రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? | why government target roja? | Sakshi
Sakshi News home page

రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Published Wed, Apr 1 2015 8:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

సందర్భం
 సామాన్య
 
 ‘‘మహిళలు తమ విద్య, శక్తి సామర్థ్యాలను ముఖ్యమైనవి గా గుర్తించి, వాటిని ఉపయో గించడం ప్రారంభిస్తే చివరికి వారు పోటీపడాల్సివచ్చేది పు రుషులతోనే’’ (బెట్టీ ఫ్రిడాన్,  సెకండ్ వేవ్ ఫెమినిస్ట్).
 
 ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ప్రతి పక్ష మహిళా సభ్యురాలు రోజాపై జరిగిన దాడి అసాధా రణమైనది. ఎందుకంటే ఆ దాడిలో రాజకీయ విద్వేషం కంటే ‘మగరాయుడి’లా ప్రవర్తించే ఒక ‘ఆడదానికి’ బుద్ధి చెప్పాలనే పితృస్వామిక ప్రతీకార వాంఛ బలంగా కనిపించింది. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చట్ట సభల్లో వినవస్తున్న స్వత ంత్ర మహిళా గళాలను నొక్కేసే ప్రమా దం ఈ ధోరణిలో ఉంది. అందుకే ఇది రాయాల్సి వస్తోం ది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా సభా సమావేశాల్లో పాల్గొంటున్న రోజాను ఎందుకిలా టార్గెట్ చేస్తున్నారు? అవును,‘టార్గెట్’ చేస్తున్నారని నేను సరైన పదమే వాడా ను. ‘ఐరన్ లెగ్’ అనే మూఢ విశ్వాస పద ప్రయోగమూ, ‘లేడీ విలన్’ అనే పురుషాహంకారపు ఉక్రోషం ఎందు కు? రోజా మగవాళ్లకి దీటైన ప్రతిభ, వాక్చాతుర్యం,  సమయస్ఫూర్తి, విషయ పరిజ్ఞానంగల నేత కాబట్టి. అంతకుమించి పితృస్వామ్యపు సంకెళ్లు బంధించలేని స్వేచ్ఛా భావజాలం గలిగిన స్త్రీ కావడం వల్ల ఆమె టార్గెట్ అవుతోంది. సరిగ్గా చెప్పాలంటే పితృస్వామిక ఆధిపత్యపు వ్యవస్థీకృత స్వభావమే రోజాని టార్గెట్ చేస్తోంది.
 
 రోజా కన్నీరు పెట్టడాన్ని పదేపదే చూపి మురిసిన మీడియాకు ఆమెను ‘ఐరన్ లెగ్’ అంటూ అదేపనిగా అనాగరికంగా తూలనాడటం పట్టకపోవడంలో ఆశ్చ ర్యం లేదు. కానీ నిండు సభలో ఒక స్త్రీని టార్గెట్ చేసి దాడి చేస్తుంటే తోటి మహిళా ప్రజాప్రతినిధులలో ఒక్క రైనా ఎందుకు ఖండించలేకపోయారు? మనం ఉన్నది వ్యవస్థీకృత పితృస్వామ్య సమాజంలో కాబట్టి. స్త్రీవాది ఉమా చక్రవర్తి చెప్పినట్టు ఈ సమాజంలో స్త్రీలను నియంత్రించే విధానం మూడు భిన్న స్థాయిలలో, మూడు భిన్న సాధనాల ద్వారా అమలవుతుంది. మొద టిది ‘భావజాలం’. అణిగిమణిగి ఉండటం, మౌనంగా  ఉండటం, త్యాగం తదితరాలన్నీ స్త్రీత్వపు సుగుణాలని నూరిపోశారు. ఇంట్లోనైనా, వీధిలోనైనా, శాసనసభలో నైనా, మరెక్కడైనా స్త్రీ తండ్రి చాటు కూతురిగా, భర్త చాటు భార్యగా అణిగిమణిగి ఉండాల్సిందే. విషయ పరి జ్ఞానమే లేకుండా ‘‘ఆమె (రోజా) వ్యవహారశైలిని ఒక్క మహిళ సపోర్ట్ చేసినా రాజీనామా చేసి బయటకి వెళ తాను’’ అని తానే స్త్రీలందరి ప్రతినిధినంటూ నిలిచిన కిమిడి మృణాళిని లాగానో లేదా పచ్చి పితృస్వామ్య భావజాలంతో రోజాపై విరుచుకుపడ్డ పీతల సుజాత లాగానో ప్రవర్తిస్తే అది ‘స్త్రీ సహజం’. అలాంటి వారిని శాసనసభ్యులు సహా పురుషులంతా మర్యాద, మన్నన ఎరిగిన, పద్ధతిగల స్త్రీలుగా గుర్తిస్తారు. దీనినే ‘‘పితృవా త్సల్య పూర్వక అధికారంతో కూడిన పితృస్వామ్య రూపం’’ అంటారు గెర్డా లెర్నర్. రోజా, తనని ‘విలన్’ అంటున్న నేతల భావజాల దాడినే కాదు, ‘వాత్సల్యం’ మాయా బంధనాలను కూడా బద్దలు కొట్టుకుని బయ టకి వచ్చారు. పురుషులతో సమంగానూ, వారిని అధిగ మించీ ఎదిగే స్త్రీల మీద, ఆర్థిక, సామాజిక ప్రయోజనా లలో భాగస్వామ్యానికి పోటీపడే స్త్రీల మీద పురుషులు  లైంగికపరమైన దాడులకు సైతం దిగుతారు, ‘‘స్త్రీత్వపు ఎర’’ వేయడమే స్త్రీ విజయానికి కారణమని ప్రచారం కూడా చేస్తారు. అలాంటి దాడులకు తిరుగులేని సమా ధానంగానే రోజా ‘‘నన్ను రేప్ చేసే ధైర్యం లేదు’’ అనేసి ‘అబల’గా కాక దైర్యంగల మనిషిగా నిలిచింది. చిన్న సమస్యలకు కూడా క్రుంగిపోయి ఆత్మహత్యలకు మళ్లే అమ్మాయిలు రోజా ప్రదర్శించే ఆ ధైర్యాన్ని గమనిస్తే మంచిది.   
 
 శాసనసభలో రోజా ప్రవర్తన అసభ్యకరమని అం టున్న వాళ్లు అలాంటి పరిణామాలకు ప్రేరేపించిన ఘట నలను ఎందుకు టెలికాస్ట్ చేయడం లేదు? ‘‘దమ్ము ధైర్య ముంటే అన్నిటినీ టెలికాస్ట్ చెయ్యాలి’’ అన్న ఆమె సవాలుని స్వీకరించరేం?  రోజాదే తప్పయితే ప్రజలే ఆమెను తప్పు పడతారుగా? రోజాకి కుల పిచ్చి ఉందా? ఉంటే మరో కులం ఆధిపత్యం ఉందంటున్న పార్టీలో రాజకీయ అరంగేట్రం ఎందుకు చేస్తారు? అని కూడా వారే ఆలోచిస్తారు. నేటి సమాజంలో దళితులూ, మహి ళలూ ఇద్దరూ అణచివేతకు గురవుతున్నవారే. పురుషా ధిక్యతను ధిక్కరించే రోజాని లొంగదీయడానికి దళిత నేత్రి పీతల సుజాతని ప్రయోగించడం ‘నీ వేలుతో నీ కంటినే పొడవడ’మనే రాజకీయం కావచ్చేమో. కానీ అది ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని పలచన చేస్తుంది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి పీతల సుజాత లాంటి వారు ఈ విషయాన్ని లోతుగా  ఆలోచించాలి.
 
 అధిక సంఖ్యలో స్త్రీలు రాజ్యాధినేతలుగా ఉండ టం దక్షిణాసియాలోనే సాధ్యమయింది. సంప్రదాయక మైన ‘స్త్రీ’ గుర్తింపుని అధిగమించి ప్రతిభా ప్రతిపత్తులు, శక్తిసామర్థ్యాలుగల మనుషులుగా, దక్షతగల నేతలుగా వర్తమాన భారతంలో మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత, రేణుకా చౌదరి వంటి వారు ప్రజల గుర్తిం పును పొందారు. దృఢమైన నాయకులుగా మన్నన పొం దారు.  రోజా కూడా ఆ కోవకే చెందుతుంది. మంచి నాయకురాలిగా ఎదగటానికి అవసరమైన అన్ని దిను సుల మేళవింపు ఆమె. సామ్యవాదం, అస్తిత్వ రాజకీ యాలు, మానవ హక్కులు వంటి అంశాలపై తగు అవ గాహన, సైద్ధాంతిక స్పష్టత కూడా తోడైతే దేశానికి ఆమెలో ఒక మంచి నాయకురాలు దొరుకుతుంది. ఆమెపై దాడి చేస్తున్న పురుష పుంగవులకు ఈ విషయం బాగానే అర్థమైంది. అందుకే ఈ ఉలికిపాటు.
 (వ్యాసకర్త రచయిత్రి, ఫోన్ నం: 8019000900)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement