హింస... ఇక చాలు! | stop..torture on ladies | Sakshi
Sakshi News home page

హింస... ఇక చాలు!

Published Mon, Dec 9 2013 11:51 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

హింస... ఇక చాలు! - Sakshi

హింస... ఇక చాలు!

 మహిళలు హింస నుంచి విముక్తులై స్వేచ్చా జీవులైనప్పుడు... విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలను అందుకోగలిగినప్పుడు... తమ కుటుంబాలను, దేశాలను ఉన్నత స్థితికి చేర్చగలుగుతారు. మార్పునకు చోదకశక్తులు కాగలుగుతారు.
 
 మహిళలపై హింస ఒక సార్వత్రిక సమస్య. ఈ వ్యాధి సోకని ప్రాంతం, దేశం ప్రపంచంలో లేదు. భయానకమైన ఈ సమస్యను  పత్రికలు రోజూ గుర్తు చేస్తూనే ఉంటాయి. మీడియా కంటపడకుండా లక్షల మంది మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారు. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు నిర్బంధ లైం గిక కార్యకాలాపాలకు లేదా మరో విధమైన హింసకు బాధితులవుతున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అది గుర్తిస్తే మనమందరమూ కలిసి ఈ రుగ్మతను అంతమొం దించాల్సిన ఆవశ్యకత అర్థమవుతుంది.
 
 ఇంటిలో జరిగే హింస లేదా బహిరంగ వేధింపులుగా సాగే హింస... ఏదైనాగానీ ఆ చెర నుంచి మహిళలను, ఆడపిల్లలను విముక్తం చేయాలనే కర్తవ్యానికి మనం తిరిగి నిబద్ధులం కావాల్సి ఉంది. నవంబర్ 25 నుంచి పదహారు రోజులపాటూ నిర్వహిస్తున్న లైంగిక హింస వ్యతిరేక కార్యకలాపాలు ఆ అవకాశం కల్పించాయి. సగం జనాభాను నిర్లక్ష్యం చేసి, చిన్నచూపు చూసి, వివక్ష ప్రదర్శించి ఏ దేశమూ తన పూర్తి శక్తిసామర్థ్యాల మేరకు అభివృద్ధి చెందజాలదు. అందుకే  లైంగిక సమానత్వం, మహిళా సాధికారత అమెరికా విదేశాంగ విధానంలో ఒక ముఖ్యాంశమ య్యాయి. ఇంటిలో మహిళలపై సాగే గృహహింస సర్వసాధారణమైనది, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేదాని ప్రకారం శారీరకమైన గాయాల నుంచి దీర్ఘకాలికమైన  మానసిక కుంగుబాటు వరకు సవాలక్ష ఆరోగ్య సమస్యలకు అది కారణమౌతోంది. గర్భిణులపై గృహహింస బరువు తక్కు వ శిశువుల పుట్టుకకు దారితీస్తోంది. ఇక హత్యలకు గుర య్యే మహిళల్లో 38 శాతం గృహహింసకు బలయ్యేవారే.  
 
 లైంగిక హింస  శారీరకంగానే కాదు, ఆర్థికంగా కూడా ప్రభావాన్ని చూపుతుంది. మహిళల ఆదాయాలను, పని తీరును ప్రభావితం చేస్తుంది. ఒంటరితనానికి గురై మహిళలు సరిగా పని చేయలేరు. తమపట్లే కాదు, పిల్లలపట్ల కూడా శ్రద్ధచూపలేరు. మహిళలపై హింసను నివారించడం వల్ల, హింసకు పాల్పడ్డవారిని శిక్షించడం వల్ల దీర్ఘకాలంలో అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. లైంగిక  హింస సమస్యపై పలు దేశాలు చట్టాలను రూపొందించాయి. ఆ చట్టాల అమలు తీరును మెరుగుపరచటానికి కలసికట్టుగా కృషిచేయడమే ఆ తదుపరి వేయవలసి ఉన్న కీలకమైన ముందడుగు. ఈ ఏడాది మొదట్లో వర్మ కమిషన్ నివేదిక వెలువడింది, ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధిం పుల చట్టం-2013’ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ సమస్య పరిష్కారం దిశగా భారత్ ముఖ్యమైన ముందడుగు వేసిం ది. ప్రపంచవ్యాప్తంగా లైంగిక హింసను నిరోధించడానికి, ప్రతిస్పందించడానికి సంబంధించిన వ్యూహాన్ని అమెరికా ప్రభుత్వం 2012 ఆగస్టులో విడుదల చేసింది. లైంగిక హింస పరిష్కారానికి నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించి, వాటి సాధనకు అమెరికా నైపుణ్యాన్ని, శక్తిసామర్థ్యాలను అందించడానికి ముందుకు వచ్చింది.
 
 విధానకర్తలకు, క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి మధ్య మరింత సంసర్గం అవసరం. మహిళలు, ఆడపిల్లలు తమ సమస్యలపై నిలిచి మాట్లాడే విధంగా వారిని సాధికారం చేయడం, మగపిల్లలను వారు తమ అక్కచెల్లెళ్ల కోసం నిలిచి మాట్లాడే విధంగా చైతన్యవంతులను చేయడం అవసరం. అలాగే ఈ కృషిలో పురుషులను, మగపిల్లలను, సంఘ నాయకులను భాస్వాములను చేయాల్సి ఉంది. లైంగిక అసమానతలు మహిళలపట్ల హింసాత్మకతను, వివక్షాయుత విధానాలను నిశ్శబ్దంగా అనుమతిస్తాయి లేదా చురుగ్గా పెంపొందింపజేస్తాయి. కాబట్టి అంతిమం గా లైంగికపరమైన అసమానతలను పూర్తిగా అధిగమిం చాల్సి ఉంటుంది. ప్రజాస్వామిక సమాజాల నిర్మాణానికి, అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందింపజేయడానికి, విద్య, వైద్యరంగాలలోని సవాళ్లను అధిగమించడానికి మహిళా సాధికారత అవసరం. మహిళలు, ఆడపిల్లలు హింస నుంచి విముక్తులై స్వేచ్చా జీవులైనప్పుడు... విద్య, ఆరోగ్యం, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలను అందుకోగలిగినప్పుడు... వారు తమ కుటుంబాలను, సమాజాలను, దేశాలను సమున్నత స్థితికి చేర్చగలుగుతారు. మార్పునకు చోదకశక్తులు కాగలుగుతారు.
 
  మా విదేశాంగమంత్రి కెర్రీ అన్నట్టు ‘‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సౌ భాగ్యాన్ని, శాంతిని పెంపొందింపజేయడానికి చేసే కృ షిలో మహిళలపై పెట్టే పెట్టుబడులు కీలకమైన భాగం... ఆ బాధ్యతను నెరవేరిస్తేనే వారు సాధికారతగల తల్లులు గా, నేతలుగా, నవకల్పనల సృష్టికర్తలుగా మారుతారు.’’
 (‘మహిళలపై హింస’ కేంద్ర అంశమైన ‘2013 ప్రపంచ మానవహక్కుల దినం’ సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకం)

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement