ఏప్రిల్ 29, 2014: మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదేళ్లే ఇచ్చారు. నేను మోదీగారిని కోరుతున్నా. 15 ఏళ్లు ఇవ్వండి. తిరుపతిలో ఎన్డీఏ సభలో చంద్రబాబు
ఆగస్టు 25, 2015: ప్రత్యేక హోదా సంజీవని కాదు.. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో
మే 17, 2016: హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభం? ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?
మే 18, 2016: హోదాతోనే అంతా కాదు. హోదా సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విన్నవించా.
సెప్టెంబర్ 8, 2016: ప్రత్యేక హోదా వీలుకాదు. అదే స్ఫూర్తితో సమాన ప్రయోజనాలు ఇస్తామని చెబుతుంటే వాటిని తీసుకోకుండా ఏం చేద్దాం?
సెప్టెంబర్ 9, 2016: హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా? దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోంది. ప్రతిపక్షం చేస్తున్న బంద్‌కు సహకరించవద్దని ప్రజలను కోరుతున్నా.
సెప్టెంబర్ 10, 2016: హోదా వస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం.. కేంద్రం చెప్పినదానికంటే అదనంగా ఏమొస్తాయో చెప్పండి. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు.
సెప్టెంబర్ 15, 2016: హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు, హోదాకు సంబంధం లేదు.
సెప్టెంబర్ 19, 2016: హోదా ప్యాకేజీకి సమానం. అందుకే అంగీకరించాం.
సెప్టెంబర్ 26, 2016: హోదా అంటే జైలుకే.. విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు వార్నింగ్..
అక్టోబర్ 28, 2016: ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు, పోలవరం ప్రాజెక్టుని సాకారం చేస్తున్నందుకు జైట్లీకి కృతజ్ఞతలు
జనవరి 25, 2017: హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయని ఎక్కడుంది? ఏ జీవోలో ఉందో చూపండి. హోదాకు, రాయితీలకు సంబంధం లేదు.
ఫిబ్రవరి 3, 2017: హోదా వేస్ట్. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు.
ఫిబ్రవరి 15, 2017: ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామన్నారు.
మార్చి 15, 2017: సంప్రదింపుల ఫలితంగానే ప్రత్యేక సాయానికి కేంద్రం ఆమోదం. రావాల్సినవన్నీ సాధించుకుంటున్నాం.
మార్చి 16, 2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాం.
మార్చి 2, 2018: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని తెలుగుదేశం పార్టీ ఎక్కడా, ఎప్పుడూ అనలేదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డంకులు ఉన్నాయని కేంద్రం చెప్పడం వల్లే ప్రత్యేక సాయానికి అంగీకరించాం. రాజీనామాలొద్దు.. కేంద్రంపై దశలవారీగా పోరాడదాం.
(టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం)
మార్చి 7, 2018: ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్ జైట్లీ అవమానకరంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని, అందులో ఉన్న అంశాలన్నింటినీ ప్రత్యేక సాయం కింద ఇస్తామని అప్పుడు ప్రకటించారు. అవి కూడా సరిగా ఇవ్వలేదు.
మార్చి 8, 2018: కేంద్ర మంత్రివర్గం వైదొలుగుతున్నాం. మా మంత్రులు రాజీనామా చేస్తారు.
మార్చి 10, 2018: వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వం.
మార్చి 15, 2018: వైఎస్సార్‌సీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం. కొంతమంది కావాలనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. (అసెంబ్లీలో)
మార్చి 16, 2018: మేమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం. వైఎస్సార్‌సీపీ పెట్టే తీర్మానానికి మద్దతు ఇవ్వం (టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో)
మార్చి 24, 2018: హోదా కాకపోయినా ఈశాన్య రాష్ట్రాలకిచ్చిన రాయితీలు ఇస్తే ఓకే.
Comments
Please login to add a commentAdd a comment