సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఉత్కంఠరేపిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కర్ణాటక ఫలితాలు దేశవ్యాప్తంగా మోదీ పాలనకు ఉన్న ప్రజామోదానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనతో ఎంత విసిగిపోయారో ఈ ఫలితాలు చూస్తే అర్థమవుతుందన్నారు. సిద్ధరామయ్య చేసిన అవినీతియే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమని విమర్శించారు. అంతేకాక రాహుల్‌గాంధీ ప్రచారం చేసని ప్రతి రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని, అందువల్ల ఆ పార్టీ ఒక సారి రాహుల్‌గాంధీ నాయకత్వం గురించి ఆలోచిస్తే మంచిదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మునిగిపోయే ఓడలా ఉంది, అయినప్పటికి తెలంగాణలో తామే ప్రత్యామ్నయంగా నిలుస్తామని కాంగ్రెస్‌నేతలు విర్రవీగడం హాస్యాస్పదం అన్నారు.
అలానే ఎన్నికల అనంతరం వెలువడిని సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌ను కూడా తూలనాడారు. ‘ఈ సర్వేలు, ఎగ్జిట్‌పోల్ ఫలితాలు, మీడియా సంస్థలు అన్ని కూడా తమ పార్టీని తక్కువ చేసి చూపాయి. కానీ ప్రజలు మోదీ పాలనను నమ్ముతున్నార’న్నారు. ఎన్నికల ప్రచారంలో బాబు తన అనుచరులతో కలిసి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కానీ వారి మాటలను కర్ణాటక తెలుగు ప్రజలు నమ్మలేదన్నాడు. బీజేపీ ఓడిపోతేనే రాజకీయ మేలు జరుగుతుందని బాబు భావించారు, కానీ ప్రజలకు బీజేపీ నాయకత్వం మీద నమ్మకం ఉందన్నారు. ఇప్పటికైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాబు చేసే గిమ్మిక్కులను గమనించాలని కోరారు. బీజేపీ, మోదీనే ప్రత్యేక హోదాకు అడ్డు పడుతున్నారని ప్రచారం చేసి చంద్రబాబు ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నాడు. కానీ ప్రజలు ఆయన చేసే అవినీతిని, కుటుంబ పాలనను గమనిస్తున్నారని, 2019 ఎన్నికల్లో అందుకు తగ్గ ఫలితాన్ని చవిచూస్తారని తెలిపారు.
‘కర్ణాటక ఫలితాలు చూసైనా కుటుంబ పాలకులు కనువిప్పాలి. ఎందుకంటే మరో 20 ఏళ్లపాటు దేశానికి మోదీపాలన అవసరమని ప్రజలు భావిస్తున్నారు. కర్ణాటకలో తమ పార్టీ గెలుస్తందని నమ్మకం ఉండటం వల్లే ఎన్నికలకు ముందుగానే యడ్యురప్పని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమన్నారు. ఎవరితోనూ పొత్తు అవసరం లేకుండానే పూర్తి మెజారిటీ సాధించి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, యడ్యురప్ప ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతార’ని అక్ష్మణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment