
సాక్షి, పెద్దపల్లి : టీఆర్‌ఎస్ ఐదేళ్ల పాలన, కూటములను చూస్తోంటే నిజాం పాలనను తలపిస్తోందని ఉత్తరప్రదేశ్ సీఎం, బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వాదులకు బిర్యానీ పొట్లాలను అందిస్తే తమ ప్రభుత్వం బుల్లెట్లతో సమాధానం చెప్పిందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తీవ్రవాదులకు వేసినట్టేనని, అలాగే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకి వేసినట్టేనని హెచ్చరించారు.
టీఆర్‌ఎస్ కుట్రలను నమ్మెద్దని అన్నారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలకు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎస్.కుమార్‌కు ఓటేసి నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. తొలుత తెలుగులో ప్రసంగం ప్రారంభించిన యోగీ ప్రజలకు వికారినామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రచార సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు, రాపోలు ఆనంద్ భాస్కర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీ అభ్యర్థి ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment