
సాక్షి, పశ్చిమగోదావరి : రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ బహిరంగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పొగడ్తలతో ముంచెత్తారు. పోలవరం వేగంగా పూర్తి కావడానికి చంద్రబాబే కారణమంటూ ప్రశంసల జల్లు కురిపించారు. పోలవరం పర్యటనకు వచ్చిన కోడెల మీడియాతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు 80 సంవత్సరాల ఆలోచన. దీని కోసం 30 ఏళ్లుగా ప్రయత్నాలు జరిగాయి. మరో ఏడునెలల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది.’ అని కోడెల ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment