
సాక్షి, మెదక్ : దుబ్బాకలో టీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని మాజీమంత్రి చెరుకు ముత్యం రెడ్డి అన్నారు. గురువారం చేగుంటలో జరిగిన టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముత్యంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను విమర్శించే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. నాలుగేళ్లు తిప్పుకుని తన టికెట్ అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పు చేయకుండా నిజాయితీగా బతుకుతున్నానని.. తాను అమ్ముడు పోయే మనిసి కాదని స్పష్టం చేశారు. తనను విమర్శించే వారి నోట్లో పురుగులు పడతాయంటూ మండిపడ్డారు. చిల్లర పాలిటిక్స్ చేయనని ఆయన చెప్పారు.