=ఈలోగా మరమ్మతులు పూర్తి
=టౌన్‌ప్లానింగ్ ఫిర్యాదులపై అదాలత్‌లు
=ప్రజల ముందుకు పనుల వివరాలు
=వరల్డ్‌క్లాస్ సిటీగా నగరం
=‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్
సాక్షి, సిటీబ్యూరో: ఆర్నెళ్లలో నగరంలోని రహదారుల రూపురేఖలు మారుస్తానని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. అప్పటి దాకా ఇబ్బందుల్లేని ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తూ రోడ్ల నిర్వహణ చూస్తామని తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ‘అదాలత్’లు నిర్వహిస్తామన్నారు. ప్రారంభించిన పనుల్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేసేందుకు శ్రద్ధ చూపుతానన్నారు. చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. పేదల ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యమిస్తానన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా గత వారం బాధ్యతలు చేపట్టిన సోమేశ్‌కుమార్ శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..
సాక్షి: రోడ్డెక్కితే ప్రజలు జీహెచ్‌ఎంసీని తిట్టుకుంటున్నారు. అధ్వానపు రోడ్లతో అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?
కమిషనర్: తరచూ దెబ్బతింటున్న రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్న మాట వాస్తవమే. రోడ్ల మెరుగుకు, ప్రజల ఇబ్బందులు తొలగిం చేందుకు మూడంచెల వ్యూహం అమలు చేస్తా. ఈనెల 10లోగా పాట్‌హోల్స్ మరమ్మతుల్ని, ఆపై రోడ్లు దెబ్బతిన్న ప్రాం తాల్లో ప్యాచ్‌వర్క్స్ పూర్తిచేస్తాం. తద్వారా ట్రాఫిక్ జామ్స్ తగ్గుతాయి. ఆరు నెలల్లోగా రీకార్పెటింగ్ ఇత ర పనులు పూర్తిచేస్తాం.
అవసరమైన చోట కొత్త రోడ్లు వేస్తాం. రోడ్లు తరచూ పాడయ్యే ప్రాంతాల్లో సమస్యలు గుర్తించి పరిష్కరిస్తాం. వర్షానికి బీటీ త్వరగా పాడవుతున్నం దున ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేస్తాం. ట్రాఫిక్ దృష్ట్యా ఇది సాధ్యం కాకుంటే ఇంటర్‌లాకింగ్ సిస్టంతో పనులుచేస్తాం. నీటినిల్వ, డ్రైనేజీ పొంగిపొర్లడం వంటివి నిరోధిస్తాం. ఆరు నెలల్లోగా ఇవన్నీ పూర్తిచేసి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటాం.
సాక్షి: పనుల్లో జాప్యానికి, అవినీతికి ‘జీహెచ్‌ఎంసీ’ పర్యాయపదంగా మారిందనే ప్రచా రం ఉంది. ఈ అపప్రద ఎలా తొలగిస్తారు?
కమిషనర్: అవినీతి, జాప్యం.. రెండింటికీ అంతర్గత సంబంధం ఉంది. జాప్యాన్ని నివారిస్తే అవినీతి అంతమవుతుంది. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంపై ఆరోపణలెక్కువ ఉన్నాయి. వాటిని అరికట్టేందుకు ఫైళ్ల పరిష్కారానికి సరళీకరణ విధానాలు చేపడతాం. నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారమయ్యేలా సిటిజెన్ చార్టర్‌ను అమలు చేస్తాం. 300 గజాల్లోపు ఇళ్లు కట్టుకునే వారి నుంచి బిల్డర్ల వరకు రెడ్‌టేపిజం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు దృష్టికొచ్చింది. రెండునెలల్లోగా ఫైలు పరిష్కారం కాకుంటే నేరుగా నా వద్దకే రావచ్చు. ఈ విభాగంలోని ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ‘అదాలత్’లు నిర్వహిస్తాం. ఫిర్యాదుల్ని వారంలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా. అనుమతి నిరాకరించే పక్షంలో లిఖితపూర్వకంగా చెబుతాం.
సాక్షి: ఎప్పుడో గడువు ముగిసిపోయిన బీపీఎస్ ఫైళ్లే ఇంకా క్లియర్ కాలే దు?
కమిషనర్: బీపీఎస్ ఫైళ్ల పరిష్కారానికి జోన్ల వారీగా మేళాలు ఏర్పాటు చేస్తాం. వాటికి నే నూ హాజరవుతా. మేళాల అనంతరం ఐదు రోజుల్లోగా ఫైళ్లన్నీ క్లియర్ చేయాలనేది ఆలోచన.
సాక్షి: ఏటా వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు.. పనులు మాత్రం ముందుకు కదలవు. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారు?
కమిషనర్: చేపట్టే ప్రతి పని నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. పనుల వివరాలు స్థానికులు, ప్రజాప్రతినిధులకు తెలిసేలా అంచనా వివరాలతో సహా బోర్డులు ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు పూర్తిచేయాల్సిందీ పేర్కొంటాం. తద్వారా ‘లక్ష్యం’ కళ్లముందు కనిపిస్తుంది. స్థానిక కార్పొరేటర్, అధికారులు, వివిధ సంఘాల నేతలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తాం. వారి సమన్వయంతో నిర్ణీత వ్యవధిలోగా పని పూర్తికి మార్గమేర్పడుతుంది. సం బంధిత జోనల్ కమిషనర్‌కు అజమాయిషీ బాధ్యతలప్పగిస్తాం. అడపాదడపా కమిషనర్ తనిఖీలు ఉంటాయి.
సాక్షి: ఏటా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా చెత్త సమస్యలు తీరడం లేవు. దీనికి మీరు చేపే పరిష్కారం?
కమిషనర్: పరిస్థితిని నేనింకా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏరోజు ఎంతమంది విధుల్లో ఉంటున్నారో, ఎంతమంది రావడం లేదో కూడా సంబంధిత డీఎంసీలకే తెలియడం లేదు. పారిశుధ్యం సహా వివిధ విభాగాల్లో సిస్టమ్స్ మార్చాల్సి ఉంది. మంచి సిస్టమ్ ఉంటే పనుల్లో మంచి ఫలితాలుంటాయి.
సాక్షి: శివారు ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల్లేవు. గ్రేటర్ ప్రజలతో సమానంగా శివారు ప్రజలు పన్నులు కడుతున్నా వారి సమస్యలు తీరట్లేదు. ఈ పరిస్థితుల్లో మరిన్ని గ్రామపంచాయతీల విలీనంపై మీ వ్యక్తిగత అభిప్రాయం?
కమిషనర్: శివారు ప్రాంత సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దానిపై అధ్యయనం చేస్తున్నా. త్వరలోనే తగిన పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నా. చిన్న గ్రామం ఏకంగా ఒకేసారి గ్రేటర్‌లో విలీనం కావడం సమంజసం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ముందుగా మునిసిపాలిటీలుగా కొంత అభివృద్ధి చెందాక గ్రేటర్‌లో కలిసినా ఇబ్బంది ఉండదు.
సాక్షి: పేదల కోసం ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా?
కమిషనర్: పేదలపై నాకు శ్రద్ధ ఉంది. గిరిజన సంక్షేమశాఖలో పనిచేసినప్పుడు వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన అనుభవం ఉంది. పేదలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు వారికి తప్పనిసరిగా కావాల్సింది జీవనోపాధి. అందుకు తగిన కార్యక్రమాల్ని అ మలు చేయాలి. నిరుపేద యువతకు ఉపాధి చూపడంతో పాటు నగర ప్రజల అవసరాలు తీర్చేలా కార్యక్రమాలు రూపొందించాల్సి ఉంది. ఆ దిశగా ఎంతో చేయగలనన్న నమ్మకం ఉంది.
సాక్షి: జీహెచ్‌ఎంసీని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మీ డ్రీమ్?
కమిషనర్: పనులు త్వరితంగా పూర్తిచేయాలనేదొక్కటే లక్ష్యం. వేరే అజెండా లేదు. మంచి సిటీగా తీర్చిదిద్దేందుకు నాకు కొన్ని ఆలోచనలున్నాయి. అవేమిటో ఇప్పుడే వెల్లడించను. ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల సహకారంతో చేయలేని పనంటూ ఉండదు. నగరంలో ప్రజలను సంసిద్ధుల్ని చేసేందుకు వారి సహకారం అవసరం. ఈ విషయంలో గతంలో నాకు వేరే అభిప్రా యం ఉండేది. ఇప్పుడది సరికాదని తెలుస్తోంది. అందరినీ కలుపుకోగలిగితేనే ఏదైనా సాధ్యం. నగరాన్ని వరల్డ్‌క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. మొదట పారిశుధ్యం అద్భుతంగా ఉండాలి. రోడ్లు అద్దాల్లా మెరవాలి. రోడ్లపై నీటినిల్వలుండరాదు.. ఇలా ఇంకా కొన్ని అంశాల్లో ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండాలి.
సాక్షి: ఏటా వేల కోట్ల బడ్జెట్ కేటాయిం పులు.. పనులు మాత్రం ముందుకు కదలవు. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారు?
కమిషనర్: చేపట్టే ప్రతి పని నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. పనుల వివరాలు స్థాని కులు, ప్రజాప్రతినిధులకు తెలిసేలా అం చనా వివరాలతో సహా బోర్డులు ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు పూర్తిచేయాల్సిందీ పే ర్కొంటాం. తద్వారా ‘లక్ష్యం’ కళ్లముందు కనిపిస్తుంది. స్థానిక కార్పొరేటర్, అధికారులు, వివిధ సం ఘాల నేతలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తాం. వారి సమన్వయంతో నిర్ణీత వ్యవధిలోగా పని పూర్తికి మార్గమేర్పడుతుంది. సంబంధిత జోనల్ కమిషనర్‌కు అజమాయిషీ బాధ్యతలప్పగిస్తాం. అడపాదడపా కమిషనర్ తనిఖీలు ఉంటాయి.
నగర పంచాయతీలకు పచ్చజెండా
Published Sat, Nov 2 2013 3:25 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
Advertisement
Advertisement