
సాక్షి, అమరావతి: టీడీపీ పతనం దిశగా సాగుతోందనే విషయం ఆ పార్టీ వారి అంతరాత్మకు బాగా తెలుసునని, ఆ నిస్పృహతోనే చంద్రబాబు, ఆయన అనుయాయిలు సీఎం వైఎస్ జగన్‌ని విమర్శిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేసిన కృషిని అందరూ మెచ్చుకుంటున్నారని, దీంతో తిరిగి ఎప్పటికైనా అధికారంలోకి వస్తామా? రామా? అనే భయం టీడీపీని పట్టుకుందన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.....
► చంద్రబాబుకు వృద్ధాప్యం వచ్చేసింది ఆయన అవుట్ డేటెడ్ అయిపోయారు. ఆయన వారసుడు లోకేష్ అప్‌డేట్ కాలేకపోగా ప్రజల మధ్యకు వచ్చి భవిష్యత్ నాయకుడు అనిపించుకోలేక పోతున్నాడు.
► దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను అందిస్తూ జగన్ ముందుకు వెళుతూంటే బీహార్ అనీ, తుగ్లక్ అని చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.
► అధికారంలో ఉండగా చంద్రబాబు చేసిన దుబారా ఇంకెవరూ చేసి ఉండరు. విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి కోట్లు ఖర్చు పెట్టారు.
► వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత దుబారా లేకుండా పారదర్శకతతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. వాస్తవం ఇలా ఉంటే చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment