సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జీఎస్‌టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఆగ్రహంగా ఉన్న వ్యాపార వర్గాలు బీజేపీకి షాక్ ఇస్తారనుకుంటే సూరత్ వంటి ప్రధాన ట్రేడ్ సెంటర్లలోనూ బీజేపీ వ్యతిరేకపవనాలు వీచిన దాఖలాలు లేవు. సూరత్ జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూరత్ ఈస్ట్ మినహా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యం కనబరిచింది.
సౌరాష్ట్ర మినహా గుజరాత్‌లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటింది. దక్షిణ, మధ్య గుజరాత్ ప్రాంతాల్లో తన పట్టు నిలుపుకుంది. వాణిజ్య వర్గాలు ప్రబలంగా ఉండే సూరత్, అహ్మదాబాద్, వడోదరల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు రావడం గమనార్హం.
జీఎస్‌టీ, నోట్ల రద్దుతో ముప్పతిప్పలు పడ్డ గుజరాత్ వ్యాపారులు మూకుమ్మడిగా బీజేపీకి షాక్ ఇస్తారని వెలువడ్డ అంచనాలు తారుమారయ్యాయి. రాహుల్ సైతం వ్యాపారుల్లో ఉన్న అసంతృప్తితో లబ్ధి పొందాలని జీఎస్‌టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా అభివర్ణిస్తూ ప్రచారంలో దూసుకుపోయారు. అయితే ఫలితాల విషయానికి వస్తే జీఎస్‌టీపై వ్యాపారుల అసంతృప్తి ప్రభావం పెద్దగా కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment