సాక్షి, హైదరాబాద్: తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. డిగ్రీ కళాశాలల్లో తెలుగు మీడియంతో పాటు అధ్యాపక పోస్టులను ఎత్తివేయడం సిగ్గు చేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. యూజీసీ నిబంధనల ప్రకారం అధ్యాపక, విద్యార్థుల నిష్పత్తి 1:25గా ఉండాలని, కానీ 60 మంది సైన్స్, 70 మంది ఆర్ట్స్ విద్యార్థులకు ఒక్కో అధ్యాపకుడు ఉండాలన్న నిర్ణయం సరైంది కాదన్నారు. డిగ్రీలో తెలుగు మీడియాన్ని కొనసాగించాలన్నారు.
‘అధ్యాపక పోస్టులను ఎత్తివేయడం సిగ్గుచేటు’
Published Sat, Jun 23 2018 3:18 AM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment