సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సీబీఐపై అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశాన్ని నిరాకరించడం సరైన చర్యే అంటూ తనను తాను సమర్థించుకున్నారు. సీబీఐ, ఈడీ సంస్థలు కలుషితమైయ్యాయని ఆరోపించారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు.ఎన్డీయే ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వల్ల ఎవ్వరికి చిల్లిగవ్వ ఉపయోగం లేదన్నారు. దేశ ప్రయోజనాల కోసమే 35 ఏళ్ల పాటు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు.(ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ)
కేసీఆర్ ప్రతి రోజు నన్నే తిడుతున్నారు
‘కేసీఆర్ ప్రతి రోజు నన్ను తిడుతున్నారు..హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినందుకా నాపై విమర్శలు’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న సోనియాగాంధీ హామీని స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్త ఉండదని బీజేపీ ఏకపక్షంగా ప్రకటించిందని.. అందుకే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment