ఆ దిగుమతులు రైతుల ఉరితాళ్లు | The government has allowed the import of potatoes for the first time. | Sakshi
Sakshi News home page

ఆ దిగుమతులు రైతుల ఉరితాళ్లు

Published Sun, Nov 2 2014 12:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

ఆ దిగుమతులు రైతుల ఉరితాళ్లు - Sakshi

ఆ దిగుమతులు రైతుల ఉరితాళ్లు

ధరలు తగ్గినందుకు నిరసనగా రైతులు వీధుల్లో బంగాళదుం పలను బస్తాల కొద్దీ పారబోయకుండా ముగిసే కాలాన్ని ఇటీ వలి కాలంలో మనం చూసి ఉండం. కేంద్రప్రభుత్వం మాత్రం మొట్టమొదటిసారిగా బంగాళదుంపల దిగుమతికి అనుమతించింది. దేశీయ సరఫరాను పెంచడానికీ, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికే దిగుమతులను అను మతిస్తున్నట్లు అధికారికంగా చెబుతున్నారు. నిజా నికి దేశంలో బంగాళదుంపల ఉత్పత్తి ఈ ఏడు సాధా రణ స్థాయిలోనే ఉంది. ఈ ఏడు వీటి ఉత్పత్తిలో త గ్గుదల  2.3 శాతం మాత్రమే ఉంటుందని అంచనా.

కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఈ ఏడాది నవంబర్ చివరినాటికి బంగాళ దుంపల దిగుమతులు దేశంలోకి వచ్చేలా టెండర్లు జారీ చేయవలసిందిగా జాతీయ వ్యవసాయ, మార్కెటింగ్ సమాఖ్యను ఆదేశించింది. కానీ, పంజాబ్ నుండి బంగాళదుంపల దిగుబడి నవంబర్ మధ్యనాటికే మార్కెట్‌ను ముంచెత్తుతుందని అంచనా. ఈ నేప థ్యంలో రైతులు మరోసారి బళ్లకొద్దీ ఆలు దుంపలను ప్రధాన రహదారులపై వదిలివేయక తప్పదనిపిస్తోంది.

ఉత్పత్తిలో కాసింత తగ్గుదల కూడా లేనప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంలోని ఆర్థిక హేతుబద్ధత ఏమిటి? ఖరీఫ్ పంట దిగుబడి బాగానే వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. నవం బర్ మధ్య నాటికి వస్తుందనుకుంటున్న శీతాకాలపు పంట కూడా సాధారణంగానే ఉంటుందని అంచనా. చైనా, రష్యాల తర్వాత ప్రపంచంలోనే బంగాళ దుంపలను అధికంగా పండి స్తున్న మూడో అతిపెద్ద దేశం భారత్.

కానీ శక్తిమంతమైన ఆర్థికవేత్తల లాబీ ఒత్తిడితో.. పళ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల దిగుమతి కోసం భారతీయ మార్కెట్‌ను బార్లా తెరవడానికి ఆహార ద్రవ్యోల్బణం చక్కటి సాకుగా మారింది. ఇండో-యూరోపియన్ యూని యన్ మధ్య ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఈయూ దీన్నే డిమాండ్ చేస్తోంది.

దేశ ఎగుమతి దిగుమతి విధానానికి బంగాళ దుంపలు మాత్రమే బలి కావడం లేదు. హర్యా నాలోని సోనేపట్‌లో ఉన్న ఒక ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని సందర్శించినప్పుడు దిగ్భ్రాంతికర విష యం తెలిసింది.. కొనుగోలుదారులు లేక రైతులు తాము పండించిన టమాటాలను వీధుల్లో విసిరి వేస్తున్న సమయంలో భారత్, టమాటా పేస్టును భారీ మొత్తం లో చైనా నుంచి దిగుమతి చేసుకుందని అక్కడి రైతులు చెప్పా రు. ఆహార ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో సహా  దేశంలోని పలు ప్రాంతాలలో రైతులు టమాటా పంటను వృథాగా పారవేసినట్లు వార్తలొచ్చాయి.

టమాటా ధరలు కిలోకు రెండు రూపాయల కంటే తక్కువకు పడిపోయి నప్పుడు వాటిని పశువులకు ఆహారంగా వదిలేయడమో, లేదా వీధుల్లో విసిరివేయడమో తప్ప  రైతు లకు మరో మార్గం లేకుండా పోయింది. 2014 ఆగస్టు 28 నుం చి సెప్టెంబర్ 28 వరకు ఒక్క నెలలోనే భారత్ 376,009 డాలర్ల విలువైన టమాటా ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసు కుంది. మనం ఇళ్లలో వాడుతున్న టమాటా కెచప్, టమాటా పురీ చివరకు టమాటా జ్యూస్ వంటి పాపులర్ బ్రాండ్‌లన్నీ చైనా, నేపాల్, ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్ నుండే దిగుమతి అవుతున్నాయి. అంటే, మన దేశీయ టమాటా రైతులు గిట్టు బాటు ధరలు లేక చస్తున్న సమయంలోనే టమాటా ఉత్ప త్తులను మనకు ఎగుమతి చేస్తున్న దేశాల రైతులకు సహాయం చేస్తున్నామన్నమాట.

ఉదాహరణకు పాస్తానే తీసుకోండి. దేశీయంగా గోడవు న్లలో భారీ మొత్తంలో గోధుమ పేరుకుపోయి ఉన్నప్పుడు సం వత్సరానికి 39 శాతం చొప్పున అసాధారణ వృద్ధితో ఇటలీ నుంచి పిండిని భారత్ దిగుమతి చేసుకుంటోంది. గోధుమ నుంచే అది తయారవుతున్నప్పుడు దేశంలోనే  దాన్ని ఎందుకు తయారు చేయకూడదు? భారతీయ పాస్తా దిగుమతులు 2003-04లో 3.39 బిలియన్లు ఉండగా 2013-14లో అవి 17.22 బిలియన్లకు ఎగబాకాయి.

దేశంలోని లక్షలాది నూనె గింజల ఉత్పత్తిదారుల పొట్ట గొడుతూ  విదేశీ వంటనూనెలను నిస్గిగ్గుగా ప్రోత్సహిస్తున్నారు. ఆహార దిగుమతులు దేశీయ ఉత్పత్తిని ధ్వంసం చేస్తున్నాయి. ఇండోనేసియా, మలేసియా, బ్రెజిల్, యునెటైడ్ స్టేట్స్ దేశాల వంట నూనెల ఉత్పత్తిదారుల ఆర్థిక ప్రయోజనాల కోసం దేశం లోని మెట్ట ప్రాంతాలలో సన్నకారు రైతులు జీవన విధానాన్నే లాగేస్తున్నారు. వాస్తవానికి గత 3 దశాబ్దాలలో భారతీయ వంటనూనెల దిగుమతి బిల్లు అమాంతంగా పెరిగిపోయింది.

2012 చివరినాటికి వంటనూనెల దిగుమతులు 9.01 మిలి యన్ టన్నులకు చేరాయి. దీని విలువ రూ.56,295 కోట్లు. 2006-07, 2011-12 మధ్యకాలంలో మన వంటనూనెల దిగు మతులు 380 శాతం పెరిగాయి. వంటనూనెల దిగుమతిని తగ్గించడానికి దేశంలో నూనెగింజల ఉత్పత్తిని పెంచాల్సి ఉందని మాజీ వ్యవసాయ మంత్రి శరద్ పవార్ పదే పదే వల్లించేవారు.

అయితే 1994-95 నాటికే నూనెగింజల ఉత్పత్తిలో భారత్ దాదాపు స్వయంపోషకత్వ స్థాయికి చేరుకున్న విషయం ఎవ రూ ప్రస్తావించడం లేదు. ఆ నాటికి మన వంటనూనెల దిగు మతులు కేవలం 3 శాతం మాత్రమే. 1994-95 తర్వాత నూనె గింజల దిగుమతి సుంకాలు క్రమానుగతంగా తగ్గిస్తూ వచ్చారు. దీంతో దిగుమతులు పెరిగాయి. దిగుమతి సుంకాన్ని 300 శాతానికి పెంచాలని నిబంధన ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో నూనె దిగుమతులపై జీరో టారిఫ్‌ను భారత్ అనుమతించింది. దేశీయ అవసరాలలో 50 శాతం పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దేశీయ నూనెగింజల విప్లవాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఆర్థిక వేత్తల లాబీ ఇప్పుడు పామాయిల్ తోటల సాగును ప్రోత్సహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది..
                                                                                                                                                          దేవిందర్ శర్మ
                                                                                                                                                     
పామాయిల్ వ్యవసాయంతో భూమి ఎడారి కావడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ 10 రెట్లు అధికంగా విడుదలై భూతాపం పెరుగుతోందని వరల్డ్ వాచ్ సంస్థ పేర్కొంది. కానీ, భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మిజోరం, త్రిపుర, అస్సాం, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని హరితారణ్యా లను నిర్మూలించి 10 లక్షల పైగా హెక్టార్ల భూమిలో పామాయిల్ తోటల పెంపకానికి పథకాలు రచిస్తోంది. (దీని ద్వారా సంవత్సరానికి నాలుగు లేదా అయిదు టన్నుల పామాయిల్ మాత్రమే ఉత్పత్తవుతుంది. దీనిలోని ఆర్థిక హేతుబద్ధత ఏమి టో నా అవగాహనకు అందటం లేదు.) ముందుగా నూనె గిం జల ఉత్పత్తిదారులను నాశనం చేయడం, తర్వాత వంట నూనెల ఉత్పత్తికి అడవులను నిర్మూలించడం. ఇది నిజంగానే అద్భుతమైన అభివృద్ధి నమూనాయే మరి.

(వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement