'ఆ డాక్టర్‌తో మంచి నాటకం ఆడించారు' | Ambati Rambabu Slams Chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఆ డాక్టర్‌తో మంచి నాటకం ఆడించారు'

Published Wed, Apr 8 2020 6:23 PM | Last Updated on Wed, Apr 8 2020 6:59 PM

Ambati Rambabu Slams Chandrababu  - Sakshi

సాక్షి, తాడేపల్లి : కరోనా మహమ్మారి నుంచి ఎలా బయటపడాలి, వైరస్‌ను ఎలా జయించాలని ప్రపంచ మానవాళి యుద్దం చేస్తుంది..ఇటువంటి సంక్షోభ సమయంలో చంద్రబాబు రాజకీయాలు చేయడం దారుణమని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ద్వజమెత్తారు. బాబు పీఎం, సీఎం, ఎన్నికల కమిషనర్‌కు లేఖలు రాస్తుంటే.. మంచి సలహాల కోసం అనుకున్నాము.. కానీ జగన్‌పై విమర్శలు చేసేందుకే ఆ లేఖలు రాస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానా అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ప్రజలకు మేలు చేయాలని కోటి 30లక్షల పేద కుటుంబాలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

అయితే ఇవి కేంద్ర ప్రభుత్వ డబ్బులని.. వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారంటూ బాబు తప్పుడు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా తయారైన సమయంలోనూ ఎంతో శ్రమకు ఓర్చి పేదలకు వెయ్యిరూపాయలను అందజేస్తున్న సమయంలో మెచ్చుకోవాల్సింది పోయి ఇలా విమర్శలకు దిగడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన తర్వాతే జీతం వాయిదా రూపంలో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దమయిందని తెలిపారు. (మరోసారి సీఎంలతో మాట్లాడనున్న మోదీ)

ఆ డాక్టర్‌తో మంచి నాటకం ఆడించారు :
నర్సీపట్నంలో చంద్రబాబు డాక్టర్‌తో మంచి నాటకం ఆడించారు. డాక్టర్‌కు అయ్యన్నపాత్రుడుతో ఏమి సంబంధం ఉంది? ఆయన ఇంటికి డాక్టర్ ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమన్నారు. వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తే ప్రజలు బాబును క్షమించరని.. ఎన్నికల సమయంలోనూ మోదీ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ నానా మాటలు అనడం ఎవరు మరిచిపోరని అంబటి గుర్తుచేశారు. (డాక్టర్ సుధాకర్పై సస్పెన్షన్ వేటు)

తెలంగాణ లో కూడా టీడీపీ ఉంది కదా.. 
కరోనా నేపథ్యంలో మీరు హైదరాబాద్‌లో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. మీ పార్టీ తెలంగాణలో కూడా ఉందన్న విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌కు  చంద్రబాబు లేఖలు ఎందుకు రాయడం లేదన్నారు. ఒకవేళ కేసీఆర్‌కు లేఖ రాస్తే క్వారంటైన్‌లో పెడుతారేమోనని భయపడుతున్నరా అంటూ ఎద్దేవా చేశారు. మీ టార్గెట్ వైఎస్‌ జగన్‌ అని మాకు క్లియర్‌గా అర్థమవుతుందన్నారు. బాబు మంచి సలహాలు ఇస్తే తాము తప్పకుండా స్వీకరిస్తామని, లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి కాస్త ఉదారంగా నిధులు ఇవ్వమని  ప్రధానిని ఎందుకు అడగలేదంటూ అంబటి ప్రశ్నించారు. (ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement