జైపూర్ : రాజస్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం రేసులో నిలిచిన అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్ధాన్‌లో తమ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం తర్వాత నిర్ణయిస్తుందన్నారు. యువ నేత సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్‌లు ఇరువురూ రాజస్ధాన్ సీఎం పదవికి పోటీ పడుతున్నారు.
మరోవైపు రాజస్ధాన్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగిస్తూ విజయపతాకం ఎగురవేసింది. పాలక బీజేపీతో హోరాహోరీ పోరులో సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకుఅ అవసరమైన మేజిక్ ఫిగర్ 100 సీట్లు కాగా, కాంగ్రెస్ ఇప్పటికే 102 స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా, బీజేపీ 73 స్ధానాల్లో, బీఎస్పీ ఐదు స్ధానాల్లో ఇతరులు 20 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. వసుంధరా రాజె నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment