
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా నేడు బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన కపిల్ మిశ్రాపై గతంలోనే శాసనసభలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తీరుతో తీవ్రంగా విభేదించిన మిశ్రా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు ఆయన బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ నేతలు రాజీనామా చేయడం ఆప్‌ను కలవరానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment