
సాక్షి, హైదరాబాద్ : కుమార పట్టాభిషేకం కోసమే కేసీఆర్ యాగాలు.. యజ్ఞాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నిజమైన హిందువని అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు.. కానీ కేసీఆర్‌ని నిజమైన ముస్లిం అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. భద్రాచలం రాముని కళ్యాణానికి మనవడితో పట్టుబట్టలు పంపడం.. వరంగల్‌లో పూజారిని చంపితే మాట్లాడకపోవడం వంటివి చూస్తే కేసీఆర్ హిందువేనా అనే అనుమానం కలుగుతుందన్నారు.
తాను ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేశానని.. తనకంటే గొప్ప హిందువు లేడని కేసీఆర్ అంటున్నారు.. కానీ ఆయన కంటే రావణాసురుడు ఎక్కువ యాగాలు చేశాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment