సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. రాఫెల్ ఒప్పందంపై రాహుల్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మోదీని దించేద్దాం’ అని రాహుల్ మోదీపై విమర్శలు చేస్తుంటే.. దానికి పాకిస్తాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ మద్దతు పలకడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని దించేందుకు పాకిస్తాన్‌తో కలిసి కాంగ్రెస్ అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేస్తుందా? అని చురకలంటించారు.
‘మోదీ హటాటో’ (మోదీని దించేయండి) అంటూ రాహుల్ గాంధీ, ఫవాద్ హుస్సేన్ చేసిన ట్వీట్‌లను ఉటంకిస్తూ షా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్‌లో పాకిస్తాన్‌వద్దు, కాంగ్రెస్‌వద్దు (#NaPakNaCongress) అనే హాష్‌టాగ్‌ని షా జతచేశారు. కాగా, మేకిన్ ఇండియాలో భాగంగా రాఫెల్ డీల్‌లో రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌కు భాగం చేశారంటూ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ వెల్లడించిన నేపథ్యంలో దేశ రక్షణశాఖపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని రాహుల్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.
Rahul Gandhi says ‘Modi Hatao’
— Amit Shah (@AmitShah) September 22, 2018
Pakistan says ‘Modi Hatao’
Now Pakistan also supports Rahul Gandhi’s baseless allegations against PM Modi.
Is Congress forming an International Mahagathbandhan against PM Modi?#NaPakNaCongresshttps://t.co/eHBs0DGfBP
Comments
Please login to add a commentAdd a comment