![North and South Korea to launch joint bid to host 2032 summer Olympics - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/13/oli.jpg.webp?itok=ea882IUF)
సియోల్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ను ఉమ్మడిగా నిర్వహించేందుకు తాము సిద్ధం అంటున్నాయి దాయాది దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియా. తమ రాజధానులు ప్యాంగ్యాంగ్, సియోల్‌లలో 2032 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి సమాచారం ఇవ్వనున్నాయి. 2018లోదక్షిణ కొరియాలోని పియాంగ్‌చాంగ్‌లో జరిగిన శీతాకాల ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా తమ జట్లను పంపడంతో రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు మెరుగుపడ్డాయి.
మరోవైపు తమ ద్వీపకల్పంలో ఉద్రిక్తతల నివారణ, శాంతి స్థాపనకు దోహదపడుతుందని భావించి ఉమ్మడి ఆతిథ్యం పట్ల దక్షిణ కొరియా చొరవ చూపింది. గతేడాది రెండు దేశాల అంతర్గత చర్చల్లో ఆ ప్రస్తావన తెచ్చింది. గతంలో దక్షిణ కొరియా 1988లో సియో ల్‌లో ఒలింపిక్స్ నిర్వహించింది. ఉత్తర కొరియా వాటిని బహిష్కరించింది. అయితే, ఉత్తర కొరియా రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి బిడ్ నెగ్గడం కష్టమే.
Comments
Please login to add a commentAdd a comment