జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. 30 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారంటూ తిరుగుబాటు బావుటా ఎగరేసిన సచిన్ పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన నేపథ్యంలో మరో అంకానికి తెర లేచింది. అసమ్మతి వర్గంపై అనర్హత అస్త్రాన్ని ప్రయోగించడానికి రంగం సిద్ధమైంది. దానికి సంబంధించి ప్రక్రియ కూడా మొదలైంది. సీఎం అశోక్ గహ్లోత్ వర్గం ఫిర్యాదుతో అసమ్మతి వర్గానికి శాసన సభ స్పీకర్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా నోటీసులు ఇచ్చారు.
ఈ నెల 17లోగా వివరణ ఇవ్వాలని పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలను ఆదేశించారు. కాగా, జైపూర్‌లో మంగళవారం జరిగిన రెండో దఫా కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) భేటీకి కూడా సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో పార్టీ అధిష్టానం వేటువేసిన సంగతి తెలిసిందే. పైలట్‌తోపాటు అతని సన్నిహితులైన ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనాలను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించింది. శాసనసభా పక్ష సమావేశం అనంతరం పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
(చదవండి: పైలట్‌పై వేటు)
Comments
Please login to add a commentAdd a comment