ఆమె ఎక్కడున్నా అంతే: అమిత్‌ షా | Amit Shah Says Where There Is Mamata Banerjee, There is violence | Sakshi
Sakshi News home page

ఆమె ఎక్కడున్నా అంతే: అమిత్‌ షా

Published Thu, May 16 2019 4:44 PM | Last Updated on Thu, May 16 2019 5:07 PM

Amit Shah Says Where There Is Mamata Banerjee, There is violence - Sakshi

న్యూఢిల్లీ: తన ఎన్నికల ర్యాలీ సందర్భంగా కోల్‌కతాలో చోటుచేసుకున్న హింసాత్మాక ఘటనల వెనుక పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆరోపించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేపదే బీజేపీని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోందని విమర్శించారు. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం కోత విధించడాన్ని ఆయన తప్పుబట్టారు.

‘ప్రజా వ్యతికరేకత ఎక్కువగా ఉండటంతో మమతా బెనర్జీ తీవ్ర నిస్పృహలో ఉన్నారు. అందుకే ఆమె మాపై చీటకి మాటికి చిర్రుబుర్రులాడుతున్నారు. మా అజెండా, సిద్ధాంతాల గురించి బెంగాల్‌ ప్రజలకు వివరించేందుకు మేము యాత్ర చేపట్టాలకుంటే పర్మిషన్‌ ఇవ్వలేదు. బీజేపీ తలపెట్టిన 70 ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. బెంగాల్‌కు వచ్చిన మా నాయకుల హెలికాప్టర్లను ఇక్కడ దిగనివ్వలేదు. ఇలాంటి ఒక్క పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే జరిగాయి. మా పార్టీ అధికారంలో ఉన్న 16 రాష్ట్రాల్లో ఒక్క ప్రతిపక్ష నాయకుడిని కూడా అడ్డుకోలేదు. బెంగాల్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ గెలిస్తే హింస ఆగుతుంది. బెంగాల్‌లో జరిగినన్ని హింసాత్మక ఘటనలు దేశంలో మరెక్కడా జరగలేదు. మమత ఎక్కడ ఉంటే అక్కడ హింస ఉంటుంది. మేము మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే ఆమె మా కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఎన్నికల తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమ’ని ఆజ్‌తక్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌ షా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రతీకార చర్యలను ఈసీ అడ్డుకోలేకపోయిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement