'కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం' | AICC secretary Kunthiya takes on cm kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం'

Published Thu, Feb 22 2018 4:15 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

AICC secretary Kunthiya takes on cm kcr - Sakshi

కుంతియా, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియా అన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్‌ కుటుంబానికే పరిమితమైందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని అవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.

మరోపక్క, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. బంగారు తెలంగాణలో నలుగురే లాభపడ్డారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తున్న వారిని కేసీఆర్‌ అణిచివేస్తున్నారని ఉత్తమ్‌ చెప్పారు. దళితులపై థర్డ్‌ డిగ్రీ.. గిరిజనులకు బేడీలు వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. నాలుగేళ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్‌ భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement