సాక్షి, అమరావతి : ఐటీ దాడుల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ చేసిన ట్వీట్‌పై వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కౌంటర్ వేశారు. ఏమీ తవ్వ కుండానే ఎలుకలు దొరికాయని కరెక్టుగా తవ్వితే ఏనుగులు దొరుకుతాయని మంత్రి కన్నబాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అవినీతికి అంతూ పొంతూ లేదనడానికి తాజా ఐటీ దాడులే ఉదాహరణ. చంద్రబాబు మాజీ వ్యక్తిగత సహాయకుడి దగ్గర రూ.2 వేల కోట్లు ఉన్నట్లు కేంద్ర ఐటీ శాఖ నోట్ విడుదల చేసింది. తక్కువే పట్టుకున్నారు తమ దగ్గర చాలా ఉంది అన్న చందంగా లోకేష్ ట్వీట్ ఉంది. కంగారు పడొద్దు. ఇల్లు అలకగానే పండగ కాదు. మొదలైంది ఇప్పుడే. మీ బాగోతాలు. మీ కథలన్నీ బయటకొస్తాయి.
(చదవండి : మచ్చుకు రూ.2,000 కోట్లు)
ఐదేళ్లు రాష్ట్రాని లూటీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రతి కుటుంబానికి మేలు జరగాలని మీకు అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సొంత ప్రయోజనాల కోసమే పనిచేసారు. అవి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన సోదాలు కావు ఐటీ శాఖ చేసిన సోదాలు. కొన్ని సబ్ కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందని చెబితే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల్లో సైతం స్వప్రయోజనాల కోసమే పనిచేశారు. అమరావతిలో జరిగిన ఇన్ సైడ్ ట్రెడింగ్‌ను కమిటీ బయట పెట్టింది. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వారి చేతుల్లోకి తెచ్చుకున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి’అని మంత్రి పేర్కొన్నారు.
(చదవండి : ఓటుకు నోటు కేసుపై కూడా నిగ్గు తేల్చాలి)
Comments
Please login to add a commentAdd a comment