Faculty posts
-
సార్లు లేరు.. చదువుల్లేవు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్/ ఉస్మానియా యూనివర్సిటీ/నాంపల్లి: ఉత్తమ విద్యకు, సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు నిలయంగా.. విద్యార్థుల వికాసానికి తోడ్పడే కేంద్రంగా ఉండాల్సిన అత్యున్నత విద్యా సంస్థలే.. యూనివర్సిటీలు. కానీ రాష్ట్రంలో యూనివర్సిటీలకే ‘వికా సం’ లేని దుస్థితి. రెగ్యులర్ అధ్యాపకులు లేక నామ మాత్రపు బోధన ఒకవైపు.. ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేక అవస్థలు మరోవైపు.. విద్యార్థుల భవిష్యత్తుకు గండి కొడుతున్నాయి. కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలేమోగానీ కనీస ‘చదువు’కే దిక్కు లేకుండా పోతోందని.. ప్రభుత్వం నుంచి తగిన సాయం అందకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థాపరమైన లోపాలు వంటివి వర్సిటీలకు శాపంగా మారాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా నియామకాలేవి? రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టు లు 2,828 ఉండగా.. అందులో 1,869 పోస్టులు అంటే మూడింట రెండొంతులు ఖాళీగానే ఉండటం గమనార్హం. నిజానికి 2017 నవంబర్ నాటికి యూనివర్సిటీల్లో 1,528 ఖాళీలు ఉన్నట్టు గుర్తిం చారు. అప్పట్లోనే 1,061 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇదుగో.. అదుగో అంటూ ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. ఓ సారి రిజర్వే షన్లు అంశం అంటూ, మరోసారి న్యాయపరమైన వివాదా లు అంటూ, మరోసారి నియామకాల తీరుపై కసరత్తు చేస్తున్నామంటూ దాట వేస్తూ వచ్చాయి. దీనితో గత ఏడాది జనవరి 31 నాటికి ఖాళీల సంఖ్య 1,869కి పెరిగింది. కేటగిరీల వారీగా చూస్తే 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబం ధించి కాంట్రాక్టు, తాత్కాలిక అధ్యాపకులతో బోధన నిర్వహిస్తూ మమ అనిపిస్తున్న పరిస్థితి నెల కొంది. దీనివల్ల పూర్తిస్థాయిలో బోధన అందడం లేదని, రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వందేళ్ల ఉస్మానియాకూ తప్పని సమస్య 105 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఫ్యాకల్టీ కొరత, మౌలిక సదుపాయాల లేమి తో సతమతం అవుతోంది. దాదాపు అన్ని విభాగా ల్లోనూ కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. సీనియర్ ఫ్యాకల్టీ లేక పరి శోధనలనే మాటే లేకుండా పోయిందని.. పీజీ స్థాయిలో బోధన మొక్కుబడిగా సాగుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ల్యాబ్‌లలో రసాయ నాలు, పరి కరాలు సరిగా లేవని.. ఇతర మౌలిక వసతులూ లేక ఇబ్బంది పడుతున్నామని అంటు న్నారు. జేఎన్టీయూ లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఇక ఉన్నత విద్యా మండలి ప్రతిష్టాత్మ కంగా నిజాం కాలేజీలో, కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్ కోర్సుకు ఫ్యాకల్టీ సమస్య వేధిస్తోంది. ఓయూలో పేరుకే ఫ్యాన్లు.. కానీ తిరగవు.. తెలుగు వర్సిటీలో ముగ్గురే.. దేశంలోనే మొట్టమొదటి భాషా విశ్వవిద్యాలయ మైన పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పరిస్థితి మరీ చిత్రం. ఇందులో మొత్తంగా ముగ్గురే రెగ్యులర్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఇందులోనూ ఒకరు రిజిస్ట్రార్‌గా, మరొకరు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ గా పనిచేస్తుండటం గమనార్హం. జ్యోతిషం, తెలు గు, ఇంగ్లిష్, కంప్యూటర్, భాషా అను బంధ శాఖ, విజ్ఞాన సరస్వత శాఖ. తులనాత్మక అధ్యయన శాఖ, జర్నలిజం, భాషాభివృద్ధి శాఖ, లింగ్విస్టిక్, భాషా నిఘంటు నిర్మాణ శాఖ జానపదం, సంగీ తం శాఖల్లో పోస్టులన్నీ ఖాళీయే. అన్నింటా తాత్కా లిక అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. నీళ్లు కూడా సరిగా రావట్లేదు మా హాస్టల్లో సరిగా వస తులు లేవు. మామూలు నీళ్లకే కాదు తాగునీటికీ ఇబ్బంది వస్తోంది. డైనింగ్ హాల్లో, ఇతర చోట్ల ఏర్పాట్లేమీ లేవు. – పరశురామ్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థి ‘తెలుగు’ ప్రొఫెసరే లేరు తెలుగు విశ్వవిద్యాలయం ఏ భాషాభివృద్ధి కోసం ఏర్ప డిందో ఆ భాషకే సరైన దిక్కు లేకుండా పోయింది. తెలుగు శాఖలో కూడా రెగ్యు లర్ ఫ్యాకల్టీ లేకపోవడం శోచనీయం. వర్సిటీ పాలక మండలి నిద్రావస్థలో ఉంది. – శివకృష్ణ, రీసెర్చ్ స్కాలర్, తెలుగు వర్సిటీ ఏ వర్సిటీ అయినా అంతే.. ► కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో కీలకమైన మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరు కూడా లేరు. ► మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలను ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండానే కొనసాగిస్తున్నారు. ► వరంగల్ కాకతీయ వర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ► నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీలో కొన్ని విభాగాల్లో ఒక్కొక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. కీలకమైన ఇంజనీరింగ్‌లో 48 పోస్టులు ఖాళీయే. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులు నామమాత్రమే. ► నిజామాబాద్ తెలంగాణ వర్సిటీలో కీలకమైన మ్యాథ్స్, ఎకనామిక్స్, ఫార్మాస్యూ టికల్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు. మొత్తం 152 పోస్టులకుగాను రెగ్యులర్ సిబ్బంది 69 మందే. హాస్టళ్లలో పరిస్థితీ ఇంతే.. ► యూనివర్సిటీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు హాస్టళ్ల లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. కొన్నిచోట్ల తాగునీటికీ ఇబ్బంది పడాల్సి వస్తోంది. పాలమూరు యూనివర్సిటీ హాస్ట ళ్లలో గదుల తలుపులు, కప్‌బోర్డులు విరిగి పోయాయి. కిచెన్ లేక ఆరుబయటే వం టలు చేయాల్సి వస్తోంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. శాతవాహన వర్సి టీలో ఫార్మసీ కళాశాల, హాస్టళ్లు పాత భవనాలు, రేకులషెడ్లలో కొనసాగుతు న్నాయి. మహత్మాగాంధీ వర్సిటీ బాలికల హస్టల్లో తాగు నీటి సరఫరా సరిగా లేదని విద్యార్థినులు వాపోతున్నారు. -
విజిటింగ్ ఫ్యాకల్టీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఐఐఈఎస్టీ, శిబ్పూర్లో తాత్కాలిక, విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టులు శిబ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఈఎస్టీ).. ఒప్పంద ప్రాతిపదికన విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (బెంగళూరు రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు.. ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 30 ► విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, టౌన్ అండ్ రీజినల్ ప్లానింగ్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమేటిక్స్ తదితరాలు. ► తాత్కాలిక ఫ్యాకల్టీ(టెంపరరీ): అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 60ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.75,000 వరకు చెల్లిస్తారు. ► విజిటింగ్ ఫ్యాకల్టీ: అర్హత: పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/రీసెర్చ్‌లో సుదీర్ఘ అనుభవం ఉండాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 68ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.1,00,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, పర్సనల్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021 ► వెబ్సైట్: www.iiests.ac.in ఎంఏఎన్ఐటీ, భోపాల్‌లో 107 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఏఎన్ఐటీ).. వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (యూనియన్ బ్యాంకులో.. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు) ► మొత్తం పోస్టుల సంఖ్య: 107 ► విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ తదితరాలు. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. ► వేతనం: నెలకు రూ.70,900 నుంచి రూ.1,01,500 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: క్రెడిట్ పాయింట్ స్కోర్, రీసెర్చ్/అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.09.2021 ► దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఎంఏఎన్ఐటీ, భోపాల్–462003 చిరునామకు పంపించాలి. ► వెబ్సైట్: http://www.manit.ac.in -
679 వైద్య అధ్యాపక పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 679 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపించింది. అలాగే ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ వంటి విభాగాల్లో అధ్యాపకుల కొర తను అధిగమించేందుకు అవసరమైతే 25 శాతం అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చి కాంట్రాక్టు లేదా రెగ్యులర్ పద్ధతిలో అధ్యాపకులను భర్తీ చేయాలని కూడా ప్రతిపాదించింది. మరోవైపు కొత్త కాలేజీ లకు అనుమతి కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు దరఖాస్తు ప్రక్రియను వైద్య, ఆరోగ్య శాఖ వేగవంతం చేసింది. సెప్టెంబర్ నాటికి నిబంధ నల ప్రకారం దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం ఆ మేరకు మౌలిక సదుపాయాల కల్పన ఏమేరకు జరిగిందో పరిశీలించేందుకు ఎన్ఎంసీ ఉన్నతాధికారులు నవంబర్‌లో ఆయా కాలేజీలను సందర్శిస్తారు. వచ్చే ఏడాది బ్యాచ్ ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుబంధ ఆసుపత్రుల్లో పడకల కొరత... ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నెలకొల్పాలంటే వాటికి అనుబంధ ఆసుపత్రులు అవసరం. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అనుబంధ ఆసుపత్రులుగా నిర్ణయించారు. అయితే మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో తప్పనిసరిగా 300 పడకలు ఉండాలన్నది నిబంధన. అయితే ఆ నిబంధన మేరకు ఏడు ఆసుపత్రుల్లో ఒక దానికే ఆ మేరకు పడకలు ఉన్నాయి. మిగిలిన ఆసుపత్రుల్లో 300 పడకలు లేవు. ఇది ఇప్పుడు వైద్య, ఆరోగ్యశాఖకు సవాల్‌గా మారింది. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 400 పడకలు ఉండగా వనపర్తి, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో 150 చొప్పున, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం వంద చొప్పున పడకలు ఉన్నాయి. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలున్నాయి. తక్కువ పడకలున్న జిల్లా ఆసుపత్రుల్లో ఆగమేఘాల మీద 300 పడకల చొప్పున వాటిని పెంచాల్సి ఉంటుంది. ఆ మేరకు తక్షణమే పడకల పెంపుపై దృష్టి సారించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే ప్రాంతాలు సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, కొత్తగూడెం, మంచిర్యాల -
‘ఫేక్’ ఫ్యాకల్టీలను తేల్చేస్తాం!
సాక్షి, సిటీబ్యూరో: అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న హెచ్ఓడీలు, అధ్యాపకుల పీహెచ్‌డీలు, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లను మరోసారి చూపించాలని జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. నకిలీ పీహెచ్‌డీలు, విద్యార్హత సర్టిఫికెట్లతో అనేక కళాశాలల్లో హెచ్ఓడీలు, అధ్యాపకులుగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కేవలం మూడు నెలల కాలంలోనే మరోసారి పరిశీలనకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఈ చర్య నకిలీ విద్యార్హతలతో కొనసాగుతున్న వారిలో వణకు పుట్టిస్తోంది. ఇదే విధంగా ఫిర్యాదులు రావడంతో గడిచిన అక్టోబర్ నెలలోనూ ఫ్యాకల్టీ పీహెచ్‌డీలు, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించింది. అయినప్పటికీ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు వస్తుండటంతో మరోసారి పక్కాగా నిర్వహించేందుకు సిద్ధం అయింది. దీంట్లో భాగంగానే ఈ నెల 8న మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్యాకల్టీ సభ్యులు యూనివర్సిటీలోని అకాడమిక్ ఆడిట్ సెల్ వద్ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ముందు స్వయంగా హాజరు కావాలని ఇన్చార్జి రిజిస్ట్రార్ గోవర్దన్ అనుబంధ కళాశాలకు ఆదేశాలు జారీచేశారు. పనితీరు పరిశీలన... తాజా ఆదేశాల ప్రకారం ఫ్యాకల్టీ యూజీ, పీజీ, పీహెచ్డీ, పీహెచ్డీ అడ్మిషన్ లెటర్, సినాప్సిస్ కాపీ, థీసిస్ కాపీ, ప్రీ పీహెచ్డీ పరీక్ష రిజల్ట్ కాపీతో పాటు ఇతర పత్రాలను తీసుకుని స్వయంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ కమిటీ డాక్టరేట్లను పరిశీలించడంతో పాటు, ఫ్యాకల్టీ నైపుణ్యం, పనితీరును తెలుసుకోనున్నారు. తక్కువ వేతనాల కోసం... యూజీసీ నిబంధనల ప్రకారంఒక్కో కళాశాలలో పనిచేస్తున్న 10 శాతం మంది అధ్యాపకులకు పీహెచ్డీ హోదా ఉంటేనే ఆ కళాశాలలకు అక్రిడేషన్ హోదా వస్తుంది. పీహెచ్డీ హోదా ఉన్న అధ్యాపకులను 10 శాతం మందిని కొనసాగించాలంటే కళాశాలల యాజమాన్యాలకు ఆర్ధికంగా మోయలేని భారం అవుతుంది. హెచ్ఓడీ స్థాయిలో పనిచేసే సిబ్బందికి తప్పనిసరిగా డాక్టరేట్ ఉండాల్సిందే. కాబట్టి చాలా కళాశాలలు తక్కువ వేతనాలకు దొరికే వారిని నియమించుకుంటున్నారు. వారి డాక్టరేట్లు, విద్యార్హత సర్టిఫికెట్లను పూర్తిగా పరిశీలించడం లేదు. దీని వల్ల టెక్నికల్ కళాశాలల్లో విద్యాబోధనలో నాణ్యత కొరవడుతుంది. విచారణకు రానివారిని తొలగిస్తాం ఫేక్ సర్టిపికెట్లతో అనుబంధ కళాశాలల్లో కొంత మంది పనిచేస్తున్నారని యూనివర్సిటీ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో కమిటీని నియమించాం. ఫ్యాకల్టీ వారి డాక్టరేట్లు, ఇతర విద్యార్హత పత్రాలను తీసుకుని వచ్చి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ముందు హాజరు కావాలి. ఈ విచారణకు రాని వారిని ఫ్యాకల్టీ జాబితా నుంచి తొలగిస్తాం.– గోవర్దన్, ఇన్చార్జి రిజిస్ట్రార్,జేఎన్టీయూహెచ్ పదేపదే పరిశీలన సరికాదు యూనివర్సిటీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో ఫ్యాకల్టీలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గడిచిన అక్టోబర్ నెలతో పాటు అంతకుముందు కూడ ఒకసారి ఫ్యాకల్టీ సర్టిఫికెట్లను పరిశీలించారు. అయినప్పటికీ మరోసారి డాక్టరేట్లు, ఇతర విద్యార్హతలను రుజువు చేసుకోవాలని ఆదేశించడం సరికాదు.– వి.బాలకృష్ణారెడ్డి, తెలంగాణటెక్నికల్ ఎంప్లాయీస్అసోసియేషన్ అధ్యక్షులు -
మెడికల్ కాలేజీలకు విజిటింగ్ ఫ్యాకల్టీ
సాక్షి, హైదరాబాద్: ► డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి.. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్‌గా ఉన్నారు. అనేక అంతర్జాతీయ మెడికల్ సంస్థల్లో సభ్యులుగా, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నిత్యం అంతర్జాతీయ వైద్య వేదికలపై ప్రసంగిస్తుంటారు. అధునాతన వైద్యరంగంలో నూతన పంథాలను ప్రవేశపెట్టారు. ► డాక్టర్ సోమరాజు.. కేర్ వ్యవస్థాపకుడు. వైద్య రంగంలో ఎంతో అనుభవం గడించారు. ప్రొఫెసర్‌గా సేవలందించారు. అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని అందించారు. అంతర్జాతీయస్థాయిలో వైద్య వేదికలపై సెమినార్లు ఇచ్చారు. ► డాక్టర్ గురువారెడ్డి.. సన్‌షైన్ వ్యవస్థాపకుడు. వైద్యరంగంలో వచ్చిన అనేక మార్పులను అందిపుచ్చుకొని ఆసుపత్రిని తీర్చిదిద్దారు. దేశవిదేశాల్లో వైద్యరంగంలో వచ్చిన మార్పులు ఒడిసిపట్టుకున్నారు. ఇలాంటి ప్రముఖులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. అధునాతన వైద్య పరిజ్ఞానా న్ని, పరికరాలను తమ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్తగా వచ్చే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు విజిటింగ్ ఫ్యాకల్టీగా వీరే బోధిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు చెందిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) ఆచరణలోకి తెచి్చంది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రైవేటు రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులను ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ‘విజిటింగ్ ఫ్యాకలీ్ట’గా నియమించుకునే వెసులుబాటు కలి్పస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండే ప్రముఖ వైద్యులను కూడా నియమించుకోవడానికి అనుమతించింది. ప్రస్తుతం దేశంలో మెడికల్ కాలేజీల్లో విజిటింగ్ ఫ్యాకల్టీ అనే అంశం లేదు. 30 ఏళ్ల క్రితం విజిటింగ్ ఫ్యాకల్టీ వ్యవస్థ ఉండగా, దాన్ని ఇప్పుడు తిరిగి ప్రవేశపెట్టారు. ప్రైవేట్ లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీ విజిటింగ్ ఫ్యాకలీ్టని నియమించుకోవచ్చు, కానీ ఈ నియామకం ప్రస్తుతం ఉన్న అధ్యాపకుల సంఖ్యలో 50 శాతానికి మించకూడదు. పెరగనున్న ప్రతిష్ట.. రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో ఎంబీబీఎస్ సీట్లు 4,790 ఉండగా, పీజీ మెడికల్ సీట్లు 1,400 ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2,358 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా, 1,051 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 1,307 ఖాళీలున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చాలాచోట్ల బోధనా సిబ్బంది సామర్థ్యంపై విమర్శలున్నాయి. రోజువారీ వైద్యరంగంలో వస్తున్న మార్పులను, అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవట్లేదన్న విమర్శలున్నాయి. దీంతో వైద్య విద్య నాసిరకంగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. దీంతో కొన్ని మెడికల్ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపట్లేదు. దీంతో ప్రముఖ ప్రైవేటు వైద్యులను విజిటింగ్ ఫ్యాకలీ్టగా తీసుకుంటే ఆయా కాలేజీల్లో వైద్య బోధన మెరుగుపడుతుందని ఎంసీఐ ఉద్దేశంగా చెబుతున్నారు. ప్రముఖ వైద్యుల పేర్లను ఆయా కాలేజీల వెబ్సైట్లలో పెట్టడం ద్వారా వాటి ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తున్నారు. నెలకు నాలుగు క్లాసులు, ఒక్కో క్లాసు మూడు గంటలు ఉండేలా చేయాలని బీవోజీ నిర్ణయించింది. విజిటింగ్ ఫ్యాకలీ్టకి ఎంత పారితోíÙకం ఇవ్వాలనేది ఆయా కాలేజీల ఇష్టానికే వదిలేశారు. విజిటింగ్ ఫ్యాకల్టీ తప్పనిసరిగా పీజీ పూర్తి చేసి, సంబంధిత స్పెషాలిటీలో కనీసం 8 ఏళ్లు అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలుగా నిర్ధారించారు. విజిటింగ్ ఫ్యాకల్టీని మొదట ఏడాది కాలానికి నియమిస్తారు. తర్వాత మరో ఏడాది పొడిగించుకోవచ్చు. మెడికల్ కాలేజీ సీట్లను కాపాడుకోవడంలో విజిటింగ్ ఫ్యాకలీ్టని పరిగణనలోకి తీసుకోరు. వైద్యవిద్య ప్రమాణాలు పెరుగుతాయి ప్రైవేటు రంగంలో ప్రముఖులైన దేశ విదేశీ వైద్యులను మెడికల్ కాలేజీల్లో విజిటింగ్ ఫ్యాకలీ్టగా నియమించడం వల్ల వైద్యవిద్య నాణ్యత పెరుగుతుంది. అధునాతన పరిజ్ఞానాన్ని విద్యార్థులు, రెగ్యులర్ ఫ్యాకలీ్టకి కూడా అందించడానికి వీలవుతుంది. ఆయా మెడికల్ కాలేజీల ప్రతిష్ట కూడా పెరుగుతుంది. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంతోమంది ప్రముఖులున్నారు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వైద్య విద్య నాణ్యత మరింత పెరుగుతుంది. డాక్టర్ సోమరాజు, డాక్టర్ శాంతారాం, డాక్టర్ మానస్ పాణిగ్రాహి, డాక్టర్ బాలాంబ వంటి ప్రముఖ వైద్యులు విజిటింగ్ ఫ్యాకల్టీగా వస్తే ఆయా స్పెషాలిటీల్లో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన వైద్య విద్య అందించడానికి వీలు కలుగుతుంది. – డాక్టర్ పుట్టా శ్రీనివాస్, డైరెక్టర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ -
గురుకుల జేఎల్ పోస్టులకు 17 నుంచి ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల జూనియర్ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీపై రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) మరో అడుగు ముందుకేసింది. డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ ముందుగా చేపట్టిన తర్వాత జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని గురుకుల బోర్డు భావించింది. కానీ డిగ్రీ లెక్చరర్ ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తడంతో ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేసి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీని ముందుకు తెచ్చింది. ఇప్పటికే జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి 1:2 పద్ధతిలో ఎంపికైన∙ప్రాథమిక జాబితాలోని అభ్య ర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టిన బోర్డు.. తాజాగా ఈ నెల 17 నుంచి 22 వరకు ఇంటర్వ్యూలు, డెమో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో తేదీలు ఖరారు చేయనుంది. పరిశీలనకు ప్రత్యేక బోర్డులు.. జేఎల్ అభ్యర్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ, డెమోను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బోర్డులో గురుకుల నియామకాల బోర్డు, గురుకుల సొసైటీ, విషయ నిపుణులు, మానసిక వైద్యుడు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసిన ఆ మేరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తా రు. ఇంటర్వ్యూ కేటగిరీలో 25 మార్కులుంటాయి. ఇంటర్వ్యూ, డెమో ప్రక్రియకు గరిష్టంగా 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వ్యవధి ఉంటుంది. రాత పరీక్ష మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది జాబితాను ఎంపిక చేస్తారు. త్వరలో డీఎల్ ప్రాథమిక జాబితా గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా త్వరలో విడుదల కానుంది. వాస్తవానికి ఇప్పటికే 1:2 పద్ధతిలో ప్రాథమిక జాబితా ప్రకటించినా.. అందులో దాదాపు 30 శాతం అభ్యర్థులకు నిర్దేశిత తేదీ నాటికి అర్హతలు లేవు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఈ విషయం వెలుగు చూడటంతో అర్హతల్లేని అభ్యర్థులను జాబితా నుంచి తొలగించి కొత్త జాబితా రూపొందించేందుకు బోర్డు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారిని తొలగించి మెరిట్ ఆధారంగా కొత్త అభ్యర్థుల పేర్లను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రోస్టర్ ఆధారంగా 1:2 పద్ధతిలో పేర్లను ఖరారు చేయనుంది. ఇందుకు నెలరోజులు పట్టే అవకాశం ఉంది. -
పదేళ్లుగా పడిగాపులే!
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలోనూ నిరుద్యోగులకు పాత కష్టాలే. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు పదేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. కొన్నింటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సకాలంలో భర్తీ చేయాలన్న ధ్యాస అధికారుల్లో లేకుండా పోయింది. ఫలితంగా విద్యాబోధన గందరగోళంగా మారింది. యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆమో దం తెలిపి 15 నెలలు గడిచినా, గత ఏడాది అక్టోబర్ 10న యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల సమావేశంలో గవర్నర్ అదేశించినా ఇంకా ఆచరణకు నోచుకోలేదు. పోస్టుల కోసం నిరుద్యోగులకు పదేళ్లుగా నిరీక్షణ తప్పడంలేదు. ఉస్మానియా యూనివర్సిటీలోనే లైబ్రరీ సైన్స్, లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లే లేరు. మిగతా యూనివర్సిటీల్లోనూ అంతే. జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల నియామకానికి 2008లో నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఆ తరువాత వాటి జోలికి వెళ్లలేదు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్లను భర్తీ చేసిన ప్రభుత్వం ఆ తరువాత వాటిని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నియామకాలు చేపడతారని భావించిన నిరుద్యోగులకు నిరాశ తప్పలేదు. జూనియర్ లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది నిరుద్యోగుల గరిçష్ట వయోపరిమితి కూడా దాటిపోయింది. ఏటా రెండుసార్లు జాతీయ అర్హత పరీక్ష, ఒకసారి రాష్ట్ర అర్హత పరీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం నియామకాలపై దృష్టి సారించడం లేదు. 5,278 పోస్టుల్లో 4,441 పోస్టులు ఖాళీనే... రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో మంజూరైన పోస్టులు 5,278 ఉండగా, అందులో 4,441 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. 837 మంది రెగ్యులర్ లెక్చరర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దాదాపు 3,500 మంది కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతోనే ఇంటర్మీడియెట్ విద్యాబోధన కొనసాగుతోంది. డిగ్రీ కాలేజీల్లో 2,730 మంజూరైన పోస్టులుంటే అందులో 1,419 మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. మిగతా 1,311 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. వాటిల్లోనూ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ లెక్చరర్లే కొనసాగుతున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 1500కు పైగా రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసేందుకు వీలుగా ఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కాంట్రాక్టులోనైనా అవకాశం ఇవ్వరెందుకు? కాంట్రాక్టు పోస్టుల్లో తమకెందుకు అవకాశం కల్పిం చరని నిరుద్యోగులు వాపోతున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తే ప్రతిభావంతులకు ఉపాధి లభిస్తుందని నిరుద్యోగి సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా భర్తీకి దిక్కులేదు రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో మొత్తంగా 1,551 ఖాళీలున్నట్లు ప్రభుత్వం గతేడాది తేల్చింది. ప్రస్తుతం వాటిసంఖ్య 1,790కి చేరుకుంది. గతేడాది ఆమోదించిన పోస్టుల్లో మొదటిదశ 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే చెప్పినా అధికారులు జాప్యం చేస్తున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌ల్లోనే నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉన్నా.. కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవహారం పేరుతో కాలయాపన చేశారు. తరువాత యూజీసీ నిబంధనలను (నియామకాల డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్) మార్పు చేసిందని, కొత్త వాటి ప్రకారం నియామకాలు చేపట్టాలా? పాత నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలా? అంటూ కాలం వెళ్లదీశారు. రోస్టర్ కమ్ రిజర్వేషన్లను విభాగాల వారీగా తీసుకోవాలా? యూనివర్సిటీ వారీగా తీసుకోవాలా? అన్న విషయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, దాని నేపథ్యంలో యూజీసీ ఇచ్చిన ఆదేశాలపై స్పష్టత లేదని, అప్పట్లో యూజీసీ ఇచ్చిన ఆదేశాలపై అధ్యయనం పేరుతో మొన్నటి వరకు కాలయాపన చేశారు. చివరకు యూజీసీనే పాత నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తోందని, అప్పటివరకు నియామకాల కోసం చేపట్టిన ప్రక్రియను ఆపాలని యూజీసీ పేర్కొంది. దీంతో ముందుగానే మనం పాత నిబంధనలతో భర్తీ చేస్తే సరిపోయేదని, జాప్యం చేయకుండా ఉండాల్సిందంటున్నారు. -
అయ్యో.. ఐఐటీ! ఏది ఫ్యాకల్టీ
ఐఐటీ కాన్పూర్.. జూన్ మొదటి వారంలో 12 మంది అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది.. 200 మందికి పైగా రాత పరీక్ష నిర్వహించింది.. అందరూ పీహెచ్డీ చేసిన వారే. కానీ పరీక్షలో పాసైంది 13 మంది.. అందులో ఉద్యోగానికి ఎంపికైంది ఒకే ఒక్కరు! ఐఐటీ ఖరగ్‌పూర్.. జూలై రెండో వారంలో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.. వచ్చిన దరఖాస్తులు కేవలం నాలుగే. ఐఐటీ గోవా.. ఈ ఏడాది పూర్తిస్థాయిలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. తరగతులు మొదలయ్యాయి. కానీ 62 శాతం అధ్యాపకుల పోస్టులు ఖాళీ! ఐఐటీ బిలాయ్.. ఇందులోనూ అదే పరిస్థితి.. విద్యార్థులు ఫుల్... 58 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ!! సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీలు (ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ)అధ్యాపకుల కొరతతో అల్లాడుతున్నాయి. బోధనా సిబ్బంది నియామకానికి తరచూ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నా అర్హులైనవారు దొరకడం గగనమైంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అంతర్జాతీయ నిపుణులను నియమించుకోవచ్చని, వారు ఇక్కడ పని చేయడానికి అవసరమైన వీసాలు జారీ చేయడానికి ఎలాంటి సమస్యా లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించినా పరిస్థితిలో మార్పు కన్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేయడం, పూర్తిస్థాయి ప్రొఫెసర్ల నియామకానికి ఆంక్షలు పెట్టడం కూడా అధ్యాపకుల కొరతకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2013 నుంచి మారిన పరిస్థితి.. ఐఐటీల్లో అధ్యాపకులకు ఇస్తున్న వేతనాలు భారీ స్థాయిలోనే ఉంటాయి. ఒక్కసారి ఈ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానాలు అందుతుంటాయి. విద్యార్థులతో కలిసి చేసే పరిశోధనలకు అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కేవి. కానీ ఇదంతా గతం. గత దశాబ్దకాలంగా ఈ పరిస్థితి మారుతోంది. ‘‘2011 దాకా ఐఐటీల్లో ఖాళీలే ఉండేవి కావు. అప్పుడు దేశవ్యాప్తంగా పది లోపే ఐఐటీలు ఉండటం వల్ల ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరగడంతోపాటు కొత్త కోర్సులు, దానికి తగ్గట్టే విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో 2013లో మొదలైన అధ్యాపకుల కొరత 2015కు వచ్చేసరికి 38 శాతానికి చేరింది’’ అని స్ట్రాటజిక్ ఇన్నోవేషన్ (న్యూఢిల్లీ) కో–క్రాఫ్టర్ అరుణ్ కశ్యప్ పేర్కొన్నారు. దానికి తోడు వివిధ బ్రాంచీల్లో ఏర్పడ్డ అధ్యాపకుల ఖాళీలకు అర్హులైన వారు దొరకడం లేదని ఖరగ్‌పూర్ ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్ పంకజ్ మోహన్పూరియా వివరించారు. ‘‘ఇటీవల కాలంలో వస్తున్న అభ్యర్థులను నేను స్వయంగా చూశా. వారు ఐఐటీ ఫ్యాకల్టీకి ఏమాత్రం అర్హులు కారు. ఐఐటీకి ఎంపికయ్యే విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులు. వారికి బోధించేవారు ఎంత సమర్థవంతంగా ఉండాలో మీరే ఆలోచించండి’’ అని ఆయన పేర్కొన్నారు. ఐఐటీయన్ల ‘ఐటీ’ బాట పదేళ్ల క్రితం వరకు ఐఐటీలో గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారిలో ప్రతి బ్యాచ్‌కు చెందిన 15 శాతం మంది ఫ్యాకల్టీ వైపు వచ్చేవారు. దీంతో అప్పట్లో ఫ్యాకల్టీకి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ తర్వాత ఐటీ రంగంలో భారీ ఎత్తున అవకాశాలు రావడం, ఏటా రూ.కోటి అంతకంటే ఎక్కువ వేతనాలు ఆఫర్ చేస్తుండటంతో ఐఐటీయన్లు బోధన వైపు దృష్టి సారించడం లేదని మూడున్నర దశాబ్దాలపాటు ఐఐటీ ఫ్యాకల్టీగా పనిచేసి పదవీ విరమణ పొందిన హెచ్‌సీ వర్మ అన్నారు. ఐఐటీల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు అవసరమైతే చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అంటున్నారు. లేకుంటే భవిష్యత్‌లో ఇది అనేక అనర్థాలకు దారి తీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో తిరిగి పీజీలో చేరింది 12 శాతం లోపేనని, వారిలో నుంచి ఫ్యాకల్టీగా వచ్చింది కేవలం 2 శాతమేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గతేడాది పార్లమెంట్‌కు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది. ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 42 శాతం మంది విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్తుండగా.. మరో 44 శాతం మంది ఉద్యోగాల్లో చేరుతున్నారు. 12 శాతం మంది ఐఐటీల్లో పీజీ కోర్సుల్లో చేరుతుండగా.. మిగిలిన 2 శాతం మంది సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఐఐటీల కన్నా రెట్టింపు వేతనాలు ఐఐటీలతో పోటీ పడే లక్ష్యంతో బిర్లా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (బిట్స్), ధీరూభాయి అంబానీ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ (డీఎఐఐసిసి), మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అంతకంటే రెట్టింపు వేతనాలు ఆఫర్ చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ చేసి వచ్చిన భారతీయ నిపుణులను తీసుకునేందుకు ఈ మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఐఐటీల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లు కొందరు గడచిన నాలుగైదేళ్లుగా రాజీనామాలు చేసి ఈ మూడు సంస్థల్లో చేరారు. కొత్తగా బోధనా రంగంలో చేరాలనుకుని విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చిన నిపుణులను ఈ మూడు సంస్థలే పోటీ పడి ఆకర్షిస్తున్నాయి. జార్జియా టెక్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేసుకుని వచ్చిన ఓ ఐఐటీయన్‌కు ఎంఐటీ రూ.1.34 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. అమెరికాలో పీహెచ్డీ పూర్తి చేసి అక్కడే ఫ్యాకల్టీగా స్థిరపడ్డ భారతీయులను తీసుకువచ్చేందుకు బిట్స్ ప్రయత్నిస్తోంది. అప్పటికీ సాధ్యం కాకపోతే విజిటింగ్ ప్రొఫెసర్ల కోసం యూఎస్ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. కొన్ని ఐఐటీల్లో ఫ్యాకల్టీ ఖాళీలు ఇవీ.. (ఆధారం హెచ్ఆర్డీ లెక్కలు) ఐఐటీ ఖాళీల శాతం గోవా 62 దార్వార్డ్ 47 ఖరగ్‌పూర్ 46 కాన్పూర్ 37 ఢిల్లీ 29 బాంబే 27 బిలాయ్ 58 భువనేశ్వర్ 39 హైదరాబాద్ 31 -
‘అధ్యాపక పోస్టులను ఎత్తివేయడం సిగ్గుచేటు’
సాక్షి, హైదరాబాద్: తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. డిగ్రీ కళాశాలల్లో తెలుగు మీడియంతో పాటు అధ్యాపక పోస్టులను ఎత్తివేయడం సిగ్గు చేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. యూజీసీ నిబంధనల ప్రకారం అధ్యాపక, విద్యార్థుల నిష్పత్తి 1:25గా ఉండాలని, కానీ 60 మంది సైన్స్, 70 మంది ఆర్ట్స్ విద్యార్థులకు ఒక్కో అధ్యాపకుడు ఉండాలన్న నిర్ణయం సరైంది కాదన్నారు. డిగ్రీలో తెలుగు మీడియాన్ని కొనసాగించాలన్నారు. -
ఉన్నతవిద్యకు అవరోధాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో ఉన్నత విద్యకు అడుగడునా అవరోదాలు ఎదురవుతున్నా యి. అక్షరాస్యతలో అత్యంత వెనకబడిన ఈ ప్రాంత విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న పాలమూరు యూనివర్సిటీ పలు సమస్యలతో సతమతమవుతోంది. ముఖ్యంగా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పీజీ కాలేజీల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. యూనివర్సిటీ పరిపాలన విభాగం పర్యవేక్షణలో విఫలం కావడంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ముఖ్యంగా పీజీ కళాశాలల్లో కొలిక్కిరాని వివాదాలు కూడా ప్రధాన సమస్యగా మారింది. వనపర్తి పీజీ కాలేజీలో రెండు నెలల క్రితం జరగాల్సిన ప్రాక్టికల్స్ ఇప్పటివరకు నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పాలనా యంత్రాంగం జాప్యం ప్రభుత్వం 2008లో పాలమూరు యూనివర్సిటీని నెలకొల్పింది. విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు నాలుగు చోట్ల పీజీ సెంటర్లను నియమించింది. అం దుకు అనుగుణంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో వనపర్తి, గద్వాల, కొల్లాపూర్‌లలో పీజీ సెంటర్లను ఏ ర్పాటు చేసింది. మౌళిక వసతుల కల్పన అటుంచితే కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు ఇబ్బంది ప డుతున్నారు. సైన్స్ ప్రాక్టికల్స్, సీబీసీఎస్ (చాయస్బే స్డ్ క్రెడిట్ సిస్టం) నిర్వీర్యమవుతున్నాయి. సీబీసీఎ స్ విధానంలో విద్యార్థులకు వారు పీజీలో ఎం చుకున్న సబ్జెక్టుతో పాటు ఈ విధానం ద్వారా అద నంగా సబ్జెక్టులు చదువుకునేందుకు వీలుంటుంది. వేధిస్తున్న అధ్యాపకుల కొరత పీజీ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేకపోగా చాలా మంది అధ్యాపకులు కాంట్రాక్టు పద్ధతిలోనే పనిచేస్తున్నారు. ప్రతి పీజీ కోర్సులో కనీసం ఐదు సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జక్టులకు అధ్యాపకులు ఉండాలి. కానీ పొలిటికల్ సైన్స్ విభాగంలో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. మొదట్లో ఆరు మంది అధ్యాపకులు ఉండగా వారిలో ఇద్దరిని తొలగించడంతో ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్టులు ఎంపిక చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అధ్యాపకులు సూచించిన ఐదు సబ్జెక్టులను మాత్రమే విద్యార్థులు చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు కళాశాలల్లో చదవుతున్న విద్యార్థులకు కూడా ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి. వనపర్తి పీజీ కాలేజీలో వివాదం వనపర్తిలో ఉన్న పీజీ కళాశాలకు కనీసం సొంత భవనం కూడా లేదు. కొన్నేళ్లుగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలోనే నిర్వహణ సాగిస్తున్నారు. డిగ్రీ కళాశాలకు చెందిన తరగతి గదులు, ల్యాబ్‌లు, స్టాఫ్రూంలలోనే పీజీ కళాశాల సిబ్బంది సర్దుకుంటున్నారు. డిగ్రీ కళాశాల సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఉండడంతో పీజీ కళాశాల తరగతులను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.30 గంటల వరకు కొనసాగిస్తున్నారు. గతంలో పీజీ తరగతులు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో అధ్యాపక సిబ్బంది లేక డిగ్రీ కళాశాల అధ్యాపకులు పీజీ తరగతులు, ల్యాబ్ పాఠాలు బోధించే వారు. దాంతోపాటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రఘునాథ్‌రెడ్డి పీజీ కళాశాల వ్యవహారాలను చూసుకోవాలని పీయూ అధికారులు మౌఖికంగా ఆదేశించడంతో పీజీ కళాశాల తరగతులను పర్యవేక్షణ చేస్తున్నారు. కొంతకాలంగా పీయూ అధికారులు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కంప్యూటర్ ఆపరేటర్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు ఇతర సిబ్బందికి కొంత నగదు చొప్పున ప్రతీనెల గౌరవవేతనం చెల్లించారు. ప్రస్తుతం పీజీ కళాశాలకు పూర్తి స్థాయిలో అధ్యాపక సిబ్బంది రావడంతో ఏడాది కాలంగా నిలిపి వేశారు. ఇటీవల వీసీ రాజరత్నం కళాశాలను సందర్శించి ల్యాబ్‌లకు హెచ్ఓడీలుగా పీజీ అధ్యాపకులే వ్యవహరించాలని ఆదేశించారు. దీంతో కాలేజీలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డిగ్రీ కాలేజీ సిబ్బంది పూర్తిగా సహాయ నిరాకరణ చేపట్టారు. దీంతో సాయంత్రం 3.30 కాగానే డిగ్రీ సిబ్బంది మొత్తం కాలేజీకి తాళాలు వేసుకొని వెళ్తున్నారు. అటు యూనివర్సిటీ అధికారులు, ఇటు డిగ్రీ కళాశాల సిబ్బంది వైఖరి వల్ల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 4వ సెమిస్టర్ తరగతులు ప్రారంభమైనా ప్రాక్టికల్స్‌కు దిక్కేలేదు. ప్రాక్టికల్స్ జరగలేదు మా కాలేజీలో కొన్ని నెలలుగా ప్రాక్టికల్స్ తరగతులు జరగలేదు. ఒకప్పుడు డిగ్రీ కళాశాల ల్యాబ్‌లోనే పీజీ విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించారు. కానీ ఇప్పుడు అవికూడా నిలిచిపోయాయి. – అశోక్, ఎంఎస్సీ, సెకండియర్, వనపర్తి అధికారులు స్పందించాలి ఫోర్త్ సెమిస్టర్ తరగతులు కూడా మొదలయ్యాయాయి. మా కాలేజీలో ఇంతకు సైన్స్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారో లేదో యూనివర్సిటీ అధికారులు చెప్పాలి. సైన్స్ గ్రూప్‌లో ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం. వివాదాలు పక్కనబెట్టి తరగతులు నిర్వహించాలి. – కృష్ణవేణి, ఎంఎస్సీ, సెకండియర్, వనపర్తి సమస్యలు పరిష్కరిస్తున్నాం యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లోని సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. వనపర్తి పీజీ కాలేజీలో ప్రాక్టికల్స్ జరగడం లేదన్న విషయం నాకు తెలియదు. ఎగ్జామ్స్ షెడ్యూల్స్ అంతా రిజిస్ట్రార్ చూసుకుంటారు. విచారణ చేసి వనపర్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తాం. – రాజారత్నం, పాలమూరు యూనివర్సిటీ వీసీ -
1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు!
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో 1,061 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన విధానంపై వైస్ చాన్స్లర్ల కమిటీ కీలక సిఫారసు చేసింది. ఇప్పటివరకు వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో దరఖాస్తు చేసుకున్న అందరిని ఇంటర్వ్యూలకు పిలిచే విధానానికి పుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించింది. ఒక్కో సబ్జెక్టులో ఒక్కో పోస్టుకు పది మందిని మెరిట్స్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఇంటర్వ్యూలకు (1:10 నిష్పత్తిలో) ఎంపిక చేయాలని సూచించింది. ఈ మేరకు వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం నియమించిన వైస్ చాన్స్లర్ల కమిటీ రెండు రోజుల కింద ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను స్క్రీనింగ్ చేసేందుకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్స్ ఆధారంగా స్క్రీనింగ్ చేయాలని సూచించింది. ఆ మెరిట్ నిర్ణయానికి ఆరు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. ఒక్కో అంశానికి 10 మార్కుల చొప్పున 60 మార్కులకు వెయిటేజీ ఇచ్చి, మెరిట్ ఉన్న వారిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేయాలని సూచించినట్లు తెలిసింది. అలాగే ఇంటర్వ్యూలో 4 కీలక అంశాల్లో అభ్యర్థిని బట్టి 40 మార్కుల వరకు కేటాయించే విధానాన్ని సూచించినట్లు సమాచారం. తద్వారా ఇంటర్వ్యూలను త్వరగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నట్లు తెలిసింది. ఏ వర్సిటీ నోటిఫికేషన్‌ను ఆ యూనివర్సిటీనే ఇవ్వాలని, ఒక వర్సిటీలో దరఖాస్తు చేసుకున్న వారు మరో యూనివర్సిటీలోనూ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఇంటర్వ్యూ కమిటీలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చెందిన వారు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సబ్జెక్టు నిపుణుడిగా నియమించాలని సూచించినట్లు తెలిసింది. తద్వారా పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టవచ్చని సూచించినట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీలో వైస్ చాన్స్‌లర్, డీన్, డిపార్ట్మెంట్ హెడ్, ఇద్దరు సబ్జెక్టు ఎక్స్పర్ట్స్, ఇంటర్వ్యూ కమిటీలో వైస్ చాన్స్‌లర్, డీన్, రిజిస్ట్రార్, సబ్జెక్టు ఎక్స్పర్ట్ ఉండాలని పేర్కొన్నట్లు తెలిసింది. న్యాయశాఖ అభిప్రాయం తర్వాత ఈ 1,061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేయనుంది. మెరిట్ నిర్ణయానికి ఆరు ప్రధాన అంశాలు.. ► పోస్టు గ్రాడ్యుయేషన్‌లో మార్కులు ► అకడమిక్ రికార్డు (స్లెట్, నెట్, పీహెచ్డీ, విదేశాల్లో చదువులు) ► పబ్లికేషన్స్.. వివిధ అధ్యయన పత్రాలు, రచనలు.. ► ఫెలోషిప్‌లు, పరిశోధనలు, ప్రాజెక్టులు.. వాటి ఫలితాలు ► సర్వీసు, అనుభవం (కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న కాలం, ప్రైవేటు కాలేజీల్లో బోధన అనుభవం) ► అవార్డులు, రివార్డులు) ఇంటర్వ్యూ కమిటీ పరిగణనలోకి తీసుకునే 4 అంశాలు లెక్చర్స్, పరిశోధనలు, సబ్జెక్టు విశ్లేషణ, అభ్యర్థి వ్యక్తిత్వం తదితరాలు. -
బులెటిన్ బోర్డ్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఫ్యాకల్టీ పోస్టులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రొఫెసర్: (శాలక్య తంత్ర, పంచకర్మ, మౌలిక్ సిద్ధాంత, రోగ నిదాన్ అండ్ వికృతి విగ్యాన్, ప్రసూతి తంత్ర అండ్ స్త్రీ రోగ, శరీర రచన, శరీర క్రియ, అగద్ తంత్ర). ఖాళీలు: 8 అసోసియేట్ ప్రొఫెసర్: (కౌమార్ భృత్య, ప్రసూతి తంత్ర అండ్ స్త్రీ రోగ, స్వస్థ వృత్త, శరీర క్రియ, కాయ చికిత్స, ద్రవ్య గుణ, అగద్ తంత్ర, పంచకర్మ) ఖాళీలు: 8 లెక్చరర్: (ప్రసూతి తంత్ర అండ్ స్త్రీ రోగ, ద్రవ్య గుణ, కాయ చికిత్స, పంచకర్మ, రస శాస్త్ర అండ్ బైసాజ్య కల్పన, అగద్ తంత్ర, రోగ నిదాన్ అండ్ వికృతి విగ్యాన్, శల్య తంత్ర, శాలక్య తంత్ర) ఖాళీలు: 9 దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో పూర్తిచేసిన దరఖాస్తుతోపాటు సర్టిఫికెట్లను డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, జోరావర్ సింగ్ గేట్, అమీర్ రోడ్, జైపూర్ – 302002కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది: మార్చి 1, 2017 వెబ్సైట్: http://nia.nic.in -
తెరిచేనాటికైనా.. తిప్పలు తప్పేనా?
* సమస్యల వలయంలో ప్రభుత్వ కళాశాలలు * శిథిలస్థితిలో భవనాలు, చాలని తరగతి గదులు * మరుగుదొడ్లు, సైకిల్ షెడ్లు కరువు * భర్తీ కాని అధ్యాపకుల పోస్టులు * పునఃప్రారంభం నాటికైనా ఇక్కట్లను * తప్పించాలంటున్న విద్యార్థులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘ప్రభుత్వ కళాశాలకు ఎందుకు పోలే’దని విద్యార్థుల్ని అడిగితే.. ‘అక్కడ వసతుల్లేవు, పాఠాలు చెప్పడానికి అధ్యాపకులు లే’రంటారు! ‘ఎందుకలా’ అని ప్రిన్సిపాల్‌ను అడిగితే ‘ప్రతిపాదనలు పంపాం, ఇంకా మంజూరు కాలే’దంటారు. ‘ప్రతిపాదనలకు మోక్షం ఎప్పు’డని ప్రభుత్వాన్ని అడిగితే ‘ఖజానా ఖాళీ.. నిధుల్లేవు’ అని సమాధానం వస్తుంది. ఈ నేపథ్యంలో.. ‘ఇటు సమస్యలు తీరలేదు.. అటు విద్యార్థులు రాలేదు కాబట్టి రేషనలైజేషన్ సాకుతో కాలేజీలను మూసేస్తే పోలా..’ అని అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సమస్యల చట్రంలో ఇరుక్కొని పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. రోజురోజుకూ కొత్తకొత్త విధానాలు, హంగులతో ప్రైవేట్ కాలేజీలు దూసుకుపోతుంటే.. సమస్యల గుదిబండలతో ప్రభుత్వ కళాశాలలు వెనుకపడుతున్నాయి. కనీసం ఈ సెలవుల్లోనైనా సమస్యల్ని పరిష్కరించి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికైనా కష్టాలను తప్పిస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు. * జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అలాగే 15 డిగ్రీ కాలేజీలు, మరో 12 ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి వసతులు కావాలన్నా సమకూర్చుకోవాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ నిధులు సకాలంలో మంజూరుగాక పనులు జరగడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలను తరచి చూస్తే.. * జిల్లా కేంద్రం కాకినాడలో ఉన్న పీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలలు వందేళ్ల నాటి శిథిల భవనాలకు తప్ప ఇప్పటికీ కొత్త వసతులకు నోచుకోలేదు. బాలాజీచెరువు సెంటర్లోని పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో ఉదయం ఇంటర్మీడియట్, మధ్యాహ్నం ఒకేషనల్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. జగన్నాథపురంలోని అన్నవరం సత్యదేవ కళాశాలలోనూ సౌకర్యాలు అంతంతమాత్రమే. * రాజమహేంద్రవరం అటానమస్ డిగ్రీ కళాశాలలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన పీజీ బ్లాక్ నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం శూన్యం. ఇక జూనియర్ కళాశాలలో దాదాపు 1,600 మంది విద్యార్థులున్నా సరిపడినన్ని తరగతి గదుల్లేవు. మరుగుదొడ్ల సమస్య పరిష్కారం కాలేదు. * రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని మురమండలోని పిచ్చుగ కోటయ్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు లేక రోడ్డు వెంబడి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ధవళేశ్వరం జూనియర్ కళాశాలలో రక్షిత మంచినీటి సౌకర్యం లేదు. సైకిల్‌స్టాండ్ లేక విద్యార్థుల సైకిళ్ళు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. * ఏలేశ్వరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారు. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కళాశాలకు సొంత భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో నేటికి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే నిర్వహించాల్సిన పరిస్థితి. * ముమ్మిడివరం ఎంజీఆర్ జూనియర్ కళాశాలను 30 ఏళ్ల క్రితం ఓ ప్రవాసాంధ్రుడు సమకూర్చిన విరాళంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. భవనం పైకప్పు పెచ్చులూడిపోయి వర్షాకాలంలో లీకవుతోంది. కిటీకీలకు అద్దాలు లేవు. * మామిడికుదురులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ భారీ వర్షం పడితే మునిగిపోతోంది. విద్యార్థుల సైకిళ్లకు షెడ్ లేదు. * సామర్లకోటలో 1972లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటును ప్రకటించినా నేటికీ జూనియర్ కళాశాల ఒక్కటే దిక్కు. మరుగుదొడ్లు, సైకిల్ షెడ్ లేవు. శిథిలమైన భవనాల శ్లాబ్ నుంచి పెచ్చులు రాలిపడుతుండటంతో విద్యార్థులకు గాయాలైన సంఘటనలూ ఉన్నాయి. * పిఠాపురం ఆర్ఆర్ బీహెచ్ఆర్ కళాశాలకు నూతన భవనం నిర్మించినా మరుగుదొడ్ల సమస్య తీరలేదు. విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. సైకిల్ స్టాండ్ లేదు. * రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డెరైక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఖాళీ. చివరకు ఇంగ్లిష్ లెక్చరర్ పోస్టు కూడా ఖాళీగా ఉండడంతో గెస్ట్ లెక్చరర్‌తో పాఠాలు చెప్పిస్తున్నారు. * రాజానగరం నియోజకవర్గం కోరుకొండలోని రాజ బాబు జూనియర్ కళాశాలలో తరగతి గదులు విద్యార్థులకు సరిపోవడంలేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడు అదనపు గదులు అందుబాటులోకి వచ్చినా సరిపోవు. ప్రహారీ లేక పశువులు ఆవరణలోకి చొరబడుతున్నాయి. * కొత్తపేటలోని విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తగినన్ని తరగతి గదులు లేవు. ఆరేళ్ల క్రితం అదనపు గదుల నిర్మాణం చేపట్టినా నిధులు విడుదల కాక భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది. రావులపాలెం డిగ్రీ కళాశాలలో పాత భవనం విష సర్పాలకు నిలయంగా మారింది. ఆలమూరు డిగ్రీ కళాశాలను జూనియర్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్నారు. * ఇంకా రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల, ద్రాక్షారామ పీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, తుని డిగ్రీ కళాశాల, రాజా జూనియర్ కళాశాల, మహిళా జూనియర్ కళాశాల, మండపేట నియోజకవర్గం రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల, అడ్డతీగల ప్రభుత్వ జూనియర్ కళాశాల, కరప మండలం వేళంగిలో మెర్లాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, జగ్గంపేట జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, గోకవరం జూనియర్ కళాశాల, రంగంపేట జూనియర్ కళాశాలలను పలు సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. సెలవుల అనంతరం తిరిగి తెరిచే నాటికైనా వాటిని పరిష్కరించి, తాము నిశ్చింతగా చదువుకునే అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
డబ్బు కొట్టు..పోస్టు పట్టు
ఓయూలో అనర్హులకు అధ్యాపక పోస్టులు భర్తీపై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇంకా తేలని మరో11 పోస్టుల భవితవ్యం అంతా పారదర్శకమేనంటున్న వీసీ సాక్షి,సిటీబ్యూరో/ఉస్మానియాయూనివర్సిటీ,న్యూస్‌లైన్: మీరు డబ్బు పెట్టగలరా..?, అర్హతల్లేవా..? ఎంచక్కా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టు కొట్టేయవచ్చు. దేశంలో పేరుప్రఖ్యాతలున్న ఈ యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు అమ్ముకున్నారు. ఇటీవల చేపట్టిన అధ్యాపక పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిభావంతులను విస్మరించి, పరిశోధనల్లో కనీస అనుభవంలేని అభ్యర్థులకు పోస్టులు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీసీ సహా కొంతమంది డీన్లు, విభాగాల అధిపతులు, డెరైక్టర్లు కుమ్మక్కై పోస్టులను అమ్ముకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా తెలుగు మెథడాలజీ సబ్జెక్టుకు నాన్మెథడాలజీ అభ్యర్థిని ఎంపికచేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజనీతిశాస్త్రంలో ఎంఏ, పీహెచ్డీ, నెట్ పూర్తిచేసి, ఏడు పరిశోధన పత్రాలు ఒక పుస్తకాన్ని రాయడంతోపాటు బోధనలో 17 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న వాళ్లను పక్కనపెట్టి, ఎలాంటి అనుభవం లేని వాళ్లను ఎంపిక చేసినట్లు సమాచారం. హిందీ అధ్యాపకుల్లో ఎంపికైన ముగ్గురు అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి నెట్ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆది నుంచి వివాదాలే..: ఓయూలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి 2008లో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2009 ఫిబ్రవరిలో మొదటిసారి నోటిఫికేషన్ విడుదల కాగా..6300మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే యూజీసీ నిబంధనలు, ఇతర కారణాల వల్ల ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. ఇవే పోస్టులకు అప్పటి వీసీ తిరుపతిరావు హయంలో 2010, 2011లో రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. తీరా ఆయన పదవీకాలం ముగియడంతో ఆతర్వాత వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొ.ఎస్.సత్యనారాయణ నోటిఫికేషన్లో పలు సవరణలు తీసుకొచ్చి మరోసారి నోటిఫికేషన్ జారీచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ సమక్షంలో ఆయా విభాగాల వారీగా 2012 జూన్ నుంచి 2013 జూన్ వరకు సుమారు 5500 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తీరా ఫలితాలు ప్రకటించే సమయంలో పాలకమండలి సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు అభ్యర్థులు, విద్యార్థుల నుంచి తీవ్ర ‘ఒత్తిళ్లు’ రావడంతో 182 పోస్టులకు సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 11 పోస్టుల ఫలితాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఇదిలావుంటే మరో మూడుపోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో వాటి భర్తీని తాత్కాలికంగా నిలిపేశారు. ఎంతో పారదర్శకంగా వ్యవహరించాం.. నోటిఫికేషన్ వెలువడి, చాలాకాలంపాటు భర్తీకి నోచుకోకుండాపోయిన అధ్యాపక పోస్టులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా భర్తీ చేశాం. పరీక్షలో సాధించిన మార్కులు, వారికున్న అర్హతలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఆయా విభాగాల నిపుణుల సమక్షంలో ప్రతిభ ఆధారంగానే పోస్టులను భర్తీచేశాం. అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఎంపికలో ఎలాంటి అవినీతి,అక్రమాలు చోటుచేసుకోలేదు. - ప్రొ.సత్యనారాయణ, ఓయూ వీసీ