ఉన్నతవిద్యకు అవరోధాలు | palamuru university facing Faculty problem | Sakshi
Sakshi News home page

ఉన్నతవిద్యకు అవరోధాలు

Published Mon, Jan 22 2018 8:20 AM | Last Updated on Mon, Jan 22 2018 8:20 AM

palamuru university facing Faculty problem - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా లో ఉన్నత విద్యకు అడుగడునా అవరోదాలు ఎదురవుతున్నా యి. అక్షరాస్యతలో అత్యంత వెనకబడిన ఈ ప్రాంత విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న పాలమూరు యూనివర్సిటీ పలు సమస్యలతో సతమతమవుతోంది. ముఖ్యంగా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పీజీ కాలేజీల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. యూనివర్సిటీ పరిపాలన విభాగం పర్యవేక్షణలో విఫలం కావడంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ముఖ్యంగా పీజీ కళాశాలల్లో కొలిక్కిరాని వివాదాలు కూడా ప్రధాన సమస్యగా మారింది.  వనపర్తి పీజీ కాలేజీలో రెండు నెలల క్రితం జరగాల్సిన ప్రాక్టికల్స్‌ ఇప్పటివరకు నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.

పాలనా యంత్రాంగం జాప్యం
ప్రభుత్వం 2008లో పాలమూరు యూనివర్సిటీని నెలకొల్పింది. విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు నాలుగు చోట్ల పీజీ సెంటర్లను నియమించింది. అం దుకు అనుగుణంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో వనపర్తి, గద్వాల, కొల్లాపూర్‌లలో పీజీ సెంటర్లను ఏ ర్పాటు చేసింది. మౌళిక వసతుల కల్పన అటుంచితే కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు ఇబ్బంది ప డుతున్నారు. సైన్స్‌ ప్రాక్టికల్స్, సీబీసీఎస్‌ (చాయస్‌బే స్డ్‌ క్రెడిట్‌ సిస్టం) నిర్వీర్యమవుతున్నాయి. సీబీసీఎ స్‌ విధానంలో విద్యార్థులకు వారు పీజీలో ఎం చుకున్న సబ్జెక్టుతో పాటు ఈ విధానం ద్వారా అద నంగా సబ్జెక్టులు చదువుకునేందుకు వీలుంటుంది.   

వేధిస్తున్న అధ్యాపకుల కొరత
పీజీ కళాశాలల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు లేకపోగా చాలా మంది అధ్యాపకులు కాంట్రాక్టు పద్ధతిలోనే పనిచేస్తున్నారు. ప్రతి పీజీ కోర్సులో కనీసం ఐదు సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జక్టులకు అధ్యాపకులు ఉండాలి. కానీ పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. మొదట్లో ఆరు మంది అధ్యాపకులు ఉండగా వారిలో ఇద్దరిని తొలగించడంతో ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్టులు ఎంపిక చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అధ్యాపకులు సూచించిన ఐదు సబ్జెక్టులను మాత్రమే విద్యార్థులు చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు కళాశాలల్లో చదవుతున్న విద్యార్థులకు కూడా ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి.  

వనపర్తి పీజీ కాలేజీలో వివాదం
వనపర్తిలో ఉన్న పీజీ కళాశాలకు కనీసం సొంత భవనం కూడా లేదు. కొన్నేళ్లుగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలోనే నిర్వహణ సాగిస్తున్నారు. డిగ్రీ కళాశాలకు చెందిన తరగతి గదులు, ల్యాబ్‌లు, స్టాఫ్‌రూంలలోనే పీజీ కళాశాల సిబ్బంది సర్దుకుంటున్నారు. డిగ్రీ కళాశాల సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఉండడంతో పీజీ కళాశాల తరగతులను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.30 గంటల వరకు కొనసాగిస్తున్నారు. గతంలో పీజీ తరగతులు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో అధ్యాపక సిబ్బంది లేక డిగ్రీ కళాశాల అధ్యాపకులు పీజీ తరగతులు, ల్యాబ్‌ పాఠాలు బోధించే వారు. దాంతోపాటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రఘునాథ్‌రెడ్డి పీజీ కళాశాల వ్యవహారాలను చూసుకోవాలని పీయూ అధికారులు మౌఖికంగా ఆదేశించడంతో పీజీ కళాశాల తరగతులను పర్యవేక్షణ చేస్తున్నారు. కొంతకాలంగా పీయూ అధికారులు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కంప్యూటర్‌ ఆపరేటర్, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌కు ఇతర సిబ్బందికి కొంత నగదు చొప్పున ప్రతీనెల గౌరవవేతనం చెల్లించారు. ప్రస్తుతం పీజీ కళాశాలకు పూర్తి స్థాయిలో అధ్యాపక సిబ్బంది రావడంతో ఏడాది కాలంగా నిలిపి వేశారు.  ఇటీవల వీసీ రాజరత్నం కళాశాలను సందర్శించి ల్యాబ్‌లకు హెచ్‌ఓడీలుగా పీజీ అధ్యాపకులే వ్యవహరించాలని ఆదేశించారు. దీంతో కాలేజీలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డిగ్రీ కాలేజీ సిబ్బంది పూర్తిగా సహాయ నిరాకరణ చేపట్టారు. దీంతో సాయంత్రం 3.30 కాగానే డిగ్రీ సిబ్బంది మొత్తం కాలేజీకి తాళాలు వేసుకొని వెళ్తున్నారు. అటు యూనివర్సిటీ అధికారులు, ఇటు డిగ్రీ కళాశాల సిబ్బంది వైఖరి వల్ల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 4వ సెమిస్టర్‌ తరగతులు ప్రారంభమైనా ప్రాక్టికల్స్‌కు దిక్కేలేదు.

ప్రాక్టికల్స్‌ జరగలేదు
మా కాలేజీలో కొన్ని నెలలుగా ప్రాక్టికల్స్‌ తరగతులు జరగలేదు. ఒకప్పుడు డిగ్రీ కళాశాల ల్యాబ్‌లోనే పీజీ విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించారు. కానీ ఇప్పుడు అవికూడా నిలిచిపోయాయి. – అశోక్, ఎంఎస్సీ, సెకండియర్, వనపర్తి

అధికారులు స్పందించాలి  
ఫోర్త్‌ సెమిస్టర్‌ తరగతులు కూడా మొదలయ్యాయాయి. మా కాలేజీలో ఇంతకు సైన్స్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారో లేదో యూనివర్సిటీ అధికారులు చెప్పాలి. సైన్స్‌ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌ చాలా ముఖ్యం. వివాదాలు పక్కనబెట్టి తరగతులు నిర్వహించాలి. –  కృష్ణవేణి, ఎంఎస్సీ, సెకండియర్, వనపర్తి

సమస్యలు పరిష్కరిస్తున్నాం
యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లోని సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. వనపర్తి పీజీ కాలేజీలో ప్రాక్టికల్స్‌ జరగడం లేదన్న విషయం నాకు తెలియదు. ఎగ్జామ్స్‌ షెడ్యూల్స్‌ అంతా రిజిస్ట్రార్‌ చూసుకుంటారు. విచారణ చేసి వనపర్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తాం.  – రాజారత్నం, పాలమూరు యూనివర్సిటీ వీసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement