అమెరికా అందాల పోటీల్లో ప్రవాస తెలుగు యువతి, మిస్ న్యూయార్క్ నీనా దావులూరి(24) మెరిసింది. మిస్ అమెరికా అందాల పోటీలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది.
అట్లాంటా నగరంలో నిర్వహించిన పోటీలో 15 సెమీ ఫైనలిస్టులను వెనక్కు నెట్టి ఆమె మిస్ అమెరికా కిరీటాన్ని అందుకుంది. బ్రాడ్వాక్ హాలులో జరిగిన ఈ పోటీని అమెరికా అంతటా టీవీలో ప్రసారం చేశారు.
అంతకుముందు ఈ టైటిల్ అందుకున్న మాజీ మిస్ న్యూయార్క్ మాలోరి హాగన్.. నీనాకు కిరీటం అలంకరించింది. విజేతగా నిలిచిన నీనాకు 50 వేల డాలర్లు ఉపకార వేతనంగా అందుతాయి.