Somes Kumar
-
కోవిడ్-19 నియంత్రణకు వలంటీర్లు కావాలి
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్-19 వైరస్ నియంత్రణ కార్యక్రమాల్లో వలంటీర్లుగా పనిచేసేందుకు అన్ని కేడర్లు, ర్యాంకుల రిటైర్డు ఆర్మీ, పారామిలటరీ, పోలీసు, ఎక్సైజ్ ఉద్యోగుల దరకాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరు రోగులకు వైద్య సేవలు అందించడం, రవాణా, భద్రత తదితర సేవల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోడానికి www.transport.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఈ నెల 22తో దరఖాస్తుల గడువు ముగుస్తుందని చెప్పారు. (లాక్డౌన్ ఏయే రంగాలకు సడలింపు.. ) ట్రంప్ నిర్ణయం మంచిది కాదు : బిల్‌గేట్స్ -
మంచి.. అటెండర్ చెప్పినా ఆచరిస్తా!
♦ ప్రజల ప్రాధాన్యతలే నా ప్రాధామ్యాలు ♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పునర్విభజన ముసాయిదా గందరగోళంగా, తలాతోక లేకుండా ఉందని వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. అడ్డగోలుగా ఓటర్లను జాబితాల్లోంచి తొలగించారని విమర్శలు... రూ. వేల కోట్లతో భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు... ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్‌గా డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. శనివారం సోమేశ్‌కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలు.. ప్రాధాన్యతలు తదితర అంశాలపై జనార్దన్‌రెడ్డి ‘సాక్షి’ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు.. ప్రశ్న: కొత్త కమిషనర్ వస్తే అప్పటి వరకున్న ప్రణాళికలు, ప్రాజెక్టులు దారి మళ్లి కొత్తవి తెరపైకి రావడం జీహెచ్ఎంసీలో ఆనవాయితీ. అదే పునరావృతం కానుందా..! జవాబు: మంచి అనేది ఎక్కడ నుంచి ప్రారంభమైనా పూర్తి చేస్తాను. ఎవరికి పేరు వస్తుందన్నది పట్టించుకోను. బాగుంటే అటెండర్ అభిప్రాయానికైనా విలువిస్తా. బాగలేకపోతే డెరైక్టర్ స్థాయి వారు చెప్పినా పట్టించుకోను. అవసరమైతే స్వల్ప మార్పులుంటాయేమో కానీ నా పథకం కాదని నిలిపివేయను. ప్రశ్న: నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలని మీ డ్రీమ్? జవాబు: పని పెద్దదా.. చిన్నదా అనే ఆలోచనుండదు. చేసే పని ప్రజాబాహుళ్యానికి, ఎక్కువ మందికి ఉపయోగపడేలా ఉండాలని ఆలోచిస్తాను. డ్రీమ్ అంటే స్కైవేలు.. భారీ నిధులతో చేపట్టే పనులే ఉండాలని లేదు. పనులు చిన్నవే కావచ్చు కానీ.. అప్రాధాన్యమైనవి మాత్రం కావు. వాటి వల్ల ఎక్కువ మందికి సమస్యలు తీరతాయి. అలాంటి వాటి గురించి ఆలోచిస్తాను. ప్రశ్న: మీ తొలి ప్రాధాన్యతలు.. ? జవాబు: ప్రజల ప్రాధాన్యతలే నా ప్రాధామ్యాలు. మొదటిది పారిశుద్ధ్యం. రెండోది రహదారులు. ఆ తర్వాత సదుపాయవంతమైన జీవనానికి కల్పించాల్సిన మౌలిక వసతులు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఇంటింటికి రెండు చెత్తడబ్బాలు అందుబాటులోకి తేనున్నాం. ఇక రహదారులు మన్నికగా ఉండేందుకు వైట్‌టాపింగ్ ఆలోచనలు చేశారు. వీలైనన్ని మార్గాల్లో వాటిని నిర్మిస్తాం. ప్రశ్న: పారిశుద్ధ్యం మెరుగుకు ఏం చేయనున్నారు? జవాబు: గ్రేటర్‌లోని కాలనీ సంఘాలు, ప్రజలతో పారిశుద్ధ్య కార్మికుల పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తాం. కార్మికులవి, సూపర్వైజర్లవి ఫోన్ నంబర్లు కూడా ప్రజలకిస్తాం. తద్వారా తమ ఇంటిముందు వీధి ఊడ్చేదెవరో ప్రజలకు తెలుస్తుంది. పనిచేయని రోజుల్లో అడిగేందుకు వీలుంటుంది. ప్రశ్న: క్షేత్రస్థాయి పర్యటనలు ఏ జోన్, డివిజన్ నుంచి ప్రారంభించనున్నారు ? జవాబు: గ్రేటర్లో 150 డివిజన్లున్నాయి. వాటి పేర్లతో లాటరీ తీస్తాను. ఏరోజు ఏ డివిజన్ వస్తే ఆరోజు అక్కడ తనిఖీలు చేస్తాను. ముందస్తు సమాచారం ఉంటే వాస్తవ పరిస్థితి తెలియకుండా జాగ్రత్త పడతారు. ప్రశ్న: తొలగించిన 1600 మంది కార్మికుల విషయంలో ఏంచేయనున్నారు ? జవాబు: ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఈ అంశం ఉంది. తగిన పరిష్కారం చూపుతాం. ప్రశ్న: డీలిమిటేషన్.. విశ్వనగర ప్రాజెక్టులు.. ఇతరత్రా సవాళ్ల తరుణంలో బాధ్యతలు చేపడుతున్నారు. ఎలా భావిస్తున్నారు ? జవాబు: సమస్యలున్నప్పుడు.. పరిష్కారమూ ఉంటుంది. స్థానిక సంస్థల్లో పాలకులు ఎంత ముఖ్యమో, పురజనులు అంతే ముఖ్యం. ప్రజలందరి సహకారంతో పనిచేస్తా. ప్రశ్న: సంక్షేమం.. అభివృద్ధి దేనికి ప్రాధాన్యం ? జవాబు: దేని దారి దానిదే. రెండూ జరగాల్సిందే. హైటెక్‌సిటీలోనూ స్లమ్స్ ఉన్నాయి. సంపన్న కాలనీలు, పేదల మురికివాడల మధ్య చాలా అంతరాలున్నాయి. పేదలకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఆ దిశగా కృషి చేస్తాను. ప్రశ్న: ఓట్ల తొలగింపుపై చెలరేగిన దుమారాన్ని ఎలా పరిష్కరిస్తారు. జవాబు: పోలింగ్‌కు ముందు వారం రోజులు మినహా ఎప్పుడైనా ఓటర్లుగా నమోదుకు అవకాశం ఉంది. జాబితాలో లేనంత మాత్రాన ఓటు పోయిందనే భయం అవసరం లేదు. పేరు లేని వారు దరఖాస్తు చేసుకుంటే నమోదు చేస్తాం. వనరుల వినియోగం.. అంతకుముందు మీడియాతో మట్లాడుతూ.. లేఔట్లలోని ఖాలీ ప్రదేశాల్లో పార్కులు, ఆటస్థలాల ఏర్పాటుతో అవి ఆక్రమణలకు గురి కాకుండా కాపాడతామని, మహిళలు, నిరుద్యోగులకు అధికమొత్తాల్లో బ్యాంకు రుణాలిప్పిస్తామని తెలిపారు. ఉన్న వనరుల్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకునే చర్యలు చేపడతామన్నారు. అంకితభావంతో పనిచేసేందుకు, సమయపాలన పాటించేందుకు బయోమెట్రిక్ వంటి విధానాల కంటే, కౌన్సిలింగ్ వంటి చర్యలు మంచి ఫలితాన్నిస్తాయన్నారు. బలవంతంగా రుద్దకుండా స్వచ్ఛందంగా స్వీయ సమీక్షతో ఉద్యోగుల పనితీరు మెరుగుపరచే ప్రయత్నం చేస్తామన్నారు. అన్నిశాఖల వారు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆ ఇళ్లను తనిఖీ చేయండి
డిప్యూటీ కమిషనర్లకు స్పెషలాఫీసర్ ఆదేశం ఆధార్ అనుసంధానంపై సమీక్ష సిటీబ్యూరో: తాళాలు ఉన్న ఇళ్లను తనిఖీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 17.91 శాతం ఓటర్ల సమాచారం లేదన్నారు. ఆధార్‌తో ఓటరు కార్డుల అనుసంధానంపై శుక్రవారం డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆధార్ అనుసంధానానికి 73.51 లక్షల మంది అర్హులు కాగా... వారిలో 57.75 లక్షల మంది పరిశీలన పూర్తయిందన్నారు. 10.34 లక్షల మందికి సంబంధించి ఇంటికి తాళాలు ఉన్నాయన్నారు. చిరునామా మార్పులు, తాళాలున్న ఇళ్లకు సంబంధించి డిప్యూటీ కమిషనర్లు స్వయంగా తనిఖీలు చేయాలని సూచించారు. అప్పటికీ ఓటర్ల సమాచారం లేనట్లయితే ఆ వివరాలను రాజకీయ పార్టీలకు అందజేయాలని సూచించారు. వీరిని జాబితాలోంచి తొలగించేందుకు నోటీసులు జారీ చేయాలన్నారు. పరిశీలన పూర్తయిన వారిలో కేవలం 20.28 లక్షల మందివి మాత్రమే ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం జరిగిందని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిపై అశ్రద్ధ చూపే బూత్‌లెవెల్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 17 నుంచి స్వచ్ఛ కమిటీల పర్యటన గ్రేటర్‌లోని 400 యూనిట్లకు ప్రభుత్వం నియమించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన స్వచ్ఛ కమిటీలు ఈనెల 17వ తేదీ నుంచి స్థానికంగా పర్యటిస్తాయని సోమేశ్‌కుమార్ తెలిపారు. అంతకుముందే సంబంధిత అధికారులు గుర్తించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను రోజూ ఉదయం పూట తనిఖీ చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిటీలోకి మరిన్ని అంశాలు స్వచ్ఛ హైదరాబాద్‌కు సంబంధించి ప్రభుత్వ విభాగాల వారీగా ఏర్పాటు చేసిన కమిటీల్లో జీహెచ్ఎంసీ కమిటీని మరింత విస్తరించారు. ఈ కమిటీలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డులకు సంబంధించిన అంశాలున్నాయి. ట్రాఫిక్, ల్యాండ్ రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూడా చేర్చారు. ఈమేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిటీలో ఇప్పటికే ఉన్న ప్రతినిధులతోపాటు అదనంగా ఎమ్మెల్సీ ఎం.డి.సలీం పేరును చేర్చారు. -
ఇది తొలిపోరు
ప్లాస్టిక్ నిషేధంపై మలి పోరాటం రేపటి నుంచే ‘స్వచ్ఛ హైదరాబాద్’ ‘సాక్షి’తో జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా చెత్త తొలగింపు తొలి దశ కార్యక్రమమని... మలి దశలో ప్లాస్టిక్ నిషేధంపై శ్రద్ధ చూపుతామని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. తొలుత అన్నివర్గాల్లో అవగాహన క ల్పిస్తామని... పట్టించుకోకపోతే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షల కంటే ప్రజల్లో అవగాహన, చైతన్యం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ‘స్వచ్ఛ హైదరాబాద్’కు పూనుకున్నారని చెప్పారు. ప్రజల చైతన్యంతో ‘మన ఇల్లు- మన సరిసరాలు- మన సిటీ’ అనే తలంపు కలుగుతుందన్నారు. అప్పుడే ‘స్వచ్ఛ హైదరాబాద్’ సాధ్యమవుతుందని... విశ్వనగరంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారంనుంచి ఐదు రోజుల పాటు ‘స్వచ్ఛ హైదరాబాద్’ మహా క్రతువు ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.ఆ విశేషాలు... సాక్షి : వీధుల్లో చెత్త తొలగింపు సరే.. ఇళ్లు, కార్యాలయాల్లో చెత్త లేకుండా చేసేందుకు ఏం చేస్తున్నారు? కమిషనర్: వీధుల్లోనే కాకుండా విధులు నిర్వహించే కార్యాలయాలు, ఇళ్లు, పరిసరాల్లోనూ చెత్త లేకుండా చేయాలనేది లక్ష్యం. కార్యాలయాల్లో చెత్తను సిబ్బంది, కార్మికులు తొలగిస్తారు. ఇళ్లకు సంబంధించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాల్సిందిగా గృహిణులకు అవగాహన కల్పించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉంటే సగం సమస్య సమసిపోయినట్లే. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం. సాక్షి : నగరంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ. ప్లాస్టిక్ క్యారీబ్యాగులతో ఎన్నో అనర్థాలు పొంచి ఉన్నాయి. ఈ-వేస్ట్, బయో మెడికల్ వేస్ట్, ఇతర వ్యర్ధాలను నిరోధించ కుండా.. వాటిపై అవగాహన కల్పించకుండా... చెత్త ఎంత తొలగించినా ప్రయోజనం ఉంటుందా? కమిషనర్: అన్నీ ఒకేసారి సాధ్యం కావు. మలిదశలో వీటిపై దృష్టి సారిస్తాం. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వాడరాదని కోర్టు ఆదేశాలు, నిబంధనలు ఉన్నాయి. గ్రేటర్ వ్యర్థాల్లో చెత్త తొలి శత్రువు. ప్రస్తుతం దీనిపైనే పోరాటం. దీన్ని అంతం చేస్తూనే మిగతా వ్యర్థాలపైనా అవగాహన కల్పిస్తాం. తర్వాత ప్లాస్టిక్ తొలగింపు చర్యలు చేపడతాం. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలకు వెనుకాడం. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా తమ వద్దకు వచ్చే వీవీఐపీలకు ప్రజలు సూచనలు, సలహాలు తెలియజేస్తారు. రోజువారీ నివేదికలొస్తాయి. మంచి సలహాలు, సూచనలు కార్యరూపంలో పెడతాం. సాక్షి : ఈ నెల 16 నుంచి 20 వరకు వీవీఐపీలందరూ పాల్గొంటున్నందున ‘స్వచ్ఛ హైదరాబాద్’ బాగానే సాగుతుంది. ఆ తర్వాత మాటేమిటి? కమిషనర్: ఇంతటితోనే ఈ కార్యక్రమం ఆగిపోదు. ఇది అవగాహనకు బాగా ఉపకరిస్తుంది. చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాల్లో అందుకు కారణాలేమిటో తెలుస్తుంది. దానిపై దృష్టి సారిస్తాం. పరిష్కారాలు ఆలోచించి అమలు చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తాం. ప్రజల్లో అవగాహన వస్తే సమస్య ఉండదు. దానిని సాధించాలి. ఇల్లు లాగే బస్తీ, కాలనీ అన్నీ ‘మనవి’ అనుకునే స్థితికి ప్రజలంతా రావాలి. అవగాహనతో పాటు.. ఆచరణలో దానిని చూపే వారికి ప్రోత్సాహకాలిస్తాం. ఈ దిశగా ఆలోచిస్తున్నాం. పరిశుభ్ర, స్వచ్ఛ కాలనీలకూ ప్రోత్సాహకాలిస్తాం. సాక్షి : ‘స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్’లో పాల్గొనే సైనికులెందరు? కమిషనర్: అధికారులు, సిబ్బంది నేరుగా 36 వేల మంది ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. వీరితో పాటు స్థానికులు, స్వచ్ఛంద సంస్థల వారు దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భాగస్వాములు కానున్నారు. సాక్షి : తడి,పొడి చెత్తను వేరుగా వేసేందుకు గృహస్థులందరికీ రెండు రకాలైన డబ్బాలను అందిస్తున్నారా? కమిషనర్: ఇప్పుడే కాదు. అందుకు సమయం పడుతుంది. ఇప్పుడు వాటిని అందజేయలేం. ఆ దిశగా ఆలోచిస్తాం. కానీ ప్రజలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన ఇంటిని మనమే శుభ్రపరచుకోవాలనేస్పృహ రావాలి. దీనికి ‘స్వచ్ఛ హైదరాబాద్’ వేదిక అవుతుందనే విశ్వాసం ఉంది. అందుకే ఇప్పుడీ కార్యక్రమం చేపట్టాం. సాక్షి : ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడైనా జరిగిందా? కమిషనర్: ఇంతవరకు లేదు. ఇదే ప్రథమం. 400 మందికి పైగా రాజకీయ ప్రముఖులు, అఖిల భారత స్థాయి అధికారులు, ఇతరులు ప్రజలతో మమేకమై, వారితో కలిసి పనిచేసే అద్భుత దృశ్యం ఇంతకు ముందెప్పుడూ లేదు. ఇదే ప్రథమం. ఈ కార్యక్రమం ఇతరులకూ ఆదర్శప్రాయంగా మారనుంది. -
అధికారమే అ‘జెండా’!
జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్కారు దృష్టి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధం అధికారుల ఉరుకులు.. పరుగులు కాలనీ సంఘాలకు పనులు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలకు దాదాపు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 15లోగా ఎన్నికలు నిర్వహించాలన్న న్యాయస్థానం ఆదేశాలు... టీఆర్ఎస్ ప్రభుత్వంలో కదలిక తెచ్చాయి. గ్రేటర్‌పై తమ జెండా ఎగురవేయాలన్న అజెండాతో అధికార పార్టీ ముందుకెళుతోంది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా బస్తీలు... కాలనీల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఓ వైపు విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాల అమలుకు.. మరోవైపు అభివృద్ధి పనులకు రంగం సిద్ధం చేసింది. వాటిపై దృష్టి సారించాల్సిందిగా నగరానికి చెందిన మంత్రులకు అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై వారు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అభివృద్ధి పనులను స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, స్లమ్స్ డెవలప్మెంట్ సొసైటీలకే ఇవ్వాలని నిర్ణయించారు. వీటిని ఎలా అమలు చేయాలి.. ఎంతమొత్తంలోని పనులను స్థానిక సంఘాలకు ఇవ్వాలి.. ఎంత గడువివ్వాలి? బిల్లుల చెల్లింపు విధానం తదితరమైనవి వీలైనంత త్వరగా ఖరారు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ మంగళవారం అధికారులకు సూచించారు. నివేదికల ఆధారంగా... మరోవైపు అభివృద్ధి పనులు చేయడానికి ఆసక్తి కనబరిచే కాలనీ సంక్షేమ సంఘాల వివరాలు... వాటికి రిజిస్ట్రేషన్లు ఉన్నదీ..లేనిదీ... బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు తదితరమైనవి సేకరిస్తారు. అర్హతలున్న సంఘాలకు పనులను మౌలిక సదుపాయాలపై దృష్టి.. జనాభా ప్రాతిపదికన.. స్థానిక అవసరాల దృష్ట్యా పనులు వర్గీక రించాలని నిర్ణయించారు. ఇందులో భాగ ంగా అన్ని సర్కిళ్లలో 1000 లోపు జనాభా ఉన్న కాలనీ/బస్తీలను, 1000-2500 జనాభా ఉన్న ప్రాంతాలను... అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్నవాటిని గుర్తిస్తారు. వీటిలో తక్కువ మౌలిక సదుపాయాలు ఉన్నవి.. ఫర్వాలేదనే స్థాయిలో ఉన్నవి... బాగున్నవి గుర్తిస్తారు. తక్కువ సదుపాయాలున్న వాటికి ప్రథమ ప్రాధాన్యమిస్తారు. ఇందులో భాగంగా సీసీరోడ్లు, బీటీరోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు.. ఇలా అంశాల వారీగా సమస్యలు గుర్తించి నివేదికలు రూపొందిస్తారు. ఇదీ ‘సంక్షేమ’ స్వరూపం ►స్వయం సహాయక బృందాలకు రూ.1000 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ అందజే సేందుకు చర్యలు ప్రారంభించారు. రోజువారీ నివేదిక లు అందజేయాల్సిందిగా ఆదేశించారు. ►పేదల బస్తీలు, ఇతర ప్రాంతాల్లో 1500 నీటి శుద్ధి కేంద్రాలు (ఆర్ఓప్లాంట్లు) ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ►{yైవర్ కమ్ ఓనర్ పథకాన్ని 5వేల మందికి వర్తింపజేయాలని భావిస్తున్నారు. ►మరో ఐదువేల మంది నిరుద్యోగులను గుర్తించి... వారికి స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా పోలీసు ఉద్యోగాల వంటి వాటికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ►వివిధ కాలనీలు, బస్తీల్లో 1000 ఈ-లైబ్రరీలు. వీటిలో దినపత్రికలు, మ్యాగజైన్లే కాక, రెండేసి కంప్యూటర్లు ఉంటాయి. ఆన్లైన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ►డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రతి నియోజకవర్గంలో రెండేసి స్లమ్‌ల (మొత్తం 48 స్లమ్స్‌లో) ఎంపిక. ►యువత కోసం వెయ్యి జిమ్‌ల ఏర్పాటు. వాటిని వారే నిర్వహించుకునేలా అవకాశం. ►మరో వెయ్యి వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టుల నిర్మాణానికి చర్యలు. ►{పతి సర్కిల్లోనూ ఒక దోబీఘాట్‌ను సకల వసతులతో అభివృద్ధి చేస్తారు. ►177 శ్మశాన వాటికల్లో విస్తృతంగా మొక్కలు నాటి... హరిత వనాలుగా తీర్చిదిద్దనున్నారు. ►రూ. 5 భోజన కేంద్రాలు 50కి పెంపు. ►వీటిలో వీలైనన్ని కార్యక్రమాలను వంద రోజుల్లో చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ►మరోవైపు పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణకు నగరాన్ని 330 క్లస్టర్లుగా విభజించి... వాటి బాధ్యతలను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్‌సర్వీస్ అధికారులకు అప్పగించనున్నారు. ►ఇంకా.. వీలైనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకోవాలనేది సర్కారు లక్ష్యం. -
ఔను.. ఆయన ప్రేమలో పడ్డారు!
సోమేశ్ కుమార్... జీహెచ్ఎంసీ కమిషనర్‌గా 14 నెలలుగా నగర ప్రజలకు సుపరిచితులు. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్‌గా జీహెచ్ఎంసీ పాలక మండలి, స్టాండింగ్ కమిటీల బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. లక్ష్య సాధనలో భాగంగా తాను శ్రమిస్తూ... ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించే ఆయన సీరియస్ ఆఫీసర్‌గానే అందరికీ తెలుసు. ఇదంతా నాణేనికి ఒకవైపు అందరిలాగే ఆయనకూ హాబీలు... అలవాట్లు ఉన్నాయి. మరచిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మనసును మెలిపెట్టిన బాధాకర ఘటనలు ఉన్నాయి. పత్రికలు చదవడమే కాదు...పుస్తకాలు రాసే అభిరుచి ఉంది. ఆరోగ్యం కోసం నడకతో పాటు సమాజ క్షేమానికి ఉపకరించే మొక్కలపైనా మక్కువ ఉంది. సినిమాలు.. షికార్లు.. ఇతరత్రా సరదాలు ఉన్నాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ ప్రేమ కథ ఉంది. పెళ్లి దాకా వేచి చూసిన నిరీక్షణ ఉంది. ఇది నాణేనికి రెండోవైపు వ్యక్తిగత విషయాలతో పాటు ప్రజా జీవితానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకూ సమాధానాలిచ్చారు. తమ కుటుంబానికి చెందిన వివిధ అంశాలను తన సతీమణి డాక్టర్ జ్ఞాన్ ముద్రతో కలిసి ‘మార్నింగ్‌వాక్’లో సోమేశ్‌కుమార్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు.. ఈ ఆదివారం ప్రత్యేకం.. జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్‌కుమార్‌తో ‘మార్నింగ్ వాక్’ సిటీబ్యూరో: ప్రస్తుత డిజిటల్ రోజుల్లో ఏ దరఖాస్తు నింపాలన్నా ఫస్ట్ నేమ్, మిడిల్‌నేమ్, లాస్ట్నేమ్లు అవసరం. ఈ స్పెషలాఫీసర్‌కు మాత్రం ఫస్ట్ నేమ్ సోమేశ్... లాస్ట్ నేమ్ కుమార్. ఇంటి పేరు కనిపించదు. ప్రాథమిక విద్యలో ఉన్నంత కాలం పాఠశాల రిజిస్టర్లలో పేరుకు ముందు ఇంటి పేరు ఉన్నప్పటికీ. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ వచ్చేనాటికి పేరు మాత్రమే మిగిలింది. ఇంటి పేరు ఉంటే కులం, మతం వంటి వివరాలు తెలిసే వీలుంటుంది. అవేవీ అక్కరలేని సమానత్వమే కావాలనుకుంటున్న మిగతా విద్యార్థుల మాదిరిగానే ఇంటిపేరు లేకుండా పరీక్షల దరఖాస్తును నింపారు. సర్టిఫికెట్ అలాగే వచ్చింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. ఐఏఎస్ కల... తండ్రి డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేసే వారు. ఐఏఎస్‌లు సాధించిన వారు ఊళ్లోనే కాకుండా జిల్లాలో, రాష్ట్రంలో ప్రభావం చూపుతుండటంతో పెద్ద అధికారులైతే అలాంటి అవకాశం వస్తుందని సోమేశ్ కుమార్ భావించారు. చాలా మంది జీవితాలు మార్చేందుకు ఐఏఎస్ కావడమే మార్గమనుకున్నారు. దాన్ని పొందేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడయ్యారు. మొక్కలతో దోస్తీ చిన్నప్పటి నుంచీ మొక్కల పెంపకంపై సోమేశ్ కుమార్‌కు మక్కువ. కరువు జిల్లా అనంతపురం కలెక్టర్‌గా పని చేసినప్పుడు 60 ఎకరాల్లో చింతచెట్లు నాటించారు. పాడేరులో 40 వేల ఎకరాల్లో నాలుగు కోట్ల సిల్వర్ ఓక్ మొక్కల పెంపకం ఓ రికార్డు. వాటి నీడలో పెరిగే కాఫీ మొక్కలతో అక్కడి ప్రజలకు ఓ జీవనమార్గం చూపారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా గ్రీన్కర్టెన్లకు తెర తీశారు. రోడ్ల పక్కన ఫుట్‌ఫాత్‌లను ఆనుకుని ఉండే గోడలు కనిపించకుండా తీగల్లా పెరిగే మొక్కలు నాటడం.. ఫుట్‌పాత్‌లపై తక్కువ ఎత్తులోని మొక్కలతో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టారు. రాయడమంటే ఇష్టం... బాల్యం నుంచీ రాసే అల వాటు ఉంది. ఏడోతరగతిలో మోడల్ ప్రశ్నపత్రాలను రూపొందించి.. వా టికి సమాధానాలు కూడా చిన్న పేరాల్లా రాసి మిత్రులకు పంచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలంటీ భయపడే వారికి అవి ఉపయోగపడేవి. పెద్ద సమస్యలను సరళం చేయడం అలా అలవడింది. అదే ధోరణిలో జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను లెక్కింపును మూడు ముక్కలతో తేల్చిపారేశారు. నాయకత్వ లక్షణాలు.. ఢిల్లీ యూనివర్సిటీలో చదివే రోజుల్లో విద్యార్థి సంఘ నాయకునిగా ఉన్నారు. పీజీ సాయంత్రం తరగతుల విభాగానికి ఉపాధ్యక్షునిగా పని చేశారు. సినిమాలూ...నటులు సినిమాలంటే ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా నెలకు రెండు మూడు సినిమాలు చూస్తానంటారు.అంతకుముందు ఇంకా ఎక్కువే చూసేవారు. వారాంతాల్లో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లడం సంతోషాన్నిచ్చే చర్య. నచ్చిన సినిమాల్లో రెండు మూడు చెప్పమంటే చక్‌దే ఇండియా, బ్యాండ్‌బాజా భారత్, 3 ఇడియట్స్ .. అంటారు. నటుల్లో సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్‌ల నుంచి రవితేజ దాకా, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రాల నుంచి సోనాక్షిసిన్హా, విద్యాబాలన్‌ల దాకా వివిధ పేర్లు ప్రస్తావించారు. మరచిపోలేనిది: కుటుంబంతో కలసి సత్యసాయి వద్ద గడిపిన క్షణాలు. బాధ పడ్డ క్షణాలు.. ఐఏఎస్ కోసం రెండుసార్లు కష్టపడినా ఎంపిక కాలేదు. రెండోసారి అవకాశం ఒక్క అడుగు దూరంలోనే చేజారిపోయినప్పుడు.అనంతపురం జిల్లాలో పని చేసేటప్పుడు పల్స్‌పోలియో తరహాలో చిన్న పిల్లల్లో నట్టల నివారణకు 8 లక్షల డోసుల మందు వేశారు. జిల్లా మొత్తంలో ఒకరికి వాంతులయ్యాయి. మందు వల్లే జరిగిందనే వదంతులు కలచి వేశాయంటారు. నోరు లేని వారి కోసం.. డబ్బు, బలం ఉన్నవారు ఏదో ఒక విధంగా తమ పనులు చేసుకుంటారు. పేదలు, బలహీనులకు నోరు కూడా ఉండదు. న్యాయంగా అందాల్సిన పథకాలు దక్కకుండా పోతుంటాయి. అలాంటి వారిని దేవుడైనా ఆదుకోవాలి. ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. ప్రభుత్వంలో మనమంటూ ఒక హోదాలో ఉన్నప్పుడు అలాంటి వారికి ఉపకరించే పనులు చే యడం కనీస ధర్మమంటారు సోమేశ్‌కుమార్. ఈ వరుసలోదే డ్రైవర్ కమ్ ఓనర్ పథకం (డ్రైవర్లనే ఓనర్లుగా మార్చేందుకు బ్యాంకు రుణాలిప్పించే పథకం. )తొలిదశలో 105 మంది డ్రైవర్లు ఓనర్లయ్యారు. రెండో దశలో మరో 303 మందికి త్వరలోనే ఈ పథకం కింద కార్లు ఇవ్వనున్నారు. ప్రేమలో పడ్డారు.. ఐఏఎస్‌కు ఎంపిక కావడానికి ముందు అలహాబాద్‌లో సైంటిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు డాక్టర్ జ్ఞాన్ముద్రతో ప్రేమలో పడ్డారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. వారి మనసు మారేంత వరకూ వేచి ఉన్నారు. అలా ఒకటి కాదు...రెండు కాదు.. ఆరేడేళ్లు వేచి చూశారు. ప్రశ్న : స్పెషలాఫీసర్‌గా బాధ్యత మరింత పెరిగినట్లుంది..!? జ : అవును. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. జీహెచ్ఎంసీలో ఉదయం పని ప్రారంభిస్తే.. సాయంత్రానికే ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ దశలో స్పెషలాఫీసర్ కావడంతో బాధ్యత ఎన్నో రెట్లు పెరిగింది. ప్రశ్న : పెరిగిన బాధ్యతలతో ఏం చేయాలనుకుంటున్నారు? జ : పాలక మండలి లేదు. సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు మరోమారు చెప్పేందుకు వీలు లేకుండా నిర్ణీత వ్యవధిలో ఫిర్యాదులు వాటంతటవే పరిష్కారం కావాలనేది లక్ష్యం. అందుకు ప్రయత్నిస్తున్నాను. అవినీతి తగ్గాలి. ఇందుకు ప్రభుత్వ పెద్దల నుంచి రాజకీయ సంకల్పం కూడా ఉంది. రహదారులు బాగుండాలి. ఒక గమ్యం చేరేందుకు 20 నిమిషాలు పడుతుందనే అంచనా ఉంటే.. అందుకనుగుణంగా రహదారులు ఉండాలి. ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు. ఈ దిశగా ఆలోచిస్తున్నా. ప్రశ్న : టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి..? జ : ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా పని నేను చేస్తాను. బాధ్యతలు నిర్వర్తిస్తాను. ముఖ్యమంత్రి వద్దకు వివిధ సమీక్ష సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పెద్ద కార్పొరేషనే కాక... ఏ కార్యక్రమం చేయాల్సి వచ్చినా జీహెచ్ఎంసీ కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. సీఎం ఆలోచనల అమలుకు యత్నించాలి. ప్రజలకు ఆయన చెప్పినవి చేయాల్సి ఉంటుంది. అందుకు సమన్వయంతో పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పిన పనులూ చేయాలి. ఒక అధికారిగా వీరందరితో సమన్వయం అవసరం. దాన్ని మరోలా భావిస్తే ఏం చేయాలి? ప్రశ్న : మిమ్మల్ని చాలామంది మొండిఘటం అంటారు.. ? జ : నేను చెప్పేది..చేసేది ఒకటే. ఏదైనా నిజాయితీగా చేస్తాను. నన్ను విమర్శించే వారు సైతం నేను చేసేది కరక్టే అని ఒప్పుకుంటారు. అందువల్లే ఎవరేమనుకున్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనగలుగుతున్నాను. ప్రశ్న : ఉద్యోగులపై కోపం ప్రదర్శిస్తారని? జ : ఎవరి పనులు వారు చేయాలి. లక్షలాది ప్రజలకు సేవలందించాల్సిన జీహెచ్ఎంసీలో ఎన్నో బాధ్యతలుంటాయి. వివిధ ఒత్తిళ్లుంటాయి. ఒక్కరి నిర్లక్ష్యం ఎంతోమందిపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్‌గా చెబుతాను. కచ్చితంగా చేయమంటాను. ఒకసారి, రె ండుసార్లు చె ప్పిచూస్తాను. అయినా వినిపించుకోకుంటే.. ఏం చేయాలి ? వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలని చెబుతానే తప్ప ఇతరత్రా ఉండదు. తమ పనులు సరిగ్గా చేసేవారికి నాతో సమస్య ఉండదు. -
‘గ్రేటర్’లో అదనం
‘సర్వే’లో మరికొన్ని అంశాలు వెబ్సైట్లో నమూనా ఫారం భవనం వివరాలు.. పెంపుడు కుక్కల సమాచారమూ తెలపాల్సిందే నల్లా కనెక్షన్ వివరాలూ ఇవ్వాలి బీపీఎస్ కుటుంబాలు మరింత జాగ్రత్తగా ఉండాలి ‘సాక్షి’తో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న ఇంటింటి సర్వేలో భాగంగా గ్రేటర్ ప్రజలు అదనంగా మరికొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నగరంలో నెల కొన్న పరిస్థితుల దృష్ట్యా ఆస్తిపన్ను, నల్లా కనెక్షన్ వంటి అంశాలు సైతం తెలిసేందుకు వీలుగా గ్రేటర్ అధికారులు వాటిని పొందుపరుస్తున్నారు. తద్వారా అనుమతులు లేకుండా కట్టిన ఇళ్లు.. ఆస్తిపన్ను చెల్లించనివారు.. తదితర వివరాలు సైతం తెలియనున్నాయి. వీటితో పాటు నివాస గృహానికి అనుమతి పొంది, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల గుట్టూ రట్టు కానుంది. అక్రమాలకు కళ్లెం వేయడంతో పాటు నిజంగా అర్హులైన వారికి మరింత సమర్థంగా సంక్షేమ పథకాలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. త్వరలో సర్వే జరుగనున్న నేపథ్యంలో నగర ప్రజలు అందించాల్సిన అదనపు వివరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. జీహెచ్ఎంసీ ఏర్పాట్లు తదితర అంశాలను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెబ్సైట్లో సర్వే ఫారం సమగ్ర సర్వే ఫారంలో ఏయే అంశాలున్నాయి? వాటిలోని ప్రశ్నలకు సమాధానాలు ఎలా? అప్పటికప్పుడు అవసరమైన సమాచారం తెచ్చేదెలా? వంటి ప్రశ్నలు నగర ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు సర్వే ఫారాన్ని జీహెచ్ఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. దీంతో పాటు కరపత్రాల ద్వారానూ తగిన సమచారం అందిస్తామన్నారు. సర్వేపై ప్రజలకెలాంటి సందేహాలు ఉన్నా... నివృత్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కాల్ సెంటర్ ద్వారా సాయం సర్వే ప్రశ్నావళికి సంబంధించి ప్రజల సందేహా ల నివృత్తికి జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ సిబ్బం దికి అవసరమైన శిక్షణ ఇస్తామని కమిషనర్ చె ప్పారు. తద్వారా ప్రజల సందేహాలకు వారు సమాధానాలు చెబుతారన్నారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ 040-21 11 11 11కు ఫోన్‌చేసి ప్రజలు తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చునని చెప్పారు. ఇది అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. బీపీఎల్ కుటుంబాలూ.. తస్మాత్ జాగ్రత్త గ్రేటర్‌లోని బీపీఎల్ కుటుంబాల వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. లేని పక్షంలో ప్రభుత్వం భవిష్యత్‌లో ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. లేదా ప్రస్తుతం పొందుతున్న పథకాల నుంచి తొలగించే ప్రమాదం ఉంటుంది. అందుకే సరైన వివరాలు అందజేయాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా తమ వివరాలను అందజేయాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివన్నీ జిరాక్స్‌లు తీయించుకొని ఉండటం మేలు. వీటితో పాటు బ్యాంకు/పోస్టాఫీసు ఖాతాలు ఉంటే వాటి నెంబర్లు తెలియజేయాలి. గ్యాస్ కనెక్షన్లు, దీపం పథకం ప్రయోజనం తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంది. అంతేకాదు..భవిష్యత్‌లో జీహెచ్ఎంసీ తదితర ప్రభుత్వ విభాగాలు అమలు చేయబోయే సంక్షేమ పథకాలన్నింటికీ వీటితో పోల్చి చూస్తారు. ఎక్కడి వారు అక్కడే ఎక్కడ ఉంటున్న వారు అక్కడే తమ వివరాలు నమోదు చేయించాలి. ఉదాహరణకు నగరంలోఉండేవారు ఇక్కడే పేర్లు నమోదు చేయిస్తే.. భవిష్యత్‌లో అమలయ్యే సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు పొం దాలనుకునేవారు (ఇక్కడ తాత్కాలికంగా ఉంటున్నవారు) అక్కడే తమ వివరాలివ్వాలి. తద్వారా అక్కడ పథకాలు పొం దే వీలుంటుంది. నగరంలో ఉంటున్న తమకు గ్రామాల్లో భూములు ఉన్నాయంటున్న వారు..ఎక్కడ నివాసం ఉంటా రో..పథకాలను వినియోగించుకోవాలనుకుంటారోఅక్కడే వివరాలు అందజేయాలి. తప్పనిసరిగా విధులకు వెళ్లాల్సిన వారు.. ఇంట్లో ఉండటం వీలుపడని వారికి (ఆస్పత్రుల్లో చికిత్సలో ఉన్నవారు.. ఇంటర్వ్యూలకు ఇతర ప్రదేశాలకు వె ళ్లినవారు తదితరులు) సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తే ఫారంలోని ‘రిమార్కులు’ కాలమ్‌లో వాటిని పొందుపరుస్తారు. భార్య లేక భర్త నగరంలో ఉండి.. మిగతా వారు ఇతర ప్రదేశం(వేరే జిల్లా,గ్రామం)లో ఉంటే అక్కడే నమోదు చేయించుకుంటే మంచిదని కమిషనర్ తెలిపారు. నగరంలో తాత్కాలిక నివాసం ఉండేవారు వారి స్వగ్రామాల్లో వివరాలు నమోదు చేయిస్తేనే స్థానికంగా సంక్షేమ పథకాలకు అర్హులవుతారన్నారు. విదేశాల్లో ఉంటున్న వారికి సంబంధించిన సమాచారాన్ని కుటుంబీకులు తెలియజేయవచ్చు. గ్రేటర్ ప్రజలు అదనంగా పొందుపరచాల్సిన అంశాలివీ... 1. భవనం/ఇల్లు ఆస్తిపన్నుకు సంబంధించిన(పీటీఐఎన్) నెంబరు. 2. జలమండలి నుంచి నల్లా కనెక్షన్ ఉందా? ఉంటే క్యాన్ నెంబరు. 3. భవనంలో ఎన్ని అంతస్తులున్నాయి? 4. నివాస భవనమా.. వాణిజ్య భవనమా? 5. కొన్ని అంతస్తుల్లో నివాసాలుండి.. కొన్ని అంతస్తుల్లో వాణిజ్యం జరుగుతోందా? 6. కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల వివరాలు. -
సులువుగా గుర్తించొచ్చు
జీహెచ్ఎంసీ వాహనాలకు బోర్డులు వారంలో 4 రోజులు కూల్చివేతలు సాక్షి, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ వాహనాలకు ఇకపై బోర్డులు కనిపించబోతున్నాయి. ఇక్కడ చెత్త తరలింపునకే 500కు పైగా వాహనాలు ఉన్నాయి. మలేరియా నిర్మూలన, విపత్తుల నివారణ, టౌన్‌ప్లానింగ్... ఇలా వివిధ విభాగాల్లో వేయికి పైగా వాహనాలు ఉ న్నాయి. ఏవి ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు. వాటిని ఏఏ పనులకు వినియోగిస్తున్నారో తెలియదు. అధికారుల ప్రయాణాల కోసం అద్దెకు తీసుకున్న వాహనాలు సైతం ఏవి ఎక్కడ ఉంటున్నాయో తెలియదు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి చెందిన అన్ని వాహనాలపైనా అవి జీహెచ్ఎంసీవని తెలిసే విధంగా పెద్ద బోర్డులు అమర్చుతున్నారు. ఉదాహరణకు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఉపకరణాలు, సిబ్బంది ఉండే వాహనాలకు అది పారిశుద్ధ్య విభాగానికి చెందిన వాహనమని తెలిసేలా బోర్డులు అమర్చుతున్నారు. త్వరలో జీపీఎస్‌ను కూడా వినియోగించుకోనున్నారు. అంతేకాదు.. 24 గంటల పాటు పని చేసే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నెంబర్(040- 21 11 11 11)ను కూడా బోర్డుపై పేర్కొంటూ, ప్రజలు తమ ఫిర్యాదులు చేయవచ్చునని సూచిస్తున్నారు. దీనివల్ల చూడగానే అవి జీహెచ్ఎంసీ వాహనాలని, సంబంధిత విభాగానికి చెందినవని ప్రజలకు తెలుస్తాయని కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. అధికారులు వినియోగించే అద్దె వాహనాలపై కూడా (ప్రభుత్వ వాహనం తరహాలో) అది జీహెచ్ఎంసీ వాహనమని తెలిసేలా చిన్న అక్షరాలతో రాయనున్నారు. వివిధ విభాగాలతో సమన్వయం.. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు గ్రేటర్‌లోని వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కమిషనర్ చెప్పారు. ట్రాఫిక్, జలమండలి, విద్యుత్... ఇలా విభిన్నవిభాగాల సహకారం, సమన్వయంతోనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ట్రాఫిక్ పోలీసులు గుర్తించిన 142 నీటి నిల్వ ప్రాంతాల గురించి తమ ఇంజినీర్లకు వివరాలు అం దజేశామన్నారు. త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. దాదాపు 150 ప్రదేశాల్లో రహదారుల మరమ్మతుల విషయమై ట్రాఫిక్ విభాగం నుంచి వివరాలు అందాయని, వాటి మరమ్మతులూ చేస్తామన్నారు. నెల రోజుల గడువు గ్రేటర్లో ‘మన ఊరు- మన ప్రణాళిక’ అమలుకు ప్రభుత్వానికి నెల రోజుల గడువు కోరినట్లు సోమేశ్ కుమార్ తెలిపారు. గ్రేటర్లో మూడు జిల్లాలు ఉన్నందున ముగ్గురు అధికారులు ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. ముగ్గురూ సమన్వయంతో ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంది. వర్షాలు ప్రారంభమైనందు న తగిన సమయం తీసుకొని అవసరమైన విధి వి ధానాలు రూపొందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. నిరంతరం కూల్చివేతలు అక్రమ భవనాల కూల్చివేత నిరంతర ప్రక్రియ అని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఇందుకు తగిన ప్రణాళికను రూపొందించామన్నారు. వారంలో నాలుగు రోజుల పాటు కూల్చివేతలు జరుగుతాయి. మంగళ, బుధ, గురు, శని వారాల్లో కూల్చివేతలు కొనసాగిస్తామన్నారు. ఈ నాలుగు రోజుల్లో ప్రతి జోన్‌లోని ఏదో ఒక సర్కిల్లో కూల్చివేతలు ఉంటాయన్నారు. తమ దృష్టికి వచ్చిన అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇతర సమస్యలపై కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఎన్కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి అడ్వొకేట్ జనరల్ సూచన మేరకు వ్యవహరించనున్నట్లు కమిషనర్ చెప్పారు. నిబంధనల మేరకు తగుచర్యలు తీసుకోవచ్చునని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చట్టపరమైన వివాదాలు లేకుండా ఉండేందుకు ఆయన సలహా తీసుకుంటున్నామన్నారు. -
ప్రజల చేతికే...ప్రగతి చ్రక్రం
మీ కాలనీలో రోడ్డు బాగా లేదా..? కొత్త రోడ్డు వేయాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్నాయా.. ? నో ప్రాబ్లమ్. మీ బస్తీలో పిల్లల పుట్టిన రోజులు, చిన్న చిన్న ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాలు ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా ..? ఇకపై చింతించాల్సిన పని లేదు. మీ పరిసరాల్లో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. దానికో ప్రహరీ నిర్మిస్తే పిల్లలకు ఆట స్థలంగానో.. లేదా పార్కుగానో అభివృద్ధి చేయవచ్చుననుకుంటున్నారా..? మీరు చేయాలనుకుంటున్న పనికి సహకారం అందుతుంది. సాక్షి, సిటీబ్యూరో: కాలనీలు.. బస్తీల ప్రజలు తమకు ఏఏ సదుపాయాలు అవసరమని భావిస్తున్నారో వాటిని స్వయంగా వారే చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించబోతోంది. బస్తీ సంఘాలు.. కాలనీ అసోసియేషన్లు.. లేదా పదిమంది బృందంగా ఏర్పడి తమ అవసరాల కోసం తామే పనులు చేసుకుంటామంటే జీెహ చ్ఎంసీ అవకాశం కల్పించనుంది. ప్రజలకు ఉపయోగపడే పనులను వారి భాగస్వామ్యంతోనే చేయించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. దాదాపు రూ.10 నుంచి రూ.20 లక్షలకు మించని పనులను ఇలా ప్రజలకే ఇచ్చేందుకు సంబంధిత అధికారులు యోచిస్తున్నారు. తద్వారా ప్రజలకు అవసరమైన సదుపాయాలు సకాలంలో సమకూరడమే కాకుండా.. పనులు సత్వరం పూర్తవుతాయని భావిస్తున్నారు. అంతేకాదు.. తమ కోసం పనులు చేసుకుంటారు కాబట్టి నాణ్యతలోనూ ప్రజలు రాజీ పడబోరని భావిస్తున్నారు. వివిధ పనులకు సంబంధించి తగిన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే వారికి అంచనా వ్యయం, ఇతరత్రా అంశాలను లెక్కించి, జీహెచ్ఎంసీ అధికారులు 80 శాతం మేర నిధులు అందజేస్తారు. మిగతా 20 శాతం నిధులను పనులు పూర్తయ్యాక, క్వాలిటీ కంట్రోల్ పరీక్షల అనంతరం చెల్లిస్తారు. సాంకేతిక పదాల జోలికి పోకుండా, వీలైనంత మేరకు ప్రజలకు అర్థమయ్యే భాషలోనే అంచనాలు రూపొందిస్తారు. ఇలా ఏటా దాదాపు రూ.500 కోట్ల మేర పనులు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా 20-30 కాలనీల్లో రూ.10 కోట్ల మేర ఇలాంటి పనులను ప్రజలకు అప్పగించాలని భావిస్తున్నారు. త్వరలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందాక ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విలేకరులకు తెలిపారు. రెసిడె న్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు(ఆర్డబ్ల్యూఏలు) తాము చేయదలచుకున్న పనుల వివరాలతో ఆన్లైన్ ద్వారా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేయవచ్చు. అటు నిధుల సద్వినియోగం.. ఇటు అభివృద్ధి జీహెచ్ఎంసీకి దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఉంది. కానీ అందులో సగం నిధులు కూడా ఖర్చు కావడం లేదు. సాధారణంగా ఎక్కువ చోట్ల నిధుల లేమి సమస్య ఎదురవుతుంది. జీహెచ్ఎంసీలో పరిస్థితి దీనికి భిన్నం. అందుకు కారణాలనేకం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీహ చ్ఎంసీ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు చేస్తున్న పనులను అలా కొనసాగిస్తూనే.. తక్కువ మొత్తాల్లో పూర్తయ్యే పనులను స్థానికులకు, భారీ మొత్తాల్లో చేపట్టాల్సిన వాటిని పెద్ద కాంట్రాక్టు సంస్థలకు అప్పగించే యోచనలో ఉన్నారు. తద్వారా నిధులు వినియోగమై, ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో ఉండే రిటైర్డు ఇంజినీర్ల వంటి వారి సహకారంతో పనులు నాణ్యతగా జరుగుతాయనేది అధికారుల అభిప్రాయం. ‘మన ఊరు-మన ప్రణాళిక’ తరహాలో నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ విధానం ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో స్థానికులకు భాగస్వామ్యం కల్పించినట్లూ అవుతుందని భావిస్తున్నారు. పెద్ద పెద్ద పనులకు (రూ.100- రూ.200 కోట్ల వరకు) అంతర్జాతీయ సంస్థలు పాల్గొనేలా టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. -
‘మెట్రోపోలీస్’ ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో: వచ్చే అక్టోబర్‌లో జరుగనున్న మెట్రోపోలీస్ సదస్సును పురస్కరించుకొని 150 కిలోమీటర్ల మేర రహదారి మార్గాలను అభివృద్ధి పరచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. సదరు మార్గాల్లో చేపట్టాల్సిన పనుల గురించి ప్రతిపాదనలందజేయాల్సిందిగా హెచ్ఎంఆర్, ఆర్అండ్బీ, ఎన్‌హెచ్ అధికారులకు సూచించారు. మెట్రోపోలీస్ సదస్సు ఏర్పాట్లపై గురువారం జీహెచ్ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు పర్యటించే పర్యాటకప్రదేశాలు, షాపింగ్ ప్రాంతాలు, సదస్సు వేదిక తదితర ప్రాంతాలతో సహా 150 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులను పొందేందుకు ఈనెల 6లోగా ప్రతిపాదనలందజేయాలన్నారు. సెప్టెంబర్ 15లోగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు డిఫెక్ట్ లయబిలిటీ వర్తిస్తుందని చెప్పారు. సీఓపీ సదస్సు సందర్భంగా చేపట్టిన పనుల్ని పునరుద్ధరించడంతోపాటు 125 కి.మీ. మేర రహదారి మార్గాలను సీజనల్ ఫ్లవర్స్ మొక్కలతో తీర్చిదిద్దాలని సూచించారు. జూబ్లీహిల్స్ రోడ్డునెం.36 పై శ్రద్ధ వహించాల్సిందిగా హెచ్ఎంఆర్ అధికారులను కోరారు. చారిత్రక ప్రదేశాల్లో రంగులు మారే ప్రత్యేక వీధిదీపాలు ఏర్పాటు చేయాలని టూరిజం అధికారులకు ఆదేశించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ కమిషనర్ రోనాల్డ్‌రాస్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీలోని స్థానికేతరులు స్వస్థలాలకు వెళ్లాలి
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లతో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న తెలంగాణేతర ఉద్యోగులందరినీ వారి వారి ప్రాంతాలకు పంపించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు జి. దేవిప్రసాద్, సి. విఠల్, కారం రవీందర్‌రెడ్డి, తిప్పర్తి యాదయ్య తదితరులు మాట్లాడారు. జీహెచ్ఎంసీతోపాటు తెలంగాణలోని ఇతర మునిసిపాలిటీల్లో పనిచేస్తున్నవారిని కూడా ఎలాంటి ఆప్షన్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమించాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇక్కడ ఉద్యోగాల్లో చేరినవారు కూడా వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. అపాయింటెడ్ డే (జూన్2)కు ముందుగానే ఇక్కడి ఉద్యోగులంతా వారి మాతృసంస్థలకు వెళ్లిపోవాలని సూచించారు. వారంతా వెళ్లిపోయాక మిగిలే ఖాళీలను స్థానికులైన నిరుద్యోగ యువతతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు చెత్త నిర్వహణ పనులకు రాంకీకి అప్పగించరాదని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక తగిన నిర్ణయం తీసుకోగలదన్నారు. సమావేశానంతరం ఇవే డిమాండ్లతో రూపొందించిన వినతిపత్రాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు అందజేశారు. -
ఎప్పటికప్పుడు తెరపై ఫలితం
సాక్షి, సిటీబ్యూరో: ఈసారి కౌంటింగ్‌కు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం తోడు కానుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో రౌండ్ల వారీగా, టేబుళ్ల వారీగా ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతుంది. కావాలనుకుంటే ఈ వివరాల ప్రింట్ కాపీని కూడా పొందవచ్చు. ఈవీఎంలకు అనుసంధానిస్తున్న ‘ప్రింటర్ కమ్ ఆగ్జిలరీ డిస్ప్లే యూనిట్ (పాడు)’ ద్వారా ఈవీఎంలలోని ఓట్ల వివరాలను ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతాయి. ఓట్లను లెక్కించే అధికారులతోపాటు ఎన్నికల పరిశీలకులు, రాజకీయపార్టీల ఏజెంట్లు ‘పాడు’ డిస్ప్లే ద్వారా ఎప్పటికప్పుడు కౌంటింగ్ తీరును.. ఓట్ల వివరాలను చూడవచ్చు. ఈ వివరాలకు సంబంధించిన కాపీ కావాలంటే ప్రింటర్‌ను అనుసంధానించి పొందవచ్చు. గతంలో ఈ విధానం లేదు. ఈసారి కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ విధానం గురించి పోటీ చేసిన అభ్యర్థులందరికీ తెలియజేయాల్సిందిగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అందుకుగాను ఈ నెల 14న పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించాల్సిందిగా రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కమిషనర్ సోమేశ్‌కుమార్ రిటర్నింగ్ అధికారులతో జీహెచ్ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 211 టేబుళ్లు.. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 211 టేబుళ్లు వెరసి మొత్తం 422 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నందున ఒక్కో టేబుల్‌కు ఒక్కో యూనిట్ వంతున 422 ‘పాడు’ యూనిట్లు అవసరమన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక అబ్జర్వర్ ఉంటారని, ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించడంతోపాటు ప్రతి రౌండ్ ఫలితాన్ని ప్రకటిస్తారన్నారు. ప్రతి రౌండ్ ఫలితంపై అబ్జర్వర్ సంతకం చేస్తారని, రిటర్నింగ్ అధికారులు ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు. ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల అబ్జర్వర్లకు ప్రత్యేక రూమ్ కేటాయించడంతోపాటు ఎప్పటికప్పుడు ఎన్నికల సరళి.. రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు తెలియజేసేందుకు మీడియాసెంటర్ ఏర్పాటు చేయాలని సోమేశ్‌కుమార్ సూచించారు. 16న కౌంటింగ్ జరుగనున్నందున 15వ తేదీ మధ్యాహ్నం కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని, అదే సమావేశంలో వారికి గుర్తింపు కార్డులు అందజేయాలని ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి 8.30 నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదన్నారు. అప్పటిలోగా పోస్టల్‌బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాని పక్షంలో వాటిని రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్దకు పంపించాలని సూచించారు. ఏజెంట్లు బయటకు వెళ్తే తిరిగి రానీయరు కౌంటింగ్‌కు హాజరయ్యే రాజకీయ పార్టీల ఏజెంట్లు లోనికి ప్రవేశించాక బయటకు వెళ్తే తిరిగి లోనికి రానీయరని సోమేశ్‌కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోనే క్యాంటీన్ ఏర్పాట్లు చేయాలి తప్ప ఎవరినీ ఆహార పదార్థాలు లోనికి తేనీయవద్దని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కౌంటింగ్ రోజున అభ్యర్థుల సమక్షంలో ఉదయం 6.30 గంటలకే స్ట్రాంగ్‌రూమ్‌లు తెరవాలన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం దాదాపు రెండు వేల మంది విధులు నిర్వహించనున్నారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు వంతున (కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు కేంద్రం నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్) 1266 మంది, ఇతరత్రా అధికారులు, సిబ్బంది వెరసి మరో 600 మంది, రిజర్వులో దాదాపు 200 మంది వెరసి దాదాపు 2066 మంది విధుల్లో పాల్గొననున్నారు. -
త్వరలో నైట్‌షెల్టర్ల ఏర్పాటు
సాక్షి, సిటీబ్యూరో : ఎముకలు కొరికే చలి రాత్రుల్లో నిరాశ్రయుల దుస్థితిని వెల్లడిస్తూ.. అలాంటి వారికోసం నైట్‌షెల్టర్ల అవసరాన్ని తెలియజేస్తూ శుక్రవారం ‘చలిపంజా’ శీర్షికన ‘సాక్షి’ వెలువరించిన కథనానికి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పందించారు. ఆశ్రయం లేక.. రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్న ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఉంటున్నారో గుర్తించి వివరాలు అందజేయాల్సిందిగా కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు. నైట్‌షెల్టర్లు అవసరమైన ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవనాలు అందుబాటులో ఉన్నట్లయితే ఏర్పాట్లకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో భవనాలను గుర్తించడమో.. నిర్మించేందుకు అవకాశాలున్నాయేమో పరిశీలించాలన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, అదనపు కమిషనర్ (యూసీడీ) కెన్నడీతో కలిసి శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని సందర్శించారు. రాత్రి వేళలో రోగి సహాయకులు నిద్రించేందుకు అవసరమైన షెల్టర్ నిర్మాణం గురించి ఆస్పత్రి సీఈఓ ఆర్పీ సింగ్‌తో ఆయన చర్చించారు. షెల్టర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ అవసరమైన అనుమతులు ఇవ్వడం లేదని సింగ్.. కమిషనర్ దృష్టికి తెచ్చారు. తమ తరపున అవసరమైన సహాయం అందిస్తామని సోమేశ్‌కుమార్ హామీనిచ్చారు. అనంతరం ఆయన రోగులు, వారి సహాయకులతో సాధకబాధకాలపై చర్చించారు. అదే విధంగా మిగతా ఆస్పత్రుల వద్ద రోగి సహాయకులు, ఇతరత్రా నిరాశ్రయులు తలదాచుకునేందుకు, రాత్రి వేళల్లో సౌకర్యవంతంగా నిద్రించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కెన్నడీని సోమేశ్‌కుమార్ ఆదేశించారు. కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు నగరంలో నైట్‌షెల్టర్లు లేని వైనంపై వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, కార్పొరేటర్ సురేష్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు హరిగౌడ్ తదితరులు శుక్రవారం కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను కలిసి.. తలదాచుకునే చోటు లేని అభాగ్యుల కోసం వెంటనే వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్, వీలైనంత త్వరితంగా.. వీలైనన్ని ప్రాంతాల్లో నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దుప్పట్లు పంపిణీ చేసిన వైఎస్సార్సీపీ ఐటీవింగ్ రాత్రివేళల్లో చలికి వణికిపోతున్న అభాగ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీవిభాగం ఆపన్నహస్తం అందించింది. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘చలిపంజా’ కథనానికి చలించి బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఉన్న వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డితో పాటు హర్షవర్ధన్, సురేంద్ర, రాకేష్, మహేష్, శంకర్, ప్రసాద్, చంద్ర, ఆదిత్య, అరవింద్‌లు ఉన్నారు. -
జీహెచ్ఎంసీ పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోంది
సాక్షి, సిటీబ్యూరో : నగరాన్ని క్లీన్‌గా ఉంచాల్సిన జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అవినీతి కంపు కొడుతోంది. ఈ విభాగంలో నిధుల దుబారా అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోంది. వ్యవస్థను సరిదిద్దడంలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తాజాగా ‘స్పెషల్ ఆఫీసర్ల’ను నియమించారు. ఈ స్పెషల్ ఆఫీసర్లు తమకప్పగించిన సర్కిల్లో ప్రతి రోజూ క్షేత్రస్థాయి తనిఖీలు చేయడంతో పాటు కార్మికుల హాజరునూ, విధుల్లో ఉన్న వారి వివరాలనూ పరిశీలించాల్సి ఉంది. దాంతోపాటు రోడ్లను ఊడ్చిందీ లేనిదీ పర్యవేక్షించడం.. చెత్త డబ్బాలనుంచి చెత్తను ఎప్పటికప్పుడు తరలించే పనులు సవ్యంగా జరిగేలా చూడాలి. ఈ విధానం వల్ల పరిస్థితిలో మార్పు రాగలదని అంచనా వేస్తున్నారు. కానీ.. గతంలోనూ ఇలాంటి ప్రయోగాలు చాలానే జరిగాయి. జీహెచ్ఎంసీ స్వీపింగ్ యూనిట్లలో ఉండాల్సినంతమంది కార్మికులు లేకుండానే నిధులు భోంచేస్తున్నారనే కారణంతో గతంలో ఉన్న కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేశారు. పనిచేసే కార్మికుల పేరిటే కొత్త యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. బినామీ కార్మికులను అరికట్టేందుకు ఓఎస్సార్టీ.. బయోమెట్రిక్ హాజరు.. తదితరమైనవెన్నో ప్రవేశపెట్టారు. కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేసినందున.. గ్రూపులుగా ఏర్పాటైన కార్మికులకే వేతనాలను నేరుగా బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తున్నామన్నారు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగంలో నిధుల స్వీపింగ్ ఆగలేదు. కాంట్రాక్టర్లు పోయినా కాంట్రాక్టర్ల మనుషులే గ్రూపులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలో వేతనాలు నేరుగా వేస్తున్నా ఏటీఎం కార్డులు కాంట్రాక్టర్ల మనుషుల వద్దే ఉంటున్నాయి. 18 మంది నుంచి గ్రూపు సభ్యులను ఏడుగిరికి తగ్గించినా.. విధులకు డుమ్మాలు.. విధుల్లో లేనివారికి వేతనాలందడం జరుగుతూనే ఉంది. 18 మంది కార్మికులున్నప్పుడు నలుగురైదుగురు డుమ్మాలు కొడితే ప్రస్తుతం ఒకరిద్దరు విధుల్లో ఉండటం లేదు. అంతేకాదు గతంలోనూ రాత్రివేళల్లో పారిశుధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతల్ని సర్కిళ్ల వారీగా ఉన్నతాధికారులకు అప్పగించారు. కొద్దిరోజుల పాటు ఫలితమిచ్చిన ఆ ప్రయోగం.. అనంతరం మరుగున పడింది. పారిశుధ్య కార్మికుల హాజరు.. రోడ్లను ఊడ్చినట్లుగా స్థానిక కార్పొరేటర్ల నుంచి సంతకాలు తీసుకునే విధానం ఉంది. అయినప్పటికీ దుబారా ఆగలేదు. చె త్త తరలింపు పనులకు అదనపు వాహనాలు అద్దెకు తీసుకున్నా.. వాటివల్ల జీహెచ్ఎంసీలోని కొందరికి ప్రయోజనం కలిగిందే తప్ప.. పనుల్లో పెద్ద తేడా కనిపించలేదు. స్వీపింగ్ యూనిట్లు.. బోగస్‌లు.. తదితర వ్యవహారాల్లో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు కార్మిక నేతల నుంచి ఉన్నతాధికారుల వరకు ఁఅవినాభావ సంబంధాలురూ. ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ ఏ మేరకు ఫలితమిస్తుందో వేచి చూడాల్సిందే. ఫలితమివ్వని జరిమానాలు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండేందుకు రహదారులపై చెత్త వేస్తే జరిమానాలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వందరోజల ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు.. కార్పొరేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే జీహెచ్ఎంసీలో ఈ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. అయినప్పటికీ ప్రజల్లో మార్పు కనిపించలేదు. అధికారులు తనిఖీలు చేసిన సందర్భాల్లో రోడ్లపై చెత్తను గుర్తించి.. వాటిని వేసిన వారికి విధించిన జరిమానాలు సైతం తక్కువేమీ లేవు. 2012 జనవరి నుంచి ఇప్పటి వరకు ఇలా వసూలు చేసిన జరిమానా రూ. 1,20,32,342. అయినా రోడ్లపై చెత్త వేసేవారు వేస్తూనే ఉన్నారు. రహదారులు అపరిశుభ్రతతో అల్లాడుతూనే ఉన్నాయి. -
మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ
= స్త్రీలపై అఘాయిత్యాలను అరికట్టేందుకే.. = జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడి సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని నిరుద్యోగ మహిళ లకు డ్రైవింగ్‌లో, సెక్యూరిటీగార్డులుగా శిక్షణనిస్తామని, శిక్షణ పొందిన వారిలో 200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇందుకుగాను ఎన్జీఓలతో కలిసి డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభివృది ్ధపనులపై గురువారం మేయర్, కమిషనర్ ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్యాబ్స్‌లో వెళ్తున్న మహిళలపై అభయ తరహా ఘటనలు జరగుతున్నందున, మహిళాడ్రైవర్లే ఉంటే ఇలాంటివి కొంతమేర నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు. బ్యాంకు లింకేజీలు, దీపం, బంగారు తల్లి, వడ్డీలేని రుణం, అభయహస్తం తదితర కార్యక్రమాలపై మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ/ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన పనులను త్వరిత గతిన పూర్తిచేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. విద్యుత్ బల్బుల్ని బయట అమ్ముకోకుండా ఉండేందుకు వాటిపై జీహెచ్ఎంసీ లోగోను ముద్రించాల్సిందిగా సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో టైమర్ల ఏర్పాటు కోసం టెండ ర్లు ఆహ్వానించాల్సిందిగా సూచించారు. వెటర్నరీ ఆస్పత్రిని అభివృద్ధి చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ సూచించారు. హెచ్ఎంఆర్కు అప్పగించిన మొఘల్సరాయిని జీహెచ్ఎంసీకి తిరిగి అప్పగించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా ఫ్లోర్‌లీడర్లు కమిషనర్‌ను కోరారు. ఇంకా, తమ గౌరవ వేతనాల్ని పెంచాల్సిందిగా కోరారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో... అంతకు ముందు జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయా పనులకు బడ్జెట్లో కేటాయించిన నిధుల కంటే అదనపు నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. క్యాపిటల్ పనులకు 400 శాతం, రెవెన్యూ పనులకు 300 శాతం అదనంగా కేటాయించేందుకు అంగీకరించారు. శ్మశానవాటికల అభివృద్ధికి కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. నవయుగ సెజ్ నుంచి చందానగర్ రైల్వేస్టేషన్ వరకు రోడ్డు అభివృద్ధికి రూ. 8.25 కోట్లు మంజూరుకు ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోడ్డు వల్ల ఎక్కువమందికి ప్రయోజనం ఉండదని అడ్డుకున్నారు. పాతబస్తీలో ఎక్కువమందికి అవసరమైన పనులెన్నో ఉన్నాయన్నారు. దీంతో, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యుల మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. -
నగర పంచాయతీలకు పచ్చజెండా
=ఈలోగా మరమ్మతులు పూర్తి =టౌన్‌ప్లానింగ్ ఫిర్యాదులపై అదాలత్‌లు =ప్రజల ముందుకు పనుల వివరాలు =వరల్డ్‌క్లాస్ సిటీగా నగరం =‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో: ఆర్నెళ్లలో నగరంలోని రహదారుల రూపురేఖలు మారుస్తానని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. అప్పటి దాకా ఇబ్బందుల్లేని ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తూ రోడ్ల నిర్వహణ చూస్తామని తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ‘అదాలత్’లు నిర్వహిస్తామన్నారు. ప్రారంభించిన పనుల్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేసేందుకు శ్రద్ధ చూపుతానన్నారు. చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. పేదల ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యమిస్తానన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా గత వారం బాధ్యతలు చేపట్టిన సోమేశ్‌కుమార్ శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.. సాక్షి: రోడ్డెక్కితే ప్రజలు జీహెచ్ఎంసీని తిట్టుకుంటున్నారు. అధ్వానపు రోడ్లతో అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కమిషనర్: తరచూ దెబ్బతింటున్న రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్న మాట వాస్తవమే. రోడ్ల మెరుగుకు, ప్రజల ఇబ్బందులు తొలగిం చేందుకు మూడంచెల వ్యూహం అమలు చేస్తా. ఈనెల 10లోగా పాట్‌హోల్స్ మరమ్మతుల్ని, ఆపై రోడ్లు దెబ్బతిన్న ప్రాం తాల్లో ప్యాచ్‌వర్క్స్ పూర్తిచేస్తాం. తద్వారా ట్రాఫిక్ జామ్స్ తగ్గుతాయి. ఆరు నెలల్లోగా రీకార్పెటింగ్ ఇత ర పనులు పూర్తిచేస్తాం. అవసరమైన చోట కొత్త రోడ్లు వేస్తాం. రోడ్లు తరచూ పాడయ్యే ప్రాంతాల్లో సమస్యలు గుర్తించి పరిష్కరిస్తాం. వర్షానికి బీటీ త్వరగా పాడవుతున్నం దున ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేస్తాం. ట్రాఫిక్ దృష్ట్యా ఇది సాధ్యం కాకుంటే ఇంటర్‌లాకింగ్ సిస్టంతో పనులుచేస్తాం. నీటినిల్వ, డ్రైనేజీ పొంగిపొర్లడం వంటివి నిరోధిస్తాం. ఆరు నెలల్లోగా ఇవన్నీ పూర్తిచేసి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి: పనుల్లో జాప్యానికి, అవినీతికి ‘జీహెచ్ఎంసీ’ పర్యాయపదంగా మారిందనే ప్రచా రం ఉంది. ఈ అపప్రద ఎలా తొలగిస్తారు? కమిషనర్: అవినీతి, జాప్యం.. రెండింటికీ అంతర్గత సంబంధం ఉంది. జాప్యాన్ని నివారిస్తే అవినీతి అంతమవుతుంది. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంపై ఆరోపణలెక్కువ ఉన్నాయి. వాటిని అరికట్టేందుకు ఫైళ్ల పరిష్కారానికి సరళీకరణ విధానాలు చేపడతాం. నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారమయ్యేలా సిటిజెన్ చార్టర్‌ను అమలు చేస్తాం. 300 గజాల్లోపు ఇళ్లు కట్టుకునే వారి నుంచి బిల్డర్ల వరకు రెడ్టేపిజం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు దృష్టికొచ్చింది. రెండునెలల్లోగా ఫైలు పరిష్కారం కాకుంటే నేరుగా నా వద్దకే రావచ్చు. ఈ విభాగంలోని ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ‘అదాలత్’లు నిర్వహిస్తాం. ఫిర్యాదుల్ని వారంలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా. అనుమతి నిరాకరించే పక్షంలో లిఖితపూర్వకంగా చెబుతాం. సాక్షి: ఎప్పుడో గడువు ముగిసిపోయిన బీపీఎస్ ఫైళ్లే ఇంకా క్లియర్ కాలే దు? కమిషనర్: బీపీఎస్ ఫైళ్ల పరిష్కారానికి జోన్ల వారీగా మేళాలు ఏర్పాటు చేస్తాం. వాటికి నే నూ హాజరవుతా. మేళాల అనంతరం ఐదు రోజుల్లోగా ఫైళ్లన్నీ క్లియర్ చేయాలనేది ఆలోచన. సాక్షి: ఏటా వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు.. పనులు మాత్రం ముందుకు కదలవు. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారు? కమిషనర్: చేపట్టే ప్రతి పని నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. పనుల వివరాలు స్థానికులు, ప్రజాప్రతినిధులకు తెలిసేలా అంచనా వివరాలతో సహా బోర్డులు ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు పూర్తిచేయాల్సిందీ పేర్కొంటాం. తద్వారా ‘లక్ష్యం’ కళ్లముందు కనిపిస్తుంది. స్థానిక కార్పొరేటర్, అధికారులు, వివిధ సంఘాల నేతలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తాం. వారి సమన్వయంతో నిర్ణీత వ్యవధిలోగా పని పూర్తికి మార్గమేర్పడుతుంది. సం బంధిత జోనల్ కమిషనర్‌కు అజమాయిషీ బాధ్యతలప్పగిస్తాం. అడపాదడపా కమిషనర్ తనిఖీలు ఉంటాయి. సాక్షి: ఏటా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా చెత్త సమస్యలు తీరడం లేవు. దీనికి మీరు చేపే పరిష్కారం? కమిషనర్: పరిస్థితిని నేనింకా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏరోజు ఎంతమంది విధుల్లో ఉంటున్నారో, ఎంతమంది రావడం లేదో కూడా సంబంధిత డీఎంసీలకే తెలియడం లేదు. పారిశుధ్యం సహా వివిధ విభాగాల్లో సిస్టమ్స్ మార్చాల్సి ఉంది. మంచి సిస్టమ్ ఉంటే పనుల్లో మంచి ఫలితాలుంటాయి. సాక్షి: శివారు ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల్లేవు. గ్రేటర్ ప్రజలతో సమానంగా శివారు ప్రజలు పన్నులు కడుతున్నా వారి సమస్యలు తీరట్లేదు. ఈ పరిస్థితుల్లో మరిన్ని గ్రామపంచాయతీల విలీనంపై మీ వ్యక్తిగత అభిప్రాయం? కమిషనర్: శివారు ప్రాంత సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దానిపై అధ్యయనం చేస్తున్నా. త్వరలోనే తగిన పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నా. చిన్న గ్రామం ఏకంగా ఒకేసారి గ్రేటర్లో విలీనం కావడం సమంజసం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ముందుగా మునిసిపాలిటీలుగా కొంత అభివృద్ధి చెందాక గ్రేటర్లో కలిసినా ఇబ్బంది ఉండదు. సాక్షి: పేదల కోసం ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా? కమిషనర్: పేదలపై నాకు శ్రద్ధ ఉంది. గిరిజన సంక్షేమశాఖలో పనిచేసినప్పుడు వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన అనుభవం ఉంది. పేదలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు వారికి తప్పనిసరిగా కావాల్సింది జీవనోపాధి. అందుకు తగిన కార్యక్రమాల్ని అ మలు చేయాలి. నిరుపేద యువతకు ఉపాధి చూపడంతో పాటు నగర ప్రజల అవసరాలు తీర్చేలా కార్యక్రమాలు రూపొందించాల్సి ఉంది. ఆ దిశగా ఎంతో చేయగలనన్న నమ్మకం ఉంది. సాక్షి: జీహెచ్ఎంసీని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మీ డ్రీమ్? కమిషనర్: పనులు త్వరితంగా పూర్తిచేయాలనేదొక్కటే లక్ష్యం. వేరే అజెండా లేదు. మంచి సిటీగా తీర్చిదిద్దేందుకు నాకు కొన్ని ఆలోచనలున్నాయి. అవేమిటో ఇప్పుడే వెల్లడించను. ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల సహకారంతో చేయలేని పనంటూ ఉండదు. నగరంలో ప్రజలను సంసిద్ధుల్ని చేసేందుకు వారి సహకారం అవసరం. ఈ విషయంలో గతంలో నాకు వేరే అభిప్రా యం ఉండేది. ఇప్పుడది సరికాదని తెలుస్తోంది. అందరినీ కలుపుకోగలిగితేనే ఏదైనా సాధ్యం. నగరాన్ని వరల్డ్‌క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. మొదట పారిశుధ్యం అద్భుతంగా ఉండాలి. రోడ్లు అద్దాల్లా మెరవాలి. రోడ్లపై నీటినిల్వలుండరాదు.. ఇలా ఇంకా కొన్ని అంశాల్లో ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండాలి. సాక్షి: ఏటా వేల కోట్ల బడ్జెట్ కేటాయిం పులు.. పనులు మాత్రం ముందుకు కదలవు. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారు? కమిషనర్: చేపట్టే ప్రతి పని నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. పనుల వివరాలు స్థాని కులు, ప్రజాప్రతినిధులకు తెలిసేలా అం చనా వివరాలతో సహా బోర్డులు ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు పూర్తిచేయాల్సిందీ పే ర్కొంటాం. తద్వారా ‘లక్ష్యం’ కళ్లముందు కనిపిస్తుంది. స్థానిక కార్పొరేటర్, అధికారులు, వివిధ సం ఘాల నేతలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తాం. వారి సమన్వయంతో నిర్ణీత వ్యవధిలోగా పని పూర్తికి మార్గమేర్పడుతుంది. సంబంధిత జోనల్ కమిషనర్‌కు అజమాయిషీ బాధ్యతలప్పగిస్తాం. అడపాదడపా కమిషనర్ తనిఖీలు ఉంటాయి.