బాలకృష్ణ వాడిన పదజాలం తప్పే: మంత్రి | Balakrishna Terminology Is Wrong | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ వాడిన పదజాలం తప్పే: మంత్రి

Published Sun, Apr 22 2018 7:41 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

Balakrishna Terminology Is Wrong - Sakshi

మంత్రి పితాని సత్యానారాయణ(పాత చిత్రం)

తూర్పుగోదావరి జిల్లా: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వాడిన పదజాలం తప్పేనని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయాలలో మాట్లాడే బాష నాయకులు నేర్చుకోవాలని హితవుపలికారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కేంద్రం రాజకీయ కుట్ర చేసే పరిస్థితి ఉందన్నారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల్లోకి వచ్చి రాజకీయాలు చేయాలని సూచించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేశపరులని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సోముకు తగదన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఎమ్మెల్యే అనిత బాధ్యతలు తీసుకోకపోవచ్చునని జోస్యం చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement