
సాక్షి, అమరావతి : సొంత పార్టీనేతలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడాన్ని తప్పుబట్టారు. ‘సీఎం ఇక్కడ పులి.. ఢిల్లీలో పిల్లి’ అని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించడం తప్పని పేర్కొన్నారు. సాక్షర భారత్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలుగా సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. టీడీపీ, జనసేనల వల్లే 2014లో బీజేపీకి నాలుగు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయన్నారు. పొత్తుల విషయం అదిష్టానం చూసుకుంటుందని, 2019లో తమ మద్దతు లేకుండా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు.