ఏకపక్షమైన చారిత్రాత్మక యుద్ధంలో అటూ ఇటూ నిలిచి పోరాటం సాగిస్తూ ఉంది. సుభాష్ చంద్ర బోస్ నేతృత్వంలోని భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ) అక్ష కూటమి దేశా లకు సైనిక బందీలుగా చిక్కిన భారత యుద్ధ ఖైదీలతో రూపొందినది. ఆ ఐఎన్ఏ సైనికులు బ్రిటిష్ నాయకత్వంలోని తమ సహోదరులతోనే పోరాటా నికి తలపడ్డారు. ఇరు పక్షాల సైన్యమూ అత్యంత విధేయంగా, తమ సేనా నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి పోరాడింది. మూడేళ్లు గడిచే సరికి, 1947–48లో బాధాకరమైన భ్రాతృ హత్యా మారణకాండలో యుద్ధం సాగించినది సైతం అదే సైన్యం. ఈసారి అది తన సొంత దేశ భూభాగం కశ్మీర్‌ను కాపాడుకోవడం కోసం పోరాడింది. మన ప్రజాస్వామ్యానికి సైన్యం దన్ను నేటి మన సైన్యం వలస పాలనా కాలపు భారత సైన్యం గుణశీలాలు, శిక్షణ , నాయకత్వ నిర్మాణ క్రమం, ‘‘సైనిక జాతుల’’ రెజిమెంట్ల పొందిక సహా తొలుత రెండుగా చీలింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పాటుతో మూడుగా చీలింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అదే సైన్యం ఒకటి కంటే ఎక్కువసార్లే అ«ధికారాన్ని నెరపింది, ప్రజలు ఎన్నుకున్న తమ నేతలను హతమార్చింది. దశాబ్దాల కాల క్రమంలో పాక్ సైన్యం, వచ్చిపోయే ఎన్నికైన ప్రభుత్వాలను శాసించేంతగా వ్యవస్థీకృతమైంది. బంగ్లాదేశీ సైన్యం, ఎర్షాద్–జియాల రెండు దశాబ్దాల దుస్సాహసాల తర్వాతి కాలంలో మరింత వృత్తిశీలమైనదిగా, ఆధునికమైనదిగా, చాలా వరకు రాజకీయాలకు అతీతమైన బలగంగా పరిణతి చెందినట్టు అనిపి స్తుంది. భారత్‌లో సైన్యం మరింతగా రాజకీయాలకు అతీతమైనదిగా మారింది. అంతేకాదు, ఎక్కువ వృత్తిశీలమైనదిగా, వ్యవహరశైలి కలిగినదిగా, మరీ ముఖ్యంగా జాతిపరంగా, సామాజికంగా, మతపరంగా వైవిధ్యభరితమై నదిగా మారింది. సైనిక జాతులు వంటి పలు వలసవాద తలబరువులను వదిలించుకుని భారత సైన్యం నిజంగానే రాజకీయాలకు అతీతమైన, లౌకిక, ఉదారవాద బలగంగా మారింది. రాజకీయ అధికారాన్ని ఇష్టపూర్వకంగా గౌర వించడం మరింతగా పెరిగింది కూడా. కొందరైతే అది రాజకీయాధికారాన్ని అతి సులువుగా అంగీకరించేస్తుందని వాదిస్తుంటారు. రెండవ ప్రపంచ యుద్ధం నుంచి వలస పాలనానంతర ప్రపంచంలో వివిధ సైన్యాలు ఎలా పరివర్తన చెందాయో పరిశీలించి చూడండి. రాజ కీయాలకు దూరంగా ఉండి, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాల ఆదేశా లను పాటించే చెప్పుకోదగినంత పెద్ద సైన్యం ఏదీ కనబడదు. దిన దిన గండంగా బతికిన చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాల హయాంలో సైతం భారత సైన్యం దేశాన్ని విజయవంతంగా రక్షించడమే కాదు, మరో దేశం ఏర్పడటానికి సహకరించింది కూడా. వలస పాలనానంతర కాలంలోని సైన్యం పరిణామంపై మన దేశంలో విస్తృతంగానే అధ్యయనం జరిగింది. సైనిక చరిత్రకారులు, ఇతర మేధావులకే అది పరిమితమైంది. సామాజిక శాస్త్రాలలో సుప్రసిద్ధులైన రజనీ కొఠారీ, అశిష్ నంది వంటి వారి వారసులు దాన్ని సాధారణంగా విస్మరించారు. 1962 యుద్ధ పరాజయ చరిత్ర అత్యు త్తమంగా లిఖితమై ఉంది. సైన్యం అప్పటికింకా భారతీయీకరణ చెందు తోంది కాబట్టి ఆ చరిత్ర చాలా కీలకమైనది కూడా. బ్రిటిష్ వారి నుంచి సైనిక చరిత్ర రచనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాటి సైనికాధికారులు చాలా మందే మన సైనిక చరిత్రపై, పరిణామంపై పలు మంచి రచనలు చేశారు. ఆ వారసత్వం క్రమంగా క్షీణించినా చెప్పుకోదగిన పుస్తకాలు ఎప్పటికప్పుడు వెలువడుతూనే ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం మాజీ సైనికాధికారులు రచించినవే. క్షంతవ్యం కాని డయ్యర్ పోలిక అయితే, పెంపొందుతున్న భారత ప్రజాస్వామ్యం శక్తికి కీలకమైన సామా జిక–సైనిక సంస్థగా సైన్యంపై ఒక వృత్తి సామాజిక శాస్తవేత్త చేసిన చెప్పు కోదగిన అధ్యయనం ఏదీ నాకు కనిపించలేదు. సైన్యం పౌర జీవితానికి దూరంగా ఉండాలని మనం అనుకున్నట్టుగానే సామాజిక శాస్త్రాల పండి తులు కూడా సైన్యాన్ని ఏకాకిగా వదిలేసినట్టుంది. భారత సమాజాన్ని, రాజకీ యాలను అధ్యయనం చేసే పండితుల మస్తిష్కాలు పూర్తిగా నిస్సైనికీకరణం చెందాయి. సైన్యాన్ని కంటోన్మెంట్లలో ఉండి దాని పని అది చేసుకోనివ్వనీ అన్నట్టుంది ఇది. భారత ప్రజాస్వామ్యానికి దూరంగా ఉండటం ద్వారా సైన్యం.... మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలవత్తరం కావడంలో, సమాఖ్యగా పెంపొందడంలో, ఉదారవాద స్వభావంగలిగినదిగా మారడంలో పోషించిన చారిత్రక పాత్రను ఎవరూ పట్టించుకున్నదీ లేదు. సైన్యం నుంచి ఇలా మేధో పరంగా విడివడి పోవడమే క్షమార్హం కాని రావత్–డయ్యర్ పోలికను తేవా లనే తప్పుడు నిర్ణయానికి దారితీసింది. భారత్ తన సైన్యాన్ని అ«ధికారానికి, రాజకీయాలకు దూరంగా ఉంచ డంలో ఎలా సఫలమైందో, చాలా వలసానంతర దేశాలు ఎలా విఫలమ య్యాయో తెలుసుకోడానికి స్టీవెన్ విల్కిన్సన్ రాసిన ‘ఆర్మీ అండ్ నేషన్’ చదవడం తప్పనిసరి. కరియప్ప నుంచి మానెక్షా వరకు, ఆ తర్వాతా సైన్యం ఆలోచనా విధానం ఎలా మారుతూ వచ్చిందో ఆయన వివరించారు. అంతే కాదు, సైన్యం సామాజిక, జాతికపరమైన పొందికను మార్చి దాన్ని వైవిధ్య భరితమైనదిగా చేయడానికి దశాబ్దాలుగా అగ్ర సైనిక నాయకత్వం, రాజకీయ వేత్తలు కలసి చేసిన కృషిని సైతం ఆ పుస్తకం చెబుతుంది. తద్వారా సైన్యంలో ఒక్క జాతి, పంజాబీ అధిపత్యం తగ్గడమే కాదు, సైనిక జాతులు అనే వలస వాద వారసత్వాన్ని అది వదుల్చుకోగలిగింది. చివరకు రాష్ట్రాలవారీగా జనా భాను బట్టి సైనిక నియామకాల కోటాలను కేటాయించడం సైతం జరిగింది. సైన్యం/పౌర ప్రభుత్వాల మధ్య చైనా గోడ అనే భావనను వ్యవస్థీకరించ డానికి ఎంతో రాజకీయ చింతన, సామాజిక నిర్మాణ కౌశలమూ అవసరమ య్యాయి. సైన్యం సహాయాన్ని కోరేది పౌర ప్రభుత్వాలే అయితే, పౌరజీవితానికి దూరంగా ఉండేలా సైన్యాన్ని ఒప్పించగలిగినా, పౌర ప్రభుత్వాలు అదే పనిగా సహాయం కోసం దానిపై ఆధాపడుతూ వచ్చాయి. మెజిస్ట్రేట్ ఆదేశానుసారం పనిచేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ‘‘పౌర అధికా రానికి సహాయంగా’’ అని అభివర్ణించడం పరిపాటి. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) ఇచ్చే అధికారాలతో సైన్యం కొన్ని సార్లు స్వయంప్రతిపత్తితో తిరుగుబాట్లతో పోరాడాల్సి వస్తుంది. ఈ రెండిం టిలో ఏది ప్రస్తావనకు వచ్చినా దురదృష్టవశాత్తూ అది డయ్యర్‌ను మన జీవితాల్లోకి తిరిగి తీసుకొస్తుంది. జలియన్‌వాలాబాగ్ మారణకాండ తదుపరి బ్రిటిష్ ప్రభుత్వం సంస్కర ణలను చేపట్టింది. నాటి భారత సైన్యం పౌర నియంత్రణలో పాటించాల్సిన పద్ధతులు వ్యవస్థీకృతమయ్యాయి. గుంపులపై కాల్పులు జరపాలంటే మెజి స్ట్రేట్ అక్కడ ఉండటమూ, లిఖిత ఆదేశాలు ఇవ్వడమూ అవసరం చే శారు. పౌర అధికారానికి సహాయంగా పనిచేసేటప్పడు ఈ పద్ధతులు నేటికీ సైన్యా నికి వర్తిస్తాయి. ఆ తర్వాత, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభు త్వానికి సైన్యం మరింత క్రియాశీల పాత్రను నిర్వహించడం అవసరమై సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల ఆర్డినెన్స్‌ను తెచ్చింది. మరింత విస్తృ తాధికారాలను ఇచ్చే ఏటీఏఫ్ఎస్పీకి అదే తల్లి. ఇప్పుడిక ఆలోచించండి. సైన్యం గుంపులపైన లేదా సాయుధ పోరా టకారులు కానివారిపైన కాల్పులు జరపడాన్ని, మారణకాండ సాగించడాన్ని గుర్తుచేసుకుని చెప్పగలరా? ఆపరేషన్ బ్లూస్టార్ గురించి చెప్పకండి. అది తుపాకులతో జరిగిన పోరు, అందులో 149 మంది సైనికులు కూడా మర ణించారు. కశ్మీర్లో జరిగిన 1990 నాటి గవాకదాల్ గురించి కూడా చెప్ప కండి. అది పారామిలిటరీ దళాలు చేసినది. 1990ల మ«ధ్య వరకు కొంత మెతక వైఖరితో వ్యవహరించిన పలు మానవ హక్కుల ఉల్లంఘనలను, బూటకపు ఎదురుకాల్పులను, కొన్ని అత్యాచారాలను కూడా చెప్పకండి. ఆ తర్వాతి నుంచి అలాంటి వాటికి శిక్షలు విధిస్తున్నారు. ఇవి కూడా సాయుధ పోరాటకారుల తిరుగుబాటు వ్యతిరేక చర్యలలో జరిగిన ఉల్లంఘనలు. మూకలను, ఆగ్రహంతో ఉన్న గుంపుల గురించి ఆలోచించండి. సైన్యం వారిలో ఒక్కరినైనా కాల్చాల్సి రాలేదు. దుండగులు, ఎంత ఆగ్రహంగా ఉన్నా లేదా ఎంతటి కరడుగట్టిన వారైనా సైన్యాన్ని చూసిన వెంటనే పారిపోతారు. సైన్యం కఠినంగా, నిష్పాక్షికంగా ఉంటుందని వారికి తెలుసు. సైన్యం ఫ్లాగ్ మార్చ్ జరిపాక కూడా కొనసాగిన మత ఘర్షణ ఒక్కటీ కనబడదు. కశ్మీర్ లోనూ అదే పరిస్థితి. గుంపులు సైన్యాన్ని సవాలు చేసినదిగానీ, పోరాడినది గానీ లేదు. సైన్యం ఉగ్రవాదులతో పోరాడినప్పుడల్లా పౌరులు అడ్డు తొల గారు. సైన్యం ముట్టడిలోని ఉగ్రవాదులకు రాళ్లు రువ్వే గుంపులు మానన కవచాలు అవుతుండటంతో ఈ సమీకరణం ఇటీవల మారింది. మును పెన్నడూ ఎరుగని ఈ సవాలుతో వ్యవహరించే సిద్ధాంతాన్ని సైన్యం కను గొనాల్సి ఉంది. కంటికి కన్ను పంటికి పన్నుSమానన కవచాలకు పరిష్కారం కాదు. అయితే సైన్యం తనను అడ్డగించే గుంపులపై కాల్పులు జరపవచ్చా? అలా అయితే, ఎప్పుడు, ఎంత మేరకు, ఎలాంటి ప్రభావం కోసం? తేల్చాల్సి ఉంది. సైనిక బలగాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ బహిరంగంగా మాట్లా డేటప్పుడు మాటలను ఆచితూచి ప్రయోగించాల్సింది. ఈ సరికొత్త సవా లును ఎదుర్కోవడానికి ఒక కొత్త సిద్ధాంతం అవసరం. అది రూపొందు తుందనడంలో సందేహం లేదు. సైనిక శ్రేణులకు ముందు ఎక్కువ మంది కశ్మీరీలను మనం ఇక చూడం. అంతేకాదు మన సైన్యం డయ్యర్ శైలిలో వందల మందిని మారణహోమం చేయదు. అందువల్లనే డయ్యర్–రావత్ పోలిక వాస్తవాన్ని తృణీకరించేది, వక్రీకరించేది. - శేఖర్ గుప్తా twitter@shekargupta