సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా వుండకూడదన్నదే చంద్రబాబు లక్ష్యమని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ప్రజల మధ్య గొడవలు పెట్టడమే ఆయనకున్న ఆలోచన అని దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు రోజూ గంటల తరబడి మీడియా సమావేశాలు పెడుతూ పిచ్చి పట్టిన వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు బాబు పట్ల ప్రభుభక్తి చాటుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక వ్యక్తి కోసం రమేష్ కుమార్ న్యాయాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ('విచక్షణ' కోల్పోతోందా?)
అక్కడ టీడీపీ వాళ్లవే ఎక్కువ నామినేషన్లు
ఎన్నికల అధికారిగా ఆయన దారుణంగా వ్యవహరిస్తున్నారని చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడే కాదు.. ఆరు నెలల తరువాత ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారని.. అందుకే ఎన్నికల్లో ఏకగ్రీవాలు నమోదవుతున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క ఫిర్యాదు లేదని తెలిపారు. అక్కడ వైఎస్సార్ సీపీ కన్నా టీడీపీ వాళ్లవే ఎక్కువ నామినేషన్లున్నాయి’ అని చెవిరెడ్డి పేర్కొన్నారు. (రమేష్‌కుమార్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి: అందుకే ఆయన సేవలో!)
చదవండి: ఎన్నికలు వాయిదా
Comments
Please login to add a commentAdd a comment