
పాలమూరు మేలిమి కథకుడు
1954 - 60ల మధ్య పాలమూరు జిల్లా నుంచి విస్తృతంగా కథలు రాసి గుర్తింపు పొందిన రచయిత వల్లపురెడ్డి. వాస్తవ జీవిత చిత్రణ వల్లపురెడ్డి బలం. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు ఆయన ప్రధాన కథా వస్తువులు. ప్రధాన స్రవంతి వచనంలో అలవోకగా కథను నడిపించడం తెలిసిన వల్లపురెడ్డి కథలకు భారతి, తెలుగు స్వతంత్ర వంటి పత్రికలు పీఠం వేయడంలో ఆశ్చర్యం లేదు.
వల్లపురెడ్డి దాదాపు 70 కథలు రాసినా అన్నీ అందుబాటులో లేకపోవడం దురదృష్టం. దొరికిన 35 కథలతో ఈ సంపుటి తీసుకొచ్చిన పాలమూరు మిత్రులు అభినందనీయులు. మరుగున పడ్డ కథకులు అలాగే ఉండిపోరనీ మబ్బు తొలగిన మరుక్షణాన పాఠకుల సమక్షంలో హాజరవుతారని ఈ సంపుటి సాక్ష్యం పలుకుతుంది. కథాభిమానులు తప్పక పరిశీలించాల్సిన పుస్తకం.
వెల: రూ.150/- ప్రతులకు: 94908 04157