సాక్షి, విజయవాడ: శాసనసభ అన్నా, సభాపతి అన్నా తనకు అపారమైన గౌరవముందని, ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్లు శాసనసభ్యుడిగా కొనసాగిన తనకు సభ సంప్రదాయాలు పూర్తిగా తెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తానూ ఎప్పుడూ సభాపతినిగానీ, సభనుగానీ అగౌరవపరచలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు. అలా చేసినట్టు ఎవరైనా భావిస్తే.. క్షమించాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థి అయిన కోడెల శివప్రసాదరావును రాజకీయంగా విమర్శించడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. తనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం తీసుకురావాలని అసెంబ్లీలో మంగళవారం టీడీపీ సభ్యులు కోరిన నేపథ్యంలో ఆయన బుధవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
- నాకు కోడెల మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి
- ఆయన, నేను పోయిన ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేశాం
- సత్తెనపల్లి స్థానంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో కోడెల నాపై 924 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు..
- ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను, నా పార్టీని, నా పార్టీ కార్యకర్తలను, అభిమానులను కోడెల తీవ్రంగా వేధిస్తున్నారు
- నాకు ఆయన రాజకీయ ప్రత్యర్థి. నన్ను అవిధంగానే భావించి వేధిస్తున్నారు
- నా క్యాడర్‌ను పీఎస్‌కు పిలిపించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రౌడీషీట్‌లు పెడతామని బెదిరించారు.
- హిస్టరీ హిట్లు తెరిపిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా కోర్టుల్లో మేం వ్యాజ్యాలు నడుపుతున్నాం
- పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని మమ్మల్ని, మా క్యాడర్‌ను ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న
- రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు చేయడం నా బాధ్యత
- కోడెల, ఆయన తనయుడు సత్తెనపల్లిలో రౌడీయిజం, దౌర్జన్యాలు చేస్తున్నారు
- ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సమయంలో కోడెల, ఆయన తనయుడు మా పార్టీ వారిపై దౌర్జన్యం చేసి ఎంపీపీ పదవిని కైవసం చేసుకున్నారు
- అలాంటి వ్యక్తిని రాజకీయంగా విమర్శించడం తప్పా?
- సత్తెనపల్లి క్లబ్బుపై కోడెల వ్యాఖ్యలు పచ్చి అబద్ధం
- అక్కడ పేకాట ఆడటం లేదు. టెన్నిస్, క్యారమ్, షటిల్ మాత్రమే ఆడుతున్నారు
- ఆ స్థలాన్ని కాజేయాలని కోడెల, ఆయన తనయుడు ప్రయత్నిస్తున్నారు
- ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు పోలీసులను అడ్డంపెట్టుకొని.. క్లబ్‌కు తాళాలు వేశారు
- కోడెలకు వ్యతిరేకంగా క్లబ్ సెక్రటరీ, వైఎస్సార్సీపీ నేత నాగుల్ మీరా కోర్టుకు వెళ్లడంతో మేం విజయం సాధించాం
- క్లబ్ విషయంలో ఆయనకు వ్యతిరేకంగా పోరాడినందుకు మళ్లీ మాపై కక్ష కట్టారు
గొడుగు సుబ్బారావు వ్యవహారం..!
- సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల, ఆయన తనయుడు దౌర్జన్యాలు పెరిగాయి
- గొడుగుల సుబ్బారావు అనే వ్యక్తి భూమిని కోడెల తనయుడు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు
- పోలీసులతో బెదిరించడంతో సుబ్బారావు ఊరు వదిలివెళ్లాల్సి వచ్చింది
- సుబ్బారావు ఉమ్మది హైకోర్టులో కేసు వేయడంతో సీఐ, డీఎస్పీ, కోడెల తనయుడితోపాటు సీబీఐకి కోర్టు నోటీసులు జారీచేసింది
- కమిషన్ల కోసం నడికుడి-కాళహస్తి రైల్వే కాంట్రాక్టర్‌ను కోడెల తనయుడు బెదిరించారు
- కేసు పెట్టేందుకు కాంట్రాక్టర్ పోలీసుల వద్దకు వెళితే.. కోడెలతో రాజీ చేసుకోమని వారు ఆయనకు సలహా ఇచ్చారు
- ఆ విషయాన్ని సదరు కాంట్రాక్టర్ పీఎంవో, సీఎం దృష్టికి తీసుకెళ్లారు
- కోడెలకు చెందిన సేఫ్ మెడికల్ కంపెనీలో డ్రగ్స్ తయారుచేస్తున్నారు
- ఆ మందులను కచ్చితంగా కొనాలని అన్ని మెడికల్ షాపులను ఆదేశించారు
- లేకుంటే కేసులు పెడతామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు
- గత ఎన్నికల్లో చట్టవిరుద్ధంగా రూ. 11 కోట్లు ఖర్చు పెట్టానని కోడెల స్వయంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు
- తనపై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పారు. అలాంటి వ్యక్తి క్రిమినల్ కాదా?
- 1999లో ఆయన ఇంట్లో బాంబులు పేలి నలుగురు చనిపోయారు
- ఆ కేసుల్లో క్లీన్‌చిట్ ఇచ్చారని నిన్న అసెంబ్లీలో కొందరు చెప్పారు
- అందులో వాస్తవం లేదు. కోడెలను క్రిమినల్ అని నిర్ధారణ చేసి.. ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా సీబీఐ కేంద్రాన్ని కోరింది
- కానీ అప్పటి సీఎం చంద్రబాబు సాయంతో కోడెల కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేశారు
- అలాంటి వ్యక్తి క్లబ్ ఆస్తిని కాజేయాలని దుర్భుద్ధితో నన్ను భయపెట్టాలని చూస్తున్నారు
- నన్ను అణచివేస్తే.. చూస్తూ ఊరుకోను. జైల్లో పెడితే.. కోడెల దుర్మార్గాలను మరింత బిగ్గరగా జైలు గోడలు బద్దలయ్యేలా వివరిస్తా
- కోడెల అరాచకాలను నేను ప్రశ్నిస్తూనే ఉంటా..
- కానీ, స్పీకర్ విధులకు సంబంధించి నేను మాట్లాడను.. నాకు శాసనసభ అంటే, స్పీకర్ అంటే ఎంతో గౌరవం ఉంది
Comments
Please login to add a commentAdd a comment