
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు టైం దగ్గరపడిందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా హెచ్చరించారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అని చెప్పారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పారని అన్నారు.
అలాగే, డబుల్ బెడ్ రూంలు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అసలు నిజాలేమిటో తెలుస్తున్నాయని, మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment