పొలాల్లో కందకాలే రైతుకు రక్ష
సందర్భం
దేశంలో ఎక్కడ విన్నా రైతన్నల ఆత్మహత్యలే. ఏ పొద్దు పేపర్ చూసినా అన్నదాతల బలవన్మర ణాలే. వర్షాభావ పరిస్థి తులే రైతుల ఆత్మహత్య లకు ముఖ్యకారణం. వర్ష పాతం కరువైన నేపథ్యం లోనే రైతులు లోతుగా బోర్లను వేయడానికి విపరీతంగా ధనం వెచ్చించి అప్పుల బారినపడుతున్నారు. వర్షాలు పడక, బోర్లలో, బావుల్లో నీరు అందక, పంట ఎండిపోయే దశలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆత్మహ త్యలే శరణ్యం అనుకుని నిండుప్రాణాలను బలిపె ట్టుకుని ఆలుబిడ్డల బతుకులను అగాధంలోకి నెట్టే స్తున్నారు. ఈ పరిస్థితుల్లో చనిపోయిన రైతు కుటుం బాలకు పరిహారం చెల్లించి బాధ్యత నెరవేర్చుకు న్నట్లు ప్రభుత్వాలు భావించడం సరికాదు.
ఎన్ని ప్రాజెక్టులు చేపట్టినా యింకా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయన్న సంగ తిని ప్రభుత్వాలు మర్చిపోరాదు. ప్రాజెక్టుల వల్ల కొద్ది ప్రాంతాల రైతులకే మేలు కలిగి మిగతా ప్రాం త రైతులు దారుణంగా నష్టపోతున్నారు. కనుక అన్ని ప్రాంతాల రైతులకూ ఉపశమనం కలిగించే పథకాలను తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉంది.
రైతు పొలంలోనే వాననీటి సంరక్షణ చేపట్టి భూగర్భజలాలను అభివృద్ధి చేసుకోవడమే ఉత్తమ మార్గమని వాన నీటి సంరక్షణ పథకాలు, వాటి ఫలి తాలబట్టి తెలుస్తోంది. అంటే పొలం కిందనే చెరు వును (భూగర్భంలో) ఏర్పర్చుకుని, అవసరమైన నీటిని మాత్రమే బావులు లేదా బోర్ల ద్వారా వాడు కుని పంటలు పండించుకోవచ్చు.
వాన నీటి సంరక్షణ పనులను ప్రభుత్వం కూడా చేపట్టి చెక్ డ్యాములను కడుతోంది. చెరువు లను పునరుద్ధరిస్తోంది. కానీ వాటివల్ల వాటి పరిధి లోని లేదా సమీపంలోని కొంతమంది రైతులకే ప్రయోజనం కలుగుతోంది. కాబట్టి రైతులందరికీ ప్రయోజనం కలగాలంటే, ప్రధానంగా రెండు చర్యలు చేపట్టాలి.
1. రైతులందరి పొలాల్లో, చేలలో వాన నీటి సంరక్షణ చర్యలను చేపట్టవలసి ఉంది. వాన నీటి సంరక్షణ చర్యలన్నింటిలో అత్యంత చవ కైనది, అత్యంత ఫలప్రదమైనది. సమతల కందకాల తవ్వకమే. కందకాలు తవ్వడానికి ఎకరాకు రూ.3 వేలు చాలు. దీనివల్ల రైతు పొలంలో పడిన వర్షపు నీరు పూర్తిగా పొలంలోనే ఇంకిపోయి చేనుకిందే చెరువు ఏర్పడి బోర్లు, బావులు పుష్కలంగా సాగు నీటిని అందించి, పంటలు మెండుగా పండి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదు.
2. వాన నీటిని సంరక్షించడమే కాకుండా భూగర్భంలో లభ్య మయ్యే నీటికి అనువైన పంటలను పండించుకుంటే ఆత్మహత్యలు చేసుకునే విపత్కర పరిస్థితులు రైతు లకు దాపురించవు. అంటే నీటి బడ్జెట్‌ను తయారు చేసుకుని పంటలు పండించుకొవాలి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సేద్యయో గ్యమైన ప్రతి ఎకరా చేనుకు వాననీటి సంరక్షణ కలిగించాలంటే ఒక్కో రాష్ట్రానికి, కేవలం 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. ఈ ఖర్చు ప్రభుత్వాలకు పెద్ద లెక్క కాదు. ఒక్క ఏడాదిలోనే ఈ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఏడాది కురిసే వాన నీటిని మొత్తం ఒడిసిపట్టి ఒకే ఏడు రెండు ఆరుతడి పంటలు పండింపచేసి, రాష్ట్రాలను సస్యశ్యామలం చేయవచ్చు. ప్రభుత్వాలు ఇకనైనా వాన నీటి సంరక్షణ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్య తనివ్వాలి. అతివృష్టి కాలంలో వరదలను ఆపి పంట లను రక్షించేది, అనావృష్టి కాలంలో సరిపడా సాగు నీటిని అందించగలిగింది ఒక్క వాన నీటి సంరక్షణ పథకమే. అందుచేత ప్రభుత్వాలు, పాలకులు మీన మేషాలు లెక్కించకుండా తక్షణమే ప్రతి రైతు చేలో కందకాలు తవ్వించి ఎండిన బోర్లకు, బావులకు సరి పోను నీరు అందేటట్టు చేసి, ప్రతి రైతూ పంటలు నిశ్చింతగా పండించుకునేటట్లు చేయాలి.
లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టే ప్రాజెక్టులు చాలా కాలానికి గాని పూర్తి కావటం లేదు. ఈ వాన నీటి సంరక్షణ వల్ల ఇంచుమించు ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనం చేకూరుతుంది. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పొలంలో వాననీటి సంరక్షణ కోసం యుద్ధ ప్రాతిపదికన సమతల కందకాలు తవ్వే కార్యక్రమా లను చేపట్టి భవిష్యత్తులో రైతుల ఆత్మహత్యలను అరికట్టాలి. రైతే దేశానికి వెన్నెముక. రైతు శ్రేయస్సే దేశ శ్రేయస్సు, రైతు సౌభాగ్యమే దేశ సౌభాగ్యం.
- సంగెం చంద్రమౌళి
వ్యాసకర్త అధ్యక్షులు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల వే దిక. మొబైల్ 9849566009