మిస్ అమెరికా కిరీటాన్ని ఇటీవల దక్కించుకున్న తెలుగమ్మాయి నీనా దావులూరి బుధవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకున్నారు.
వాషింగ్టన్: మిస్ అమెరికా కిరీటాన్ని ఇటీవల దక్కించుకున్న తెలుగమ్మాయి నీనా దావులూరి బుధవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకున్నారు. ఓవల్ ఆఫీసులో కొద్దిసేపు ఒబామాతో ముచ్చటించారు. చిల్డ్రన్ మిరకిల్ నెట్‌వర్క్ హాస్పిట్ చాంపియన్స్ గౌరవార్థం ఒబామాతో కలసి ఒక గ్రూప్ ఫొటో తీయించుకున్నారు. అధ్యక్షుడు ఒబామాతో తన భేటీపై నీనా దావులూరి ‘ట్విట్టర్’ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.