
జేడీ శీలం
సాక్షి, అమరావతి : అవినీతి వల్లే పరిపాలన మీద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోయారని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రహదారులకు, విశాఖ ఉక్కు పరిశ్రమకి పెట్టిన ఖర్చు రాష్టానికి ఇచ్చిన నిధులుగా ఎలా చెప్తారని ప్రశ్నించారు. చట్టంలో లేకుండానే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హోదా ఇచ్చారని గుర్తుచేశారు. ఉత్తరాఖండ్‌కి ఇచ్చినట్టే ఏపీకి హోదా ఇద్దామని విభజన సమయంలో చర్చ జరిగిందని తెలిపారు. మూడు సార్లు చట్టంలో సవరణలు చేసినపుడు హోదా అంశం కూడా ఎందుకు బీజేపీ చేర్చలేదని సూటిగా ప్రశ్నించారు.
చెప్పిన దానికన్నా ఎక్కువే ఏపీకి చేశామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నాడు క్యాబినెట్లో పెట్టినవే అడుగుతున్నాం తప్ప కొత్తవి ఏమీ కాదని వ్యాఖ్యానించారు. అమిత్ షా వక్రీకరించి మాట్లాడారని చెప్పారు. మట్టి నీరు తీసుకుని వచ్చినప్పుడే చంద్రబాబు నోరెత్తివుంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అధికార దాహంతో హామీలను బీజేపీ అమలు చేయదని తాము ముందే ఉహించలేక పోయామని అన్నారు. రాష్టంలో కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు జరగదని, ప్రజల నాడి తెలుసుకున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment