బాబు మోసగాడు.. గెలిస్తే మళ్లీ బీజేపీ ఒళ్లో కూర్చుంటారు | Asaduddin Owaisi Special Interview On Lok Sabha Election | Sakshi
Sakshi News home page

బాబు మోసగాడు

Published Mon, Apr 8 2019 11:26 AM | Last Updated on Mon, Apr 8 2019 11:26 AM

Asaduddin Owaisi Special Interview On Lok Sabha Election - Sakshi

‘చంద్రబాబు స్వార్ధపూరిత పడగనీడలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్‌కుప్రాణప్రతిష్ట జరగాల్సి ఉంది. ఆ ప్రాంతం పునరుత్తేజం కావాలి. పురోగతి బాట పట్టాలి. ఇది జరగాలంటే కచ్చితంగా జగన్‌  రావాలి. ఐదేళ్లు విలవిల్లాడిన ఆంధ్రా మళ్లీ పునరుత్తేజం కావాలి. చితికిన ఈ తెలుగు రాష్ట్రం సొంత కాళ్లమీద నిలబడాలి. అది జరగాలంటే ఆ ప్రాంతానికి జగన్‌ కావాలి. రాష్ట్ర విభజన తర్వాత అస్తవ్యస్తంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దగలిగే సామర్థ్యం వైఎస్‌ జగన్‌లో పుష్కలంగా ఉంది. ఎంతోకాలంగా జగన్‌ను దగ్గరనుంచి బాగా గమనించాకే.. నేను ఈ మాటలు చెబుతున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా అద్భుత పాలన అందించి తెలుగు ప్రజల మనస్సుల్లో సుస్థిరంగా నిలిచిన డాక్టర్‌ వైఎస్సార్‌ పాలనాదక్షతను పుణికిపుచ్చుకోవటమే కాకుండా.. ఆయనకంటే మిన్నగా సీఎం పదవిలో వైఎస్‌ జగన్‌ రాణిస్తారు’ అని  సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు.- గౌరీభట్ల నరసింహమూర్తి

సాక్షి, హైదరాబాద్‌ :  ‘ఏపీలో స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈసారి కచ్చితంగా వైఎస్సార్‌సీపీ అఖండ మెజారిటీతో గెలవబోతోంది. దేవుడి దయ వల్ల 130కి తగ్గకుండా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇదేదో మాటవరసకు నేను చెప్పటం లేదు. అక్కడి పరిస్థితులు, ఐదేళ్ల బాబు పాలన, జనం ఆకాంక్ష ఆధారంగా చెబుతున్న మాటలు ఇవి’ అని అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. 

జగన్‌ తొలి లక్ష్యం.. ప్రత్యేక హోదా సాధనే
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ చాలా గందరగోళంగా మారింది. మంచి పాలనతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పింది. తాకట్టు రాజకీయాలతో చంద్రబాబు ఆంధ్రాను అతలాకుతలం చేశారు. ఆ రాష్ట్రం వెంటనే పురోగతి బాట పట్టి సుస్థిర ప్రగతి సాధించాలంటే.. కచ్చితంగా హోదాను దక్కించుకోవాలి. అది చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం సాధ్యం కాదు. హోదా కోసం

అహర్నిశలు శ్రమిస్తున్న నేత
జగన్‌. ఇప్పటికిప్పుడు ఆయన ముందున్న లక్ష్యాల్లో మొదటిది ప్రత్యేక హోదా సాధనే. దానికోసం నిబద్ధతతో పోరాడుతున్న నేత ఆయనొక్కడే. ఆ హోదా ఏపీకి దక్కాలంటే.. పార్లమెంటుకు ఎక్కువ సంఖ్యలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీలు వెళ్లాలి. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితిలో.. ఆ పార్టీ కచ్చితంగా 20 కంటే ఎక్కువ పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తుంది. 

బాబు మరోపేరు మోసగాడు(ధోకేబాజ్‌)
చంద్రబాబుకు ఉన్న మరోపేరు మోసగాడు(ధోకేబాజ్‌). నమ్మినవారిని మోసగించటం ఆయన నైజం. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్న సమయంలో తొమ్మిదేళ్లపాటు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆయన పనితీరును చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెబుతున్న మాట ఇది. తన అవసరం కోసం ఎంత దగాకైనా తెగబడే తత్వం చంద్రబాబుది. ఆయన వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా పోయింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని హోదా పేరుతో జనం ముందుకు వెళ్తున్నారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు మారుపేరు. ఆయన మాటలు నమ్మితే ఆంధ్రప్రదేశ్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అయినా..ఆయన తీరేంటో బాగా అర్ధం చేసుకున్న ప్రజలు.. చంద్రబాబును సీఎంగా చూసేందుకు సిద్ధంగా లేరు.

ముస్లింలను దగా చేసింది బాబు కాదా?
చంద్రబాబుది క్షణక్షణానికి మాట మార్చే తత్వం. ముస్లింలనునిలువునా వంచించిన వ్యక్తి ఆయన. బాబు పాలనలోమైనారిటీలు ఎప్పుడూ సంతోషంగా ఉండరనేది నగ్న సత్యం. గుజరాత్‌ అట్టుడికిపోతూ అమాయక ముస్లింలు ఊచకోతకుగురైతే.. ముసిముసి నవ్వులు నవ్విన వ్యక్తి చంద్రబాబు. ఇలుఖాన్, అఖ్తర్‌ ఖాన్, హఫీజ్‌ జునైద్‌.. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే వందల్లో ఉంటాయి. ఇలాంటి అమాయకులను హత్య చేస్తూ పోవటం, అమాయకులైన 22 మంది హైదరాబాదీ ముస్లిం యువకులను గుజరాత్‌ పోలీసులు బలవంతంగాతీసుకెళ్లి జైళ్లలో పెడితే చంద్రబాబు ఏం చేశారు. దీనిపైఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యే హోదాలో నేను ప్రశ్నిస్తే అనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుచిరునవ్వులు చిందించటాన్ని ముస్లిం సమాజం మరిచిపోలేదు. నాటి ప్రధాని వాజ్‌పేయీ, గుజరాత్‌ ముఖ్యమంత్రినరేంద్రమోదీలకు తన మౌనంతో బాసటగా నిలిచి..ముస్లింలను దగా చేసింది చంద్రబాబు కాదా?

ఇది ముస్లింలపై చంద్రబాబుద్వేషానికి నిదర్శనం కాదా?
1999 సెప్టెంబరు 22.. ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు సిద్ధమైన సమయంలో చార్మినార్‌ సాక్షిగా హైదరాబాద్‌ పాతబస్తీ మచిలీకమాన్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో నాపై దాడి చేయించింది చంద్రబాబు కాదా? నామీదకు తుపాకీ గుండు దూసుకొచ్చింది, పోలీసుల లాఠీ దెబ్బలకు నాకు 22 కుట్లు పడ్డాయి, చొక్కా కూడా ధరించలేని విధంగా నా వీపు లాఠీ గాయాలతో నిండిపోయింది.. ఇది ముస్లింలపై చంద్రబాబు ద్వేషానికి నిదర్శనం కాదా? ఇలా ఘోరాలు చేసి ఇప్పుడు ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే.. ఒక్క ముస్లిం వ్యక్తి కూడా నమ్మడు. నాలుగున్నరేళ్లు మోదీ ఒళ్లో కూర్చుని.. ఎన్నికల వేళ ఇప్పుడు ఆయనను తిట్టినట్టు నటించి రేపు మళ్లీ ఆయన చంక ఎక్కేందుకు సిద్ధపడే చంద్రబాబును ముస్లింలు నమ్మే పరిస్థితే లేదు.  
 
ముస్లింలకు వైఎస్‌ 4%రిజర్వేషన్లు ఎంతో మేలు చేసింది
ఈ ఎన్నికల విషయంలో ముస్లింలు స్పష్టంగా ఉన్నారు. అందుకు కారణం చెబుతాను. మా నేత యూనుస్‌ సుల్తాన్‌ ఇంటిలో ముఖ్యమంత్రి హోదాలో డాక్టర్‌ వైఎస్‌రాజశేఖరరెడ్డి ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు మా తండ్రిగారు సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ ఆయనతో ముస్లింల రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. వారికి రిజర్వేషన్లతో ఎలాంటి మేలు జరుగుతుందో, తద్వారా సమాజానికి ఉపయోగమేంటో వివరించారు. దాన్ని ఎంత శ్రద్ధగా విన్నారో, అంత సీరియస్‌గా తీసుకున్నారు వైఎస్‌. ముస్లింలకు వెంటనే 4 శాతం రిజర్వేషన్లను ప్రకటించి అమలు చేశారు. అది ఎంత మేలు చేసిందో ముస్లింలు కళ్లారా చూశారు. ఆ ఫలాలు అనుభవించిన ఎంతోమంది ఉన్నత స్థితికి చేరుకున్నారు. అలాంటి మహానేత కుమారుడిగా జగన్‌ను వారు అవే కళ్లతో చూస్తున్నారు. కచ్చితంగా ముస్లిం సమాజం అంతా జగన్‌కు అండగా నిలవాలి, నిలుస్తుంది కూడా.

ప్రతి ముస్లిం వైఎస్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారు
రాజకీయ నేతగా నాకు వైఎస్‌ రాజశేఖరరెడ్డితో మంచి అనుబంధం ఉండేది. ప్రతి ముస్లిం కుటుంబం కూడా వైఎస్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావించేవారు. ఇప్పుడు జగన్‌ విషయంలోనూ వారు అలాగే ఉన్నారు. ఇది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, యావత్‌ ఆంధ్రాలో లక్షల కుటుంబాలు జగన్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. వేయి కిలోమీటర్ల మేర యాత్ర చేసి పేదల గుండె చప్పుడు విన్న తర్వాత వైఎస్సార్‌లో మరో మనిషి ఉద్భవించారు. ఆయన పేదల ప్రతి సమస్యను ఆలకించారు, స్పందించారు, తదనుగుణంగా అడుగేశారు. అందుకే గొప్ప పాలనతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఇప్పుడు ఎండావానను లెక్కచేయకుండా మూడు వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ పాదయాత్ర చేసి.. వికలాంగులు, అనాధలు, పేదలు... ఇలా అన్ని వర్గాల బాధలను కళ్లారా చూసి వారి తలపై చేయివేసి నిమిరి నేనున్నానని ధైర్యం ఇచ్చిన వైఎస్‌ జగన్‌.. కచ్చితంగా రాజశేఖరరెడ్డిని మించిన నేత అవుతారు. జనం మధ్య నెలల తరబడి నిలిచి.. ఆంధ్రప్రదేశ్‌ ఏంటో స్పష్టంగా చూసి అవగాహన చేసుకున్న పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా జగన్‌ అవతరించారు. ప్రతి విషయంపై ఇప్పుడు ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది, స్పష్టత ఉంది, ఏం చేయాలో అనే ఆలోచన ఉంది, ఆచరించి చూపే తెగువ ఉంది. అన్నింటికి మించి ప్రతి ఒక్కరి బాధను ఆలకించే సహృదయం ఉంది. నిరంతరం స్వార్ధ చింతనతో రగిలిపోయే చంద్రబాబుతో.. ఒక్కసారి జగన్‌ను పోల్చి చూసుకుంటే నిజమేంటో తెలుస్తుంది. అలాంటి జగన్‌  చేతికి అధికారం వస్తే సుపరిపాలన కళ్లముందు వచ్చి వాలకుండా ఉంటుందా?

జనాన్ని రెచ్చగొట్టేందుకే కేసీఆర్‌ జపం చేస్తున్న చంద్రబాబు
జనాన్ని రెచ్చగొట్టడం ద్వారా తప్పుదారి పట్టించేందుకే  కేసీఆర్‌ జపం చేస్తున్నారు చంద్రబాబు. తన మాటలు నమ్మే పరిస్థితి లేదని గుర్తించే కేసీఆర్‌ పేరెత్తుకుని ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి బొక్కబోర్లాపడ్డారు. తెలంగాణ జనంతో ఛీ కొట్టించుకున్నాడు. అక్కడి ప్రజలకు మొహం చూపే దమ్ముకూడా బాబుకు లేదు. ఇప్పుడు ఏపీలో కూడా జనంతో ఛీ కొట్టించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి.. ఏపీలో కాంగ్రెస్‌తో కలవకుండా విడిగా పోటీ చేస్తుండటం... జనం ఇదంతా గుర్తిస్తున్నారు.
 
జగన్‌ ‘ఒక్కడు’గానే
నేను స్పష్టంగా ఓ విషయం చెబుతాను. జగన్‌ ఏకైక లక్ష్యం ఏపీకి ప్రత్యేక హోదా సాధించటం. ఈ విషయంలో ఆయన చాలా మానసిక స్థయిర్యంతో ఉన్నారు. ఆయన ఎవరి పంచన చేరే దుస్థితిలో లేరు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే ‘ఒక్కడు’గానే ఉంటారు. ఈ విషయంలో కేసీఆర్‌ పాత్ర ఉండదు, కేటీఆర్‌ పాత్ర ఉండదు, ఒవైసీ పాత్ర ఉండదు. ఆయనకు ఆ అవసరం కూడా లేదు. మీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టో చూస్తే తెలుస్తుంది. మంచి విజన్‌ ఉన్న నేతగా జగన్‌ ఎదుగుతున్నారు.

కుమారుడి భవిష్యత్‌పైనే బాబుకు బెంగ
ప్రస్తుతం చంద్రబాబుకు పేదల సంక్షేమం అవసరం లేదు. బడుగుల బాగు అవసరం లేదు. ఏపీ ప్రజల చింత పట్టదు. చివరకు తన పార్టీ కూడా పట్టదు. ఆయన ముందున్న ఏకైక లక్ష్యం తన కొడుకు భవిష్యత్తేమిటనే భయం. తన రాజకీయ జీవితం చరమాంకంలో ఉందని చంద్రబాబు గుర్తించారు. రాజకీయంగా తాను లేకుంటే తన కుమారుడి భవిష్యత్తేమిటనే బెంగ ఆయనను పట్టుకుంది. కుమారుడి కోసం ఎంతకైనా తెగించే రకంగా తయారయ్యారు. ఇది ఏపీకి ఏమాత్రం శుభపరిణామం కాదు.
 
ఎక్కడా మోదీ వేవ్‌ లేదు, రాహుల్‌కూ అనుకూల పరిస్థితి లేదు
ఎక్కడా మోదీ వేవ్‌ లేదు. నిజానికి మోదీకి వ్యతిరేక గాలి వీస్తోంది. ఆయన ప్రధాని అయ్యే అవకాశాల్లేవు. రాహుల్‌ గాంధీకి కూడా అనుకూల పరిస్థితే లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ 16 పార్లమెంటు స్థానాలను గెలువనుంది. హైదరాబాద్‌లో మజ్లిస్‌ విజయం తథ్యం. నేను టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతిస్తున్నందున మా మిత్ర కూటమి ఖాతాలో 17 స్థానాలుంటాయి. కాంగ్రెస్‌గాని మరే పార్టీ గానీ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఖాతా తెరవవు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ హవా, ఏపీలో జగన్‌ వేవ్‌ ఉన్నప్పుడు ఇక మోదీ వేవ్‌కు ఛాన్సే లేదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది.  

టీడీపీకి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే!
చంద్రబాబు మరోసారి జనాన్ని దగా చేసేందుకు సిద్ధపడే జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని దొంగ ప్రచారం చేస్తున్నారు. నామాట గుర్తు పెట్టుకోండి... చంద్రబాబు పొరపాటున మళ్లీ గెలిస్తే  బీజేపీ ఒళ్లో కూర్చుంటారు. గతంలో వాజ్‌పేయీ, ఆ తర్వాత మోడీ జపం చేసిన చంద్రబాబు కచ్చితంగా మళ్లీ ఎన్డీయేతో కలుస్తారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి అధికారంలోకి రాబోతోంది. 20 మందికిపైగా ఎంపీలను గెల్చుకొని జగన్‌ కీలక భూమిక పోషించే స్థితిలో ఉంటారు. ఆయన సునాయాసంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువచ్చే శక్తిమంతంగా తయారవుతారు. ఎంపీగా నేను జగన్‌ పార్టీ వెన్నంటే ఉండి పార్లమెంటులో ఏపీకి హోదా కోసం కృషి చేస్తా. ఆంధ్రా ప్రజలకు ప్రత్యేక హోదాను జగన్‌ కానుకగా ఇచ్చే అద్భుత ఘట్టానికి ప్రత్యక్ష సాక్షిగా ఉంటాను. ఏన్డీయేవైపు చూస్తున్నాడంటూ జగన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. జగన్‌ లక్ష్యం ప్రత్యేక హోదా సాధించటమేనన్న వాస్తవాన్ని జనం గుర్తించకుండా.. వారి దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు చేసే దుష్ట ప్రయత్నమది. నిజానికి టీడీపీకి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే!

ఏపీ పురోగతి బాట పట్టి సుస్థిర ప్రగతి సాధించాలంటే.. కచ్చితంగా ప్రత్యేక హోదాను దక్కించుకోవాలి. ప్రత్యేకహోదా కోసం అహర్నిశలు శ్రమిస్తున్ననేత వైఎస్‌ జగన్‌. ఏపీకి ప్రత్యేక హోదా దక్కాలంటే.. పార్లమెంటుకు ఎక్కువ సంఖ్యలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు వెళ్లాలి.

ప్రతి విషయంపై జగన్‌కు సంపూర్ణ అవగాహన, స్పష్టత, ఏం చేయాలోఅనే ఆలోచన ఉంది. కేంద్రంతో పోరాడి సాధించే తెగువ ఉంది. అన్నింటికీమించి ప్రతి ఒక్కరి బాధను ఆలకించేసహృదయం జగన్‌ సొంతం.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లనుప్రకటించి అమలు చేశారు. అది ఎంత మేలు చేసిందోముస్లింలు కళ్లారా చూశారు. ఆ ఫలాలు అనుభవించినఎంతోమంది ఉన్నత స్థితికి చేరుకున్నారు. అలాంటిమహానేత కుమారుడిగా వైఎస్‌ జగన్‌ను వారు అవేకళ్లతో చూస్తున్నారు. కచ్చితంగా ముస్లిం సమాజంఅంతా జగన్‌కు అండగా నిలవాలి, నిలుస్తుంది కూడా!

చంద్రబాబు మరోసారి జనాన్ని దగా చేసేందుకుసిద్ధపడే.. జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని దొంగప్రచారం చేస్తున్నారు. నామాట గుర్తు పెట్టుకోండి.. బాబు పొరపాటున మళ్లీ గెలిస్తే కచ్చితంగాబీజేపీ ఒళ్లో కూర్చుంటారు. నిజానికి టీడీపీకిఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే!

ముస్లింలను నిలువునా వంచించిన వ్యక్తి చంద్రబాబు.బాబు పాలనలో మైనారిటీలు ఎప్పుడూ సంతోషంగాఉండరనేది నగ్న సత్యం. గుజరాత్‌ అట్టుడికిపోతూఅమాయక ముస్లింలు ఊచకోతకు గురైతే..ముసిముసి నవ్వులు నవ్విన వ్యక్తి చంద్రబాబు.

రాజకీయ నేతగా నాకు వైఎస్‌ రాజశేఖరరెడ్డితోమంచి అనుబంధం ఉండేది. ప్రతి ముస్లిం కుటుంబంకూడా వైఎస్‌ను తమ కుటుంబ సభ్యుడిగాభావించేవారు. ఇప్పుడు జగన్‌ విషయంలోనూవారు అలాగే ఉన్నారు. ఇది ఒక్క ముస్లింలకేపరిమితం కాదు. యావత్‌ ఆంధ్రాలో లక్షలకుటుంబాలు జగన్‌ను తమ కుటుంబసభ్యుడిగా భావిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement