jd sheelam
-
‘పాలనపై పట్టు కోల్పోయిన చంద్రబాబు’
సాక్షి, అమరావతి : అవినీతి వల్లే పరిపాలన మీద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోయారని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రహదారులకు, విశాఖ ఉక్కు పరిశ్రమకి పెట్టిన ఖర్చు రాష్టానికి ఇచ్చిన నిధులుగా ఎలా చెప్తారని ప్రశ్నించారు. చట్టంలో లేకుండానే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హోదా ఇచ్చారని గుర్తుచేశారు. ఉత్తరాఖండ్‌కి ఇచ్చినట్టే ఏపీకి హోదా ఇద్దామని విభజన సమయంలో చర్చ జరిగిందని తెలిపారు. మూడు సార్లు చట్టంలో సవరణలు చేసినపుడు హోదా అంశం కూడా ఎందుకు బీజేపీ చేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. చెప్పిన దానికన్నా ఎక్కువే ఏపీకి చేశామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నాడు క్యాబినెట్లో పెట్టినవే అడుగుతున్నాం తప్ప కొత్తవి ఏమీ కాదని వ్యాఖ్యానించారు. అమిత్ షా వక్రీకరించి మాట్లాడారని చెప్పారు. మట్టి నీరు తీసుకుని వచ్చినప్పుడే చంద్రబాబు నోరెత్తివుంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అధికార దాహంతో హామీలను బీజేపీ అమలు చేయదని తాము ముందే ఉహించలేక పోయామని అన్నారు. రాష్టంలో కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు జరగదని, ప్రజల నాడి తెలుసుకున్నామని వివరించారు. -
'పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలి'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై శుక్రవారం రాజ్యసభలో చర్చ వాడీవేడిగా కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ రెవిన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాలంటూ రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయలన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ముంపు మండలాలను ఏపీలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
మా సవరణలను కాపీకొట్టారు: జేడీ శీలం
బీజేపీపై కేంద్ర మంత్రి జేడీ శీలం ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజలకు మేలు చేసేలా కాంగ్రెస్ పార్టీ చేసిన సవరణలనే బీజేపీ కాపీ కొట్టిందని కేంద్ర మంత్రి జేడీ శీలం విమర్శించారు. ‘‘ సీమాంధ్రలో రెవెన్యూ లోటుకు సం బంధించి రూ.10వేల కోట్లు ఇవ్వాలని, ఈశాన్య రాష్ట్రాల మాదిరే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని లోక్‌సభలో బిల్లు ఆమోదానికి ముందురోజే రాహుల్‌గాంధీ మాకు హామీ ఇచ్చారు. అయితే అప్పటికే వాటిని పొందుపరచడంలో ఆలస్యం జరగడంతో లోక్‌సభలో ఈ సవరణలు పెట్టలేదు. రాజ్యసభలో బిల్లు సందర్భంగా పెడతామని చెప్పారు. ఈ సవరణలనే బీజేపీ కాపీ కొట్టి సీమాంధ్ర ప్రజల కోసం పోరాడుతున్నట్లుగా మొసలికన్నీరు కారుస్తోంది’’ అని శీలం విమర్శించారు. సీమాంధ్ర ప్రజలపై బీజేపీకి నిజంగా ప్రేమ ఉంటే హైదరాబాద్‌ను పదేళ్లపాటు యూటీగా చేయాలన్న డిమాండ్‌కు ఎందుకు అంగీకరించలేదని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు కంకణబద్ధులమై ఉన్నామని, రెండు ప్రాంతాల వారు అభివృద్ధి చెందేలా కృషిచేస్తామని జేడీశీలం భరోసా ఇచ్చారు. -
జేడీ శీలం 'నో కామెంట్'...కాఫీ తాగామన్న కావూరి!
-
ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. జీవోఎంకు నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం మంత్రులను మాట్లాడించేందుకు ప్రయత్నించగా మంత్రి జేడీ శీలం 'నో కామెంట్' అని వ్యాఖ్యానించగా, కావూరి 'కాఫీ తాగాం' అని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరోసారి మంత్రుల బృందాన్ని మరోసారి కలుస్తాం అని పనబాక లక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై మళ్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ లను కలుస్తామన్నారు. -
యూటీపై నేనెవరితోనూ మాట్లాడలేదు: దిగ్విజయ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసే విషయమై తానెవరితోనూ మాట్లాడలేదని, ఎలాంటి చర్చా చేయలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నది చాలా సున్నిత అంశమని, ఈ విషయాన్ని మంత్రుల బృందం చూసుకుంటుందని తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని హైదరాబాద్‌ను యూటీ చేస్తే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని కేంద్ర మంత్రి జేడీ శీలం చేసిన వ్యాఖ్యలను దిగ్విజయ్ వద్ద ప్రస్తావించగా ‘‘యూటీపై నేను ఎలాంటి చర్చా చేయలేదు. ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఆయన తప్పర్థం చేసుకొని ఉండొచ్చు. నేనెప్పుడూ దీనిపై ఏదీ చెప్పలేదు. కేవలం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం వరకే మాట్లాడాను’’ అని చెప్పారు. ఇక హైదరాబాద్‌ను యూటీ చేసే విషయంలో మీరేమంటారు అని అడగ్గా ‘హైదరాబాద్ యూటీ అంశంపై విలేకరుల సమావేశంలో చర్చించలేం. ఇది చాలా సున్నిత సమస్య. దీన్ని మంత్రుల బృందం చూసుకుంటుంది’ అని బదులిచ్చారు. తీర్మానంపై తర్జనభర్జన.. అసెంబ్లీలో రాష్ట్ర విభజన తీర్మానం అంశంపై స్పష్టత వచ్చిందా అని ప్రశ్నించగా ‘‘తీర్మానం విషయమై నేను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో చర్చించా. విభజనకు సంబంధించిన షెడ్యూల్‌ను పంపిస్తానని ఆయన నాకు వాగ్దానం చేశారు. అది చూశాక మీకు తెలుపుతా. అప్పటి వరకు దీనిపై స్పష్టత ఇవ్వలేను’’ అని దిగ్విజయ్ చెప్పారు. అసెంబ్లీ తీర్మానం కోరతారని మీరు భావిస్తున్నారా? అని అడగ్గా.. అది పూర్తిగా కేంద్ర హోంశాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. చట్ట, న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాలపై తొందరపాటు చర్యలకు దిగొద్దని విజ్ఞప్తి చేసినా నలుగురు ఎంపీలు రాజీనామా చేశారని, వారిపై ఏమైనా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? అని అడగ్గా ‘‘నేను మరోమారు విజ్ఞప్తి చేస్తున్నా. వారు వాస్తవాలను గుర్తించుకోవాలి. విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇచ్చిన హామీని వారు గుర్తించాలి. హామీకి కట్టుబడాలి’’ అని బదులిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలపై ప్రశ్నించగా.. ‘‘ఆయన అత్యంత విధేయుడైన కాంగ్రెస్‌వాది.. ఆయన పార్టీని వదిలిపోరని నేను మీకు హామీ ఇవ్వగలను’’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటనలు చేసినా, ఇతరులెవరు ఏం చెప్పినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడే ఉందని దిగ్విజయ్‌సింగ్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. పాలమూరు నుంచి రాహుల్‌ను పోటీకి దించాలి: డీకే అరుణ రాష్ట్ర మంత్రి డీకే అరుణ, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం దిగ్విజయ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నేతలు మల్లు రవి, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని వారు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు జిల్లా పార్టీ నేతలు చేసిన తీర్మానం కాపీని వారు దిగ్విజయ్‌కు అందించారు. అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ ‘రాహుల్‌ను మహబూబ్‌నగర్ నుంచి పోటీకి దించాలని కోరాం. ఈ నెల 29న గద్వాలలో నిర్వహిస్తున్న తెలంగాణ జైత్రయాత్ర లో పాల్గొనాలని దిగ్విజయ్‌ను ఆహ్వానించాం’ అని తెలిపారు. దిగ్విజయ్‌తో కేంద్ర మంత్రి పల్లంరాజు భేటీ.. కేంద్ర మంత్రి పల్లంరాజు కూడా దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు ఆయనతో చర్చించారు. మంత్రుల బృందం దృష్టికి తేవాల్సిన అంశాలు, సీమాంధ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కేంద్ర పర్యవేక్షణ కిందకు తేవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పినట్లు సమాచారం. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. -
సమైక్య సెగలో కేంద్ర మంత్రి జేడీ శీలం ఉక్కిరిబిక్కిరి
-
సమైక్య సెగలో కేంద్ర మంత్రి జేడీ శీలం ఉక్కిరిబిక్కిరి
కేంద్రమంత్రి జేడీ శీలానికి అడుగడుగునా సమైక్య సెగ తాకింది. తొలుత కొంతమంది సమైక్యవాదులు, ఆ తర్వాత సీమాంధ్ర లాయర్ల జేఏసీ సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేయడానికి ఉద్యుక్తుడవుతున్న జేడీ శీలం.. సమైక్యవాదుల ప్రతిఘటనతో మిన్నకుండిపోయారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తేనే సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కాసేపటికి సీమాంధ్ర లాయర్ల జేఏసీకి చెందిన పలువురు న్యాయవాదులు కూడా శీలాన్ని అడ్డుకున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు తెలంగాణ బిల్లు రాకుండా అడ్డుకుంటామన్న హామీ ఇవ్వాలని ఆయనను లాయర్లు పట్టుబట్టారు. దాంతో.. ఏమీ చేయలేని పరిస్థితిలో, విభజనను అడ్డుకునేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామని చెప్పిన శీలం..అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరారు. కాగా, ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌లో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావానికి సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ తన మద్దతు తెలిపింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయవాదులు భారీ సంఖ్యలో ఆ సమావేశంలో పాల్గొంటారని జేఏసీ ప్రతినిధులు చెప్పారు. -
సోనియాతో ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ