సాక్షి, అమరావతి : ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు మైనారిటీలపై ప్రేమ పుట్టుకొస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మైనారిటీ వర్గం నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ ఫరూక్‌కు మైనారీటీల తరఫున మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. దీంతో ఆయన శాసన మండలి చైర్మన్ పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆదివారం ఉయదం ఫరూక్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ షరీఫ్ పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక, కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మైనారిటీ, ఎస్టీలను ఇన్నాళ్లూ దూరంగా పెట్టి, తీరా ఎన్నికలకు దగ్గరపడిన సమయంలో వారిని చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోనుండటం గమనార్హం. ఎన్నికలకు ముందు ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు చంద్రబాబు ఈమేరకు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని, ఇప్పుడు మంత్రులుగా నియమించినంత మాత్రాన వారు చేయగలిగేది ఏమీ ఉండదని, ఇదంతా ఎన్నికల ప్రచారం కోసమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment