
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్-19 వైరస్ నియంత్రణ కార్యక్రమాల్లో వలంటీర్లుగా పనిచేసేందుకు అన్ని కేడర్లు, ర్యాంకుల రిటైర్డు ఆర్మీ, పారామిలటరీ, పోలీసు, ఎక్సైజ్ ఉద్యోగుల దరకాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరు రోగులకు వైద్య సేవలు అందించడం, రవాణా, భద్రత తదితర సేవల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోడానికి www.transport.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఈ నెల 22తో దరఖాస్తుల గడువు ముగుస్తుందని చెప్పారు. (లాక్‌డౌన్ ఏయే రంగాలకు సడలింపు.. )
Comments
Please login to add a commentAdd a comment