బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీతో కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒకే కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య ఎంఐఎం బ్రోకర్‌గా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కాగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్లేనన్నారు. లక్షల ఉద్యోగాలు భర్తిచేస్తామన్న కేసీఆర్ వేల సంఖ్యల్లో కూడా నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. ఉత్తమ్ కుమార్ గాంధీభవన్‌లో కూర్చొని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికే బీజేపీని టీఆర్ఎస్‌తో ముడిపెడుతున్నారని విమర్శించారు. మోసపూరిత పార్టీలకు బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment