
చెన్నై: తమిళనాడు ఎన్నికలను ఉద్దేశించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 2021వ సంవత్సరంలో తమిళనాడు ప్రజలు పెద్ద అద్భుతాన్ని సృష్టించబోతున్నారని పేర్కొన్నారు.
అవసరమైతే.. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం రజనీకాంత్‌తో పొత్తుకు సిద్ధమని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విలేకరులతో మాట్లాడిన రజనీకాంత్ రాజకీయ పొత్తులు, ముఖ్యమంత్రి పదవి తదితర అంశాలపై స్పందించారు. కమల్‌తో పొత్తు పెట్టుకుంటారా? అన్న ప్రశ్నకు పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కమల్‌తో పొత్తు పెట్టుకుంటే ఎవరు సీఎం అవుతారన్న ప్రశ్నకు.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సర్‌ప్రైజ్ ఉంటుందని వ్యాఖ్యానించారు. 2021 ఎన్నికల నాటికి రాజకీయాల్లో తన పాత్రపై సంకేతాలిస్తూ.. ‘2021లో తమిళనాడు ప్రజలు వందశాతం పెద్ద అద్భుతాన్ని సృష్టించబోతున్నారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment